April 12 Current Affairs | క్రీడలు
క్రీడలు
సలీం దురాని
భారత క్రికెట్ మాజీ ఆల్ రౌండర్ సలీం దురాని (88) ఏప్రిల్ 2న మరణించాడు. 1934, డిసెంబర్ 11న అఫ్గానిస్థాన్‌లోని కాబూల్‌లో జన్మించాడు. అతడికి ఎనిమిది నెలల వయస్సు ఉన్నప్పుడు అతడి కుటుంబం కరాచీకి వచ్చి స్థిరపడింది. 1947లో భారత్-పాక్ విభజన అనంతరం ఆయన కుటుంబం భారత్‌కు వచ్చింది. 1960లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ ద్వారా భారత్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. 1973లో ఇంగ్లండ్‌తో చివరి టెస్టు ఆడాడు. 29 టెస్టులు ఆడి ఒక సెంచరీ, ఏడు అర్ధ సెంచరీలతో 1202 పరుగులు చేశాడు.
ప్రపంచ కప్ లోగో
భారత్ 2011 ప్రపంచ కప్ గెలిచి 12 ఏండ్లు అయిన సందర్భంగా ఐసీసీ 2023 వన్డే క్రికెట్ ప్రపంచ కప్ లోగోను ఏప్రిల్ 2న ఆవిష్కరించింది. ఈ టోర్నీని భారత్‌లో నిర్వహించనున్నారు. లోగో నీలం, గులాబీ రంగు డిజైన్ మధ్యలో ప్రపంచ కప్ ఉంది. 2011 ప్రపంచ కప్ ఫైనల్లో ధోని కెప్టెన్సీలోని భారత్ జట్టు శ్రీలంకను ఓడించింది. అప్పుడు సిక్స్‌తో ధోని జట్టును విజేతగా నిలిపాడు.
వెర్స్టాపెన్
ఫార్ములావన్ ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రిలో మాక్స్ వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) విజేతగా నిలిచాడు. ఏప్రిల్ 2న మెల్బోర్న్లో జరిగిన పోటీలో పోల్ పొజిషన్లో రేసు మొదలుపెట్టిన వెర్స్టాపెన్ విజయం సాధించాడు. లూయిస్ హామిల్టన్ రెండో స్థానంలో నిలిచాడు. దీంతో వెర్స్టాపెన్ తొలిసారి ఆస్ట్రేలియన్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఫెర్నాండో అలాన్సో మూడో స్థానంలో నిలిచాడు.
మెద్వెదెవ్
మియామి ఓపెన్ టెన్నిస్ టోర్నీని రష్యా ఆటగాడు డానిల్ మెద్వెదెవ్ గెలుచుకున్నాడు. ఏప్రిల్ 2న సౌత్ ఫ్లోరిడాలోని మియామి గార్డెన్స్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మెద్వెదెవ్ ఇటలీ ఆటగాడు జానిక్ సినర్‌పై విజయం సాధించాడు. గత 25 మ్యాచుల్లో మెద్వెదెవ్ 24 గెలవడం విశేషం. ఇండియన్ వెల్స్ ఫైనల్లో కార్లోస్ అల్కారజ్ చేతిలో ఓడిపోయాడు.
కలికేష్ నారాయణ
నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఐఏ) నూతన అధ్యక్షుడిగా కలికేష్ నారాయణ సింగ్ డియో ఏప్రిల్ 6న బాధ్యతలు స్వీకరించాడు. ఈయన సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నాడు. 12 ఏళ్లకు పైగా పదవిలో కొనసాగుతున్న వారిపై కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ వేటు వేయడంతో రణిందర్ సింగ్ స్థానంలో కలికేష్ అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?