సుప్రీంకోర్ట్ ఏ కేసు సందర్భంగా ‘రాజ్యం’ వివరణను స్పష్టంగా పేర్కొన్నది?
1. ప్రాథమిక హక్కులకు సంబంధించి కింది వాటిలో సరైన జవాబును గుర్తించండి?
ఎ) ఇంగ్లండ్ రాజు జాన్ ఎడ్వర్డ్-I
తొలిసారిగా తనదేశ ప్రజలకు ప్రాథమిక హక్కులను ప్రసాదించారు.
బి) క్రీ.శ. 1215లో ఇంగ్లండ్‌లో వెలువడిన హక్కుల ప్రకటనను చరిత్రలో
‘మాగ్నాకార్టా’గా పేర్కొంటారు.
సి) ప్రాథమిక హక్కులను ఫ్రెంచ్ రాజ్యాంగం లో ‘బిల్ ఆఫ్ రైట్స్’గా పేర్కొన్నారు.
డి) మానవులు సంపూర్ణంగా అభివృద్ధి
చెందడానికి కావలసిన కనీస హక్కులను ప్రాథమిక హక్కులు అంటారు.
1) ఎ, బి, సి 2) ఎ, బి, డి
3) బి, సి, డి 4) ఎ, బి, సి, డి
2. కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
ఎ) ఫ్రెంచి వివ్లవ ఆదర్శాలు “స్వేచ్ఛ,
సమానత్వం, సౌభ్రాతృత్వం”
బి) ఫ్రెంచి విప్లవానికి బైబిల్‌గా సోషల్ కాంట్రాక్ట్ థియరీ అనే గ్రంథాన్ని
పేర్కొంటారు
సి) సోషల్ కాంట్రాక్ట్ అనే గ్రంథాన్ని
రూసో రచించారు
డి) ఫ్రెంచ్ జాతీయసభ 1787లో
మానవ హక్కుల ప్రకటన వెలువరించింది.
1) ఎ, బి, సి, డి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, సి
3. ఐక్యరాజ్య సమితి(యూఎన్ఓ) ‘విశ్వమానవ హక్కుల ప్రకటనను’ ఎప్పుడు జారీ చేసింది?
1) 1948 డిసెంబర్ 10
2) 1949 డిసెంబర్ 16
3) 1948 డిసెంబర్ 23
4) 1948 డిసెంబర్ 31
4. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవంగా ఏ రోజున నిర్వహిస్తారు?
1) సెప్టెంబర్ -3 2) డిసెంబర్ -10
3) నవంబర్ -11 4) జనవరి -16
5. కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
ఎ) ప్రాథమిక హక్కులన్నీ చట్టబద్ధమైన హక్కులే
బి) చట్టబద్ధమైన హక్కులన్నీ ప్రాథమిక హక్కులే
సి) ప్రాథమిక హక్కులు రాజ్యాంగంచే హామీ ఇవ్వబడ్డాయి
డి) చట్టబద్ధమైన హక్కులన్నీ ప్రాథమిక హక్కులు కావు
1) ఎ, బి, సి, డి 2) బి, సి, డి
3) ఎ, బి, సి 4) ఎ, సి, డి
6. కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
ఎ) అమెరికా స్వాతంత్య్ర ప్రకటన 1776లో వెలువడింది
బి) అమెరికా స్వాతంత్య్ర ప్రకటన తర్వాత ఫిలడెల్ఫియా కన్వెన్షన్ ద్వారా ఏర్పడిన రాజ్యాంగంలో ప్రారంభంలో గల ప్రాథమిక హక్కుల సంఖ్య -8
సి) అమెరికా రాజ్యాంగంలో 1791,
డిసెంబర్ 15న Bill of Rights పేరుతో
ప్రాథమిక హక్కులను పేర్కొన్నారు.
డి) Bill of Rights లో అమెరికా
పౌరులకు ఉండే వివిధ రకాల హక్కులు
స్వేచ్ఛలను పేర్కొన్నారు.
1) ఎ, బి, సి 2) ఎ, సి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, బి, డి
7. అమెరికా స్వాతంత్య్ర ప్రకటన(1776) సందర్భంగా స్వేచ్ఛా, స్వాతంత్య్రాలతో జన్మించిన మానవులు జీవితాంతం వాటితోనే కొనసాగుతారని ఎవరు పేర్కొన్నారు?
1) థామస్ జఫర్సన్
2) థియోడర్ రూజ్వెల్ట్
3) విలియం జాన్సన్
4) జార్జి వాషింగ్టన్
8. కింది అంశాలలో సరైన జవాబును గుర్తించండి?
ఎ) ప్రాథమిక హక్కులు వేరు సాధారణ హక్కులు వేరు
బి) సాధారణ హక్కులకు పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభలు చేసిన చట్టాలు హామీ ఇస్తాయి
సి) కేవలం ప్రజాస్వామ్య దేశాలలో గల ప్రజలకు మాత్రమే ప్రాథమిక హక్కులుంటాయి.
డి) కమ్యూనిస్టు, నియంతృత్వ రాజరికం అమలుల్లో ఉన్న ప్రజలకు హక్కులుండవు
1) ఎ, బి, సి 2) ఎ, సి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, బి, డి
9. సమాజంచే కోరబడి రాజ్యం గుర్తించిన అంశాలే హక్కులు అని ఎవరు వ్యాఖ్యానించారు?
ఎ) హెచ్.జె.లాస్కీ బి) గార్నర్
సి) జీన్బోడిన్ డి) థామస్ హాబ్స్
10. మనదేశంలో ప్రాథమిక హక్కుల భావనకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ) బాలగంగాధర్ తిలక్ స్వరాజ్ అనే బిల్లు ద్వారా భారతీయులకు వాక్ స్వాతంత్య్రాన్ని ప్రసాదించాలని ఆంగ్లేయులను డిమాండ్ చేశారు.
బి) స్వరాజ్ అనే బిల్లును 1875లో
బాలగంగాధర్ తిలక్ ప్రతిపాదించారు
సి) మహాత్మాగాంధీ యంగ్ ఇండియా పత్రికలో భారతీయుల హక్కుల గురించి
పేర్కొన్నారు.
డి) జవహర్లాల్ నెహ్రూ 1931లో కామన్వెల్త్ అనే పత్రికలో భారతీయుల హక్కుల గురించి వివరించారు.
1) ఎ, బి, సి 2) ఎ, బి, సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, డి
11. స్వరాజ్ అనేది బ్రిటిష్‌వారు భారతీయులకు ప్రసాదించే ఉచిత కానుక కాదని అది భారతీయుల స్వయం వ్యక్తీకరణ అని ఎవరు వ్యాఖ్యానించారు?
1) మహాత్మాగాంధీ
2) దాదాభాయ్ నౌరోజీ
3) గోపాల కృష్ణ గోఖలే
4) లాలాలజపతిరాయ్
12. భారత ప్రజాస్వామ్యానికి ప్రాథమిక హక్కులు పునాదిరాళ్లు అని ఎవరు వ్యాఖ్యానించారు?
1) జవహర్లాల్ నెహ్రు
2) లాలాలజపతిరాయ్
3) నానీ పాల్కీవాలా
4) బిపిన్ చంద్రపాల్
13. కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
ఎ) 1925లో అనీబీసెంట్ కామన్ వెల్త్ ఆఫ్ ఇండియా అనే బిల్లును ప్రతిపాదించారు
బి) మోతీలాల్ నెహ్రూ నివేదిక ప్రాథమిక హక్కుల ఆవశ్యకతను గుర్తించింది
సి) కామన్ వెల్త్ ఆఫ్ ఇండియా అనే బిల్లు ద్వారా ఐర్లాండ్ ప్రజలకు కల్పించిన ప్రాథమిక హక్కుల వంటివే భారత ప్రజలకు కూడా కల్పించాలని డిమాండ్
చేయడమైనది
డి) భారత జాతీయ కాంగ్రెస్ లాహోర్
సమావేశం (1929)లో ప్రాథమిక హక్కులపై తీర్మానాన్ని ఆమోదించారు
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, సి
3) ఎ, సి, డి 4) ఎ, బి, డి
14. నెహ్రూ రిపోర్ట్‌కు సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి?
ఎ) 1928 మే నెలలో మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన INC ఒక కమిటీ ఏర్పాటు చేసింది
బి) మోతీలాల్ నెహ్రూ కమిటీ తన రిపోర్ట్‌ను 1928, ఆగస్టు 10న సమర్పించినది
సి) మోతీలాల్ నెహ్రూ సమర్పించిన రిపోర్ట్ పై ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరింది
డి) మోతీలాల్ నెహ్రూ సమర్పించిన రిపోర్ట్ అమల్లోకి రాకపోయినప్పటికీ చరిత్రలో ‘నెహ్రూ రిపోర్ట్-1928’గా నిలిచిపోయింది
1) ఎ, బి, డి 2) ఎ, సి, డి
3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి
15. భారత జాతీయ కాంగ్రెస్ ‘కరాచీ’ లో నిర్వహించిన సమావేశానికి సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ) 1931లో కరాచీలో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం జరిగింది
బి) ఈ సమావేశంలో ప్రాథమిక హక్కుల తీర్మానాన్ని ఆమోదించారు
సి) ఈ సమావేశంలో ప్రాథమిక హక్కుల తీర్మానాన్ని సుభాష్ చంద్రబోస్ ప్రవేశ పెట్టారు
డి) ఈ సమావేశానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షత వహించారు
1) ఎ, బి, సి 2) ఎ, సి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, బి, డి
16. 1931లో కరాచీలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ప్రాథమిక హక్కులు, ఆర్థిక విధానంపై తీర్మానాన్ని ఎవరు రూపొందించారు?
1) సర్దార్ వల్లభాయ్ పటేల్
2) జవహర్లాల్ నెహ్రూ
3) బిపిన్ చంద్రపాల్
4) అనీబీసెంట్
17. కింద పేర్కొన్న అంశాల్లో సరికాని దానిని గుర్తించండి?
1) ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలోని 3వ భాగంలో పేర్కొన్నారు
2) ప్రాథమిక హక్కుల వివరణ ఆర్టికల్ 14 నుంచి 35 మధ్య గలదు
3) ప్రాథమిక హక్కుల రక్షణకు ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు రిట్స్‌ను జారీచేస్తుంది.
4) ప్రాథమిక హక్కుల రక్షణకు ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టులు 5 రకాల రిట్స్‌ను జారీ చేస్తాయి
18. కింది వాటిలో సరైన జవాబును గుర్తించండి?
ఎ) ప్రాథమిక హక్కుల ఉపసంఘం 1) సర్ తేజ్ బహుదూర్ సఫ్రూ
బి) ప్రాథమిక హక్కుల సమన్వయ సంఘం 2) సర్థార్ వల్లభాయ్ పటేల్
సి) ప్రాథమిక హక్కుల సలహా సంఘం
3) జె.బి. కృపలాని
1) ఎ-2, బి-3, సి-1
2) ఎ-3, బి-1, సి-2
3) ఎ-3, బి-2, సి-1
4) ఎ-1, బి-3, సి-3
19. కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
ఎ) ప్రాథమిక హక్కుల సమన్వయ సంఘం 1) 1947 జనవరి 24
బి) ప్రాథమిక హక్కుల ఉపసంఘం 2)1947, ఫిబ్రవరి 12
సి) ప్రాథమిక హక్కుల సలహాల సంఘం 3) 1944-1945
1) ఎ-3, బి-2, సి-1
2) ఎ-3, బి-1, సి-2
3) ఎ-1, బి-2, సి-3
4) ఎ-2, బి-3, సి-1
20. జె.బి.కృపలాని అధ్యక్షతన ఏర్పడిన ప్రాథమిక హక్కుల ఉపసంఘంలో సభ్యులు కానిది?
1) హరనాం సింగ్, జైరాందాస్ దౌలత్ రాం, కె.ఎం. మున్షీ
2) కె.టి.షా, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
3) రాజకుమారి అమృతకౌర్, ఎం.ఆర్. మసాని
4) ప్రమథా రంజన్ ఠాగూర్, దామోదర్ స్వరూప్ సేథ్
21. జె.బి. కృపలాని అధ్యక్షతన ఏర్పడిన ప్రాథమిక హక్కుల ఉపసంఘంలో సభ్యులను గుర్తించండి?
1) మౌలానా అబుల్ కలాం ఆజాద్,
డా. బి.ఆర్. అంబేద్కర్
2) కె.ఎం. మున్షీ, సయ్యద్ మహ్మద్ సాదుల్లా
3) అనంతశయనం అయ్యంగార్, డి.పి. బైతాన్
4) పైవన్నీ సరైనవే.
22. ప్రాథమిక హక్కులను రాజ్యాంగానికి ఆత్మ, అంతరంగం వంటిదని వ్యాఖ్యానించిన వారు?
