Current Affairs | టీ హబ్‌ను ఏయే సంస్థల భాగస్వామ్యంతో ఏర్పాటు చేశారు?
కరెంట్ అఫైర్స్
1. 2023 తెలంగాణ సామాజిక, ఆర్థిక చిత్రం ప్రకారం కింది ఏయే వ్యవసాయ మార్కెట్ కమిటీలకు ఈ-నామ్ ను విజయవంతంగా అమలు చేసినందుకు ప్రధానమంత్రి ఎక్సలెన్స్ అవార్డు దక్కింది?
A. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ
B. సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ
C. కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ
D. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ
పైవాటిలో సరైన జవాబును గుర్తించండి
1) A, B 2) A, D
3) A, C
4) A, B, C, D ANS: 3
2. తెలంగాణ ప్రభుత్వ పథకమైన సాఫ్ట్ నెట్ (SOFT NET)కు సంబంధించి సరికాని వ్యాఖ్యను గుర్తించండి.
1. టెక్నాలజీ సాయంతో నాణ్యమైన విద్యను అందించడం
2. ఇది జీ శాట్-8 ఉపగ్రహాన్ని ఉపయోగించుకుంటుంది
3. ఇది తెలంగాణ విద్యాశాఖ ప్రవేశపెట్టిన పథకం
4. సాఫ్ట్ నెట్ ద్వారా మొత్తం నాలుగు చానళ్లను ప్రసారం చేస్తారు. ANS: 3
3. కిందివాటిని సరిగ్గా జతపరచండి.
తెలంగాణ ప్రభుత్వ పథకాలు సంబంధిత విభాగం
A. కేసీఆర్ కిట్ 1) మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ
B. వి-హబ్ 2) ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ
C.టి.ఎస్. గ్లోబల్ లింకర్ 3) వ్యవసాయ శాఖ
D. రైతు వేదిక 4) పరిశ్రమలు, వాణిజ్య శాఖ
5) ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ
పైవాటిలో సరైన జవాబును గుర్తించండి
1) A-2, B-5, C-4, D-3
2) A-4, B-5, C-2, D-3
3) A-5, B-4, C-2, D-3
4) A-5, B-2, C-4, D-3 ANS: 4
4. టీ-హబ్‌కు సంబంధించి కిందివాటిలో సరైన వ్యాఖ్యను గుర్తించండి.
A.భారతదేశపు మొదటి ప్రైవేట్ రాకెట్ ‘ప్రారంభ్’ను తయారు చేస్తున్న ‘స్కైమాట్ ఏరోస్పేస్’ సంస్థ టి-హబ్ లోనే ఇంక్యుబేట్ అయ్యింది.
B. 2022లో జాతీయ స్టార్టప్ అవార్డుల్లో ‘టి-హబ్’కు దేశంలోనే అత్యుత్తమ ఇంక్యుబేటర్ అవార్డు వచ్చింది.
C. రెండో విడత టీ-హబ్ (టీ-హబ్ 2.0) ను 2022 జూన్ 28న ప్రారంభించారు.
పై వాక్యాలను ఉపయోగించి సరైన జవాబును గుర్తించండి.
1. B, C సరైనవి
2. A, B, C సరైనవి
3. A, B సరైనవి
4. A, C సరైనవి ANS: 2
5. టీ-హబ్ (టెక్నాలజీ హబ్)ను తెలంగాణ ప్రభుత్వం ఈ కింది ఏయే సంస్థల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసింది?
A. ఐఐటీ, హైదరాబాద్
B. ఐఐఐటీ, హైదరాబాద్
C. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, హైదరాబాద్
D. నల్సార్, హైదరాబాద్
E. గూగుల్ ఇండియా పైవాటిని ఉపయోగించి సరైన జవాబును గుర్తించండి
1. A, C, D మాత్రమే
2. A, B, C, D మాత్రమే
3. B, C, D మాత్రమే
4. B, C, D, E మాత్రమే ANS: 3
6. బాలామృతం’ పథకానికి సంబంధించి కిందివాటిలో సరైన వ్యాఖ్యలను గుర్తించండి.
A. బాలామృతం పొడిని ఏడు నెలలు- మూడు సంవత్సరాల వయస్సున్న పిల్లలకు అందిస్తారు.
B. రోజుకు సిఫార్సు చేసిన పరిమాణం 100గ్రాముల పొడి, రోజుకు 3 నుంచి 5సార్లు
C. ప్రతీ నెల 2.5 కిలోల బాలామృతం పొడి ఒక్కో లబ్ధిదారుడికి ఇస్తారు.
పైవాటిని ఉపయోగించి సరైన జవాబును గుర్తించండి
1. A మాత్రమే సరైనది
2. B మాత్రమే సరైనది
3. A, C మాత్రమే సరైనవి
4.A, B, C మూడూ సరైనవే ANS: 4
7. కిందివాటిలో తెలంగాణ ఆహార శుద్ధి విధానం -2021 లక్ష్యం కానిది ఏది?
1. పెరుగుతున్న ఆహార ధాన్యాల ఉత్పత్తికి అనుగుణంగా 2024-25 నాటికి 10వేల ఎకరాల్లో ‘ప్రత్యేక ఆహార శుద్ధి మండళ్ల’ ఏర్పాటు
2. ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు రూ. 25వేల కోట్ల పెట్టుబడిని ఆకర్షించడం
3. దాదాపు 70వేల ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పించడం
4. మొదటి దశలో 15 ఆహార శుద్ధి మండళ్లను, ఒక్కో మండలిని 500 నుంచి వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయడం ANS: 4
8. కిందివాటిని జతపరచండి.
పరిశ్రమ స్థలం
A. వైద్య పరికరాల పార్కు 1. ముచ్చెర్ల, రంగారెడ్డి జిల్లా
B. మెగా ఫుడ్ పార్కు 2. బుగ్గపాడు, ఖమ్మం జిల్లా
C. హైదరాబాద్ ఫార్మా సిటీ 3. మహేశ్వరం, రంగారెడ్డి జిల్లా
D. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ 4. సుల్తాన్ పూర్, రంగారెడ్డి జిల్లా
5. ఆదిబట్ల, రంగారెడ్డి జిల్లా
పైవాటిలో సరైన జవాబును గుర్తించండి
1. A-1, B-2, C-3, D-5
2. A-4, B-2, C-1, D-3
3. A-4, B-1, C-2, D-3
4. A-4, B-3, C-1, D-2 ANS: 2
9. తెలంగాణ సోషల్ ఇన్నోవేషన్ పాలసీ ‘పెంటాహెలిక్స్’ మోడల్ ను అవలంభిస్తుంది. ఈ కింది వాటిలో ఈ మోడల్ లో ఏవి భాగంగా ఉంటాయి?
A. ప్రభుత్వ రంగం
B. ప్రైవేటు రంగం
C. విద్యాసంస్థలు
D. సామాజిక వ్యవస్థాపకులు
E. పౌరసమాజం
F. రాజకీయ పార్టీలు
పైవాటిలో సరైన
జవాబును గుర్తించండి
1. A, B, C
2. A, B, C, D
3. A, B, C, D, E
4. A, B, C, D, F ANS: 3
10. ‘డార్విన్ బాక్స్’కు సంబంధించి కింది వ్యాఖ్యల్లో నిజం కానిది ఏది?
A. డార్విన్ బాక్స్ అనేది వ్యాపారుల కోసం క్లౌడ్ ఆధారిత మానవ వనరుల నిర్వహణ (హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్) వేదికను అందించే టెక్నాలజీ స్టార్టప్
B. డార్విన్ బాక్స్ అనేది హైదరాబాద్‌లోని బయోటెక్నాలజీ రంగానికి చెందిన స్టార్టప్
C. తెలంగాణ నుంచి యూనికార్న్ క్లబ్లో చేరిన తొలి స్టార్టప్
పైవాటిని ఉపయోగించి సరైన జవాబును ఎంపిక చేయండి
1. A సరైనది
2. B, C సరైనవి
3. A, C సరైనవి
4. C సరైనది ANS: 3
11. 2014 నుంచి 2023 జనవరి వరకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా లబ్ధిపొందిన వివిధ సామాజిక వర్గాలను వారి సంఖ్య ఆధారంగా అవరోహణ క్రమంలో అమర్చండి.
A. బీసీలు B. ఎస్సీలు
C. ఎస్టీలు D. మైనారిటీలు
పైవాటిలో సరైన జవాబును గుర్తించండి.
1) A, B, C, D 2) B, C, A, D
3) B, C, D, A 4) A, B, D, C
ANS: 2
12. తెలంగాణ రాష్ట్ర ఆయిల్ పామ్ మిషన్‌కు సంబంధించి కింది వాటిలో సరైన వ్యాఖ్యలను గుర్తించండి.
A. ప్రభుత్వం మూడు విడతల్లో ఆయిల్ పాం రైతులకు సబ్సిడీ ఇస్తుంది.
B. ప్రభుత్వం ఆయిల్ పాం రైతులకు ఒక ఎకరాకు అందించే సబ్సిడీ విలువ రూ. 50వేలు
C. కేంద్ర ప్రభుత్వం ‘జాతీయ ఆహార భద్రత’ మిషన్ కింద సబ్సిడీని 60:40 నిష్పత్తిలో అందిస్తుంది.
పై వ్యాఖ్యల ఆధారంగా కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి
1) A, B, C అన్నీ సరైనవే
2) A, B సరైనవి
3) A, C సరైనవి
4) B, C సరైనవి ANS: 3
13. తెలంగాణ ఈ-వేస్ట్ మేనేజ్మెంట్ విధానం, 2017 ప్రకారం ఈ-వేస్ట్ ఉత్పత్తిలో దేశంలోని నగరాల్లో హైదరాబాద్ ఆరో స్థానంలో ఉంది. అయితే ఏడాది కాలంలో హైదరాబాద్ లో ఎంత ఈ-వేస్ట్ ఉత్పత్తి అవుతుంది (2015 లెక్కల ప్రకారం)?
1. 20వేల మెట్రిక్ టన్నులు
2. 25వేల మెట్రిక్ టన్నులు
3. 30వేల మెట్రిక్ టన్నులు
4. 15వేల మెట్రిక్ టన్నులు ANS: 3
14. ‘వెరీఫాస్ట్ (VERIFAST)’ అనే మొబైల్ అప్లికేషన్ ఉద్దేశం?
1. పాస్‌పోర్టులను ధ్రువీకరించే, జారీ చేసే ప్రక్రియను క్రమబద్ధీకరించడం
2. నేరం విషయంలో లేదా అత్యవసర సమయాల్లో పోలీసులకు సమాచారం ఇవ్వడం
3. పరిశ్రమల ఏర్పాటుకు వేగంగా అనుమతులు ఇవ్వడం
4. వేగవంతమైన అంబులెన్స్ సర్వీసులు అందించడానికి ANS: 3
15. కిందివాటిని జతపరచండి.
పథకం ప్రారంభించిన తేదీ
A. మిషన్ కాకతీయ 1) 2014 అక్టోబరు 13
B. పాడి పశువుల పంపిణీ 2) 2017 జూన్ 20
C. గొర్రెల పంపిణీ 3) 2015 మార్చి 12
D. సద్దిమూట 4) 2018 ఆగష్టు 11
సరైన జవాబును గుర్తించండి
1. A-4, B-3, C-1, D-2
2. A-3, B-4, C-1, D-2
3. A-3, B-4, C-2, D-1
4. A-4, B-3, C-2, D-1 ANS: 3
16. కిందివాటిని జతపరచండి.
మహిళా సంరక్షణ పథకాలు – లక్ష్యాలు
A. టీ- షీ క్యాబ్స్ 1) మహిళలు, చిన్నారులకు సైబర్ నేరాల నుంచి రక్షణ కోసం అవగాహన
B. సఖి కేంద్రం 2) హైదరాబాద్ లో ఈవ్ టీజింగ్ ను అరికట్టడం కోసం
C. షీ-టీమ్స్ 3) మహిళలపైలైంగిక దోపిడీ సమస్యలకు సింగిల్ విండో సర్వీస్
D. సైబ్ హర్ కార్యక్రమం 4) మహిళలు, బాలికలకు హింస నుంచి రక్షణ
సరైన జవాబును గుర్తించండి
1. A-3, B-4, C-1, D-2
2. A-3, B-4, C-2, D-1
3. A-4, B-3, C-1, D-2
4. A-1, B-3, C-4, D-2 ANS: 3
17. తెలంగాణ ప్రభుత్వం 2023 ఏప్రిల్ 3న ‘చలువ పైకప్పు (కూల్‌రూఫ్) విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం కూల్‌రూఫ్‌ల వల్ల ఉపయోగం కానిది ఏది?
1. చలువ పైకప్పుతో ఉన్న భవనాల లోపలి వేడి, సాధారణ భవనాలతో పోలిస్తే 2.10c నుంచి 4.30c తగ్గే అవకాశముంది.
2. చలువ కప్పుల నిర్వహణ ఖర్చు అధికంగా ఉంటుంది.
3. చలువ కప్పుల వల్ల విద్యుత్ ఖర్చులో 20% వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది.
4. చలువ కప్పుల కింద ఉన్న ఇంటి పై కప్పుల మన్నిక ఎక్కువగా ఉంటుంది.
ANS: 2
18. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘చలువ కప్పు (కూల్ రూఫ్)’ విధానం 2023-28 లక్ష్యాలకు సంబంధించి కిందివాటిని జతపరచండి
సంవత్సరం లక్ష్యం
A. 2023- 24 1) 60
B. 2024-25 2) 8.5
C. 2025-26 3) 30
D. 2026-27 4) 40
E. 2027-28 5) 7.5
6) 90
7) 112.5
పై కోడ్లను ఉపయోగించి సరైన జవాబును గుర్తించండి
1. A-5, B-3, C-1, D-6, E-7
2. A-2, B-4, C-1, D-7, E-6
3. A-2, B-4, C-1, D-6, E-7
4. A-5, B-3, C-1, D-7, E-6 ANS: 1
19. లాజిస్టిక్స్ రంగాన్ని మెరుగుపరచడం వల్ల రవాణా ఖర్చులో 10% వరకు తగ్గుతుంది. దీనివల్ల ఎగుమతులు 5 నుంచి 8% వరకూ పెరిగే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన లాజిస్టిక్స్ పాలసీ-2021 గురించి సరైన వ్యాఖ్య ఏది?
A. రాష్ట్రంలో లాజిస్టిక్స్ రంగం అభివృద్ధిని ప్రోత్సహించడం వల్ల ప్రైవేటు రంగంలో రూ. 10వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం
B. ఈ విధానాన్ని పరిశ్రమలు, వాణిజ్య శాఖ పర్యవేక్షిస్తుంది.
C. ఈ విధానం 2021 నుంచి 2026 వరకు అమలులో ఉంటుంది.
పైకోడ్లను ఉపయోగించి సరైన జవాబు గుర్తించండి
1. A, C సరైనవి
2. B, C సరైనవి
3. A, B సరైనవి
4. A, B, C సరైనవి ANS: 4
20. కిందివాటిలో ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి సరైన వ్యాఖ్యను గుర్తించండి.
A. ముస్లిం సామాజిక, ఆర్థిక, విద్యా స్థితిగతులపై అధ్యయనం కోసం జి. సుధీర్ కమిటీని నియమించారు.
B.ప్రస్తుతం రాష్ట్రంలో ముస్లింలకు 3% రిజర్వేషన్లు ఇస్తున్నారు.
C.సుధీర్ కమిటీ 12%కి పెంచాలని సిఫార్సు చేసింది.
D. షాదీ ముబారక్ పథకం ద్వారా ముస్లిం యువతులకు 2017 ఏప్రిల్ 1 నుంచి రూ. 1,00,116 అందిస్తున్నారు.
పైవాటిని ఉపయోగించి సరైన జవాబును గుర్తించండి
1. A, B సరైనవి
2. A, C, D సరైనవి
3. A, C
4. A, D ANS: 3
పీ విష్ణువర్ధన్
విష్ణు
ఐఏఎస్ అకాడమీ,
హైదరాబాద్
7702170025
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?