TSICET-2023 | మే 26, 27న ఎంసీఏ, ఎంబీఏ ఎంట్రన్స్ పరీక్ష
- ఐసెట్‌కు 14 ప్రాంతీయ, 75 పరీక్ష కేంద్రాల ఏర్పాటు
- మార్చి 6 నుంచి మే 6 వరకు దరఖాస్తుకు గడువు
- ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి
తెలంగాణ లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో అడ్మిషన్లు పొందడానికి కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో మే 26, 27 తేదీల్లో అర్హత పరీక్ష నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. మంగళవారం కేయూలోని సెమినార్ హాల్లో ఈ పరీక్ష పో స్టర్ విడుదల చేశారు. ఐసెట్‌కు 14 ప్రాంతీయ కేంద్రాలను, 75 పరీక్ష కేంద్రాలను ఏర్పా టు చేయనున్నట్టు పేర్కొన్నారు. మంగళవారం నోటిఫికేషన్ విడుదల కాగా మార్చి 6 నుంచి మే 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఎస్సీ, ఎస్టీలకు దరఖాస్తు రు సుము రూ.550, ఇతరులకు రూ.750 ఉం టుందని తెలిపారు. 250 రూపాయల అపరాధ రుసుముతో మే 12 వరకు, రూ.500 అపరాధ రుసుముతో మే 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్‌ను మే 22 నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని, ఈ పరీక్షను మే 26, 27న ఉదయం 10 నుంచి మధ్యా హ్నం 12.30 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఈ ఫలితాల తొలి కీ జూ న్ 5న విడుదల చేస్తామని, అభ్యంతరాలు ఏమైనా ఉంటే జూన్ 8 వరకు తెలుపాలని కోరారు. పూర్తి ఫలితాలను జూన్ 20న విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా సమర్పించాలని కోరారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?