Groups Special | ఎఫ్ఏటీఎఫ్ నుంచి ఏ దేశాన్ని సస్పెండ్ చేశారు?
1. ఓలాఫ్ స్కోల్జ్ ఇటీవల భారత్‌లో పర్యటించారు. ఆయన ఏ దేశ ప్రభుత్వాధినేత? (3)
1) ఇటలీ 2) ఫ్రాన్స్
3) జర్మనీ 4) గ్రీక్
వివరణ: జర్మనీ చాన్స్‌లర్ ఓలాఫ్ స్కోల్జ్ ఫిబ్రవరి 25-26 తేదీల్లో భారత్‌లో పర్యటించారు. ఆరు సబ్మెరైన్ల నిర్మాణానికి ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. దీని విలువ 5.2 బిలియన్ డాలర్లు ఉంటుంది. 2000 నుంచి భారత్, జర్మనీ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం ఉంది. 2011లో ఇరు దేశాల మధ్య ఇంటర్‌గవర్నమెంట్ కన్సల్టేషన్స్ ప్రారంభమయ్యాయి. 2021, మార్చి 7 నాటికి రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 70 సంవత్సరాలు పూర్తయ్యాయి. యూరప్ ఖండంలో భారత్‌కు అత్యంత పెద్ద వాణిజ్య భాగస్వామి జర్మనీ.
2. డెజర్ట్ ఫ్లాగ్ VIII ఏ దేశంలో ఉంటుంది? (4)
1) సౌదీఅరేబియా 2) తుర్క్మెనిస్థాన్
3) ఇజ్రాయెల్ 4) యూఏఈ
వివరణ: డెజర్ట్ ఫ్లాగ్ VIII యూఏఈ నిర్వహిస్తుంది. ఇందులో పాల్గొనేందుకు భారత వాయుదళం వెళ్లింది. ఇది బహుళ దేశాలు పాల్గొనే వాయుదళ విన్యాసం. ఈ విన్యాసం ఫిబ్రవరి 27 నుంచి మార్చి 17 వరకు ఉంటుంది. ఇందులో ఫ్రాన్స్, కువైట్, ఆస్ట్రేలియా, యూకే, బహ్రెయిన్, మొరాకో, స్పెయిన్, రిపబ్లిక ఆఫ్ కొరియా, యూఎస్ఏ తదితర దేశాలు పాల్గొంటున్నాయి. భారత్ తరఫున ఎల్సీఏ తేజస్ పాల్గొంటుంది. అంతర్జాతీయ విన్యాసంలో తేజస్ పాల్గొనడం ఇదే ప్రథమం.
3. ఏ రాష్ట్రంలో అజంత-ఎల్లోర అంతర్జాతీయ పండుగ నిర్వహిస్తారు? (3)
1) గుజరాత్
2) మధ్యప్రదేశ్
3) మహారాష్ట్ర 4) గోవా
వివరణ: అజంత-ఎల్లోర గుహలు మహారాష్ట్రలో ఉన్నాయి. ఇక్కడ ‘ఎల్లోర-అజంత అంతర్జాతీయ పండుగ’ ఫిబ్రవరి 25న ప్రారంభమైంది. ఏడేండ్ల తర్వాత ఈ వేడుక జరిగింది. ఈ ఏడాది ఇది సొనారి ప్యాలెస్‌లో నిర్వహించారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మరఠ్వాడా యూనివర్సిటీలో ఈ భవనం ఉంది. గాయకులు, నాట్యకళాకారులతో పాటు ఇతర కళల్లో నైపుణ్యం ఉన్న వారు దీనికి హాజరయ్యారు. మయూర్ వైద్య అనే కళాకారుడి కథక్ నృత్యంతో ఈ ఉత్సవం ప్రారంభమైంది.
