Polity feb 28 | అక్రమ అరెస్టుల నుంచి రక్షణ పొందే హక్కును కల్పించే ఆర్టికల్ ?
109. కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
ఎ) ఎ.కె.గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసులో జస్టిస్ హెచ్.జె.కానియా నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది
బి) ఎ.కె. గోపాలన్ కేసులో కార్యనిర్వాహక, శాసన వ్యవస్థ చర్యలు న్యాయ సమీక్షకు గురైనవి
సి) ఎ.కె.గోపాలన్ కేసులో 1950 నాటి ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టంలోని అంశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు
1) ఎ, సి, డి 2) బి, సి, డి
3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి
110. ఆర్టికల్ 21 ప్రకారం ప్రస్తుతం జీవించే హక్కుగా దేన్ని పేర్కొనవచ్చు?
ఎ) గోప్యత హక్కు, ఆరోగ్యాన్ని పొందే హక్కు, ఏకాంతంగా ఉండే హక్కు
బి) సమాచారం పొందే హక్కు, జీవిత బీమా పొందే హక్కు
సి) కాలుష్య రహిత గాలి, నీరు పొందే హక్కు, సత్వర విచారణ పొందే హక్కు
డి) విదేశాలకు వెళ్ళేహక్కు ఉచిత న్యాయసహాయం పొందే హక్కు
1) ఎ, సి, డి 2) ఎ, బి, సి
3) ఎ, బి, డి 4) ఎ, బి, సి, డి
111. ఇన్స్టెంట్ త్రిపుల్ తలాక్ (తలాక్-ఎ-బిద్ధత్) ద్వారా ముస్లిం మతంలో భర్త భార్యకు ఇచ్చే విడాకులు చెల్లుబాటు కావు అని సుప్రీంకోర్టు 2017లో ఏ కేసు సందర్భంగా తీర్పునిచ్చింది?
1) సైరాబాను Vs యూనియన్ ఆఫ్ ఇండియా
2) షకీలాబేగం Vs యూనియన్ ఆఫ్ ఇండియా
3) మహ్మద్ ఖాసీం Vs యూనియన్ ఆఫ్ ఇండియా
4) పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా
112. 10 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల్లోపు గల మహిళలను వయస్సుతో సంబంధం లేకుండా ఆలయంలోకి అనుమతించాల్సినదేనని 2018లో శబరిమలై కేసుగా పేరొందిన ఏ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది. దాన్ని గుర్తించండి?
1) అనురాగ్ మీర్జా Vs స్టేట్ ఆఫ్ కేరళ కేసు
2) పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ Vs స్టేట్ ఆఫ్ కేరళ కేసు
3) ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ Vs స్టేట్ ఆఫ్ కేరళ కేసు
4) రూథర్ ఆమ్టే స్టేట్ ఆఫ్ కేరళ కేసు
113. వివాహేతర సంబంధం నేరమని పేర్కొంటున్న ఐపీసీలోని సెక్షన్ 497 చెల్లుబాటు కాదని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా కీలకమైన తీర్పునిచ్చింది?
1) జోసెఫ్ షైన్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా
2) అఖిల్ మిశ్రా Vs యూనియన్ ఆఫ్ ఇండియా
3) కేదారీనాథ్ Vs స్టేట్ ఆఫ్ బెంగాల్ కేసు
4) నాడీవర్మన్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా
114. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని 2018లో చేర్చిన సెక్షన్ 18(ఎ) ప్రకారం కింద అంశాల్లో సరైన సమాధానం గుర్తించండి?
ఎ) ప్రభుత్వ ఉద్యోగిని అరెస్టు చేయాలంటే అపాయింట్మెంట్ అథారిటీ అనుమతి తప్పనిసరి
బి) కేసు నమోదైన వెంటనే ప్రాథమిక విచారణ లేకుండా అరెస్టు చేయవచ్చును
సి) క్రిమినల్ కేసు నమోదుకు ఎలాంటి ప్రాథమిక విచారణ అవసరం లేదు
డి) వ్యక్తులను అరెస్టు చేయడానికి ముందస్తు అనుమతి అవసరం లేదు
1) ఎ, బి, సి 2) ఎ, సి, డి
3) ఎ, బి, సి, డి 4) బి, సి, డి
115. గోప్యతా హక్కుకు సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి?
