Current Affairs March 15th | తెలంగాణ
తెలంగాణలోనే ఫాక్స్‌కాన్
ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన హోన్ హాయ్ టెక్నాలజీ గ్రూప్‌నకు చెందిన ‘ఫాక్స్‌కాన్’ను తెలంగాణలోనే ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ చైర్మన్ యంగ్ లియూ మార్చి 6న సీఎం కేసీఆర్‌కు ప్రత్యేకంగా లేఖ రాసి ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని కొంగర కలాన్‌లో ఫాక్స్‌కాన్ ఉత్పత్తి ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. టీ వర్క్స్ ప్రారంభానికి వచ్చిన యంగ్ లియూ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
మెట్రో ఎండీకి అవార్డు
హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సోషల్ (ఇంపాక్ట్) సీఈవో ఆఫ్ ది ఇయర్ అవార్డు మార్చి 5న అందుకున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సీఈవోలు సభ్యులుగా ఉన్న సీఈవో క్లబ్స్ ఆఫ్ ఇండియా ఈ అవార్డును బెంగళూరులో ‘గో బియాండ్-2023’ రీట్రీట్ కార్యక్రమంలో అందజేసింది. థైరోకేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు డా. ఆరోగ్యస్వామి వేలుమణి ద్వారా ఈ అవార్డును ఆయన స్వీకరించారు.
శంషాబాద్ ఎయిర్పోర్ట్
శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరోసారి ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్-ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ సర్వే ‘ఉత్తమ విమానాశ్రయం’ అవార్డుకు మార్చి 6న ఎంపికయ్యింది. 2022కు ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 15-25 మిలియన్ల వార్షిక ప్రయాణికుల విభాగంలో ఈ అవార్డు లభించింది. వరుసగా 9 సంవత్సరాలు ఈ ఎయిర్పోర్ట్ గ్లోబల్ టాప్-3 విమానాశ్రయాల్లో ఒకటిగా నిలుస్తూ వస్తుంది.
శేఖర్ రెడ్డి
సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ-భారతీయ పరిశ్రమల సమాఖ్య) తెలంగాణ విభాగానికి నూతన చైర్మన్‌గా సీ శేఖర్ రెడ్డి మార్చి 7న ఎంపికయ్యారు. రియల్ సీఎస్ఆర్ ఎస్టేట్స్ లిమిటెడ్‌కు సీఎండీగా ఉన్నారు. అలాగే వైస్ చైర్మన్‌గా డి సాయిప్రసాద్ ఎంపికయ్యారు. ఈయన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
బోయింగ్ ఫ్రైటర్
దేశంలోనే తొలి బోయింగ్ ఫ్రైటర్ కన్వర్షన్ లైన్ (బీసీఎఫ్) హైదరాబాద్‌లో ఏర్పాటు కానున్నది. ప్రయాణికుల విమానాలను సరకు రవాణా విమానాలుగా మార్చే సదుపాయాన్నే బీసీఎఫ్ అంటారు. ఈ సదుపాయాన్ని జీఎంఆర్ ఏరో టెక్నిక్‌తో కలిసి బోయింగ్ నెలకొల్పనున్నది. దీనికి సంబంధించిన ఒప్పంద పత్రాలపై బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ సలీల్ గుప్తే, జీఎంఆర్ ఏరో టెక్నిక్ సీఈవో అశోక్ గోపీనాథ్ మార్చి 10న సంతకాలు చేశారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?