1,540 ఏఈఈ పోస్టులు
# కొలువుల నోటిఫికేషన్ జారీ చేసిన టీఎస్పీఎస్సీ
#సాగునీటి పారుదలశాఖలోనే 704 ఉద్యోగాలు
#ఈ నెల 22 నుంచి దరఖాస్తుల స్వీకరణ
#ఇప్పటివరకు 20,899 పోస్టులకు నోటిఫికేషన్
#52,460 పోస్టులకు ఆర్థికశాఖ అనుమతి
రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ శరవేగంగా సాగుతున్నది. తాజాగా 1,540 ఉద్యోగాలకు టీఎస్పీఎస్సీ శనివారం నోటిఫికేషన్ జారీచేసింది. వివిధ శాఖల్లోని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులన్నింటికీ ఒకేసారి ప్రకటన ఇచ్చింది. తెలంగాణ వచ్చినప్పటి నుంచి సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న సర్కారు, ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి సైతం పెద్దపీట వేసింది. 1,540 ఉద్యోగాల్లో సాగునీటిపారుదలశాఖలోనే 704 పోస్టుల కు నోటిఫికేషన్ ఇచ్చింది. తెలంగాణలోని ప్రతి ఇంటికీ నల్లా ద్వారా నీరందించే లక్ష్యంతో సర్కారు తీసుకొచ్చిన మిషన్ భగీరథ కోసం 302 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నది. ఈ నెల 22 నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ ఈ నెల 15 నుంచి www.tspsc.gov.inలో అందుబాటులో ఉంటుందని చెప్పారు. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులన్నింటికీ ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వడంపై ఇంజినీరింగ్ అభ్యర్థుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
20,899 పోస్టులకు నోటిఫికేషన్లు
రాష్ట్రంలో 80,039 ఉద్యోగాలను భర్తీచేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించినప్పటి నుంచి ఉద్యోగ నియామక ప్రక్రియ చకచకా సాగుతున్నది. ఏప్రిల్‌లో సీఎం కేసీఆర్ ప్రకటించగా కేవలం ఐదు నెలల్లోనే 65.5 శాతం ఉద్యోగాలకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఇప్పటివరకు 52,460 పోస్టులకు ఆర్థికశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 19,359 ఉద్యోగాలకు ఆయా నియామక సంస్థలు నోటిఫికేషన్లు ఇచ్చాయి. ప్రస్తుతం ఇచ్చిన 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులతో కలిపి ఆ సంఖ్య 20,899కి చేరింది. ఇప్పటికే గ్రూప్-1, పోలీస్, వైద్యారోగ్యశాఖ వంటి కీలక శాఖల్లో ఉద్యోగాల భర్తీకి సర్కారు నోటిఫికేషన్లు ఇచ్చింది. ఇటీవలే గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాలకు సైతం ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. ఈ నెల చివరి వారంలో గ్రూప్-2, గ్రూప్-3 పోస్టులకు సైతం నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉన్నది. ఇదే నెలలో గ్రూప్-4 పోస్టులకు సైతం ఆర్థికశాఖ అనుమతి ఇవ్వనున్నట్టు తెలిసింది.
అభ్యర్థులకు ఆల్‌ది బెస్ట్: హరీశ్‌రావు
‘ఉద్యోగ నియామక ప్రక్రియ శరవేగంగా సాగుతున్నది. టీఎస్పీఎస్సీ 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం సంతోషం. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రణాళికతో చదివి ధైర్యంగా పరీక్ష రాయండి. ఇంజినీరింగ్ అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్’ అంటూ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ట్వీట్‌చేశారు.
మిషన్ భగీరథ (సివిల్) 302
పంచాయతీరాజ్ (సివిల్) 211
పురపాలక, పబ్లిక్ హెల్త్ డిపార్ట్ మెంట్ (సివిల్) 147
ట్రైబల్ వెల్ఫేర్ (సివిల్) 15
రోడ్లు, భవనాలశాఖ (సివిల్) 145
రోడ్లు, భవనాలశాఖ (ఎలక్టికల్) 13
గ్రౌండ్ వాటర్ డెవలప్మెంట్ (మెకానికల్) 03
సాగునీటిపారుదల శాఖలో..
సివిల్ ఇంజినీర్ 320
మెకానికల్ ఇంజినీర్ 84
ఎలక్టికల్ ఇంజినీర్ 200
అగ్రికల్చర్ ఇంజినీర్ 100
- Tags
- AEE posts
- Notification
- TSPSC
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?