ఎ) గోప్యతా హక్కుపై న్యాయస్థానంలో పిటీషన్లు వేసినవారు-పుట్టస్వామి, శాంతాసిన్హా
బి) ఆధార్ పథకాన్ని సవాల్ చేస్తూ గోప్యతా హక్కును హక్కుగా ప్రకటించాలని పుట్టస్వామి, శాంతాసిన్హా కోరారు
సి) 2017 ఆగస్టు 24న 9 మంది న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గోప్యతా హక్కుపై ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది
డి) రాజ్యాంగంలోని ఆర్టికల్, 21 ప్రకారం ‘గోప్యతా’ అనేది జీవించే హక్కులో అంతర్భాగం
1) ఎ, సి, డి 2) ఎ, బి, సి, డి
3) ఎ, బి, డి 4) ఎ, బి, సి
116. గంగా, యమునా నదులకు ప్రాణమున్న జీవుల హోదా కల్పిస్తూ 2017లో తీర్పునిచ్చిన న్యాయస్థానాన్ని గుర్తించండి.
1) సుప్రీంకోర్టు
2) అలహాబాద్ హైకోర్టు
3) ఉత్తరాఖండ్ హైకోర్టు
4) కలకత్తా హైకోర్టు
117. సుప్రీంకోర్టు ఇచ్చిన వివిధ తీర్పుల్లోని సారాంశానికి సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ) రతీనాం నాగభూషణ్ పట్నాయక్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఆత్మహత్య చేసుకోవడం ప్రాథమిక హక్కు అని పేర్కొన్నది
బి) జ్ఞానకౌర్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో ఆత్మహత్య ప్రాథమిక హక్కు కాదని పేర్కొన్నది
సి) వెంకటేష్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఆత్మహత్య చేసుకోవడం ప్రాథమిక హక్కు అని పేర్కొన్నది
డి) దులాల్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో మర్యాదగా జీవించడం, మర్యాదగా మరణిం చడం అనేవి జీవించే హక్కులో అంతర్భాగం అని పేర్కొన్నది
1) ఎ, బి, డి 2) ఎ, బి, సి
3) ఎ, సి, డి 4) ఎ, బి, సి, డి
118. 2011లో జీవించే హక్కును ఉల్లంఘిస్తున్న కారణంగా ఎండోసల్పాన్ అనే క్రిమి సంహారక మందును నిషేధించాలని ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నిరాహార దీక్ష చేశారు?
1) మధ్యప్రదేశ్ – దిగ్విజయ్‌సింగ్
2) బీహార్-లాలూ ప్రసాద్ యాదవ్
3) తమిళనాడు- కరుణానిధి
4) కేరళ-అచ్యుతానంద్
119. ఆహారపు హక్కును ఆర్టికల్ 21లో అంతర్భాగంగా ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా 2000 సంవత్సరంలో గుర్తించినది?
1) కామరాజు Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
2) పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
3) గౌరవ్జైన్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
4) రంగనాథ్ మిశ్రా Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
120. ఏ కేసు సందర్భంగా 1997లో సుప్రీంకోర్టు మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టే బాధ్యతను వారు పనిచేస్తున్న యాజమానులపై ఉంచుతూ మార్గదర్శకాలను వెలువరించినది?
1) విశాఖ స్వచ్ఛంద సంస్థ Vs స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసు
2) చంద్రబోసు Vs స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర
3) కరణ్‌సింగ్ Vs స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కేసు
4) పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
121. కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
ఎ) ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యాహక్కును అమలు చేస్తున్న 135వ దేశం భారతదేశం
బి) ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యాహక్కు గీతాన్ని రచించింది- జావేద్ అక్తర్
సి) ప్రస్తుత విద్య అనేది రాష్ట్ర జాబితాలో కొనసాగుతుంది
డి) ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యాహక్కు పల్లవి- టన్ టన్ టన్ సునోఠంటీ బజే స్కూల్ కీ
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, సి
3) ఎ, సి, డి 4) ఎ, బి, డి
122. కింది అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
ఎ) మొదటి జాతీయ విద్యావిధానం 1968లో రూపొందింది
బి) రెండవ జాతీయ విద్యావిధానం 1986లో రూపొందింది
సి) మూడో జాతీయ విద్యావిధానం 2020లో రూపొందింది
డి) నాలుగో జాతీయ విద్యావిధానం 2026 నుంచి అమల్లోకి రానున్నది
1) ఎ, బి, సి 2) ఎ, సి, డి
3) ఎ, బి, సి, డి 4) బి, సి, డి
123. కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
ఎ) నూతన విద్యావిధానంపై అధ్యయనం కోసం 2016 మే 27న టీఎస్ఆర్ సుబ్రమణ్యం కమిటీని ఏర్పాటు చేశారు.
బి) నూతన విద్యా విధానంపై అధ్యయనం కోసం 2019 మే 31న కె. కస్తూరి రంగన్ కమిటీని ఏర్పాటు చేశారు
సి) నూతన విద్యా విధానంపై సమీక్షకు సుబ్రమణ్యస్వామి ఆధ్వర్యంలో పార్లమెంటరీ స్థాయీ సంఘాన్ని 2020 జూన్ 11న ఏర్పాటు చేశారు.
1) ఎ, సి 2) ఎ, బి
3) బి, సి 4) ఎ, బి, సి
124. మూడో జాతీయ విద్యా విధానం 2020 లోని అంశాన్ని గుర్తించండి?
ఎ) మానవ వనరుల మంత్రిత్వశాఖ పేరును విద్యాశాఖగా మార్చాలి
బి) దేశ వ్యాప్తంగా ప్రాథమిక విద్యకు
ఒకే విధంగా కరికులం ఉండాలి.
సి) జీడీపీలో విద్యకు 6 శాతం నిధులు
కేటాయించాలి
డి) 3 నుంచి 21 సంవత్సరాల వయస్సు గల వారందరికీ విద్య తప్పనిసరి చేయాలి
1) ఎ, బి, సి 2) ఎ, సి, డి
3) బి, సి, డి 4) ఎ, బి, సి
125 ప్రస్తుతం అమల్లో ఉన్న 10+2+3 విద్యా విధానం స్థానంలో 2020 నూతన విద్యా విధానం దేన్ని ప్రవేశ పెట్టింది
1) 5+3+4+3 2) 5+5+3+2
3) 5+2+5+3 4) 5+3+3+4
126. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అక్రమ అరెస్టుల నుంచి నిర్బంధాల నుంచి రక్షణ పొందే హక్కును వ్యక్తులకు కల్పిస్తుంది?
1) ఆర్టికల్ 21 2) ఆర్టికల్ 22
3) ఆర్టికల్ 23 4) ఆర్టికల్ 24
127. కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
ఎ) ఆర్టికల్ 22(1)- వ్యక్తుల ఆరెస్టుకు కారణం తెలియజేయాలి
బి) ఆర్టికల్ 22(2)- అరెస్టు అయిన వ్యక్తిని 24 గంటల్లోగా సమీప మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచాలి
సి) ఆర్టికల్ 22(3)- శతృదేశాలకు చెందినవారికి ఆర్టికల్స్ 22(1), 22(2)ల్లో పేర్కొన్న రక్షణలు వర్తించవు
డి) ఆర్టికల్ 22(4)- సలహాబోర్డు అనుమతి లేకుండా ఒక వ్యక్తిని 6 నెలల వరకు నిర్బంధించవచ్చు
1) ఎ, బి,సి 2) ఎ, బి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, సి, డి
128. కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
ఎ) మనదేశంలో పీడీ చట్టాలను రూపొందించే సర్వాధికారం పార్లమెంటుకు ఉన్నది
బి) ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఒక వ్యక్తి నేరం చేస్తాడన్న అనుమానంతో ముందే నిర్బందంలోకి తీసుకోవడం
సి) ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే నేరం నిరూపితమైన తర్వాత సంబంధిత వ్యక్తిని నిర్ంబందించడం.
డి) ఒక వ్యక్తి నిర్బంధం 24 గంటలకు మించి ఉండే మేజిస్ట్రేట్ అనుమతి పొందాలి.
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, సి, డి
129. కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబు గుర్తించండి?
ఎ) ఆర్టికల్ 22(4) సలహాబోర్డు అనుమతి లేనిదే 3 నెలలకు మించి వ్యక్తిని నిర్బంధించరాదు
బి) ఆర్టికల్ 22(5) పీడీ చట్టం ప్రకారం అరెస్టు అయిన వ్యక్తికి అందుకు గల కారణాన్ని ప్రత్యేక చట్టం ప్రకారం మాత్రమే తెలియజేయాలి.
సి) ఆర్టికల్ 22(6) ప్రజా ప్రయోజనాల రీత్యా చట్టం ఉన్నప్పటికీ అరెస్టుకు గల కారణాన్ని తెలియజేయాల్సిన అవసరం లేదు.
డి) ఆర్టికల్ 22(7) సలహాబోర్డు అనుమతి లేనప్పటికీ పార్లమెంటు ప్రత్యేక చట్టం ద్వారా 3 నెలలకు మించి ఒక వ్యక్తిని నిర్బంధంలో ఉంచవచ్చు
1) ఎ, బి, డి 2) ఎ, సి, డి
3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి
130. వివిధ చట్టాలు అవి రూపొందించిన సంవత్సరాలకు సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి?
ఎ) TADA 1) 1980
బి) NASA 2) 2002
సి) MISA 3) 1985
డి) POTA 4) 1971
1) ఎ-2, బి-4, సి-3, డి-1
2) ఎ-3, బి-1, సి-4, డి-2
3) ఎ-3, బి-1, సి-2, డి-4
4) ఎ-3, బి-4, సి-1, డి-2
131. 1950లో జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం రూపొందించిన ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్‌ను ఎప్పుడు ఏ ప్రధాని కాలంలో రద్దు చేశారు?
1) 1969లో ఇందిరాగాంధీ
2) 1977లో మొరార్జీదేశాయ్
3) 1977లో రాజీవ్‌గాంధీ
4) 1969లో వి.పి.సింగ్
132. కింద పేర్కొన్న చట్టాలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ) TADA అంటే Terrorists Disrruptive Activities Prevention Act
బి) NASA అంటే National Security Act
సి) UAPA Unlawful Activities Prevention Act
డి) MISA Mineral Internal Security Act
1) ఎ, బి, డి 2) ఎ, బి, సి
3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి
133. 1985లో రాజీవ్‌గాంధీ ప్రభుత్వం రూపొందించిన టాడా(TADA) చట్టాన్ని ఎప్పడు ఏ ప్రధాని కాలంలో రద్దు చేశారు?
1) 1990 లో వి.పి. సింగ్
2) 1995లో పి.వి. నరసింహారావు
3) 1997లో హెచ్.డి. దేవెగౌడ
4) 2001లో అటల్ బిహార్ వాజ్‌పేయి
134. మీసా చట్టానికి సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి?
ఎ) MISA- Maintanance of Internal Security Act
బి) ఈ చట్టాన్ని 1971లో ఇందిరాగాంధీ ప్రభుత్వం రూపొందించింది
సి) ఈ చట్టాన్ని ప్రయోగించినప్పుడు ప్రాథమిక హక్కుల రక్షణకు న్యాయస్థానాలు రిట్స్‌ను జారీ చేస్తాయి
డి) ఈ చట్టాన్ని 1978లో మొరార్జీదేశాయ్ ప్రభుత్వం రద్దు చేసింది
1) ఎ, సి, డి 2) ఎ, బి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, బి, సి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు