సామాజిక రక్షణ..సాధారణ బీమా
- సాధారణ బీమా/జీవితేతర బీమా
- బీమా ఒక సాంఘిక / సామాజిక భద్రత సౌకర్యం
- సామాజిక భద్రత సాధించడానికిఉపయోగించే (పరికరం) సాధనం ‘బీమా’
- ఈ బీమా సౌకర్యం కల్పించడానికి బీమా సంస్థలు ఉన్నాయి.
- బీమా సంస్థలు ప్రధానంగా రెండు రకాలు
1) జీవిత బీమా
2) జీవితేతర బీమా / సాధారణ బీమా - జీవితబీమా గురించి గత సంచికలో వివరంగా అందించాం.
- జీవితేతర బీమా గురించి వివరంగా నేర్చుకుందాం.
సాధారణ బీమా / జీవితేతర బీమా
- సాధారణ బీమా వ్యాపారాన్ని కూడా ప్రవేశ పెట్టింది ఆంగ్లేయులే
- వ్యక్తి ఆరోగ్యంపైన, ఆస్తులపైన, సంపదపైన చేసే బీమాను సాధారణ బీమా అంటారు. ఉదా: ఆరోగ్య బీమా, వాహన బీమా, స్థిర, చరాస్థుల పైన బీమా పంటల బీమా, కార్గో, వెసెల్ (మెరైన్‌కు సంబంధం) బీమా మొదలైనవి.
- భారతదేశంలో మొట్టమొదటి సాధారణ బీమా కంపెనీ 1850లో కలకత్తాలో బ్రిటిష్ వారు నెలకొల్పారు. దీనిపేరు ట్రిటాన్ ‘జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్’.
- 1906లో ఏర్పడిన యూనైటెడ్ ఇండియా (మద్రాసు), నేషనల్ ఇన్సూరెన్స్ (కలకత్తా), మొదలైనవి. సాధారణ బీమా సంస్థలే.
- 1971లో ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖ దేశంలో పని చేస్తున్న సాధారణ బీమా కంపెనీలన్నింటినీ స్వాధీనం చేసుకొని ‘జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ నేషనలైజేషన్ యాక్ట్ -1972 (GIBNA) ఆమోదించినది.
- 1973 జనవరి 1న జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ)ను నెలకొల్పి జాతీయం చేసి, పనులు ప్రారంభించింది.
- బీమా జాతీయికరణకు ముందు దేశంలో పని చేస్తున్న 107 దేశ, విదేశ కంపెనీలను జాతీయం చేసి 4 కంపెనీలుగా విలీనం చేశారు. అవి ట
1) నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ కలకత్తా (1906)
2) న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (బొంబాయి) (1919)
3) యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్
లిమిటెడ్ (మద్రాస్) (1938)
4) ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీలిమిటెడ్ (న్యూఢిల్లీ) (1947) - ఈ నాలుగు కంపెనీలను జీఐసీకి అసోసియేట్ కంపెనీలుగా ఏర్పాటు చేశారు.
- ఈ సంస్థలు బీమా చేసిన మొత్తంలో 120 శాతానికి ఇది పునఃబీమా సౌకర్యంకల్పిస్తుంది.
- జీఐసీ రిజిస్టర్ కార్యాలయం, ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది.
- జీఐసీ బోర్డ్ మినిట్స్‌లో చైర్మన్ ఎ. రాజగోపాలన్ ‘GIC Re Apatkale Rakshisyami’ అనే నినాదంపై 1976 ఆగస్టు 26న సంతకం చేసి ఆమోదించారు.
- జీఐసీ సంస్కృత పదబంధాన్ని ఇలా అనువదిస్తుంది. ఆపద సమయంలో నేను నిన్ను రక్షిస్తాను.
- జీఐసీ లోగోను 1980లో సవరించి, నినాదాన్ని దేవనాగరిలిపిలో చేర్చారు.
- 2000 నవంబర్‌లో జీఐసీని భారత రీ ఇన్సూరెన్స్ కంపెనీగా మార్చారు.
