ఇస్రో చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
నియామకాలు
మనోజ్ పాండే: భారత సైనిక ప్రధానాధికారిగా నియమితులయ్యారు. ఏప్రిల్ 30న బాధ్యతలు స్వీకరించారు. ఆయన భారత దేశానికి 29వ ప్రధాన సైనికాధికారి.
సోమశేఖర రాజు: భారత సైన్యానికి వైస్ చీఫ్‌గా బాగవల్లి సోమశేఖర రాజు మే 2న బాధ్యతలు స్వీకరించారు
మనోజ్ కఠియార్: మిలిటరీ ఆపరేషన్స్‌కు డైరెక్టర్ జనరల్‌గా మనోజ్ కఠియార్ నియమితులయ్యారు. మే 1న బాధ్యతలు స్వీకరించారు
జీఏవీ రెడ్డి: డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి డైరెక్టర్ జనరల్‌గా జనవరి 31న బాధ్యతలు చేపట్టారు.
జీ అశోక్ కుమార్: భారతదేశపు మొట్టమొదటి జాతీయ తీర భద్రత సమన్వయకుడిగా ఫిబ్రవరి 16న అశోక్ కుమార్ నియమితులయ్యారు. అంతకు ముందు ఆయన నావికా దళానికి చీఫ్‌గా విధులను నిర్వహించారు.
అపరాజిత శర్మ: భారత పోస్టల్ విభాగంలో టెలికాం అకౌంట్ అండ్ ఫైనాన్స్ ఆఫీసర్‌గా ఉన్నారు. జెనీవా కేంద్రంగా పనిచేసే ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్‌లో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ సంస్థకు చెందిన కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ ఆన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్కు వైస్ చైర్ పర్సన్‌గా నియమితులయ్యారు.
హర్షవర్ధన్ శ్రింగ్లా: భారత విదేశాంగ శాఖ కార్యదర్శిగా 2020, జనవరి 29 నుంచి 2022 ఏప్రిల్ 30 వరకు విధులు నిర్వహించారు. వచ్చే ఏడాది భారత్‌లో జీ-20 సమావేశం నిర్వహించనున్నారు. దీనికి ఆయన ప్రధాన సమన్వయ అధికారిగా నియమితులయ్యారు. మే 1న ఆయన బాధ్యతలు చేపట్టారు.
అమితాబ్ కాంత్: జీ-20 షెర్పాగా నియమితులయ్యారు. ఒక సమావేశం జరుగుతున్నప్పుడు దానికి సంబంధించిన సన్నద్ధతను చూసేవారినే షెర్పా అని పిలుస్తారు. 2023లో జీ-20 కూటమి సమావేశం భారత్‌లో నిర్వహించనున్నారు. భారత్‌లో ఈ సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి. 2021లో ఈ సమావేశాలు ఇటలీలో నిర్వహించారు. ఈ ఏడాది నవంబర్ 15, 16 తేదీల్లో ఇండోనేషియాలో నిర్వహించనున్నారు. 2024లో బ్రెజిల్లో, 2025లో దక్షిణాఫ్రికాలో జీ-20 సమావేశాలు నిర్వహిస్తారు. ఈ ఏడాది జరుగనున్న జీ-20 సమావేశంతో పాటు వచ్చే ఏడాది భారత్‌లో జరుగనున్న జీ-20 సమావేశానికి అమితాబ్ కాంతే షెర్పాగా నియమితులయ్యారు. అంతకుముందు ఈ బాధ్యతలను పీయూష్ గోయల్ చేపట్టారు.
ఇక్బాల్ సింగ్ లాల్పురా: మైనారిటీల జాతీయ కమిషన్‌కు చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. భారత దేశంలో ఆరు మతాలను మైనారిటీలుగా గుర్తించారు. అవి బౌద్ధం, జైనం, సిక్కు, పార్శీ, ఇస్లాం, కైస్తవం. ఈ మైనారిటీల సంక్షేమానికి 1993 మే 17న జాతీయ మైనారిటీ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
తరుణ్ కపూర్: ప్రధాని మోదీకి సలహాదారుగా నియమితులయ్యారు. ఆయన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. పదవీ విరమణకు ముందు పెట్రోలియం శాఖ కార్యదర్శిగా పనిచేశారు.
వివేక్ కుమార్: ప్రధాని మోదీకి ప్రైవేట్ సెక్రటరీగా వివేక్ కుమార్ నియమితులయ్యారు. 2004 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్‌కు చెందిన అధికారి ఆయన.
డాక్టర్ ఎస్. రాజు: జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు కొత్త డైరెక్టర్ జనరల్‌గా ఏప్రిల్ 1న బాధ్యతలు చేపట్టారు. ఈ సంస్థ 1851లో ఏర్పాటయ్యింది. దీని ప్రధాన కేంద్రం పశ్చిమబెంగాల్లోని కోల్‌కతాలో ఉంది.
అరుణభ ఘోష్: ఈయన పర్యావరణ నిపుణుడు. మార్చి 31న ఐక్యరాజ్య సమితి ‘నికర శూన్య ఉద్గార’ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ఒక సభ్యుడిగా భారత్‌కు చెందిన అరుణభ ఘోష్ నియమితులయ్యారు. ‘కౌన్సిల్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్’ అనే సంస్థకు ఆయన సీఈవోగా ఉన్నారు.
నంద్ మూల్‌చందానీ: అమెరికాలోని సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో ప్రధాన సాంకేతిక అధికారిగా (చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్) భారత సంతతికి చెందిన నంద్ మూల్‌చందానీ నియమితులయ్యారు. అంతకుముందు ఆయన అమెరికా రక్షణ శాఖ ఆధ్వర్యంలోని జాయింట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా పనిచేశారు.
అర్వింద్ కృష్ణ: న్యూయార్క్‌లోని ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో సభ్యుడిగా అర్వింద్ కృష్ణ నియమితులయ్యారు. డిసెంబర్ 31, 2023 వరకు ఆయన ఈ పదవిలో ఉంటారు. ప్రస్తుతం ఆయన ఐబీఎం చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఉన్నారు.
లీసా స్తాలేకర్: ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెట్ అసోసియేషన్‌కు ఆస్ట్రేలియాకు చెందిన లీసా స్తాలేకర్ నియమితులయ్యారు. ఆమె ఈ పదవిని చేపట్టనున్న తొలి మహిళ.
డీజే పాండియన్: బ్రిక్స్ బ్యాంక్‌కు భారత్‌లో ప్రాంతీయ కార్యాలయం గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీలో ఉంది. ఈ కార్యాలయానికి డైరెక్టర్ జనరల్‌గా డీజే పాండియన్ నియమితులయ్యారు. ఆయన సివిల్ సర్వీసెస్ మాజీ అధికారి. బ్రిక్స్ బ్యాంక్‌నే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ పేరుతో పిలుస్తారు. దీని ప్రధాన కేంద్రం షాంఘైలో ఉంది. గతంలో ఆయన ఆసియా మౌలిక సదుపాయాల అభివృద్ధి బ్యాంక్‌లో (ఏఐఐబీ) వైస్ ప్రెసిడెంట్‌గా అలాగే ప్రధాన పెట్టుబడుల అధికారిగా కూడా పనిచేశారు. ఏఐఐబీ అనేది బీజింగ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఈ బ్యాంక్‌లో అతిపెద్ద వాటాదారు చైనా కాగా, రెండో అతిపెద్ద వాటాదారుగా భారత్ ఉంది.
సోమ్‌నాథ్: ఇస్రో చైర్మన్‌గా సోమ్‌నాథ్ నియమితులయ్యారు. అంతకు ముందు ఆయన కేరళలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌కు డైరెక్టర్‌గా పనిచేశారు.
ఉన్నికృష్ణన్ నాయర్: విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌కు డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
జగ్దీశ్ కుమార్: యూజీసీ చైర్మన్‌గా జగ్దీశ్ కుమార్ నియమితులయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరి 4న బాధ్యతలు స్వీకరించారు.
శాంతిశ్రీ ధూళిపూడి పండిట్: జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి వైస్ చాన్స్‌లర్‌గా శాంతిశ్రీ ధూళిపూడి నియమితులయ్యారు. ఆమె ఈ పదవిని చేపట్టిన తొలి మహిళ.
దినేశ్ కుమార్ సక్లాని: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (ఎన్సీఈఆర్టీ)కి కొత్త డైరెక్టర్‌గా దినేశ్ ప్రసాద్ సక్లాని నియమితులయ్యారు.
అశోక్ కుమార్: నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగాకు డైరెక్టర్ జనరల్‌గా అశోక్ కుమార్ నియమితులయ్యారు. అతడికి రెయిన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పేరు ఉంది.
అనంత్ నాగేశ్వరన్: భారత ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారుగా అనంత్ నాగేశ్వరన్ నియమితులయ్యారు.
మాదాబి పురి బుచ్: సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)కు కొత్త చైర్‌పర్సన్‌గా మాదాబి పురి బుచ్ నియమితులయ్యారు. ఆమె ఈ పదవిని చేపట్టిన తొలి మహిళ. దేశంలో స్టాక్ మార్కెట్‌ను నియంత్రించేదే సెబీ. ఫిబ్రవరి 22 నాటికి ఈ పదవిలో అజయ్ త్యాగి ఉన్నారు. ఆయన పదవీ కాలం ముగియడంతో మాదాబి పురి బుచ్‌ను నియమించారు.
సునీల్ అగర్వాల్: జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)కు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా సునీల్ అగర్వాల్ నియమితులయ్యారు.
డీఎన్ పటేల్: టెలికాం డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (టీడీశాట్)కు చైర్‌పర్సన్‌గా ధీరుభాయ్ నారన్‌భాయ్ పటేల్ నియమితులయ్యారు.
అజయ్ భూషణ్ పాండే: నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్ఎఫ్ఆర్ఏ) చైర్మన్‌గా అజయ్ భూషణ్ పాండే నియమితులయ్యారు. అంతకుముందు ఆయన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేశారు. ఎన్ఎఫ్ఆర్ఏను 2013 కంపెనీల చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు. దీనికి మే 2018లో క్యాబినెట్ ఆమోదం లభించింది. సంస్థల ఆర్థిక నివేదికలను (ఫైనాన్షియల్ స్టేట్మెంట్) ఇది సమీక్షిస్తుంది. అలాగే వారి నుంచి వివరణ కూడా కోరవచ్చు. ఏవైనా అక్రమాలు జరిగాయని భావిస్తే విచారణ చేస్తుంది. అకౌంటింగ్, ఆడిటింగ్ అంశాలకు మాత్రమే ఇది పరిమితం.
రేణు సింగ్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌లో ఉన్న ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్కు డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఆమె 1990 నాటి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి. ఈ సంస్థకు డైరెక్టర్ అయిన రెండో మహిళ ఆమె. 2015లో డాక్టర్ సవిత ఈ బాధ్యతను చేపట్టిన తొలి మహిళ.
అవార్డులు
పద్మ
ఈ ఏడాది 128 మందికి పద్మ అవార్డులను జనవరి 26న ప్రదానం చేశారు. నలుగురు పద్మవిభూషణ్, 17 మంది పద్మ భూషణ్, 107 మంది పద్మశ్రీ పొందారు.
పద్మ విభూషణ్: బిపిన్ రావత్, కల్యాణ్ సింగ్, ప్రభా ఆత్రే, రాధేశ్యాం ఖేమ్కా.
బిపిన్ రావత్: భారత సైన్యానికి 26వ సైన్యాధికారిగా బిపిన్ రావత్ పనిచేశారు. అలాగే దేశపు మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా కూడా విధులు నిర్వహించారు. గతేడాది డిసెంబర్ 8న తమిళనాడులో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు.
కల్యాణ్ సింగ్: ఉత్తరప్రదేశ్‌కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాజస్థాన్ రాష్ట్రానికి గవర్నర్‌గా కూడా పనిచేశారు. గతేడాది ఆగస్ట్ 21న మరణించారు.
రాధేశ్యామ్ ఖేమ్కా: గీతా ప్రెస్‌తో 38 సంవత్సరాల అనుబంధం ఉన్న వ్యక్తి. గీతా ప్రెస్ ట్రస్ట్ బో ర్డ్ కు చైర్మన్‌గా కూడా వ్యవహరించారు. బీహార్ రాష్ట్రం ముంగెర్లో జన్మించారు. ఖేమ్కా కూడా 2021లో మరణించారు.
ప్రభా ఆత్రే: క్లాసికల్ వోకలిస్ట్ ప్రభా ఆత్రే సెప్టెంబర్ 13, 1932లో జన్మించారు. గతంలో ఆమె పద్మశ్రీ, పద్మ భూషణ్ పొందారు.
పద్మ భూషణ్ పొందిన ప్రముఖులు: కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా, సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్, సైరస్ పూనావాలా, చంద్రశేఖరన్ (టాటా సంస్థల చైర్మన్), గులాం నబీ ఆజాద్, దేవేంద్ర ఝరియా.
పద్మశ్రీ పొందిన తెలుగువాళ్లు: గరికపాటి నరసింహారావు, గోసవిడే షేక్ హసన్, సుంకర వెంకట ఆదినారాయణ రావు, షావుకారు జానకి, దర్శనం మొగులయ్య, పద్మజా రెడ్డి.
రామ్ధర్ష్ మిశ్రా: ప్రముఖ కవి, సాహితీవేత్త రామ్ధర్ష్ మిశ్రాకు సరస్వతి సమ్మాన్ అవార్డ్-2021 దక్కింది. ‘మైతో యహా హూ’ అనే పద్య సంకలనానికి ఈ అవార్డ్ లభించింది. కేకే బిర్లా ఫౌండేషన్ దీనిని అందజేస్తుంది.
దామోదర్ మౌజో: 2022కు జ్ఞానపీఠ్ అవార్డ్ ను గెలుచుకున్నారు.
నరేంద్ర మోదీ: లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డ్ ను ప్రధాని మోదీకి ప్రకటించారు. ఈ అవార్డ్ పొందిన తొలి వ్యక్తి ఆయనే. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ పేరుమీద ఈ అవార్డ్ ను ఏర్పాటు చేశారు.
బాల్కృష్ణ విఠల్ దాస్: భారతీయ ఆర్కిటెక్ట్ బాల్కృష్ణ విఠల్దాస్ జోషికి ప్రతిష్ఠాత్మక రాయల్ గోల్డ్ మెడల్ 2022 గౌరవం దక్కింది. ఆర్కిటెక్చర్లో ప్రపంచంలోనే దీనినో గొప్ప గౌరవంగా భావిస్తారు.
సిసిలీ: కామెరూన్ దేశానికి చెందిన పర్యావరణ కార్యకర్త. 2022 వంగరి మాథయ్ ఫారెస్ట్ చాంపియన్‌షిప్ అవార్డును గెలుచుకుంది. అడవుల సంరక్షణకు చేసిన కృషికి ఈ అవార్డ్ దక్కింది. వంగరి మాథయ్ ప్రముఖ సామాజిక, పర్యావరణ కార్యకర్త. ఆఫ్రికా ఖండం నుంచి నోబెల్ బహుమతిని పొందిన తొలి మహిళ కూడా ఆమెనే. 1977లో ఆమె గ్రీన్ బెల్ట్ ఉద్యమాన్ని ప్రారంభించింది.
హర్షలీ మల్హోత్ర: 12వ భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అవార్డ్ ను హర్షలీ మల్హోత్ర గెలుచుకున్నారు. మహారాష్ట్ర గవర్నర్ ఈ అవార్డ్ ను అందజేశారు. బజరంగీ భాయ్‌జాన్ (2015) సినిమాలో ఆమె నటించింది.
సుస్మితా సేన్: బాలీవుడ్ నటి. వాషింగ్టన్ డీసీలో నిర్వహించిన సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్’ అవార్డ్ ను గెలుచుకుంది.
సత్యేంద్ర ప్రకాశ్: బ్యూరో ఆఫ్ ఔట్రీచ్ అండ్ కమ్యూనికేషన్స్‌లో ప్రధాన డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు. ఓటింగ్‌పై అవగాహన పెంచినందుకు ఆయనకు కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ అవార్డ్ ను ఇచ్చింది.
నారాయణ్ ప్రధాన్: జీడీ బిర్లా సైంటిఫిక్ రిసెర్చ్-2022 అవార్డును ప్రొఫెసర్ నారాయణ్ ప్రధాన్ పొందారు.
సురేశ్ రైనా: ప్రముఖ క్రికెటర్. స్పోర్ట్ ఐకాన్ అవార్డ్ ను మాల్దీవ్స్ దేశం ఆయనకు ప్రకటించింది. క్రికెట్లో ఆయన సాధించిన విజయాలకు ఈ అవార్డ్ లభించింది.
నీరజ్ చోప్రా: బైజూస్ క్లాసెస్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకులు సంయుక్తంగా ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ది ఇయర్ (మేల్) అవార్డ్ ను నీరజ్ చోప్రా గెలుచుకున్నాడు. మహిళల విభాగంలో మీరాబాయి చాను గెలుచుకుంది.
డెన్నిస్ పర్నెల్: గణితంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినవాళ్లకు ఇచ్చే అబెల్ ప్రైజ్‌ను 2022కు డెన్నిస్ పార్నెల్‌కు ప్రకటించారు.
వైల్ఫ్రైడ్ బ్రుట్సర్ట్: జల సంరక్షణకు కృషి చేస్తున్న ప్రొఫెసర్ వైల్ఫ్రైడ్కు స్టాక్‌హోం వాటర్ ప్రైజ్ దక్కింది. జలరంగంలో కృషి చేసే వాళ్లకు ఇచ్చే ఈ అవార్డ్‌ను నోబెల్‌తో సమానంగా పరిగణిస్తారు.
లతా మంగేష్కర్: ప్రముఖ గాయని లతామంగేష్కర్ ఫిబ్రవరి 6న మరణించారు. 1989లో దాదాసాహెబ్ ఫాల్కే, 2001లో భారత రత్న అందుకున్నారు.
మృతులు
చందుపట్ల జంగారెడ్డి: బీజేపీ నాయకుడు అయిన ఆయన ఫిబ్రవరి 5న మరణించారు. 1984లో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ దేశ వ్యాప్తంగా కేవలం రెండు సీట్లే గెలుచుకుంది. అందులో వరంగల్ నుంచి గెలిచిన జంగారెడ్డి ఒకరు. మరొకరు గుజరాత్ నుంచి గెలిచిన ఏకే పటేల్.
రాల్ బజాజ్: ప్రముఖ పారిశ్రామిక వేత్త రాల్ బజాజ్ ఫిబ్రవరి 12న మరణించారు. 2001లో పద్మ భుషణ్ పొందారు.
సింధుథాయ్ సప్కాల్: ప్రముఖ సామాజిక కార్యకర్త. అనాథ బాలల అభివృద్ధి కోసం కృషిచేసినందుకు 2021లో పద్మశ్రీ పొందారు. జనవరి 4వ ఆమె మరణించారు.
సిడ్నీ పొయిటయిర్: ఆస్కార్ అవార్డ్ పొందిన తొలి నల్ల జాతీయుడు సిడ్నీ పొయిటయిర్ జనవరి 4న మరణించారు.
భరత్ భూషణ్: ప్రముఖ ఫొటోగ్రాఫర్. తెలంగాణ సంస్కృతి, తెలంగాణ ప్రకృతిని తన ఫొటోగ్రఫీ కళతో ప్రపంచానికి చూపించారు. జనవరి 30న మరణించారు.
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ
ఎడ్యు రిపబ్లిక్
9849212411
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?