BIOLOGY | శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే కణాలు?
బయాలజీ.
1. జంతు ప్రవర్తన అధ్యయన శాస్త్రం?
1) టీరాలజీ 2) ఎండోక్రైనాలజీ
3) ఇథాలజీ 4) కార్డియాలజీ
2. కింది వాటిలో ఏ ఎమల్షన్ ‘రబ్బర్’ వల్కనైజేషన్ ప్రక్రియ ద్వారా పారిశ్రామికంగా ఉత్పత్తి చేస్తున్నారు?
1) ఆక్రస్ సపోటా
2) సింకోనా అఫిసినాలిస్
3) హీవియా బ్రెజిలెన్సిస్
4) డాల్బెర్జియా
3. కింది వాటిలో సరైనది?
ఎ. కాల్షియం – కండర సంకోచానికి
బి. ఐరన్ – హిమోగ్లోబిన్ ఏర్పాటుకు, ఎనిమియా నిరోధానికి అవసరం
సి. అయోడిన్ – సముద్ర కలుపు మొక్కల నుంచి లభిస్తుంది. థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తికి అవసరం
డి. నైట్రోజన్ – మొక్కల్లో పెరుగుదలకు, ప్రొటీన్ల తయారీకి
1) బి 2) బి, డి
3) సి 4) పైవన్నీ
4. కింది వాటిలో సరికానిది ఏది?
1) ఒకరోజు తీసుకొనే ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్, కొవ్వులు 60:25:15
2) గాలిలో, నీటిలో ఆక్సిజన్ నిష్పత్తి 21:10
3) రెటీనాలోని రాడ్స్, కోన్స్ నిష్పత్తి 15:1
4) రక్తంలోని RBC, WBC నిష్పత్తి 500:1
5. మొక్కలను ఆహారంగా తీసుకొన్నప్పుడు బీటా కెరోటిన్ నుంచి విటమిన్-ఎ మానవ శరీరంలో ఏ భాగంలోకి మారుతుంది?
1) పేగులు
2) క్లోమం, కాలేయం
3) జీర్ణాశయం, పేగులు
4) పేగు, కాలేయం
6. క్రయోఫైట్స్, లిథోఫైట్స్ పెరిగే ప్రదేశాలు వరుసగా?
1) చల్లని ప్రదేశాలు, మంచు
2) మంచు, రాతి
3) చల్లని ప్రదేశాలు, రాతి
4) రాతి, మంచు
7. హిప్పోఫోబియా అంటే గుర్రాలకు భయపడటం, హైడ్రోఫోబియా అంటే నీటికి భయపడటం, బెట్రకోఫోబియా అంటే వేటికి భయపడటం?
1) దంతాలు 2) కుక్కలు
3) పాములు 4) కప్పలు
8. కింది వాటిలో నీటిలో కరగని విటమిన్ ?
1) కాల్సిఫెరాల్ 2) థయమిన్
3) ఆస్కార్బిక్ ఆమ్లం 4) పైరిడాక్సిన్
9. పాల తెలుపురంగుకు తోడ్పడేది, మిల్క్ షుగర్గా పిలుస్తున్న చక్కెర ఏది?
1) సుక్రోజ్ 2) లాక్టోజ్
3) ఫ్రక్టోజ్ 4) గ్లూకోజ్
10. పక్షుల్లో టెలిస్కోపిక్ దృష్టి ఉంటుంది. అంటే?
1) రెండు కళ్లతో ఒకే వస్తువును చూడటం
2) ఒక కన్ను ముందుకు మరొకటి వెనక్కి చూడటం
3) రెండు కళ్లతో దూరంగా ఉండే సూక్ష్మ
పరిమాణ వస్తువులను కూడా గుర్తించడం
4) 2, 3
11. ఫ్రినాలజీ అంటే మెదడు అధ్యయనం, ఫినాలజీ అంటే దేని అధ్యయనం?
1) రెక్కలు 2) వలసలు
3) గూళ్లు 4) గుడ్లు
12. కంటిలోని ప్రతిబింబం ఏర్పడే రెటీనాను కెమెరాలోని ఏ భాగంతో పోల్చవచ్చు?
1) డయాఫ్రమ్ 2) ఫిల్మ్
3) కుంభాకార కటకం
4) యాంటీనా
13. మానవ శరీరంలో అధికంగా ఉండే పదార్థం నీరు, అయితే మూలకం ఏది?