- 2002 మార్చిలో జీఐసీ నుంచి 4 అనుబంధ సంస్థలకు వేరు చేసి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకువచ్చారు.
- జీఐసీ నుంచి వేరు చేసిన 4 ప్రభుత్వ రంగ సంస్థలు ఢిల్లీ కేంద్రంగా జీఐపీఎస్‌ఏ పేరుతో ఒక అసోసియేషన్‌గా ఏర్పడ్డాయి.
- ఐఆర్డీఏ: ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ
- భారతదేశంలో 1991లో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలో ప్రైవేటీకరణ ఒక సంస్కరణ.
- ఆర్థిక సంస్కరణల రెండోదశలో ప్రైవేట్ సంస్థలను, విదేశీ సంస్థలను బీమా వ్యాపారంలో ప్రవేశించడానికి ప్రభుత్వం అనుమతించింది.
- దీనిపై 1993లో ఆర్ఎన్ మల్హోత్రా కమిటీని ఏర్పాటు చేసింది.
- మల్హోత్రా కమిటీ 1994లో తన నివేదికను ప్రభుత్వానికి అందిస్తూ భారతదేశంలోని కార్పొరేటు సంస్థలని బీమా రంగంలోనికి అనుమతించాలని, అవి విదేశీ సంస్థల భాగస్వామ్యంతో ఏర్పరచుకోవడానికి అనుమతించాలని సూచించింది.
- ఈ కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం 1999లో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ చట్టాన్ని ప్రవేశ పెట్టింది.
- ఐఆర్డీఏ చట్టం -1999 ప్రకారం 2000 ఏప్రిల్‌లో ఐఆర్డీఏ అనే సంస్థను నెలకొల్పింది.
- ఐఆర్డీఏ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది.
- ఐఆర్డీఏ సంస్థ దేశంలోని బీమా రంగాన్ని అభివృద్ధి, నియంత్రణ, పర్యవేక్షణ చేస్తూ కొత్త సంస్థలకు అనుమతులను జారీ చేస్తుంది.
- ఐఆర్డీఏ నివేదిక ప్రకారం ప్రస్తుతం భారత దేశంలో మొత్తం బీమా కంపెనీలు 58. అందులో ఎల్ఐసీ-24 జీఐసీ 34 ఉన్నాయి.
- ఐఆర్డీఏ సంస్థ ఇండియన్ ఇన్సూరెన్స్ లాస్ యాక్ట్ -2015 ని అమలు చేస్తుంది.
- ఐఆర్డీఏ చట్టాన్ని 2015లో సవరించి మూడు ముఖ్య నిర్ణయాలను తీసుకున్నారు.
1) ఐఆర్‌డీఏను ఐఆర్డీఏఐగా మార్చడం
2) జీఐసీ అనుబంధ సంస్థల్లో ప్రభుత్వ వాటాను 51 శాతం వరకు పరిమితం చేయడం
3) బీమా చట్టం 1938కి సవరణలు చేయడం - ఐఆర్డీఏఐ ఐఆర్డీఏఐ- ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా
- ఐఆర్‌డీఏఐలో ఒక చైర్మన్ ఉంటాడు అతని పదవీ కాలం ఐదేళ్లు లేదా 65 సంవత్సరాల వయస్సు
- ఐఆర్‌డీఏఐలో శాశ్వత సభ్యులు 5గురు వారి పదవీకాలం 5 సంవత్సరాలు లేదా 62 సంవత్సరాల వయస్సు.
- ఐఆర్‌డీఏఐలో శాశ్వత సభ్యులు ఐదుగురు వారి పదవీకాలం ఐదేళ్ళు లేదా 62 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఉంటుంది.
- ఐఆర్‌డీఏఐలో తాత్కాలిక సభ్యులు నలుగురు ఉంటారు.
ప్రైవేట్ బీమా సంస్థ
- 2000లో బీమా రంగంలో ప్రైవేట్ సంస్థలను ప్రభుత్వం అనుమతించింది. విదేశీ సంస్థల భాగస్వామ్యాన్ని కూడా అనుమతించింది.
