IPMAT Rohtak 2023 | ఇంటర్‌తో ఐపీఎం
ఇంటర్ తర్వాత మంచి కెరీర్ కోసం రకరకాల అవకాశాలు ఉన్నాయి. వాటిలో మేనేజ్మెంట్ కోర్సులు ఒకటి. ఇంజినీరింగ్‌కు ఐఐటీలు, మెడికల్ కోసం ఎయిమ్స్, లా కోర్సులకు ఎన్ఎల్యూలు. అదేవిధంగా మేనేజ్మెంట్ రంగంలో అడుగుపెట్టాలనుకునే వారికి ఐఐఎంలు ప్రఖ్యాతిగాంచాయి. కొన్నేండ్లుగా ఐఐఎంలు ఇంటర్ అర్హతతో ఇంటిగ్రేటెడ్ కోర్సును అందిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కోర్సులో ప్రవేశాల కోసం సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఆ వివరాలు…
- ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్
ఐఐఎం రోహతక్ - రోహతక్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లో 2019 నుంచి ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సు.. ఐపీఎంను ప్రారంభించింది.
ఐపీఎం - ఇది ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రోగ్రామ్
- మేనేజ్మెంట్ స్టడీస్‌కు సంబంధించి యూజీ, పీజీ కోర్సు. బీబీఏ+ఎంబీఏ
- ఈ కోర్సులో ప్రవేశాలు పొందినవారు మొదటి మూడేండ్లు కనీసం 5 సీజీపీఏను సాధిస్తేనే తర్వాతి పీజీ కోర్సుకు అర్హులు.
- ఈ కోర్సు కరికులంలో మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, హ్యుమానిటీస్ ప్రధాన సబ్జెక్టులు. వీటితోపాటు బిజినెస్ కమ్యూనికేషన్, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, బిజినెస్, ఫారెన్ లాంగ్వేజెస్‌ను బోధిస్తారు.
మొత్తం సీట్ల సంఖ్య: 180
ఎవరు అర్హులు ? - కనీసం 60 శాతం మార్కులతో పదోతరగతి, ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. 2023, జూన్ 30 నాటికి జనరల్, ఓబీసీ (ఎన్సీఎల్), ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అయితే 20 ఏండ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ అభ్యర్థులు అయితే 55 శాతం మార్కులతో పదోతరగతి, ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.
నోట్: ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ పరీక్ష రాస్తున్నవారు/రాసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష విధానం
- ఐపీఎం ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఐపీఎం ఏటీ 2023)
- ఈ పరీక్షలో క్వాంటిటేటివ్ ఎబిలిటీ నుంచి 40, లాజికల్ రీజనింగ్- 40, వెర్బల్ ఎబిలిటీ నుంచి 40 ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 120 ప్రశ్నలు. ప్రతి సెక్షన్‌కు 40 నిమిషాలు. మొత్తం పరీక్ష కాలవ్యవధి 120 నిమిషాలు.
- ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు. పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు ఒక మార్కు కోత విధిస్తారు
- ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ విధానంలో ఇస్తారు
నోట్: అభ్యర్థులు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ లా (ఐపీఎల్)కు దరఖాస్తు చేసుకుంటే ఐపీఎం ఏటీ 2023లో మూడు సెక్షన్లతోపాటు నాల్గో సెక్షన్లో లీగల్ రీజనింగ్ నుంచి 20 ప్రశ్నలు ఇస్తారు. ఈ సెక్షన్ పరీక్ష రాయడానికి 20 నిమిషాలు. - ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో అర్హత సాధించిన వారికి ఆన్లైన్ పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు
- ఐపీటీ ఏటీ పరీక్షలో అర్హత సాధించిన వారికి జూన్‌లో 2023న నిర్వహిస్తారు
పర్సనల్ ఇంటర్వ్యూ.. అకడమిక్స్, జనరల్ అవేర్నెస్, కమ్యూనికేషన్ స్కిల్స్‌పై ఉంటుంది. - ఆప్టిట్యూడ్ టెస్ట్‌కు 45 శాతం, పర్సనల్ ఇంటర్వ్యూకు 15 శాతం, పదోతరగతి, ఇంటర్‌కు 40 శాతం వెయిటేజీ ఇస్తారు.
నోట్: ప్రవేశాలు పొందిన వారికి హాస్టల్ సౌకర్యం ఉంటుంది. ఏసీ రూమ్స్, మెస్, వాషింగ్ మెషిన్ సౌకర్యం ఉంటుంది. దీనితోపాటు క్రీడలకు సంబంధించి.. ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, క్రికెట్ గ్రౌండ్, టీటీ తదితర సౌకర్యాలు ఉన్నాయి.
ఐపీఎల్ Integrated Programme in Law (IPL)
- ఐఐఎం రోహతక్ ఐపీఎంతోపాటు ఐపీఎల్..
ఇంటిగ్రేటెడ్ బీబీఏ ఎల్ఎల్బీ కోర్సును కూడా అందిస్తుంది. కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్
ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాస్తున్నవారు/రాసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మిగిలిన అర్హతలు అన్ని ఐపీఎంకు వర్తించేవే దీనికి వర్తిస్తాయి. - ఈ కోర్సులో ఐపీఎల్ పరీక్ష రాసి ప్రవేశం పొందవచ్చు. లేదా క్లాట్ స్కోర్‌తో కూడా
ప్రవేశాలు పొందవచ్చు. - ఐపీఎల్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా పర్సనల్ ఇంటర్వ్యూలను నిర్వహించి
తుది ఎంపిక చేస్తారు. - ఐదేండ్లు కోర్సును పూర్తిచేసుకున్నవారికి బీబీఏ – ఎల్ఎల్బీ డిగ్రీని ఐఐఎం రోహతక్ ప్రదానం చేస్తుంది.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఏప్రిల్ 10
ఐపీఎం ఆప్టిట్యూడ్ టెస్ట్: మే 20 - పర్సనల్ ఇంటర్వ్యూకు ఎంపిక ఫలితాలు: జూన్ మొదటి వారంలో
- ఆన్లైన్ పర్సనల్ ఇంటర్వ్యూ: జూన్ రెండో వారంలో
- తుది ఫలితాల వెల్లడి: జూలై మొదటి వారంలో
- తరగతులు ప్రారంభం: 2023, ఆగస్టు మొదటి వారంలో
- పూర్తి వివరాల కోసం వెబ్సైట్: https://www.iimrohtak.ac.in/చూడవచ్చు.
Previous article
MANIT Bhopal Admission | నిట్‌లో ఎంఏ
Next article
IIM-Indore IPM Notification | ఐఐఎం ఇండోర్‌లో ఐపీఎం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?