March 22nd Current Affairs | వార్తల్లో వ్యక్తులు
సురేఖ యాదవ్
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ హై స్పీడ్ రైలును నడిపిన తొలి మహిళా లోకోపైలట్‌గా సురేఖ యాదవ్ నిలిచారు. ఆమె మార్చి 13న షోలాపూర్ స్టేషన్ నుంచి ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ (ముంబై) వరకు (450 కి.మీ.) రైలు నడిపారు. మహారాష్ట్రకు చెందిన ఆమె 1988లో రైలును నడిపి దేశంలోనే కాకుండా, ఆసియాలోనే మొదటి మహిళా లోకోపైలట్‌గా చరిత్ర సృష్టించారు.
లీ కియాంగ్
చైనా ప్రధానిగా లీ కియాంగ్ మార్చి 12న ఎన్నికయ్యారు. మొత్తం 2,936 మంది నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ సభ్యుల్లో ముగ్గురు లీకి వ్యతిరేకంగా ఓటు వేయగా, మరో 8 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. లీ కియాంగ్ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఇప్పటివరకు ప్రధానిగా లీ కెకియాంగ్ ఉన్నారు. అదేవిధంగా చైనా కొత్త రక్షణ మంత్రిగా లీ షెంగ్ఫూ నియమితులయ్యారు. ఆ దేశ సైన్యంలో జనరల్‌గా పనిచేస్తున్న ఆయనపై 2018లో అమెరికా ఆంక్షలు విధించింది. రష్యా అనుకూలుడిగా ఆయనకు పేరుంది.
శక్తికాంత దాస్
ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) గవర్నర్ శక్తికాంత దాస్‌కు ‘గవర్నర్ ఆఫ్ ది ఇయర్ 2023’ అవార్డు మార్చి 15న లభించింది. కరోనా సంక్షోభం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి క్లిష్ట పరిస్థితుల్లో మార్కెట్లను సమర్థంగా నడిపినందుకు ఈ అవార్డు దక్కింది. అంతర్జాతీయ ప్రముఖ ఇంటర్నేషనల్ రిసెర్చ్ జర్నల్ సెంట్రల్ బ్యాంకింగ్ ఈ అవార్డును అందజేసింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?