Current Affairs March 15th | ఉమెన్ ‘ఫైన్ ఎంపవర్’ కార్యక్రమాన్ని ప్రారంభించిందెవరు?
1. సంతోష్ ట్రోఫీని ఏ రాష్ట్ర జట్టు గెలుచుకుంది? (4)
1) మేఘాలయ 2) మహారాష్ట్ర
3) ఒడిశా 4) కర్ణాటక
వివరణ: సంతోష్ ట్రోఫీ ఫుట్‌బాల్ జాతీయ చాంపియన్‌షిప్‌ను ఈ ఏడాది కర్ణాటక గెలుచుకుంది. తుదిపోరులో ఆ జట్టు మేఘాలయను ఓడించింది. 54 సంవత్సరాల తర్వాత కర్ణాటక జట్టును సంతోష్ ట్రోఫీ వరించింది. ఈ ట్రోఫీని ఈ ఏడాది సౌదీ అరేబియాలో నిర్వహించారు. ఆ దేశ రాజధాని కింగ్ ఫహద్ ఇంటర్నేషనల్ స్టేడియంలో తుదిపోరు నిర్వహించారు.
2. ఏ రోజును అణ్వాయుధ రహిత-అణ్వాయుధ వ్యాప్తి నిరోధక రోజుగా నిర్వహిస్తారు? (3)
1) జనవరి 1 2) జూలై 1
3) మార్చి 5 4) మార్చి 6
వివరణ: ఏటా మార్చి 5న అణ్వాయుధ రహిత-అణ్వాయుధ వ్యాప్తి నిరోధక రోజుగా నిర్వహించాలని 2022 డిసెంబర్లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ తీర్మానం చేసింది. 2023 మార్చి 5న తొలిసారి ఈ రోజును నిర్వహించారు. మధ్య ఆసియా దేశం కిర్గిజ్‌స్థాన్ ఈ రోజు ఒకటి ఉండాలంటూ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా డిసెంబర్ 7, 2022న ఆమోదించారు. 1970 మార్చి 5న అణ్వాయుధ వ్యాప్తి నిరోధక ఒప్పందం అమల్లోకి వచ్చింది. దీంతో ఈ రోజును ఎంపిక చేశారు.
3. ‘హైసీ’ ప్రాంతం ఎక్కడ ఉంది? (3)
1) ఎత్తయిన ప్రదేశాల్లో ఉండే సముద్రం
2) భూభాగాల తీరం నుంచి 12 నాటికల్ మైళ్ల దూరంలో
3) భూభాగాల నుంచి 200 నాటికల్ మైళ్ల దూరంలో
4) భూభాగాల నుంచి 24 నాటికల్ మైళ్ల దూరంలో
వివరణ: సముద్రంలో జీవ వైవిధ్యం, జలరాశులను కాపాడేందుకు ఐక్యరాజ్య సమితి చరిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీన్ని మహాసముద్రాల పారిస్ ఒప్పందం అని కూడా పిలుస్తున్నారు. 2030 నాటికి 30 శాతం సముద్రాలను రక్షిత విభాగంలోకి తీసుకురావడమే దీని లక్ష్యం. ఏ దేశ తీరం నుంచి అయినా 200 నాటికల్ మైళ్ల అవతల ఉండే ప్రదేశాన్ని హైసీ అని పేర్కొంటారు. ఆ ప్రాంతంలో జీవ వైవిధ్యం, జల రాశులను కాపాడేందుకు ఉద్దేశించింది ఇది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 14వది కూడా ఇదే దిశా నిర్దేశం చేస్తుంది. సుమారుగా 40 సంవత్సరాల కిందట యూఎన్సీఎల్వోస్ (యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీ) కుదిరింది. అందులో భాగమే తాజా ఒప్పందం.
4. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎవరు ఎంపికయ్యారు? (2)
1) భావిన పటేల్ 2) మీరాబాయి చాను
3) ప్రీతమ్ సివచ్ 4) నీతూ గంగాస్
వివరణ: టోక్యో ఒలింపిక్స్‌లో వెండి పతకాన్ని పొందిన మీరాబాయి చానుకు 2022 బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ దక్కింది. దీన్ని ఆమె పొందడం వరుసగా రెండోసారి. అలాగే భావిన పటేల్ బీబీసీ పారా స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును పొందింది. టేబుల్ టెన్నిస్‌లో టోక్యో పారాలింపిక్స్‌లో భావిన పటేల్ వెండి పతకాన్ని గెలుచుకుంది. ప్రీతమ్ సివాచ్ భారత మహిళల హాకీ జట్టు మాజీ కెప్టెన్. ఆమెకు బీబీసీ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు దక్కింది. నీతూ గంగాస్ బాక్సింగ్ క్రీడాకారిణి. 2022 కామన్వెల్త్ పోటీల్లో బంగారు పతకాన్ని సాధించింది. ఆమెకు బీబీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ దక్కింది.
