ఉపాధి శిక్షణ సంస్థల నుంచి దరఖాస్తులు
నిరుద్యోగ మైనారిటీ యువతకు వృత్తిపరమైన ఉపాధి కోర్సులపై శిక్షణ ఇచ్చేందుకు అర్హత గల సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. విద్య, ఐటీ, హెల్త్, యానిమల్ హస్బెండరీ, డెయిరీ, వెటర్నరీ, హౌసింగ్, ఫైనాన్స్, ఎయిర్ హోస్టెస్, హార్టికల్చర్, టూరిజం, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, అడ్వాన్స్ వెల్డింగ్, ఫైర్ అండ్ సేఫ్టీ, సోలార్ ప్యానెల్ టెక్నీషియన్ తదితర విభాగాల్లో శిక్షణ ఇవ్వగలిగే సామర్థ్యం గల సంస్థలు దరఖాస్తులు సమర్పించాలని మైనారిటీ సంక్షేమశాఖ శనివారం ఒక ప్రకటనలో సూచించింది. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సెక్టార్ స్కిల్స్ కౌన్సిల్, మెప్మా, టాస్క్, టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ ఎంప్యానల్ చేయబడిన శిక్షణ సంస్థలే దరఖాస్తులు సమర్పించాలని తెలిపింది. గత మూడేండ్లలో సంస్థల పనితీరుకు సంబంధించిన పత్రాలను ప్రాజెక్టు రిపోర్టుతో జతచేసి హార్డ్ కాపీలను మైనారిటీశాఖకు అందజేయాలని పేర్కొన్నది. వివరాలకు నాంపల్లిలోని హజ్‌హౌస్ లోని కార్యాలయంలో కానీ, 040 23244501 నంబర్లో సంప్రదించాలని సూచించింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?