1) జవహర్లాల్ నెహ్రూ
2) డా.బి.ఆర్. అంబేద్కర్
3) మహాత్మాగాంధీ
4) సర్దార్ వల్లభాయ్ పటేల్
23. భారతీయ పౌరులతోపాటు విదేశీయులకు కూడా మనదేశంలో లభించే ప్రాథమిక హక్కులకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ) ఆర్టికల్ 14, 20, 21లో పేర్కొన్న
ప్రాథమిక హక్కులు
బి) ఆర్టికల్ 22, 23, 24 లో పేర్కొన్న
ప్రాథమిక హక్కులు
సి) ఆర్టికల్ 15, 16 లో పేర్కొన్న ప్రాథమిక హక్కులు
డి) ఆర్టికల్ 25, 26, 27 ల్లో పేర్కొన్న
ప్రాథమిక హక్కులు
1) ఎ, బి, సి, డి 2) ఎ, సి, డి
3) ఎ, బి, డి 4) బి, సి, డి
24. కేవలం భారతీయులకు మాత్రమే లభించే ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్‌లో పేర్కొన్నారు?
1) ఆర్టికల్స్ 15, 16, 19, 29
2) ఆర్టికల్స్ 16, 19, 20, 21
3) ఆర్టికల్స్ 20, 22, 23, 24
4) ఆర్టికల్స్ 19, 25, 26, 27
25. ‘రాజ్యం’(state) నిర్వచనం గురించి రాజ్యాంగంలో ఎక్కడ వివరణ ఉంది?
1) ఆర్టికల్ 12 2) ఆర్టికల్ 13
3) ఆర్టికల్ 18 4) ఆర్టికల్ 22
26. ‘రాజ్యం’ వివరణకు సంబంధించి కింది వాటిలో సరైన జవాబును గుర్తించండి?
ఎ) రాజ్యం అంటే భారత ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వాలు
బి) రాజ్యం అంటే పార్లమెంటు, రాష్ట్ర
శాసనసభలు
సి) భారత ప్రభుత్వ నియంత్రణలో ఉన్న అన్ని స్థానిక ఇతర అధికార సంస్థలను
‘రాజ్యం’గా పేర్కొంటారు.
1) ఎ, సి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఎ, బి
27. సుప్రీం కోర్ట్ ఏ కేసు సందర్భంగా ‘రాజ్యం’ వివరణను స్పష్టంగా పేర్కొన్నది?
1) అజయ్హాసియా Vs ఖలీద్ ముజీబ్ కేసు
2) డి.పి. వాద్వా Vs స్టేట్ ఆఫ్ బీహార్ కేసు
3) సజ్జన్‌సింగ్ Vs స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసు
4) మినర్వామిల్స్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
28. 1981లో జస్టిస్ భగవతి నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం అజయ్హాసియా కేసులో రాజ్యం/ రాజ్య సంస్థకు ఇచ్చిన వివరణకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి.
ఎ) ఒక సంస్థ చేస్తున్న మొత్తం ఖర్చును రాజ్యం ఇస్తున్నపుడు దానిని రాజ్య సంస్థగా పేర్కొనవచ్చు.
బి) ఒక సంస్థపై రాజ్యం పూర్తి నియంత్రణను కలిగి ఉన్నట్లయితే దానిని రాజ్య సంస్థగా పేర్కొనవచ్చును.
సి) ఒక సంస్థ పూర్తి మూలధనం వాటా ప్రభుత్వం కలిగి ఉంటే దాన్ని రాజ్యం
ఏజెన్సీగా పేర్కొనవచ్చు
1) ఎ, బి, సి 2) ఎ, బి
3) ఎ, సి 4) బి, సి
29. ఒక సంస్థ నిర్వహిస్తున్న కార్యకలాపాలు ప్రజాప్రాముఖ్యత కలిగి ప్రభుత్వ కార్యక్రమాలతో సంబంధం ఉన్నప్పుడు దాన్నికూడా రాజ్యసంస్థగా పేర్కొనవచ్చునని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పునిచ్చింది?
1) ఈశ్వరీబాయి Vs యూనియన్
ఆఫ్ ఇండియా కేసు
2) ఎస్.ఆర్.బొమ్మై Vs యూనియన్
ఆఫ్ ఇండియా కేసు
3) ప్రకాష్ కదం Vs స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కేసు
4) అజయ్ హాసియా Vs ఖలీద్ ముజీబ్ కేసు
-కె.శ్రీనివాసరావు
పాలిటీ ఫ్యాకల్టీ
ఏకేఆర్ స్టడీ సర్కిల్
వికారాబాద్, 9441022571
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?