5. అమెరికాలో మసాచుసెట్స్ రాష్ట్రంలోని జిల్లా కోర్టులో జడ్జిగా నియమితులైన భారతీయ అమెరికన్ ఎవరు? (1)
1) తేజల్ మెహతా 2) ఆర్తి ప్రభాకర్
3) శాంతి సేథి
4) పర్బిందర్ కౌర్ షెర్గిల్
వివరణ: అమెరికాలోని మాసాచుసెట్స్ జిల్లా కోర్టులో తేజల్ మెహతా జడ్జిగా నియమితులయ్యారు. ఆమె భారతీయ-అమెరికన్. ఈ పదవిని చేపట్టనున్న తొలి భారత సంతతికి చెందిన మహిళ ఆమె. ఆర్తి ప్రభాకర్ కూడా అమెరికాలో కీలక పదవిలో ఉన్నారు. ఆ దేశ అధ్యక్షుడికి శాస్త్ర-సాంకేతిక రంగంలో సలహాదారుగా పనిచేస్తున్నారు. ఈ పదవిని చేపట్టిన భారత సంతతికి చెందిన తొలి మహిళ. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు రక్షణ రంగంలో సలహాదారుగా శాంతి సేథి ఉన్నారు. ఆమె మాజీ సైన్యాధికారి. పర్బిందర్ కౌర్ కూడా జడ్జి. బ్రిటిష్ కొలంబియా సుప్రీంకోర్టులో నియమితులయ్యారు. కెనడాలో ఈ పదవిని చేపట్టిన తొలి భారత సంతతి మహిళ.
6. ఎన్ఆర్ఎస్సీ ఇటీవల వెలువరించిన నివేదిక ప్రకారం కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న జిల్లాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న జిల్లా? (1)
1) రుద్రప్రయాగ్ 2) తెహ్రీ గర్వాల్
3) త్రిసూర్ 4) రాజౌరీ
వివరణ: 1988 నుంచి 2022 మధ్య 17 రాష్ర్టాల్లోని 147 జిల్లాల్లో కొండ చరియలు విరిగిపడే సంఘటనల ఆధారంగా ఒక అట్లాస్‌ను ఎన్ఆర్ఎస్సీ రూపొందించింది. ఎన్ఆర్ఎస్సీ అంటే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. ఇది హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. కొండచరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉన్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉంది. దేశంలో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న జిల్లా రుద్రప్రయాగ్. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా తెహ్రీ గర్వాల్ (ఉత్తరాఖండ్), త్రిసూర్ (కేరళ), రాజౌరీ (జమ్ము-కశ్మీర్), పాలక్కడ్ (కేరళ) జిల్లాలు ఉన్నాయి. భారత వాయవ్యంలో కొండ చరియలు విరిగిపడే ప్రమాదం 66.5% ఉండగా, ఈశాన్యం 18.8%, పశ్చిమ కనుమల్లో 14.7% ఉంది.
7. ఏ దేశంతో కలిసి భారత్ ఫ్రిన్జెక్స్-23 విన్యాసాలను నిర్వహించింది? (3)
1) యూఏఈ 2) స్పెయిన్
3) ఫ్రాన్స్ 4) డెన్మార్క్
వివరణ: భారత్, ఫ్రాన్స్ సైన్యాల మధ్య ఉమ్మడి విన్యాసం మార్చి 7, 8 తేదీల్లో కేరళలోని పంగోడ్ మిలిటరీ స్టేషన్లో నిర్వహించారు. ఈ తరహా విన్యాసం నిర్వహించడం ఈ రెండు దేశాలకు ఇదే ప్రథమం. రెండు దేశాల మధ్య సమన్వయం, సహకారం పెంపొందించేందుకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ విన్యాస ఇతివృత్తం ‘హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ఆపరేషన్స్ ఇన్ కంటెస్టెడ్ ఎన్విరాన్మెంట్’. భారత్, ఫ్రాన్స్ మధ్య శక్తి (సైన్యం), వరుణ (నౌకాదళం), గరుడ (వాయుదళం) విన్యాసాలు నిర్వహించారు.
8. ప్రపంచంలోనే మొదటి బ్యాంబు (వెదురు) క్రాష్ బారియర్‌ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? (4)
1) మేఘాలయ 2) నాగాలాండ్
3) త్రిపుర 4) మహారాష్ట్ర
వివరణ: వెదురు కర్రతో తయారు చేసిన బారియర్‌ను మహారాష్ట్రలో ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో వాని-వరోరా జాతీయ రహదారిపై 200 మీటర్లు ఉంది. దీనికి బాహుబలి అనే పేరు పెట్టారు. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా దీన్ని నిర్మించారు. నేషనల్ ఆటోమోటివ్ టెస్ట్ ట్రాక్స్‌లో దీన్ని విజయవంతంగా పరీక్షించారు. అలాగే అగ్ని ప్రమాదాలను తట్టుకుంటుందా లేదా అన్న సంగతిని కూడా పరిశీలించారు. దీన్ని విస్తృతంగా వినియోగిస్తే పర్యావరణానికి మేలు జరగడంతో పాటు రైతులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
9. మహిళల ఆర్థిక భద్రత కోసం భారత్‌కు చెందిన ఏ వ్యవస్థతో యూఎన్ ఉమెన్ ‘ఫైన్ ఎంపవర్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది? (3)
1) కేంద్ర ఆర్థిక శాఖ
2) మహిళా శిశు మంత్రిత్వ శాఖ
3) బాంబే స్టాక్ ఎక్సేంజ్ 4) సెబీ
వివరణ: బాంబే స్టాక్ ఎక్సేంజ్, యూఎన్ ఉమెన్ ఇండియా సంయుక్తంగా ‘ఫైన్ ఎంపవర్’ ఉమెన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఇది మహిళలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ఉద్దేశించింది. మహిళల సామర్థ్యాన్ని కూడా పెంచేందుకు ఉద్దేశించింది. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున రెండు సంస్థలు కలిసి ‘రింగ్ ది బెల్ ఫర్ జెండర్ ఈక్వాలిటీ సెరిమని’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించాయి. అంటే లింగ సమానత్వం కోసం సిద్ధం కావాలని చెప్పడం.
10. ఇటీవల ఐబీసీఏ (IBCA) పేరుతో భారత్ కొత్త ప్రతిపాదన తెచ్చింది. ఐబీసీఏ అంటే ఏంటి? (2)
1) ఇంటర్నేషనల్ బిజినెస్ కన్జ్యూమర్ అవేర్నెస్
2) ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్
3) ఇంటర్నేషనల్ బిహేవియర్ కాన్ఫిడెన్స్ అలయన్స్ 4) ఏదీ కాదు
వివరణ: పులి, సింహం, చిరుత, మంచు చిరుత తదితర జంతువుల సంరక్షణకు భారత ప్రభుత్వం ఐబీసీఏ పేరుతో కొత్త ప్రతిపాదన చేసింది. ఈ జంతువుల సహజ ఆవాసం ఉన్న 97 దేశాలకు ఇందులో సభ్యత్వం ఇస్తారు. ఆయా జంతువుల సంరక్షణ, సంఖ్యను పెంచడం తదితర అంశాల్లో సమాచారాన్ని పరస్పరం పంచుకొనేందుకు ఈ కూటమి ఒక వేదికగా ఉపయోగపడుతుంది. ఇందుకు భారత్ 100 మిలియన్ డాలర్ల వ్యయం చేస్తామని హామీ ఇచ్చింది. అన్ని సభ్య దేశాలు కలిసి ఏడుకు తక్కువ కాకుండా, అలాగే 15కు మించకుండా ఒక సాధారణ సభను ఎన్నుకోవాలని ప్రతిపాదించింది. ఒక సచివాలయ ఏర్పాటును ప్రతిపాదించింది.
11. భారత్‌కు ఇటీవల ప్రపంచ బ్యాంక్ 1 బిలియన్ డాలర్ల రుణాన్ని ప్రకటించింది. ఇది దేనికి ఉద్దేశించింది? (1)
1) వైద్య రంగంలో మౌలిక సదుపాయాలకు
2) రైల్వే రంగంలో వినియోగానికి
3) బుల్లెట్ రైలు కోసం 4) స్వచ్ఛ భారత్
వివరణ: వైద్య రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగు పరచుకోవడానికి ప్రపంచ బ్యాంక్ 1 బిలియన్ డాలర్ల రుణాన్ని ఇవ్వనుంది. ప్రధాన మంత్రి-ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పథకానికి దీన్ని వినియోగించనున్నారు. ఈ పథకాన్ని భారత్ 2021 అక్టోబర్‌లో ప్రారంభించారు. ప్రపంచ బ్యాంక్ నుంచి వచ్చే రుణాన్ని రెండుగా విభజిస్తారు. 500 మిలియన్ డాలర్లు మహమ్మారులు వస్తే, అవసరమయ్యే ప్రజా వైద్య వ్యవస్థలను అభివృద్ధి చేస్తారు. దీనికే పబ్లిక్ హెల్త్ సిస్టమ్ ఫర్ పాండమిక్ ప్రిపేర్డ్నెస్ ప్రోగ్రామ్ అని పిలుస్తున్నారు. మరో 500 మిలియన్ డాలర్లతో వైద్య రంగంలో మరింత మెరుగైన సేవలను ఇచ్చే వ్యవస్థలను అభివృద్ధి చేస్తారు.
12. ఇటీవల శిశుపాలనగర్ అని ఒక ప్రదేశం బయటపడింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? (3)
1) హర్యానా 2) రాజస్థాన్
3) ఒడిశా 4) అసోం
వివరణ: ఒడిశాలోని భువనేశ్వర్ సమీపంలో శిశుపాలనగర్ అనే ఒక ప్రదేశాన్ని ఆర్కియాలాజికల్ శాఖ గుర్తించింది. ఇది క్రీ.పూ 300 నుంచి క్రీ.శ 4వ శతాబ్దం వరకు ఉండవచ్చు. ఈ ప్రాంతం చుట్టూ కోటగోడ ఉంది. ఎనిమిది ద్వారాలు ఉన్నాయి. కోటగోడ ఉంటూ ఎనిమిది ద్వారాలు బయటపడడం భారత చరిత్రలో ఇదే తొలిసారి. ఈ ప్రాంతంలో తవ్వకాలను 1948లో ప్రారంభించారు. గతంలోనే ఇది రక్షిత ప్రాంతంగా ప్రకటించారు. అప్పటి నుంచి తవ్వకాలను కొనసాగిస్తున్నారు. ఈ ప్రాంతం నాటి పాలకులకు రాజధానిగా ఉండొచ్చని భావిస్తున్నారు.
13. ఇటీవల అరెస్టుకు గురైన అలెస్ బియాలిట్స్కీ ఏ దేశానికి చెందినవాడు? (4)
1) ఉక్రెయిన్ 2) రష్యా
3) సిరియా 4) బెలారస్
వివరణ: అలెస్ బియాలిట్స్కీ నోబెల్ శాంతి బహుమతి పొందాడు. బెలారస్‌కు చెందినవాడు. జన్మించింది మాత్రం రష్యాలో. 2022లో నోబెల్ శాంతి బహుమతిని పొందాడు. ఆయనతో పాటు ఆ ఏడాది రష్యాలోని మానవ హక్కుల సంఘం, ఉక్రెయిన్‌లోని మానవ హక్కుల కోసం పోరాడుతున్న సివిల్ లిబర్టీస్ సంస్థలు కూడా పొందాయి. ఇటీవల అలెస్ బియాలిట్స్కీ జైలు పాలయ్యాడు. బెలారస్ దేశ న్యాయ వ్యవస్థ ఆయనకు పదేళ్ల జైలుశిక్ష విధించింది. ఇది రాజకీయ పరమైనదిగా మానవ హక్కుల కార్యకర్తలు అంటున్నారు. అతడిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
14. ఇటీవల భారత్ సందర్శించిన జార్జియా మెలోని ఏ దేశ ప్రధాని? (1)
1) ఇటలీ 2) స్పెయిన్
3) ఫ్రాన్స్ 4) జర్మనీ
వివరణ: భారత్‌లో నిర్వహించిన రైసీనా డైలాగ్‌కు మెలోని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె ఇటలీ ప్రధాని. ఆ దేశానికి ప్రధాని అయిన తొలి మహిళ. వివిధ అంశాలకు సంబంధించి భారత్, ఇటలీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఇండో-పసిఫిక్ ఓషియన్ ఇనిషియేటివ్‌లో చేరేందుకు ఇటలీ అంగీకరించింది.
15. వాయుసేన పోరాట విభాగానికి తొలిసారి నాయకత్వం వహించబోతున్న మహిళ ఎవరు? (3)
1) శివ చౌహాన్ 2) భావనాకాంత్
3) శాలిజా ధామీ 4) అవని చతుర్వేది
వివరణ: భారత వాయుసేన చరిత్రలో తొలిసారి ఒక పోరాట విభాగానికి మహిళ నాయకత్వం వహించనున్నారు. గ్రూప్ కెప్టెన్ శాలిజా ధామీకి ఈ ఘనత దక్కింది. పశ్చిమ ప్రాంతంలో క్షిపణుల స్కాడ్రన్‌కు ఆమె నేతృత్వం వహించనున్నారు. వాయుసేనలో ఇంత వరకు ఒక మహిళ ఇలాంటి బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి. 2003లో హెలికాప్టర్ పైలెట్‌గా ఐఏఎఫ్‌లోకి ధామీ అడుగుపెట్టారు. 2800 గంటలు హెలికాప్టర్లు నడిపిన అనుభవం ఉంది. అలాగే సియాచిన్‌లో సేవలు అందించేందుకు భారత సైన్యం ఫైర్ అండ్ ఫ్యూరీకోర్కు చెందిన శివ చౌహాన్‌ను గతంలో నియమించింది. జనవరి 2023 నుంచే ఆమె బాధ్యతలను స్వీకరించింది.
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ
9849212411
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?