IISER Notification 2023 | ఐసర్.. సైన్స్ కోర్సుల విశిష్ట వేదిక
ప్రపంచ మనుగడకు సైన్స్ చాలా కీలకం. దేశంలో పరిశోధనల వేగం పెంచడానికి, సైన్స్ విద్యవైపు విద్యార్థులను ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన సైన్స్ విద్యాలయాలే ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్’ (ఐసర్). ప్రారంభించిన అనతి కాలంలో ఐసర్ అనేక ప్రచురణలు, పేటెంట్లను సాధించి నమ్మశక్యం కాని మేధోసంపత్తిని సృష్టించాయి. సైన్స్ పై ఆసక్తి, పరిశోధనా రంగంలో అడుగు పెట్టాలనుకునే వారికి ఈ సంస్థలు వరప్రదాయినులుగా పేర్కొనవచ్చు. ప్రస్తుతం ఈ సంస్థల్లో ఇంటర్ అర్హతతో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఆ వివరాలు సంక్షిప్తంగా….
ఐసర్
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్. దేశంలో మొదట కోల్‌కతా, పుణెలలో ప్రారంభించారు. తర్వాత మొహాలి, భోపాల్, తిరువనంతపురం, తిరుపతి, బెర్హంపూర్‌లలో వీటిని ప్రారంభించారు.
సంస్థ ప్రత్యేకతలు
- ఈ సంస్థలు ఐదేండ్ల డ్యూయల్ డిగ్రీ సైన్స్ కోర్సులను అందిస్తున్నాయి.
- తరగతి గది అభ్యసనాన్ని పరిశోధనతో అనుసంధానించడం, ఇంటర్ డిసిప్లినరీ కార్యకలాపాలకు తగినంత అవకాశాలను ఇక్కడ కల్పిస్తారు.
- సైన్స్, ఇంజినీరింగ్ సైన్సెస్, ఎకనామిక్స్ పాఠ్యాంశాలపై ఎక్కువ దృష్టి సారించడం ఈ సంస్థల ప్రత్యేకత
- ప్రపంచస్థాయి పరిశోధన సౌకర్యాలను కోర్సు ప్రారంభం నుంచి ఐసర్లు అందిస్తాయి
- ఇంటర్న్‌షిప్ అవకాశాలు, ఏడాది పొడవునా పరిశోధనకు సంబంధించిన రిసెర్చ్ ప్రాజెక్టులకు ఇక్కడ అవకాశాలు కల్పిస్తారు
- బయాలజికల్ సైన్సెస్
- కెమికల్ సైన్సెస్,
ఐసర్ అందించే కోర్సులు
- ఎర్త్ & క్లైమెట్ సైన్సెస్/ఎర్త్ & ఎన్విరాన్మెంటల్ సైన్సెస్
- ఎకనామిక్ సైన్సెస్
- ఇంజినీరింగ్ సైన్సెస్ (కెమికల్ ఇంజినీరింగ్, డేటా సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఈఈ, సీఎస్)
- జియాలాజికల్ సైన్సెస్
- ఇంటిగ్రేటెడ్ &ఇంటర్‌డిసిప్లినరీ సైన్సెస్ (బయాలాజికల్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్)
- మ్యాథమెటికల్ సైన్సెస్
- ఫిజికల్ సైన్సెస్
నోట్: నాలుగేండ్ల బీఎస్ ప్రోగ్రామ్ ఇన్ ఇంజినీరింగ్ సైన్సెస్ అండ్ ఎకనామిక్స్‌ను ఐసర్ భోపాల్ క్యాంపస్ మాత్రమే అందిస్తుంది.
ప్రవేశాలు కల్పించే పద్ధతి
- ఈ సంస్థల్లో మూడు రకాలుగా ప్రవేశాలు కల్పిస్తారు
1. కేవీపీవై (కిషోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన)
2. ఐఐటీ-జేఈఈ (అడ్వాన్స్డ్)
3. స్టేట్ అండ్ సెంట్రల్ బోర్డ్స్ (ఎస్సీబీ) - నోట్: ఎస్సీబీ చానల్ అభ్యర్థులకు ఐసర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఐఏటీ) నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
- అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్ సైన్స్ స్ట్రీమ్/ఇంటర్ 2022 లేదా 2023లో ఉత్తీర్ణులై ఉండాలి.
ముఖ్య తేదీలు
- దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: ఐఏటీ చానల్, కేవీపీవై చానల్స్‌కు మే 25, జేఈఈ అడ్వాన్స్డ్ చానల్‌కు జూన్ 30
- పరీక్ష తేదీలు: ఐసర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ జూన్ 17న నిర్వహిస్తారు
- పూర్తి వివరాల కోసం వెబ్సైట్: https://iiseradmission.in
క్యాంపస్ సీట్ల సంఖ్య
బెర్హంపూర్ 200
భోపాల్ 240
కోల్‌కతా 250
మొహాలి 250
పుణె 288
తిరువనంతపురం 320
తిరుపతి 200
మొత్తం ఖాళీలు 1748
బీఎస్ ప్రోగ్రామ్ సీట్ల సంఖ్య
భోపాల్ (ఇంజినీరింగ్ సైన్సెస్) 60
భోపాల్ (ఎకనామిక్స్ సైన్సెస్) 30
మొత్తం ఖాళీలు 90
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?