Current Affairs April 25 | తెలంగాణ
మరో రెండు మండలాలు
రాష్ట్రంలో మరో రెండు రెవెన్యూ మండలాలను ఏర్పాటు చేస్తూ ఏప్రిల్ 18న ఉత్తర్వులు జారీ చేసింది. జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఎర్రవల్లి మండలాన్ని, కామారెడ్డి జిల్లాలోని పాల్వంచ మండలాన్ని ఏర్పాటు చేసింది. ఇటిక్యాల మండలంలోని 9 గ్రామాలను కలిపి ఎర్రవల్లిని మండలంగా, మాచారెడ్డి మండలం నుంచి 9 గ్రామాలు, రామారెడ్డి మండలం నుంచి ఒక గ్రామాన్ని కలిపి పాల్వంచ మండలంగా ప్రభుత్వం ప్రకటించింది.
బండారుగూడెం బడి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం బండారుగూడెం ప్రాథమికోన్నత పాఠశాలకు యునిసెఫ్ పుస్తకంలో చోటు లభించింది. క్లీన్ అండ్ గ్రీన్, ఎకో ఫ్రెండ్లీ, ైక్లెమేట్ రెసిడెంట్పై అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ పద్ధతులు అవలంబిస్తున్న పాఠశాలలపై కేంద్ర ప్రభుత్వం యునిసెఫ్ ఆధ్వర్యంలో పుస్తకాన్ని ప్రచురించింది. ఈ పుస్తకంలో రాష్ట్రం నుంచి బండారిగూడెం బడికి చోటు దక్కింది. ఏప్రిల్ 18న యునిసెఫ్ ప్రతినిధి శ్రేయాస్ సజీవన్ తన బృందంతో కలిసి పాఠశాలను సందర్శించి ఈ పుస్తకాన్ని అందజేశారు.
సంపన్న హైదరాబాద్
ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ మైగ్రేషన్ సంస్థ హెన్లీ అండ్ పార్ట్నర్స్ ‘వరల్డ్ వెల్తీయస్ట్ సిటీస్ రిపోర్ట్-2023’ను ఏప్రిల్ 19న విడుదల చేసింది. 97 నగరాలతో విడుదలైన ఈ వార్షిక జాబితాలో హైదరాబాద్ 11,100 మిలియనీర్లతో 65వ స్థానంలో ఉంది. న్యూయార్క్ నగరం 3,40,000 మంది మిలియనీర్లతో అగ్రస్థానంలో ఉంది. న్యూయార్క్ తరువాత వరుసగా టోక్యో, ది బే ఏరియా, లండన్, సింగపూర్, లాస్ ఏంజెల్స్, హాంకాంగ్, బీజింగ్, షాంఘై, సిడ్నీ ఉన్నాయి. ముంబై 59,400 మంది మిలియనీర్లతో 21, ఢిల్లీ (30,200) 36, బెంగళూరు (12,600) 60, కోల్కతా (12,100) 63వ స్థానాల్లో ఉన్నాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?