- బీమారంగంలో ప్రవేశించిన ప్రైవేట్ సంస్థలకు ఉదా :
- ఎ) హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్, స్టాండర్డ్ లైఫ్ (ఇంగ్లండ్)
బి) మ్యాక్స్ న్యూయార్క్, న్యూయర్క్ లైఫ్ (అమెరికా)
సి) ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, ప్రుడెన్షియల్ లైఫ్ (ఇంగ్లండ్)
డి) టాటా ఏఐజీ, అమెరికా ఇంటెల్ గ్రూప్ (అమెరికా)
ఇ) ఎస్బీఐ, ఎల్ఐసీ కార్డిప్ (ఫ్రాన్స్) - ఎఫ్) బజాజ్ అలియంజ్, అలియాంజి (జర్మనీ)
బీమా రంగానికి సంబంధించి ముఖ్యమైన పథకాలు
1) జనశ్రీ బీమా యోజన (జేబీవై) 2000
2) రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన
(ఆర్ఎస్బీవై) -2008
3) ప్రధాన మంత్రి ఫసల్‌బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై 2016)
4) ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) 2015 మే 9
5) ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్బీవై) 2015 మే9
6) అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) 2015 మే 9
7) ఆయుష్మాన్ భారత్ (ఏబీ) 2018-19 బడ్జెట్
8) ప్రధానమంత్రి శ్రమయోగి మాన్‌ధన్ యోజన (పీఎంఎస్వైఎంవై) 2019-20 బడ్జెట్
9) ప్రధానమంత్రి కర్మయోగి మానధన్ యోజన్ (పీఎంకేవైఎంవై) 2019-20 బడ్జెట్
10) నేషనల్ అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ స్కీం (ఎన్ఏఐఎస్) 1999-2000 వాతావరణ బీమా (Climatalogical Insurence)
బీమా పదజాలం
వాతావరణ బీమా పథకాన్ని 2007లో ఖరీఫ్ రుతువు నుంచి మొట్టమొదట కర్ణాటకలో ప్రారంభించారు. ఈ పథకాన్ని జాతీయ వ్యవసాయ బీమా పథకానికి ప్రత్యామ్నాయంగా అంటే పంటల బీమా పథకంగా చెప్పవచ్చు.
ఈ పథకాన్ని మొదట కర్ణాటక తర్వాత బీహార్ ఛత్తీస్‌గఢ్, ఎంపీ, రాజస్థాన్ మొదలైన మరో 7 రాష్ర్టాల్లో కూడా ప్రారంభించారు.
- సూక్ష్మ బీమా (Micro Insurence)
ఇటీవల వెలుగులోకి వచ్చిన సూక్ష్మ విధానంలో ఒక అంతర్భాగమే. సూక్ష్మ బీమా పథకం విస్తృతమైన సేవలను అందించడానికి రుణంతోపాటు, పొదుపును పెంపొందించడానికి సూక్ష్మ బీమా విధానం అమల్లోకి వచ్చింది. చాలా తక్కువ ప్రీమియంలో ఈ బీమా సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. స్వయం సహాయక బృందాలకు, రైతులకు, చిన్న వ్యాపారులకు, ఉద్యమిత్యదారులకు, వలస శ్రామికులకు, షెడ్యూల్డ్కులాలు, జాతులకు ఈ పథకం వర్తిస్తుంది.
- బీమా పాలసీ (Insurence Policy)
బీమా సంస్థ, బీమా చేసి వ్యక్తుల మధ్య కాలవ్యవధి, ప్రత్యేక నష్టభయం, బీమా చేసిన వ్యక్తి ఆదాయంలో చెల్లించే సొమ్ము నష్ట పరిహారంగా బీమా కంపెనీ చెల్లించే సొమ్మును సూచించే ఒప్పందాన్ని ఒక సంస్థతో కురుర్చుకోవడాన్ని బీమా పాలసీ అంటారు.
- సమగ్ర బీమా (Comprehensive Insurence)
వాహనం ప్రమాదానికి గురైనపుడు వాహనంలో ప్రయాణిస్తున్న వారికి, వాహనానికి కలిగిన నష్టం కూడా పరిహారం పొందవచ్చు. పట్టాదారు వల్లగాని, మరెవరి వల్లగాని జరిగినా బీమా వర్తిస్తుంది. అగ్ని ప్రమాదం, దొంగతనం వల్లగాని నష్టం జరిగినపుడు బీమా వర్తిస్తుంది.
- మూడో పార్టీ బీమా(Third Party Insurence)
వాహనానికి ప్రమాదం జరిగినపుడు దాని వల్ల మూడో వ్యక్తికి (అంటే బీమా పట్టాదారు కాకుండా) జరిగిన నష్టానికి పరిహారం చెల్లించడం జరుగుతుంది.
- పంటల బీమా (Crop Insurence)
వ్యవసాయం ప్రకృతి మీద ఎక్కువగ ఆధారపడి ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు అంటే అతివృష్ఠి, అనావృష్టి సంభవించినప్పుడు రైతులకు కలిగిన పంట నష్టం నుంచి కాపాడటం కోసం ఏర్పాటు చేసింది. పంటలబీమా
- సాధారణ బీమా (General Insurence)
వ్యక్తిగతంగా ఒక పట్టాదారునికే పరిమితం అవుతుంది.
- బృంద బీమా : (Group Insurence)
కొంతమంది వ్యక్తులకు ఒక సమూహంగా చేసే బీమాను బృంద బీమా అంటారు. ఉదా: సంఘాలు, విద్యార్థులు, ఉద్యోగులు
ప్రాక్టీస్ బిట్స్
1. భారతదేశంలో సాధారణ బీమాను ప్రవేశపెట్టింది ఎవరు?
ఎ) ఆంగ్లేయులు బి) అమెరికన్లు
సి) భారతీయులు డి) ఈజిప్షియన్లు
2. భారతదేశంలో స్థాపించిన మొట్టమొదటి సాధారణ బీమా కంపెనీ ఏది?
ఎ) ట్రిటాన్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్
బి) నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్
సి) జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్
డి) ఎ, సి
3. సాధారణ బీమా జాతీయికరణకు ముందు ఎన్ని బీమా కంపెనీలు పనిచేస్తున్నాయి?
ఎ) 4 బి) 104 సి) 107 డి) 2
4. జీఐసీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
ఎ) మద్రాస్ బి) న్యూఢిల్లీ
సి) ముంబై డి) కలకత్తా
5. ‘ఆపద సమయంలో నేను నిన్ను రక్షిస్తాను’ అనేది ఏ బీమా సంస్థ నినాదం?
ఎ) జీవిత బీమా
బి) సాధారణ బీమా
సి) వాతావరణ బీమా డి) సూక్ష్మ బీమా
6. ఐఆర్డీఏ ఏర్పాటుకు సూచించిన కమిటీ ఏది?
ఎ) తివారి కమిటీ బి) చక్రవర్తి కమిటీ
సి) మల్హోత్రా కమిటీ
డి) రంగరాజన్ కమిటీ
7) భారతదేశంలో మొట్టమొదటి సాధారణ బీమా కంపెనీని ఎప్పుడు ఎక్కడ ఏర్పాటు చేశారు?
ఎ) 1850- కలకత్తా
బి) 1950 కలకత్తా
సి) 1860 ముంబై
డి) 1960- ముంబై
8. బీమా జాతీయికరణకు ముందు దేశంలో ఉన్న 107 దేశీయ, విదేశీ కంపెనీలను ఎన్ని కంపెనీలుగా విలీనం చేశారు?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
నోట్: ఫిబ్రవరి 3న ప్రచురితమైన ఎకానమీ పేజీలో 46వ ప్రశ్న దేశంలో నోట్లను జారీచేయడానికి అనుసరించే పద్ధతి?
జవాబు: కనిష్ఠ నిల్వల పద్ధతిగా చదువుకోగలరు
-పానుగంటి కేశవ రెడ్డి
రచయిత వైష్ణవి పబ్లికేషన్స్
గోదావరిఖని
9949562008
- Tags
- GENERAL INSURANCE
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?