SSC CGL 2023 Notification | డిగ్రీతో కేంద్ర కొలువులు
ఎస్ఎస్సీ సీజీఎల్-2023
మీరు డిగ్రీ పాసయ్యారా? ప్రభుత్వ కొలువుల కోసం ఎదురు చూస్తున్నారా? మంచి జీతభత్యాలు, భద్రమైన కొలువులు. రాతపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. వీటన్నింటి సమాహారమే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఇటీవల విడుదల చేసిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్-2023. ఈ పరీక్షకు సంబంధించిన సమాచారం సంక్షిప్తంగా….
మంత్రిత్వ శాఖలు/ విభాగాలు
- ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ (కాగ్), సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్, ఇంటెలిజెన్స్ బ్యూరో, రైల్వే మంత్రిత్వ శాఖ, ఎక్స్టర్నల్ అఫైర్స్, ఏఎఫ్‌హెచ్‌క్యూ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సీబీడీటీ, సీబీఐసీ, ఎన్హెచ్ఆర్సీ, ఎన్ఐఏ, ఎంహెచ్ఏ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, కాగ్, సీజీడీఏ, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, సీఎస్‌సీఎస్ తదితర కేంద్ర ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేస్తారు.
- మొత్తం ఖాళీలు: 7500
(వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి) - అర్హతలు: ఆగస్టు 1 నాటికి డిగ్రీ ఉత్తీర్ణత. జేఎస్‌వో పోస్టులకు ఇంటర్లో కనీసం 60 శాతం మార్కులతో మ్యాథ్స్ ఉత్తీర్ణత. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ పోస్టులకు డిగ్రీలో స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
- వయస్సు: 2023, ఆగస్టు 1 నాటికి 18-27 ఏండ్ల మధ్య ఉండాలి. కొన్ని పోస్టులకు 18-30/32 ఏండ్ల వరకు అనుమతిస్తారు.
నోట్: ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: టైర్-1, టైర్-2 ద్వారా - టైర్-1 పరీక్ష 200 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు.
- ఈ పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ నుంచి ప్రశ్నలు ఇస్తారు.
- పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.5 మార్కులు కోత విధిస్తారు.
- టైర్-2లో మూడు పేపర్లు ఉంటాయి. అయితే వీటిలో పేపర్-1 అందరికీ తప్పనిసరి. పేపర్-2 జేఎస్‌వో పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారికి, పేపర్-3లో ఏఏవో పోస్టులకు షార్ట్‌లిస్ట్ అయిన వారికి ఉంటుంది.
ఎస్ఎస్సీ సీజీఎల్
- కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల్లో/ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ బీ, సీ పోస్టుల భర్తీ కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ సీజీఎల్ ఎగ్జామ్‌ను నిర్వహిస్తుంది.
ఈ పరీక్ష ద్వారా భర్తీ చేసే పోస్టులు
- అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్
- అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్
- అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
- ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్
- ఇన్స్పెక్టర్ (సెంట్రల్ ట్యాక్స్)
- ఇన్స్పెక్టర్ (ప్రివెంటివ్ ఆఫీసర్)
- ఇన్స్పెక్టర్ (ఎగ్జామినర్)
- ఇన్స్పెక్టర్ పోస్ట్స్
- ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్
- రిసెర్చ్ అసిస్టెంట్
- డివిజనల్ అకౌంటెంట్స్
- సబ్ ఇన్స్పెక్టర్
- జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్
- జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్
- ఆడిటర్
- అకౌంటెంట్
- అకౌంటెంట్/జూనియర్ అకౌంటెంట్
- పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్
- సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్/అప్పర్ డివిజన్ క్లర్క్స్
- ట్యాక్స్ అసిస్టెంట్
ముఖ్యతేదీలు
- దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: మే 3
- టైర్-1: జూలైలో నిర్వహిస్తారు
- టైర్-2: తేదీలను తర్వాత వెల్లడిస్తారు
- వెబ్సైట్: https://ssc.nic.in
Previous article
BIOLOGY | శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే కణాలు?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?