08th March Current Affairs | తెలంగాణ
తెలంగాణ
టీ వర్క్స్
దేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద ప్రొటోటైపింగ్ సెంటర్ (టీ-వర్క్స్)ను హైదరాబాద్‌లోని రాయదుర్గంలో మార్చి 2న మంత్రి కేటీఆర్, ఫాక్స్‌కాన్ సంస్థ చైర్మన్, సీఈవో యంగ్ లియు ప్రారంభించారు. భూమిలో పెట్టే విత్తనం నుంచి అంతరిక్షంలోకి వెళ్లే రాకెట్ వరకు అన్నింటిలోనూ సృజనాత్మక ఆవిష్కరణలకు టీ-వర్క్స్ వేదిక కానుంది. దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా ఇలాంటి సంస్థ లేదు. దీనిలో మెటల్, త్రీ డీ ప్రింటింగ్, ఎలక్ట్రానిక్స్, మెట్రాలజీ, వుడ్ వర్కింగ్, వెల్డింగ్, పెయింట్ జూబ్, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు తదితర విభాగాలు అందుబాటులో ఉన్నాయి. టీ వర్క్స్‌లోని యంత్రాలపై రూపొందించిన బొంగరాన్ని అతిథులకు జ్ఞాపికగా అందజేశారు.
ఆర్థిక శక్తిగా హైదరాబాద్
- దేశ ఆర్థిక శక్తి కేంద్రంగా హైదరాబాద్ నగరం ఎదుగుతున్నదని ప్రముఖ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సేవల సంస్థ సావిల్స్ ప్రకటించింది. ‘హైదరాబాద్: ది స్ప్రింట్’ పేరుతో యూకేకు చెందిన అంతర్జాతీయ ప్రాపర్టీ కన్సల్టెంట్ సావిల్స్ రూపొందించిన నివేదికను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఫిబ్రవరి 26న విడుదల చేశారు. 2022లో రికార్డు స్థాయిలో ఇండ్ల విక్రయాలు జరిగినట్టు పేర్కొంది. ప్రోత్సాహం, మౌలిక వసతుల కల్పన, ఆఫర్డబిలిటీ, మానవ నైపుణ్యాలు వంటి నాలులు ప్రధాన అంశాలతో హైదరాబాద్ ఆర్థికంగా దేశంలోనే వేగంగా దూసుకెళ్తుందని వెల్లడించింది. సావిల్స్ గ్లోబల్ సీఈవో మార్క్, రిడ్లీ, ఆసియా పసిఫిక్ సీఈవో క్రిస్టియన్ ఎఫ్ మాన్సిని, ఇండియా సీఈవో అనురాగ్ మాథుర్.
లిథువేనియా కాన్సులేట్
- ఐరోపా దేశమైన లిథువేనియా కాన్సులేట్ కార్యాలయాన్ని ఫిబ్రవరి 26న ప్రారంభించారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో దీన్ని ఏర్పాటు చేశారు. లిథువేనియా ఆర్థిక, ఇన్నోవేషన్ వైస్ మినిస్టర్ కరోలిస్ జెమైటిస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల లిథువేనియా గౌరవ కాన్సులేట్‌గా దివీస్ ల్యాబ్స్ సీఈవో కిరణ్ సశ్చంద్ర నియమితులయ్యారు.
గ్రీన్ ఊర్జా అవార్డు
దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్)కు ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) సోలార్ రూఫ్‌టాప్ ఎనర్జీ (ఈపీఎస్/రెస్కో) కేటగిరీలో అవార్డు లభించింది. ఫిబ్రవరి 27న నిర్వహించిన మూడో గ్రీన్ ఊర్జా అవార్డ్స్ అండ్ కాన్ఫరెన్స్‌లో ఈ అవార్డును అందజేశారు. బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి సంస్థలపై భారం పడకుండా, నష్టాలు తగ్గించేందుకు వినియోగదారులను సౌర విద్యుత్తు వైపు ప్రోత్సహించేందు సంస్థ చేసిన కృషికి ఈ అవార్డు దక్కింది.
అగ్రివర్సిటీ ఒప్పందం
హైదరాబాద్‌లోని ఇక్రిశాట్ సంస్థ హర్యానా వ్యవసాయ వర్సిటీతో ఫిబ్రవరి 27న ఒప్పందం కుదుర్చుకుంది. వాణిజ్య పంటల సాగు, మెలకువలు, విత్తన నిర్వహణ వంటి అంశాలపై ఐదేండ్ల పాటు సమష్టి పరిశోధనలు నిర్వహించడం ఈ ఒప్పందం లక్ష్యం. ఇక్రిశాట్ డైరెక్టర్ జాక్వెలిన్, హర్యానా వ్యవసాయ వర్సిటీ వీసీ బల్దేవ్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు.
స్వచ్ఛ సుజల్ పురస్కారం
ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండలం ముక్రా(కే) సర్పంచ్ గాడ్గె మీనాక్షి ‘స్వచ్ఛ సుజల్ శక్తి సమ్మాన్-2023’ పురస్కారం ఫిబ్రవరి 4న అందుకున్నారు. అన్ని విభాగాల్లో స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దడంలో ఆదర్శం (ఓడీఎఫ్ ప్లస్ మోడల్)గా నిలిచినందుకు ఈ జాతీయ అవార్డు లభించింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?