సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏ దేశ గూఢచారి సంస్థ?
1. 68వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా ఏ చిత్రం గెలిచింది?
1) మణికర్ణిక 2) మరక్కర్
3) తానాజీ 4) సూరరై పోట్రు
2. భారత15వ రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఇటీవల ఎన్నికయ్యారు. ఆమెకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి
1) ఈమె ఒడిశా రాష్ట్రానికి చెందిన వ్యక్తి
2) రాష్ట్రపతిగా ఎన్నికైన చిన్న వయసుగల వ్యక్తి
3) గతంలో యూపీ రాష్ట్ర గవర్నర్‌గా పని చేశారు
4) ఒడిశాలో శాసనసభ్యురాలుగా ఎన్నికయ్యారు
3. జతపరచండి
ఎ. గార్బానృత్యం 1. తమిళనాడు
బి. యక్షగానం 2. మహారాష్ట్ర
సి. తమాషా 3. కర్నాటక
డి. భరతనాట్యం 4. గుజరాత్
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-2, సి-1, డి-3
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-3, బి-1, సి-2, డి-4
4. 2022 మార్చి 10న 5 రాష్ట్రాల శాసన సభ ఎన్నికల ఫలితాలు ప్రకటించారు. వాటిని గుర్తించండి.
1) కర్నాటక, మహారాష్ట్ర, యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్
2) గోవా, యూపీ, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్
3) యూపీ, న్యూఢిల్లీ, గోవా, పంజాబ్, మణిపూర్
4) గోవా, రాజస్థాన్, పంజాబ్, యూపీ, మణిపూర్
5. 2022 లో ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ పురుషుల, స్త్రీల సింగిల్స్ విజేతలు ఎవరు?
1) నోవాక్ జకోవిచ్, ఆష్లీబార్టీ
2) రఫెల్‌నాదల్, ఆష్లీబార్టీ
3) డానియల్ మెద్వెదెవ్, సెరెనా విలియమ్స్
4) రోజర్ఫెదరర్, కోలిన్స్
6. ఉక్రెయిన్ దేశం నుంచి భారత ప్రజలను మన దేశం తీసుకొచ్చేందుకు చేపట్టిన కార్యక్రమాన్ని ఏ పేరుతో పిలుస్తారు?
1) ఆపరేషన్ దేశశక్తి 2) ఆపరేషన్ సన్‌రైజ్
3) ఆపరేషన్ గంగా 4) ఆపరేషన్ విజయ్
7. రాజస్థాన్‌లోని ‘ఖేత్రిగనులు’ ఏ ఖనిజానికి ప్రసిద్ధి?
1) బంగారం 2) వెండి
3) వజ్రాలు 4) రాగి
8. ఇటీవల భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన జగదీప్ ధన్కర్ గతంలో ఏ రాష్ట్ర గవర్నర్‌గా పనిచేశారు?
1) పశ్చిమబెంగాల్ 2) ఉత్తరప్రదేశ్
3) గుజరాత్ 4) రాజస్థాన్
9. ఏ రోజున దేశంలో 200 కోట్ల కొవిడ్ డోసులు పూర్తి చేశారు?
1) 2022 జూలై 15 2) 2022 జూలై 16
3) 2022 జూలై 17 4) 2022 జూలై 18
10. వాస్తవాలను గుర్తించండి
1. 2022 లో భరత రత్న అవార్డు ప్రకటించలేదు
2. పద్మవిభూషణ్ అవార్డు- నలుగురికి ప్రకటించారు
3. పద్మభూషణ్ 17 మందికి ప్రకటించారు
4. పద్మశ్రీ 107 మందికి ప్రకటించారు
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) అన్నీ వాస్తవాలే
11. ఇటీవల కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన రాజీవ్ కుమార్ వరుస క్రమంలో ఎన్నికైన ఎన్నో వ్యక్తి?
1) 23 2) 24 3) 25 4) 26
12. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ 2022 ఆగస్టు 26న పదవీ విరమణ తరువాత నూతన ప్రధాన న్యాయమూర్తి ఎన్నికయ్యే వ్యక్తి ?
1) జస్టిస్ యూయూ లలిత్
2) జస్టిస్ మోహా
3) జస్టిస్ లలిత కుమార్
4) జస్టిస్ ఆరణ్మిశ్రో
13. దేశంలో వైశాల్యంలో అతిపెద్ద లోక్‌సభ స్థానం ఏ రాష్ట్రంలో ఉంది?
1) ఆంధ్రప్రదేశ్ 2) తెలంగాణ
3) యూపీ 4) పంజాబ్
14. ఇటీవల అమెరికాలోని న్యూయార్క్ నగరంలో దాడికి గురైన భారత రచయిత సల్మాన్ రష్దీ రాసిన వివాదాస్పద పుస్తకం?
1) మిడ్నైట్ చిల్డ్రన్
2) ది శాటానిక్ వర్సెస్
3) ఈస్ట్-వెస్ట్ 4) మై ట్రూత్
15. 49వ జీ-7 సభ్య దేశాల సమావేశాలు 2022లో ఏ దేశంలో నిర్వహించారు?
1) అమెరికా 2) జర్మనీ
3) ఇటలీ 4) ఫ్రాన్స్
16. బ్రిటన్ ప్రధాని పదవి పోటీలో ఉన్న ప్రవాస భారత సంతతికి చెందిన వ్యక్తి ఎవరు?
1) సునీల్ మిట్టల్ 2) వికాస్‌స్వరూప్
3) రిషి సునాక్ 4) లక్ష్మీ మిట్టల్
17. కింది సంస్థల ప్రధాన కార్యాలయాలను జతపరచండి
ఎ. F.A.O 1. వియన్నా
బి. U.N.I.C.E.F 2. పారిస్
సి. U.N.E.S.C.O 3. దోమ్
డి. U.N.D.C.P 4. న్యూయార్క్
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-3, బి-4, సి-2, డి-4
3) ఎ-2, బి-1, సి-4, డి-1
4) ఎ-4, బి-1, సి-2, డి-3
18. బ్రహ్మాస్ క్షిపణుల కొనుగోలు కోసం భారత్ ఒక ఒప్పందం చేసుకున్న భాగం?
1) ఇండోనేషియా 2) ఫిలిప్పీన్స్
3) చిలీ 4) బ్రెజిల్
19. ఇటీవల మరణించిన షింజో ఆబే ఏ దేశ మాజీ ప్రధాని?
1) దక్షిణ కొరియా 2) సింగపూర్
3) నేపాల్ 4) జపాన్
20. ఇటీవల వార్తల్లోకి వచ్చిన ‘ట్విట్టర్’ సంస్థ సీఈఓ ఎవరు?
1) అరవింద్ కృష్ణ 2) పరాగ్ అగర్వాల్
3) సత్యనాదెళ్ల 4) గీతాగోపీనాథన్
21. 2022 నవంబర్/డిసెంబర్ నెలల్లో గుజరాత్లో ఎన్ని శాసన సభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి?
1) 182 2) 183 3) 184 4) 185
22. శ్రీలంక దేశానికి ఇటీవల ప్రధానిగా ఎన్నికైన వ్యక్తి ఎవరు?
1) రణిల్ విక్రమే సింఘె
2) మహేంద్ర రాజపక్సా
3) గురత్ఫోనేకా
4) దినేష్ గుణవర్దెన
23. ఇటీవల ఇండోనేషియా దేశంలో జరిగిన ఆసియా హాకీ కప్‌ను ఏదేశం గెలుచుకుంది?
1) మలేషియా 2) పాకిస్థాన్
3) దక్షిణ కొరియా 4) జపాన్
24. ఎస్-400 అనే క్షిపణులు భారతదేశం ఏ దేశం నుంచి కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకుంది?
1) అమెరికా 2) బ్రిటన్
3) ఫ్రాన్స్ 4) రష్యా
25. జతపరచండి
ఎ. జాతీయ పత్తి పరిశోధనా కేంద్రం
1. జార్వట్
బి. జాతీయ ఉప్పు పరిశోధన సంస్థ
2. నాగ్‌పూర్
సి. జాతీయ పొగాకు పరిశోధన సంస్థ 3. భోల్నగర్
డి. జాతీయ తేయాకు పరిశోధన సంస్థ 4. రాజమండ్రి
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-3, సి-4, డి-1
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-3, బి-4, సి-1, డి-2
26. ఇటీవల శ్రీలంక దేశం చేరుకున్న చైనా సైనిక్ నౌక?
1) యువాన్‌చాంగ్-5
2) షాంఘై-2
3) యువాన్‌చాంగ్-3
4) షాంఘై-4
27. ఇటీవల వార్తల్లోకి వచ్చిన ‘హమాస్’ అనే ఉగ్రవాద సంస్థ ఏ దేశానికి చెందినది?