1) కార్బన్ 2) కాల్షియం
3) ఆక్సిజన్ 4) ఇనుము
14. కింది వాటిలో గుండెపోటుకు సంబంధించినది?
1) బ్రాడీకార్డియా
2) అథిరోస్ల్కిరోసిస్
3) అర్టీరియోస్లీరోసిస్
4) మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్
15. AB+ వ్యక్తికి తీవ్రమైనగాయం కారణంగా అతనికి రక్తనష్టం జరిగింది. అయితే తనకు ఎవరు రక్తదానం చేయవచ్చు?
1) O+, A- 2) O-, A+
3) A+, A- 4) అందరూ
16. కింది వాటిలో స్టెరాయిడ్ లైంగిక హార్మోన్స్?
1) అడ్రినలిన్, ఈస్ట్రోజన్
2) ఆల్డోస్టిరాన్, ప్రొజెస్టిరాన్
3) టెస్టోస్టిరాన్, ప్రొజెస్టిరాన్
4) ఆల్డోస్టిరాన్, టెస్టోస్టిరాన్
17. గర్భనిర్ధారణకు తోడ్పడే hCG హార్మోన్ను ఉత్పత్తి చేసేది?
1) థైమస్ గ్రంథి 2) అడ్రినల్ గ్రంథి
3) బీజకోశాలు 4) జరాయువు
18. శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంపొందించే కణాలు?
1) ఎసిడోఫిల్స్ 2) లింఫోసైట్స్
3) న్యూట్రోఫిల్స్ 4) మోనోసైట్స్
19. డయాలసిస్ యంత్రంలోకి పంపుట, రక్తదానం చేసేటప్పుడు ఎక్కడ నుంచి తీసి దేనికి ఎక్కిస్తారు?
1) ధమని నుంచి తీసి సిరకు
2) సిర నుంచి ధమనికి
3) రక్తకేశనాళిక నుంచి సిరకు
4) సిర నుంచి రక్తకేశనాళికకు
20. మూత్రం లేత పసుపు రంగులో ఉండటానికి కారణం?
1) మెలనిన్ 2) హీమోసయనిన్
3) యూరోక్రోమ్ 4) క్లోరోక్రూరిన్
21. వివృత (లేక) ఓపెన్ రక్తప్రసరణ కలిగిన జీవి?
1) వానపాము 2) బొద్దింక
3) కప్ప 4) మానవుడు
22. జతపరచండి.
ఎ. జ్వాలా కణాలు 1. కీటకాలు
బి. మాల్ఫీజియన్ నాళికలు 2. ప్లనేరియా,టీనియా సోలియం
సి. హరితగ్రంథులు 3. రొయ్యలు
డి. మూత్రపిండాలు 4. చేపలు, ఉభయచరాలు
5. వానపాము, జలగ
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-5, బి-1, సి-4, డి-2
4) ఎ-1, బి-2, సి-5, డి-4
23. కింది వాటిలో అమైనో ఆమ్ల హార్మోన్?
1) ఇన్సులిన్
2) వాసోప్రెస్సిన్
3) ఆల్డోస్టిరాన్
4) థైరాక్సిన్
24. టెటాని అంటే?
1) కండరాలు సడలిక చెందడం
2) కండరాలు సంకోచించడం
3) టెండాన్స్ అరిగిపోవడం
4) లిగమెంట్ దెబ్బతినడం
25. జతపరచండి.
ఎ. గుండె 1. ఆంజియాలజీ
బి. రక్తం 2. హెమటాలజీ
సి. వినాళగ్రంథులు 3. కార్డియాలజీ
డి. మూత్రపిండాలు 4. ఎండోక్రైనాలజీ
5. నెఫ్రాలజీ
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-4, డి-5
3) ఎ-3, బి-2, సి-4, డి-5
4) ఎ-1, బి-2, సి-4, డి-5
26. కింది వాటిలో జన్యుసంబంధ వ్యాధి?
1) ఫినైల్కీటోన్యూరియా, డయేరియా
2) అల్బునిజం, గ్లూకోసూరియా
3) ఆల్కాప్టోన్యూరియా, అల్బునిజం
4) పైవన్నీ
27. అయోడిన్ అధికంగా ఉన్న పదార్థాలు?
1) సముద్రపు రొయ్యలు, చేపలు
2) సముద్రపు కలుపు మొక్కలు, ఉప్పు
3) కాలేయం, గుడ్లు
4) 1, 2
28. మూత్రపిండాల క్రియాత్మక ప్రమాణాలు?
1) అమైనో ఆమ్లాలు 2) వాయుగోళాలు
3) నెఫ్రాన్స్ 4) న్యూరాన్స్
29. ఆర్కిటిక్ ధృవంలో నివసించే వాల్స్ అనే జంతువులోని రెండు దంతాలు, పాముల్లో కోరపళ్లు ఏ దంతాల మార్పు?
1) కుంతకాలు 2) రదనికలు
3) అగ్రచర్వణకాలు 4) చర్వణకాలు
30. కింది వాటిలో భిన్నమైనది?
ఎ. తిమింగలం – జంతువుల్లో పెద్దచేప
బి. తిమింగలం సొర – ఒక చేప
సి. గబ్బిలం – ఒక ఎగిరే క్షీరదం
డి. హిప్పోపొటమస్ – నీటిలో క్షీరదం
1) ఎ 2) బి
3) ఎ, బి 4) పైవేవీకావు
31. ప్రొటీన్ కండరాల్లో మయోసిన్ , పాలల్లో కెసిన్, ఫైబ్రోయిన్ పట్టుదారంలో సిరిసిన్, రక్తంలో హీమోగ్లోబిన్ ఉండగా.. కెరోటిన్ ఎక్కడ ఉంటుంది?
1) చర్మం
2) వెంట్రుకలు, రోమాలు
3) గోర్లు, గిట్టలు, కొమ్ములు
4) పైవన్నీ
32. ఊపిరితిత్తులకు సంబంధించని వ్యాధి?
1) క్షయ 2) డిఫ్తీరియా
3) ఫ్లూ 4) ప్లేగు
33. కింది వాటిలో సరికానిది గుర్తించండి.
1) ELISA – ఎయిడ్స్ పరీక్ష
2) EEG – మెదడు చిత్రాలు
3) పేస్మేకర్ – గుండె
4) ఆంజియోగ్రామ్ – ఊపిరితిత్తులు
34. జతపరచండి.
ఎ. గుర్రం 1. ఎన్టీ-20
బి. గేదె 2. ప్రోమాటీ
సి. ఒంటె 3. సంరూప, గరిమా
డి. కుందేలు 4. ఇంఫాజ్
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-2, బి-3, సి-4, డి-1
4) ఎ-1, బి-4, సి-2, డి-3
35. కింది వాటిలో సరికానిది ఏది?
1) మెదడులోని హైపోథాలమస్ శరీర ఉష్ణోగ్రతను సమన్వయపరుస్తుంది
2) అనుమస్తిష్కం శరీర సమతాస్థితికి తోడ్పడుతుంది
3) మజ్జాముఖం అనియంత్రిత చర్యలైన మింగడం, దగ్గడం, వాంతులు, హృదయస్పందన, శ్వాసక్రియలను క్రమపరుస్తుంది
4) పార్కిన్సోనియా అంటే బ్రెయిన్ ట్యూమర్
36. కింది వాటిలో జన్యుసంబంధ వ్యాధి కానిది?
1) హీమోఫీలియా – రక్తం గడ్డ కట్టకపోవడం
2) వర్ణాంధత్వం – ప్రాథమిక వర్ణాలను గుర్తించకపోవటం
3) అల్బునిజం – మెలనిన్ అనే చర్మవర్ణకం లోపం వల్ల చర్మం తెలుపుగా ఉండడం
4) అథ్లెట్ఫుట్ – పాదం బాగా వాచి రక్తస్రావం కావడం
37. ఊపిరితిత్తులను ఆవరిస్తూ ఫ్లూరాత్వచాలు(2), హృదయాన్ని ఆవరిస్తూ పెరికార్డియం ఉండగా మెదడును ఆవరిస్తూ ఉండే మూడు త్వచాలు?
1) ఉల్బత్వచాలు
2) పరాయు త్వచాలు
3) మెనింజస్ 4) వల్కలం
38. కింది వాటిలో పంటమొక్కల దిగుబడిలో ఉపయోగపడే జీవ ఎరువుగా ఉపయోగపడని జీవి?
1) నాస్టాక్, అనబినా అనే నీలి ఆకుపచ్చ శైవలాలు
2) రైజోబియం అనే బ్యాక్టీరియా
3) అర్బస్కులార్ మైకోరైజా అనే శిలీంధ్రాలు
4) న్యూక్లియర్ పాలీహెడ్రోసిస్ అనే వైరస్
39. కింది వాటిలో సరిగా జతపరచనిది ఏది?
