నేషనల్ ఫిష్ ఫార్మర్స్ డేని ఏరోజున నిర్వహిస్తారు.
జాతీయం
ఫిష్ ఫార్మర్స్ డే
65వ నేషనల్ ఫిష్ ఫార్మర్స్ డేని జూలై 10న నిర్వహించారు. దేశమంతటా చేపల పెంపకందారులు, వాటాదారుల మధ్య సంఘీభావం కోసం ఈ దినోత్సవాన్ని జరుపుకొంటారు. ప్రొఫెసర్ హీరాలాల్ ధురి, అతని సహోద్యోగి అలీకున్హి 1957, జూలై 10న ఒడిశాలోని అంగుల్‌లో నాణ్యమైన చేప పిల్లల ఉత్పత్తిని చేపట్టారు. ఇందుకు గుర్తుగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
నేచురల్ ఫామింగ్
సహజ వ్యవసాయం (నేచురల్ ఫామింగ్)పై జూలై 10న వర్చువల్‌గా నిర్వహించిన సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సదస్సును గుజరాత్‌లోని సూరత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. భారత దేశ అభివృద్ధి ‘సబ్కా ప్రయాస్ (అందరి కృషి)’ ద్వారానే సాధ్యమని ప్రధాని అన్నారు. సూరత్‌లో గ్రామానికి 75 మంది చొప్పున జిల్లావ్యాప్తంగా 4100 మంది రైతులకు సహజ వ్యవసాయంపై శిక్షణ ఇచ్చారు. దీంతో ‘సూరత్ మోడల్ ఆఫ్ నేచురల్ ఫామింగ్’ను అవలంబించాలని ప్రధాని కోరారు.
ఏఐ ఇన్ డిఫెన్స్
మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ డిఫెన్స్ (ఏఐ డీఈఎఫ్) సింపోజియం అండ్ ఎగ్జిబిషన్‌ను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జూలై 11న ప్రారంభించారు. దీనిని రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఏర్పాటు చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా రక్షణ రంగంలో ఆత్మనిర్భర్‌ను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు.
సహ్-భాగిత
‘న్యూఢిల్లీ సహ్-భాగిత’ అనే పథకాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ జూలై 11న ప్రారంభించారు. ఢిల్లీలోని పన్నుల వసూళ్లు, వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ వ్యవస్థలో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ లను భాగస్వాములను చేసేందుకు ఈ పథకాన్ని చేపట్టారు.
రీ వైల్డింగ్
పద్మజానాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్ ప్రారంభించిన రీ వైల్డింగ్ అనే కార్యక్రమంలో భాగంగా సింగాలియా నేషనల్ పార్క్‌లోకి జూలై 12న 20 రెడ్ పాండాలను వదిలారు. అడవుల్లో పాండాల జనాభాను వృద్ధి చేయడమే ఈ కార్యక్రమ ఉద్దేశం. పద్మజానాయుడు జూలాజికల్, సింగాలియా నేషనల్ పార్క్‌లు పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో ఉన్నాయి. వన్యప్రాణి అభయారణ్యాన్ని 1992లో సింగాలియా నేషనల్ పార్క్‌గా మార్చారు. దీనిని 1994లో రెడ్ పాండాలకు ప్రధాన ఆవాసంగా ప్రకటించారు. భారత్ హిమాలయన్ రెడ్ పాండా (ఐలురస్ ఫుల్జెన్స్, చైనీస్ రెడ్ పాండా (ఐలురస్ స్టియాని)లకు నిలయం. పాండా సిక్కిం రాష్ట్ర జంతువు.
వందేండ్ల బీహార్ అసెంబ్లీ
బీహార్ అసెంబ్లీ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ప్రధాని మోదీ ప్రత్యేక స్మారక స్థూపాన్ని జూలై 12న ఆవిష్కరించారు. బీహార్ అసెంబ్లీని సందర్శించిన తొలి ప్రధాని మోదీనే.
టీకాకు అనుమతి
సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) అభివృద్ధి చేసిన గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ టీకా మందు ‘సెర్వావాక్’కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) జూలై 12న అనుమతి ఇచ్చింది. గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ నివారణే లక్ష్యంగా తొలిసారి దేశీయంగా ‘క్వాడ్రివాలెంట్ హ్యూమన్ పాపిలోమావైరస్ వ్యాక్సిన్ (క్యూహెచ్‌పీవీ)’ను సీఐఐ అభివృద్ధి చేసింది. దీనిని మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు అనుమతి కోసం డీజీసీఐకి దరఖాస్తు చేసుకొన్నది.
ధమ్మకక్క డే
ఉత్తరప్రదేశ్‌లోని సారనాథ్‌లో ధమ్మకక్క డేని జూలై 13న నిర్వహించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫెడరేషన్ ఆషాఢ పూర్ణిమ నాడు ఈ ఉత్సవాన్ని నిర్వహించింది. బౌద్ధులకు వైశాఖ బుద్ధ పూర్ణిమ తర్వాత ఆషాఘ పూర్ణిమ రెండో అత్యంత పవిత్రమైన రోజు.
యుటిలిటీ లాంజ్
సుప్రీంకోర్టు ప్రాంగణంలో లాయర్ల కోసం నూతనంగా నిర్మించిన ‘యుటిలిటీ లాంజ్’ను సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ జూలై 13న ప్రారంభించారు. తమ క్లయింట్లతో న్యాయవాదులు కూర్చొని మాట్లాడుకునేందుకు వీలుగా ఈ లాంజ్‌ను ఏర్పాటు చేశారు. ఈ లాంజ్‌లోని సేవలను ప్రముఖ ఇండియన్ కాఫీ హౌస్ కో ఆపరేటివ్ సొసైటీ అందజేస్తుంది.
జాతీయ సదస్సు
రాష్ట్రాల వ్యవసాయ, ఉద్యానవన శాఖ మంత్రుల జాతీయ సదస్సును కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ బెంగళూరులో జూలై 14, 15 తేదీల్లో నిర్వహించింది. ‘బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్ (వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఉత్తమ పద్ధతులు)’ అనే అంశంపై ఈ సదస్సు జరిగింది. డిజిటల్ వ్యవసాయం, నేచురల్ ఫామింగ్, ఐసీఏఆర్ రూపొందించిన నూతన టెక్నాలజీపై చర్చించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?