1) ఈజిప్ట్ 2) ఇరాన్
3) జోర్డాన్ 4) పాలస్తీనా
28. ఇటీవల ఏర్పాటు చేసిన ఐ2, యు2, కూటమిలో సభ్యదేశాలు ఏవి?
1) ఇజ్రాయెల్-ఇండియా, యూఎస్ఏ, యూఏఈ
2) ఇండియా-ఇండోనేషియా, యూఎస్ఏ-యూకే
3) ఇరాన్-ఇరాక్, యూకే, ఉక్రెయిన్
4) ఇరాక్-ఈజిప్టు, యూఎస్ఏ, కెనడా
29. భారత మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ జీవితంపై ‘శభాష్ మిథు’ చిత్రం రూపొందించారు. ఇందులో మిథాలీ రాజ్ పాత్రలో నటించింది?
1) ప్రియాంకా చోప్రా 2) మాధురి దీక్షిత్
3) తాప్సీ 4) అలియా భట్
30. సీఐఏ (సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) ఏ దేశ గూఢచారి సంస్థ?
1) రష్యా 2) చైనా
3) బ్రిటన్ 4) అమెరికా
31. ఇటీవల 22వ కామన్వెల్త్ క్రీడలు జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు బ్రిటన్‌లోని ఏ నగరంలో నిర్వహించారు?
1) లండన్ 2) మాంచెస్టర్
3) బర్మింగ్ హామ్ 4) గ్లాస్గో
32. ఇటీవల వార్తల్లోకి వచ్చిన ‘రమేష్ ప్రజ్ఞానంద’ ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి?
1) చెస్ 2) షట్లర్
3) హాకీ 4) పోలో
33. ఇటీవల స్పెయిన్ నెదర్లాండ్స్ దేశాల్లో నిర్వహించిన స్త్రీల హాకీ ప్రపంచకప్ విజేత ఎవరు?
1) అమెరికా 2) జర్మనీ
3) నెదర్లాండ్స్ 4) అర్జెంటీనా
34. ఇండియన్ ఎయిర్‌లైన్స్ కొనుగోలు చేసిన సంస్థ ఏది?
1) రిలయన్స్ 2) టాటా గ్రూప్
3) అదానీ 4) విప్రో
35. భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్’ను కేంద్ర ప్రభుత్వం ఏ రోజు ప్రకటించింది?
1) 2022 జూన్ 12 2) 2022 జూన్ 13
3) 2022 జూన్ 14 4) 2022 జూన్ 15
36. జతపరచండి
ఎ. జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ 1. భగవాన్ లాల్ సాహ్నీ
బి. జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ 2. రేఖా శర్మ
సి. జాతీయ మానవహక్కుల కమిషన్ చైర్మన్
3. హరీష్ హాన్
డి. జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ 4. జస్టిస్ అరుణ్ మిశ్రా
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-3, సి-4, డి-1
3) ఎ-4, బి-1, సి-2, డి-3
4) ఎ-4, బి-1, సి-2, డి-3
37. 2022లో తెలంగాణ రాష్ట్రం నుంచి పద్మశ్రీ అవార్డ్ అందుకున్న పద్మజారెడ్డి ఏ నృత్య కళాకారిణి?
1) భరతనాట్యం 2) గార్భా
3) యక్షగానం 4) కూచిపూడి
38. ఇటీవల బీహార్ ముఖ్యమంత్రిగా 8వ సారి పదవిని చేపట్టిన నితీష్‌కుమార్ రాజకీయ పార్టీపేరు?
1) ఆర్జేడీ 2) జేడీయూ
3) బీజేపీ 4) టీఎంసీ
39. అగ్ని-5 క్షిపణి ఏ శ్రేణికి చెందినది?
1) స్వల్పశ్రేణి 2) మధ్యస్థశ్రేణి
3) ఖండాంతర్గత 4) ఏదీకాదు
40. 2022 మిస్ యూనివర్స్‌గా ఎన్నికైన హమాజ్ సంధు ఏ రాష్ట్రానికి చెందినది?
1) న్యూఢిల్లీ 2) హర్యానా
3) పంజాబ్ 4) రాజస్థాన్
జవాబులు
1.4 2.3 3.3 4.2 5.2 6.3 7.4 8.1 9.3 10.4 11.3 12.1 13.2 14.2 15.2 16.3 17.2 18.3 19.4 20.2
21.1 22.4 23.3 24.4 25.2 26.1 27.4 28.1 29.3 30.4 31.3 32.1 33.3 34.2 35.3 36.2 37.4 38.2 39.3 40.3
సాంబయ్య
విషయ నిపుణులు
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?