1) థియన్ అనే ఆల్కలాయిడ్ థియాసైనెన్సిస్ నుంచి లభించును
2) నింబిడిన్, నింబిన్ అనే ఆల్కలాయిడ్ అజాడిరిక్టా ఇండికా నుంచి లభిస్తుంది
3) మార్ఫిన్ – పెపావర్ సోమ్నిఫెరం నుంచి లభించి ఉత్తేజాన్ని ఇస్తుంది
4) రిసర్పిన్ అనే ఆల్కలాయిడ్ డిజిటాలిస్ నుంచి లభించి బీపీని నియంత్రిస్తుంది
40. శరీరంలో ఉండే 639 కండరాలకు సక్రమంగా ఆక్సిజన్ అందనప్పుడు అంటే శరీరం ఎక్కువగా పనిచేసేటప్పుడు కండరాలు అవాయు శ్వాసక్రియ జరుపుకొని ఏ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది?
1) లాక్టిక్ ఆమ్లం 2) సిట్రిక్ ఆమ్లం
3) ఫార్మిక్ ఆమ్లం 4) ఎసిటిక్ ఆమ్లం
41. జతపరచండి.
ఎ. క్యారెట్, ముల్లంగి 1. పరిచ్ఛదం
బి. యాపిల్ 2. ఆంకురచ్ఛదం
సి. కుంకుమపువ్వు 3. వేరు రూపాంతరాలు
డి. కోకస్ న్యూసిఫెరా 4. పుష్పాసనం
5. ఎండిన కీలాగ్రం
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-3, బి-4, సి-1, డి-2
3) ఎ-3, బి-4, సి-5, డి-2
4) ఎ-3, బి-1, సి-5, డి-2
42. కింది వాటిలో సరికానిది గుర్తించండి.
1) హాలోఫైట్స్ – సుంవరి, అవిసీనియా వంటి మాంగ్రూవ్స్
2) హైడ్రోఫైట్స్- ఈస్ట్, పెన్సిలియం వంటి మొక్కలు
3) లిథోఫైట్స్ – శైవలం, శిలీంధ్రం కలవడం వల్ల ఏర్పడే లైకెన్స్ అనే మొక్కలు
4) ఏదీకాదు
43. కింది వాటిలో బ్యాక్టీరియా వ్యాధి కానిది ఏది?
1) డిప్లోకోకస్ న్యూమోనియె వల్ల కలిగేది న్యుమోనియా
2) బోర్డుటెల్లా పెర్టుసిస్ వల్ల కలిగే కోరింత దగ్గు వ్యాధి
3) నిస్సేరా మెనింజైటిస్ వల్ల కలిగే మెనింజైటిస్ అనే మెదడు సంబంధిత వ్యాధి
4) జ్వరం, తలనొప్పి, ఒంటినొప్పులు, చర్మం, దద్దుర్లు చిగుర్ల నుంచి రక్తస్రావం జరిగే డెంగీ వ్యాధి
44. కింది వాటిలో చిన్న పిల్లలకు సంబంధించనిది గుర్తించండి.
1) వీరిలో ప్రొటీన్ల లోపం వల్ల క్వాషియోర్కర్ వ్యాధి, కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్, కొవ్వుల లోపం వల్ల మరాస్మస్ వ్యాధి వస్తుంది
2) వీరిలో విటమిన్-డి లోపం వల్ల ఎముకల వ్యాధి ఆస్టియోమలేషియా వస్తుంది
3) వీరిలో రెనిన్ అనే ఎంజైమ్, హిస్టిడిన్ అనే ఎంజైమ్, హిస్టిడిన్ అనే అమైనోఆమ్లం ఉంటుంది
4) థైమస్ గ్రంథి ఉండి, ఆర్బీసీలు ప్లీహం, కాలేయాల్లో ఉత్పత్తి అవుతుంది
జవాబులు
1.3 2.3 3.4 4.1
5.4 6.3 7.4 8.1
9.2 10.3 11.2 12.2
13.1 14.1 15.4 16.3
17.4 18.2 19.1 20.3
21.2 22.2 23.4 24.2
25.3 26.3 27.4 28.3
29.2 30.1 31.4 32.4
33.4 34.3 35.2 36.4
37.3 38.4 39.4 40.1
41.3 42.2 43.4 44.2
విన్నర్స్ పబ్లికేషన్స్ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు