Current Affairs March 22nd | తొలి ప్రవర్తన ప్రయోగశాలను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు?
1. ఎన్ఐఎస్ఏఆర్ (నిసార్)కు సంబంధించి కింది వాటిలో సరైనవి? (3)
ఎ. భారత్, ఫ్రాన్స్ కలిసి దీన్ని రూపొందించాయి
బి. భారత్, అమెరికా కలిసి దీన్ని రూపొందించాయి
సి. ప్రపంచంలో ఇది అత్యంత ఖరీదైన ఉపగ్రహం
1) ఎ, సి 2) సి
3) బి, సి 4) బి
వివరణ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థల ఒప్పందం మేరకు ఎన్ఐఎస్ఏఆర్ (నిసార్)ను ప్రయోగించనున్నారు. ప్రపంచంలోనే ఇది అత్యంత ఖరీదైన ఉపగ్రహం. ఇరుదేశాలు కలిసి రూ.1.5 బిలియన్ అమెరికన్ డాలర్లను వ్యయం చేయనున్నాయి. రెండు వేర్వేరు పౌనఃపున్యాలతో పని చేయనున్న మొదటి రాడార్ ఉపగ్రహం కూడా ఇదే. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా ఇది చిత్రాలను తీయగలదు. అత్యంత స్పష్టతతో చిత్రాలను తీసే వెసులుబాటు దీనికి ఉంది. 2800 కేజీల బరువు ఉండే నిసార్‌లో ఎల్, ఎస్ బ్యాండ్లను వినియోగిస్తారు. ఎల్-బ్యాండ్‌తో పాటు పేలోడ్‌ను నాసా సమకూరుస్తుండగా, ఎస్-బ్యాండ్‌తో పాటు స్పేస్ క్రాఫ్ట్, జీఎస్ఎల్వీని ఇస్రో అందుబాటులోకి తెస్తుంది.
2. 23వ కామన్వెల్త్ లా కాన్ఫరెన్స్ మార్చి 5 నుంచి 9 వరకు ఎక్కడ నిర్వహించారు? (4)
1) మధ్యప్రదేశ్ 2) రాజస్థాన్
3) నాగాలాండ్ 4) గోవా
వివరణ: కామన్వెల్త్ 23వ లా కాన్ఫరెన్స్‌ను భారత్‌లోని గోవాలో మార్చి 5 నుంచి 9 వరకు నిర్వహించారు. ‘సుపరిపాలన-ప్రజా సంక్షేమం’ అనే అంశంపై దృష్టి సారించారు. న్యాయ వ్యవస్థలో సాంకేతికతను వినియోగించడం ద్వారా కలిగే ప్రయోజనాలను చర్చించారు. భారత్‌లో ప్రవేశపెట్టిన ఈ-కోర్ట్స్ విధానం, అలాగే ఎఫ్ఏఎస్టీఈఆర్ విధానాలను వివరించారు. సమావేశానికి 52 దేశాల నుంచి 500 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఐదురోజులు ఇది కొనసాగింది. గోవా గవర్నర్ శ్రీధరన్ పిైళ్లె సమావేశాలను ప్రారంభించారు.
3. సరకు, ప్రయాణికుల రవాణాకు ఎన్ని జల మార్గాలను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది? (3)
1) 15 2) 21
3) 23 4) 24
వివరణ: సరకు, ప్రయాణికుల రవాణాకు 23 జల మార్గాలను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశం మొత్తంలో 111 జాతీయ జల మార్గాలున్నాయి. మొదటి జల మార్గాన్ని 1986లో ప్రకటించారు. ఇది అలహాబాద్ నుంచి హల్దియా వరకు ఉంటుంది. దేశంలో మొత్తం 14,500 కిలోమీటర్ల నౌకాయానానికి అనుకూలంగా ఉంటే ప్రస్తుతం అందులో 2% మాత్రమే వినియోగించుకోగలుగుతున్నాం. నౌకాయానం ద్వారా రవాణా అందుబాటులోకి వస్తే, రహదారులపై రద్దీ తగ్గడమే కాకుండా, పర్యావరణానికి మేలు జరుగుతుంది. ఇది చవకైంది కూడా.
4. మెరపీ అగ్ని పర్వతం ఏ దేశంలో ఉంది? (2)
1) ఫిజీ 2) ఇండోనేషియా 3) ఆస్ట్రేలియా 4) సోలోమన్ దీవి
వివరణ: మెరపి అగ్ని పర్వతం ఇండోనేషియాలో ఉంది. ప్రపంచంలో అత్యంత క్రియాశీలంగా ఉండే అగ్ని పర్వతాల్లో ఇది కూడా ఒకటి. ఇటీవల ఇది బద్ధలయ్యింది. ఇండోనేషియా దేశం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో భాగంగా ఉంది. 17,000 దీవుల సముదాయం అయిన ఇండోనేషియాలో 130 క్రియాశీల అగ్నిపర్వతాలున్నాయి.
5. ఎన్నికల సంఘం వోట్ ఫెస్ట్‌ను మార్చి 10న ఏ రాష్ట్రంలో నిర్వహించింది? (1)
1) కర్ణాటక 2) త్రిపుర
3) మేఘాలయ 4) సిక్కిం
వివరణ: ఓటర్లలో చైతన్యం కలిగించేందుకు మార్చి 10న కేంద్ర ఎన్నికల సంఘం వోట్ ఫెస్ట్ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్‌తో పాటు ఎన్నికల కమిషనర్లు- అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ పాల్గొన్నారు. కర్ణాటక రాష్ట్ర శాసనసభకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. 80 సంవత్సరాల పైబడిన వాళ్లకు, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. సాక్షమ్ అనే మొబైల్ అప్లికేషన్‌ను తీసుకురానున్నారు. ఇందులో లాగిన్ కావడం ద్వారా నచ్చిన పార్టీకి ఓటు వేసేందుకు అవకాశం ఉంటుంది.
6. జీవన్మృతుల అవయవ దానంలోతెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది? (3)
1) 3 2) 2
3) 1 4) 4
వివరణ: జీవన్మృతుల అవయవ దానం, అవయవాల మార్పిడిలోనూ తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. 2022లో 194 మంది జీవన్మృతుల అవయవాలను వారి కుటుంబ సభ్యులు దానం చేయగా తర్వాతి స్థానంలో తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర ఉన్నాయి. అలాగే జీవన్మృతుల నుంచి తీసుకున్న అవయవాల మార్పిడిలోనూ తెలంగాణ తొలిస్థానంలో ఉంది. వీరి నుంచి 655 అవయవాలను ఇతరులకు మార్పిడి చేసి తొలిస్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో వరుసగా తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర ఉన్నాయి.
7. ఏయూకేయూఎస్ (ఆకస్)లో లేని దేశం ఏది? (4)
1) ఆస్ట్రేలియా 2) యూకే
3) యూఎస్ 4) ఫ్రాన్స్
వివరణ: ఏయూకేయూఎస్ అనేది మూడు దేశాల కలయికతో ఏర్పడింది. ఇటీవలి కాలంలో ఈ వ్యవస్థ వార్తల్లో ఉంది. న్యూక్లియర్ శక్తితో కూడిన సబ్మెరైన్లను కొనేందుకు యూఎస్, బ్రిటిష్‌లతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఇది వార్తల్లోకి వచ్చింది. ఇండో-పసిఫిక్‌లో చైనా దూకుడును అడ్డుకొనేందుకు ఏర్పాటు చేసిన కూటమిగా దీన్ని చెప్పవచ్చు. ఈ కూటమి ఏర్పాటు పట్ల ఫ్రాన్స్ నిరసనను వ్యక్తం చేసింది. ఆ దేశాన్ని ఈ ఒప్పందం నుంచి వెలుపల పెట్టడమే దీనికి కారణం. ఇటీవల శాన్‌డియాగోలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్, యూకే ప్రధాని రిషి సునాక్‌ల మధ్య జరిగిన సమావేశంలో న్యూక్లియర్ సబ్మెరైన్ల కొనుగోలు అంశం చర్చకు వచ్చింది.
8. బోల్డ్ కురుక్షేత్ర అనే సైనిక విన్యాసం ఏ రెండు దేశాల మధ్య నిర్వహించారు? (2)
1) భారత్, నేపాల్
2) భారత్, సింగపూర్
3) భారత్, శ్రీలంక
4) భారత్, మలేషియా
వివరణ: బోల్డ్ కురుక్షేత్ర పేరుతో భారత్, సింగపూర్ మధ్య సైనిక విన్యాసం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో నిర్వహించారు. ఇరు దేశాల మధ్య ఇది 13వ సైనిక విన్యాసం. తొలిసారి బెటాలియన్లు, అలాగే బ్రిగేడ్ స్థాయి ప్రణాళిక వ్యవస్థలు కూడా ఈ విన్యాసంలో పాల్గొన్నాయి. మార్చి 5 నుంచి పది రోజుల పాటు ఈ విన్యాసం జరిగింది.
9. పట్టుపురుగుల పెంపకందార్లకు బీమా సౌకర్యాన్ని కల్పించిన తొలి రాష్ట్రం? (3)
1) కేరళ 2) పశ్చిమబెంగాల్
3) ఉత్తరాఖండ్ 4) ఉత్తరప్రదేశ్
వివరణ: రేశమ్ కీత్ బీమా పేరుతో పట్టుపురుగుల పెంపకం దార్లకు ఉత్తరాఖండ్ రాష్ట్రం బీమా పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. డెహ్రాడూన్, హరిద్వార్, ఉదమ్ సింగ్ నగర్, నైనిటాల్ జిల్లాలోని ఐదు బ్లాకుల్లో ఉన్న 200 పట్టుపురుగుల పెంపకం దార్లు దీని ద్వారా లబ్ధి పొందనున్నారు. నీటి కొరతతో పాటు ఇతర ప్రమాదాలు జరిగినప్పుడు బీమా మొత్తం ఆయా వ్యక్తులను ఆదుకుంటుంది. ఇటీవల కాలంలో పలు రాష్ర్టాల్లో ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు.
10. ఇంటర్నేషనల్ డే ఆఫ్ యాక్షన్ ఆఫ్ రివర్స్‌ను ఏ రోజున నిర్వహిస్తారు? (2)
1) మార్చి 15
2) మార్చి 14
3) మార్చి 13
4) మార్చి 12
వివరణ: ఏటా మార్చి 14న ఇంటర్నేషనల్ డే ఆఫ్ యాక్షన్ ఆఫ్ రివర్స్ నిర్వహిస్తారు. ఈ ఏడాది ‘రైట్స్ ఆఫ్ రివర్స్’ అనే ఇతివృత్తాన్ని ఎంచుకున్నారు. నదుల హక్కులు అని అర్థాన్ని ఇస్తుంది. ప్రపంచంలో నదులకు హక్కును ప్రసాదించిన తొలి దేశం బంగ్లాదేశ్. అలాగే ఉత్తరాఖండ్ హైకోర్ట్ తీర్పు మేరకు భారత్‌లోనూ తొలిసారి గంగా, యమున నదులకు హక్కులను ఇచ్చారు. మార్చి 15న అంతర్జాతీయ వినియోగదారుల రోజుగా, ఇస్లామో ఫోబియా రోజుగా నిర్వహిస్తారు. జాతీయ వినియోగదారుల రోజు డిసెంబర్ 24.
11. ఇటీవల సిప్రి వెలువరించిన నివేదిక ప్రకారం గత ఐదు సంవత్సరాల్లో ఆయుధాలను దిగుమతి చేసుకున్న దేశాల్లో అగ్రస్థానంలో ఉన్నది ఏది? (4)
1) ఫ్రాన్స్ 2) శ్రీలంక
3) చైనా 4) భారత్
వివరణ: 2018 నుంచి 2022 మధ్య అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఈ మేరకు స్వీడన్‌కు చెందిన స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. భారత్‌కు ఆయుధాలను ఎగుమతి చేసిన దేశాల్లో రష్యా అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత ఫ్రాన్స్ నిలిచింది. భారత్ దిగుమతి చేసుకున్న ఆయుధాల్లో దాదాపు 45% రష్యా నుంచే వచ్చాయి. ఆ తర్వాత స్థానాలు వరుసగా ఫ్రాన్స్ (29%), యూఎస్ (11%) ఉన్నాయి. మొత్తంగా ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో భారత్ వాటా 11% ఉందని సిప్రి నివేదిక పేర్కొంది.
12. హైదరాబాద్‌కు చెందిన స్వయ రోబోటిక్స్ వార్తల్లో ఉంది. కారణం ఏంటి? (3)
1) అతిపెద్ద రోబోను రూపొందించింది
2) అతిచిన్న రోబోను రూపొందించింది
3) నాలుగు కాళ్ల రోబోను రూపొందించింది
4) కాళ్లు లేని రోబోను రూపొందించింది
వివరణ: స్వయ రోబోటిక్స్ హైదరాబాద్ కేంద్రం గా పనిచేసే సంస్థ. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా దేశంలోని తొలిసారి నాలుగు కాళ్లు ఉండే రోబోను రూపొందించింది. అలాగే దీనికి బాహ్య అస్థిపంజరం కూడా ఉంటుంది. డీఆర్డీవో ల్యాబ్స్, డిఫెన్స్ బయో ఇంజినీరింగ్ ఎలక్ట్రోమెడికల్ ల్యాబొరేటరీ సహాయంతో దీన్ని తయారు చేశారు. ఇది 25 కేజీల పేలోడ్‌ను మోయగలదు. సిపాయితో కలిసి నడవగలదు. ఒక పద్ధతిగా లేని రహదారుల్లో కూడా నడవగలదు. భారత సైన్యం అవసరాన్ని తీర్చేలా దీన్ని రూపొందించారు.
13. భారత రూపాయిలో వాణిజ్యానికి ఎన్ని దేశాలకు ఇటీవల అనుమతి ఇచ్చారు? (4)
1) 15 2) 16
3) 17 4) 18
వివరణ: పద్దెనిమిది దేశాల్లోని వేర్వేరు బ్యాంకులకు రూపాయి ద్వారా వాణిజ్యాన్ని నిర్వహించుకొనేందుకు ఆర్బీఐ అనుమతినిచ్చింది. ఆయా దేశాలు వోస్ట్రో ఖాతాను తెరవాల్సి ఉంటుంది. యూరప్‌లోని జర్మనీ, రష్యా, యూకేలతో పాటు ఆసియాలోని ఇజ్రాయెల్, మలేషియా, మారిషస్, మయన్మార్, సింగపూర్ దేశాలు అందులో ఉన్నాయి.
14. సముద్ర అంతర్భాగంలో కార్బన్-డై-ఆక్సైడ్‌ను భూస్థాపితం చేయనున్న తొలి దేశం ఏది? (2)
1) స్విట్జర్లాండ్ 2) డెన్మార్క్
3) ఫ్రాన్స్ 4) యూకే
వివరణ: కార్బన్-డై-ఆక్సైడ్‌ను భూస్థాపితం చేసే సరికొత్త ప్రాజెక్టును డెన్మార్క్ ప్రారంభించింది. వేర్వేరు దేశాల నుంచి దిగుమతి చేసుకొని కార్బన్-డై-ఆక్సైడ్‌ను ఉత్తర సముద్రంలో 1800 మీటర్ల భూమిలోపల భూస్థాపితం చేయనున్నారు.
ఈ తరహా విధానాన్ని అవలంబించనున్న ప్రపంచపు తొలి దేశం డెన్మార్క్. ఈ ప్రాజెక్టును గ్రీన్శాండ్ అనే పేరుతో పిలుస్తున్నారు. 2030 వరకు ఏటా ఎనిమిది మిలియన్ టన్నుల కార్బన్-డై-ఆక్సైడ్‌ను నిల్వ చేయనున్నారు.
15. తొలి ప్రవర్తన ప్రయోగశాలను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు? (3)
1) మహారాష్ట్ర
2) ఉత్తరప్రదేశ్
3) రాజస్థాన్
4) మణిపూర్
వివరణ: దేశంలో తొలి ప్రవర్తన ప్రయోగశాలను రాజస్థాన్‌లో ఏర్పాటు చేయనున్నారు. పింక్ సిటీగా పేరున్న జైపూర్‌లో ఇది రానుంది. ఆ నగరంలోని హరీష్ చంద్ర మాథుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో ఏర్పాటు చేయనున్నారు. 2665.04 చదరపు అడుగుల వైశాల్యంలో దీన్ని నిర్మించనున్నారు. ప్రవర్తనకు సంబంధించి ప్రయోగాలను ఇక్కడ చేపడుతారు. అంతర్జాతీయ స్థాయి నిపుణులను కూడా ఇక్కడకు రప్పించనున్నారు. ఆధునిక హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్లను వినియోగించనున్నారు.
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ
9849212411
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?