Current Affairs March 15th | జాతీయం
వడాపావ్
ప్రపంచంలోనే బెస్ట్ శాండ్విచ్ల జాబితాలో ముంబైలో పేరుగాంచిన వడాపావ్‌కు 13వ స్థానం లభించింది. ‘టేస్ట్ అట్లాస్’ అనే సంస్థ శాండ్విచ్లపై అధ్యయనం చేసి రూపొందించిన ఈ జాబితాను మార్చి 5న విడుదల చేసింది.
బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్‌సానిక్ క్షిపణిని భారత నౌకాదళం మార్చి 5న విజయవంతంగా ప్రయోగించింది. ముంబైకి సమీపంలో అరేబియా సముద్రంలో యుద్ధనౌకపై నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టారు. డీఆర్డీవో దేశీయంగా రూపొందించిన సీకర్ అండర్ బూస్టర్ పరిజ్ఞానంతో ఈ పరీక్ష నిర్వహించారు. బ్రహ్మోస్ క్షిపణి ధ్వని వేగానికి దాదాపు మూడు రెట్ల వేగంతో (మ్యాక్ 2.8) ప్రయాణించగలదు.
ఎంటీ-1
కాలం చెల్లిన, భూ కక్ష్యలో తిరుగుతున్న శాటిలైట్ మేఘ ట్రోపిక్స్-1ను ఇస్రో మార్చి 7న విజయవంతంగా ధ్వంసం చేసింది. భూ వాతావరణంలోకి ప్రవేశించి, దానికదే విడిపోయి పసిఫిక్ మహాసముద్రంపై గగనతలంలో కాలి బూడిదైంది. యునైటెడ్ నేషన్స్ స్పేస్ డెబ్రిస్ ఏజెన్సీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఉపగ్రహాలను అంతరిక్షంలోనే ధ్వంసం చేయగల సత్తా అమెరికా, రష్యా, చైనాలతో పాటు భారత్‌కు కూడా ఉంది. ఉష్ణమండల వాతావరణంపై అధ్యయనం చేయడానికి ఇస్రో ఈ శాటిలైట్‌ను 2011, అక్టోబర్ 12న ప్రయోగించింది.
ఎంఆర్ శామ్
ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే మధ్య స్థాయి ఎంఆర్ శామ్ (ఎంఆర్ ఎస్ఏఎం) మిసైల్‌ను భారత నేవీ మార్చి 7న విజయవంతంగా ప్రయోగించింది. ఐఎన్ఎస్ విశాఖపట్నం నుంచి ఈ ప్రయోగం నిర్వహించారు. డీఆర్డీవో, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా ఈ క్షిపణిని అభివృద్ధి చేయగా, బీడీఎల్ ఉత్పత్తి చేసింది.
నిసార్
భూమిపై పరిణామాలను నిత్యం పరిశీలించి తక్షణం సమాచారాన్ని అందించే నిసార్ శాటిలైట్‌ను అమెరికా దళం మార్చి 8న ఇస్రోకు అందజేసింది. దీనిలో రెండు వేర్వేరు రాడార్లు ఉంటాయి. లాంగ్ రేంజ్ రాడార్‌ను అమెరికా, ఎస్-బ్యాండ్ రాడార్‌ను భారత్ సైంటిస్టులు రూపొందించారు. వీటిని అమెరికాలోని జెట్పాపుల్సన్ ల్యాబొరేటరీకి పంపి ఏక యూనిట్‌గా మార్చారు. దీన్ని వచ్చే ఏడాది ఏపీలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?