ఇంటర్నేషనల్ జస్టిస్ డే ను ఏ రోజున నిర్వహిస్తారు (అంతర్జాతీయం)
ఇంటర్నేషనల్ జస్టిస్ డే
వరల్డ్ డే ఫర్ ఇంటర్నేషనల్ జస్టిస్‌ను జూలై 17న నిర్వహించారు. ‘ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ (ఐసీసీ)’ను 1998లో స్థాపించారు. దీనికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది దీని థీమ్ ‘అచీవింగ్ సోషల్ జస్టిస్ థ్రూ ఫార్మల్ ఎంప్లాయ్మెంట్’.
ఎక్స్‌పాట్ ఇన్సైడర్ ర్యాంకింగ్స్
2022కు ఇక్స్పాట్ ఇన్సైడర్ ర్యాంకింగ్స్‌ను ఇంటర్నేషన్స్ జూలై 18న విడుదల చేసింది. దీనిలో మెక్సికో, ఇండోనేషియా, తైవాన్, పోర్చుగల్, స్పెయిన్, యూఏఈ, వియత్నాం, థాయిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్ వరుసగా మొదటి 10 స్థానాల్లో నిలిచాయి.
-52 దేశాలకు కేటాయించిన ర్యాంకింగ్స్‌లో భారత్ 36వ స్థానంలో, కువైట్ చివరిస్థానంలో ఉన్నాయి.
-ఎక్స్‌పాట్రియేట్స్ కమ్యూనిటీల కోసం ప్రతి ఏడాది ఈ ర్యాంకింగ్‌ను కేటాయిస్తారు. ఎక్స్‌పాట్ అంటే ప్రవాసుడు లేదా బహిష్కృతుడు. అంటే తమ దేశాన్ని విడిచిపెట్టి విదేశాల్లో స్థిరపడిన వ్యక్తి.
హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్-2022 జూలై 19న విడుదలైంది. ఈ సూచికలో జపాన్ మొదటి స్థానంలో నిలిచింది. జపాన్ పాస్‌పోర్ట్‌తో ఏకంగా 193 దేశాలకు ప్రయాణించవచ్చు. రెండో స్థానంలో సింగపూర్, దక్షిణ కొరియా ఉన్నాయి. వీటి పాస్‌పోర్ట్‌తో 192 దేశాల్లో ప్రయాణించవచ్చు. జర్మనీ-స్పెయిన్ (190) 3, ఫిన్లాండ్-ఇటలీ (189) 4, ఆస్ట్రియా-డెన్మార్క్-నెదర్లాండ్స్-స్వీడన్- (188) 5, ఫ్రాన్స్-ఐర్లాండ్-పోర్చుగల్-యూకే (187) 6, బెల్జియం-న్యూజిలాండ్-నార్వే-స్విట్జర్లాండ్-అమెరికా (186) 7, ఆస్ట్రేలియా-కెనడా-చెక్ రిపబ్లిక్-గ్రీస్, మాల్టా (185) 8, హంగేరి (183) 9, లిథువేనియా-పోలెండ్-స్లొవేకియా (182) 10వ స్థానాల్లో నిలిచాయి.
-భారత్ 87వ స్థానంలో (60 దేశాలు), రష్యా 50వ స్థానంలో, చైనా 69వ స్థానంలో ఉన్నాయి. అన్నింటి కంటే చివరి స్థానంలో అఫ్గానిస్థాన్ ఉంది.
తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో ఉన్న శ్రీలంక అధ్యక్షుడి ఎన్నికకు పార్లమెంట్లో జూలై 20న ఓటింగ్ నిర్వహించారు. మొత్తం 225 మంది సభ్యుల్లో 134 మంది తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితులైన రణిల్ విక్రమసింఘెకు ఓటు వేశారు. విక్రమసింఘె దేశ ప్రధానిగా ఆరు సార్లు పనిచేశారు. శ్రీలంక పార్లమెంట్ దేశాధ్యక్షుడిని నేరుగా ఎన్నుకోవడం గత 44 ఏండ్లలో ఇదే తొలిసారి.
సంరక్షణలో ఉన్న మగ పాండాల్లో ప్రపంచంలోనే దీర్ఘకాలం జీవించిన ‘అన్ అన్’ జూలై 21న మరణించింది. హాంకాంగ్ నేషనల్ పార్క్‌లో ఉన్న ఈ పాండా 35 ఏండ్లు జీవించింది. 1999లో చైనా అన్ అన్‌తో పాటు జియా జియా అనే ఆడ పాండాను కూడా హాంకాంగ్‌కు బమతిగా ఇచ్చింది. జియా జియా 38 ఏండ్ల వయస్సులో 2016లో మరణించింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?