4. ఏ రంగంలో మహిళలను ప్రోత్సహించేందుకు కేరళ, యూఎన్ ఉమెన్ ఒప్పందం కుదుర్చుకున్నాయి? (2)
1) విద్య
2) పర్యాటకం
3) శాస్త్ర-సాంకేతిక రంగం
4) వైద్య రంగం
వివరణ: న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది యూఎన్ ఉమెన్. మహిళా సాధికారత సాధించేందుకు, లింగ వివక్షను రూపుమాపేందుకు పనిచేస్తున్న సంస్థ. ఐదో సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని సాధించేందుకు ఉద్దేశించింది. ఇటీవల భారత్‌లోని కేరళ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రాష్ట్రంలోని పర్యాటక రంగంలో మహిళల పాత్రను పెంచేందుకు ఉద్దేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా లింగపరమైన సమ్మిళిత ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ఈ ఒప్పందం తోడ్పడుతుంది. గతంలో కేరళ రాష్ట్రం మహిళా స్నేహ పూర్వక పర్యాటక విధానాన్ని ప్రారంభించింది.
5. ఏ దేశంలో అటకామా లార్జ్ మిల్లీమీటర్/సబ్ మిల్లీమీటర్ అరే ఉంది? (1)
1) చిలీ 2) పెరూ
3) వెనెజులా 4) బ్రెజిల్
వివరణ: ఏఎల్ఎంఏ లేదా అటకామా లార్జ్ మిల్లీమీటర్/సబ్ మిల్లీమీటర్ అరే అనే టెలిస్కోప్ చిలీ దేశంలో ఉంది. కొత్త సాఫ్ట్వేర్, హార్డ్వేర్ల సాయంతో దీన్ని ఆధునీకరించాలని నిర్ణయించారు. 16 కిలోమీటర్ల వ్యవధిలో 66 యాంటెనాలు విస్తరించి ఉంటాయి. దీన్ని యూరప్‌తో పాటు యూఎస్, కెనడా, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, చిలీ దేశాలు నిర్వహిస్తాయి. 2011లో దీన్ని ఏర్పాటు చేశారు. 2013 నుంచి క్రియాశీలంగా పనిచేస్తుంది.
6. ఏఐఎం4సీ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది దేనికి సంబంధించింది? (3)
1) కొత్త వార్తా సంస్థ
2) కరోనా వైరస్‌కు వ్యాక్సిన్
3) సుస్థిర వ్యవసాయం
4) జంతు సంరక్షణ
వివరణ: ఏఐఎం4సీ అంటే అగ్రికల్చర్ ఇన్నోవేషన్ మిషన్ ఫర్ ైక్లెమేట్ అని అర్థం. యూఎస్, యూఏఈ దీన్ని ప్రారంభించాయి. భారత్ ఇటీవల ఇందులో చేరింది. పర్యావరణ అనుకూల వ్యవసాయానికి ప్రాధాన్యం ఇచ్చే వ్యవస్థ ఇది. దీన్ని నవంబర్ 2021లో ఆ రెండు దేశాలు ప్రారంభించాయి. ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నేతృత్వంలో ఐ2యూ2 సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భారత్ తరఫున విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ రవి పాల్గొన్నారు. ఏఐఎం4సీ లో చేరడం పట్ల భారత్ ఆసక్తిగా ఉందంటూ అధికారికపత్రం ఇచ్చారు.
7. చిప్4 లో లేని దేశం ఏది? (4)
1) తైవాన్ 2) దక్షిణ కొరియా
3) యూఎస్ 4) చైనా
వివరణ: చిప్4 అనేది నాలుగు దేశాలతో ఏర్పాటైన కూటమి. ఇందులో యూఎస్, తైవాన్, జపాన్, దక్షిణ కొరియా ఉన్నాయి. దీన్నే ఫ్యాబ్4 అనే పేరుతో కూడా పిలుస్తారు. సెమీకండక్టర్లకు సంబంధించి ఈ నాలుగు దేశాలు ఒక్కటయ్యాయి. నాలుగు దేశాలు కూడా ఇండో-పసిఫిక్ ప్రాంతానికి చెందినవే. ప్రపంచంలో అతిపెద్ద చిప్ తయారీ మార్కెట్‌ను కలిగి ఉన్నాయి. ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ దేశాలు పలు అంశాలు చర్చించాయి. కొవిడ్-19 వల్ల సెమీకండక్టర్ల సరఫరా గొలుసుకు విఘాతం ఏర్పడింది. దీన్ని పునరుద్ధరించే ఉద్దేశంతో ఈ కూటమి ఏర్పాటైంది.
