Current Affairs April 12 | వార్తల్లో వ్యక్తులు
జస్జిత్ సింగ్
ఇండియన్ నేవీ కొత్త వైస్ చీఫ్‌గా వైస్ అడ్మిరల్ సంజయ్ జస్జిత్ సింగ్ బాధ్యతలు చేపట్టినట్లు నేవీ ఏప్రిల్ 2న వెల్లడించింది. నేవీ మారిటైమ్ డాక్ట్రిన్, స్ట్రాటజిక్ గైడెన్స్ టు ట్రాన్స్ఫర్మేషన్, ఇండియన్ మారిటైమ్ సెక్యూరిటీ స్ట్రాటజీలో లీడ్ డ్రాఫ్టర్గా పనిచేశారు. ఇదివరకు ఈ పదవిలో ఉన్న వైస్ అడ్మిరల్ సతీష్ కుమార్ నామ్‌దేవ్ ఘోర్మాడే మార్చి 31న పదవీ విరమణ పొందారు. అదేవిధంగా నేవీ పర్సనల్ చీఫ్‌గా వైస్ అడ్మిరల్ సూరజ్ బెర్రీ ఏప్రిల్ 1న బాధ్యతలు చేపట్టారు.
రవీంద్రనాథ్
కశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌గా తెలంగాణకు చెందిన డాక్టర్ అనిశెట్టి రవీంద్రనాథ్ ఏప్రిల్ 3న బాధ్యతలు చేపట్టారు. ఆయన గుల్బర్గాలోని కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ లైఫ్‌సైన్సెస్ బయోటెక్నాలజీ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆయన 1991లో ఓయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బోధనావృత్తిలో చేరారు. ఢిల్లీ, మద్రాస్, బాంబే, ఖరగ్‌పూర్ ఐఐటీల్లో, కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీల్లోనూ శిక్షణ పొదారు.
అంజలి శర్మ
హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన పర్వతారోహకురాలు సంప్రదాయ గడ్డి దుస్తులను ధరించి సౌతాఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని ఏప్రిల్ 4న అధిరోహించారు. లుయాంచడి అని పిలిచే ఈ దుస్తులను ధరించి ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ మహిళ. లుయాంచడి అనేది హిమాచల్‌ప్రదేశ్‌లోని సంప్రదాయ దుస్తులు. హిమాచల్‌ప్రదేశ్ సంస్కృతిని ప్రచారం చేయాలనే లక్ష్యంతో ఆమె ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
అనంతారపు కృష్ణయ్య
డైరెక్టర్,
శ్రీసాయి కోచింగ్ సెంటర్
కోదాడ
9948750605
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?