8. కోబ్రా వారియర్ ఏ దేశంలో జరిగే విన్యాసం? (2)
1) అమెరికా
2) యూకే
3) ఆస్ట్రేలియా
4) ఇండోనేషియా
వివరణ: కోబ్రా వారియర్ యూకేలో నిర్వహిస్తున్నారు. మార్చి 6 నుంచి 24 వరకు కొనసాగుతుంది. బ్రిటిష్ రాయల్ ఎయిర్‌ఫోర్స్‌తో పాటు భారత్‌కు చెందిన వాయుదళం, ఫిన్లాండ్, స్వీడన్, దక్షిణాఫ్రికా, యూఎస్ఏ, సింగపూర్ తదితర దేశాలకు చెందిన దళాలు కూడా ఇందులో పాల్గొంటున్నాయి. యూకేలోని వాడింగ్టన్లో ఇవి కొనసాగుతున్నాయి. భారత్ తరఫున ఐదు మిరేజ్ 2000 ఫైటర్ జెట్లు, రెండు సీ-17 గ్లోబ్ మాస్టర్లు, ఒక ఐఎల్-78 మిడ్ ఎయిర్ రీ ఫ్యూయలింగ్ ఎయిర్ క్రాఫ్ట్‌లు పాల్గొంటున్నాయి.
9. ఔరంగాబాద్ నగరానికి ఇటీవల ఏ పేరు పెట్టారు? (3)
1) దారాశివ్
2) అమృత్ ఉద్యాన్
3) ఛత్రపతి శంభాజీనగర్
4) ఏదీకాదు
వివరణ: ఔరంగాబాద్, ఉస్మానాబాద్ నగరాల పేర్లు మారాయి. ఔరంగాబాద్‌కు ఛత్రపతి శంభాజీనగర్ అని పేరు పెట్టారు. అలాగే ఉస్మానాబాద్‌కు ధారాశివ్ అని మార్చారు. కొద్ది కాలం కిందట రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్ గార్డెన్స్‌కు అమృత్ ఉద్యాన్ అని పేరు మార్చారు. రాజ్‌పథ్ కర్తవ్యపథ్గా ఇటీవల మారింది. రాష్ర్టాల్లోని నగరాలు లేదా ప్రాంతాల పేరు మార్పునకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి ఉంటే సరిపోతుంది.
10. మార్కోని ప్రైజ్ ఎవరికి దక్కింది? (1)
1) హరి బాలకృష్ణన్
2) దామోదర్
3) హిస్సార్ ఔషధ్
4) వంశీరామ్
వివరణ: ప్రముఖ కంప్యూటర్ శాస్త్రవేత్త హరి బాలకృష్ణన్‌కు 2023 మార్కోని ప్రైజ్ దక్కింది. అతను మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్‌గా ఉన్నారు. వైర్ లేదా వైర్లెస్ నెట్వర్కింగ్, మొబైల్ సెన్సింగ్ తదితర శాస్త్ర సాంకేతిక రంగాల్లో సమాజానికి ఉపయోగపడేలా ఆవిష్కరణలు చేసిన వారికి ఈ అవార్డు ఇస్తారు. కేంబ్రిడ్జ్ మొబైల్ టెలిమాటిక్స్ వ్యవస్థాపకులు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ కూడా బాలకృష్ణనే. ఐఐటీ మద్రాస్‌లో ఆయన బీటెక్ పూర్తి చేశారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా అందుకున్నారు.
11. ఎఫ్ఏటీఎఫ్ నుంచి తాత్కాలికంగా ఏ దేశాన్ని సస్పెండ్ చేశారు? (2)
1) ఇరాన్ 2) రష్యా
3) పాకిస్థాన్ 4) మొజాంబిక్
వివరణ: ఎఫ్ఏటీఎఫ్ పూర్తి రూపం- ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్. ఇది ఫ్రాన్స్‌లోని పారిస్ కేంద్రంగా పనిచేస్తుంది. ఉక్రెయిన్‌తో యుద్ధం వల్ల తాత్కాలికంగా రష్యా దేశాన్ని ఇందులో నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పటికే రష్యా ప్రపంచంలో అన్ని దేశాల కంటే అధికంగా ఆంక్షలను ఎదుర్కొంటుంది. మానవ హక్కుల మండలి నుంచి అలాగే స్విఫ్ట్ బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి సస్పెన్షన్‌కు గురైంది. ఆ దేశ పెట్రోలు అమ్మకంపై కూడా యూరోపియన్ యూనియన్ దేశాలు ఆంక్షలు విధించాయి. ఎఫ్ఏటీఎఫ్లో 39 దేశాలు ఉన్నాయి. భారత్ కూడా ఇందులో సభ్యత్వాన్ని కలిగి ఉంది. మనీలాండరింగ్, ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందకుండా ఈ కూటమి చర్యలు తీసుకుంటుంది. జీ7 దేశాలు కలిసి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశాయి.
12. ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ 2023లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? (3)
1) 55 2) 32 3) 42 4) 60
వివరణ: ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్‌ను అమెరికా విడుదల చేసింది. మొత్తం 55 దేశాలకు భారత్ 42వ స్థానంలో నిలిచింది. యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఈ సూచీని రూపొందిస్తుంది. 50 అంశాలను ప్రాతిపదికగా తీసుకొని దీన్ని తయారు చేస్తారు. పేటెంట్, కాపీరైట్ విధానాలు తదితర అంశాలు ఇందులో భాగంగా ఉంటాయి.
13. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌లో ఇటీవల ఏ విధానాన్ని ప్రవేశ పెట్టారు? (2)
1) జడ్ఎండీ 2) ఎఫ్‌జీడీ 3) ప్రైవేటీకరణ 4) పైవేవీ కాదు
వివరణ: ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ ప్లాంట్‌ను సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌లో ఏర్పాటు చేశారు. దక్షిణ భారతదేశంలో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లలో ఈ తరహా వ్యవస్థను తొలిసారి ఇక్కడ ప్రవేశ పెట్టారు. అంతేకాదు ప్రభుత్వ రంగ పబ్లిక్ సంస్థల్లో ఈ తరహా వ్యవస్థ అందుబాటులోకి రావడం ఇదే ప్రథమం. విద్యుత్ ప్లాంట్‌లో ఉత్పత్తి అయ్యే బూడిదను పూర్తిగా సల్ఫర్ రహితంగా మార్చి వాతావరణంలోకి విడుదల చేస్తారు. దీనివల్ల వాతావరణ కాలుష్యం తగ్గుతుంది.
14. తెలంగాణ ప్రభుత్వం బిట్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీని లక్ష్యం ఏంటి? (1)
1) విద్యత్ వాహనాలకు సంబంధించి
2) నైపుణ్యాల పెంపు
3) ఉద్యోగాల కల్పన
4) పైవేవీ కాదు
వివరణ: విద్యుత్ వాహనాల విస్తృత తయారీ, వినియోగాన్ని పెంచడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈవీల తయారీకి అవసరమైన వనరులు సమకూర్చుకోవడం, కొనుగోళ్లు, బ్యాటరీల తయారీ, చార్జింగ్ వంటి వివిధ అంశాలపై విధివిధానాలను రూపకల్పన చేసేందుకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
15. ఏ రోజున జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు? (3)
1) ఫిబ్రవరి 21
2) ఫిబ్రవరి 13
3) ఫిబ్రవరి 28
4) నవంబర్ 10
వివరణ: ఏటా ఫిబ్రవరి 28న భారత్‌లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రఖ్యాత శాస్త్రవేత్త సీవీ రామన్ తన ప్రయోగం ద్వారా ‘రామన్ ఎఫెక్ట్’ను ఆవిష్కరించిన రోజు ఇది. ఈ ఏడాది ఈ దినోత్సవం ఇతివృత్తం ‘గ్లోబల్ సైన్స్ ఫర్ గ్లోబల్ వెల్బీయింగ్’. భారత్ తరఫున భౌతిక శాస్త్రంలో నోబెల్ అవార్డ్ పొందిన తొలి వ్యక్తి ఆయన. అలాగే తొలిసారి భారత రత్న అవార్డ్ పొందిన వారిలో ఆయన కూడా ఉన్నారు. ఆయన భారత రత్న, నోబెల్ అవార్డులను గెలుచుకున్న తొలి వ్యక్తి. అంతర్జాతీయ సైన్స్ దినోత్సవం నవంబర్ 10న నిర్వహిస్తారు. ఫిబ్రవరి 13న జాతీయ మహిళా దినోత్సవం, వరల్డ్ రేడియో డే గా కూడా నిర్వహిస్తారు.
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ
9849212411
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు