గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్‌లో భారత్ స్థానమెంత ?
అంతర్జాతీయం
సీ గార్డియన్స్-2
సీ గార్డియన్స్-2 మారిటైమ్ ఎక్సర్సైజ్ జూలై 10 నుంచి 13 వరకు షాంఘై (చైనా)లోని వుసాంగ్లోని మిలిటరీ పోర్ట్‌లో నిర్వహించారు. పాకిస్థాన్ నేవీ, చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీ ఈ వ్యాయామంలో పాల్గొన్నాయి. ఈ ఎక్సర్సైజ్ ఉద్దేశం పాకిస్థాన్, చైనా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏకీకృతం చేయడం.
వరల్డ్ పాపులేషన్ డే
ప్రపంచ జనాభా దినోత్సవాన్ని (వరల్డ్ పాపులేషన్ డే) జూలై 11న నిర్వహించారు. 1987 జూలై 11న ప్రపంచ జనాభా 5 బిలియన్ల (500 కోట్లు)కు చేరుకున్న సందర్భంగా ఐక్యరాజ్యసమితి 1989లో జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రారంభించింది. ఈ ఏడాది థీమ్ ‘ఏ వరల్డ్ ఆఫ్ 8 బిలియన్: టువర్డ్ ఏ రెసిలియంట్ ఫ్యూచర్ ఫర్ ఆల్-హార్నెసింగ్ ఆపర్చునిటీస్ అండ్ ఎన్ష్యూరింగ్ రైట్స్ అండ్ చాయిసెస్ ఫర్ ఆల్’.
వరల్డ్ గ్రేటెస్ట్ ప్లేసెస్
టైమ్ మ్యాగజీన్ రూపొందించిన ప్రపంచంలోని 50 గొప్ప ప్రదేశాల (వరల్డ్ గ్రేటెస్ట్ ప్లేసెస్ 50) జాబితా-2022 జూలై 12న విడుదల చేశారు. రస్ అల్ ఖైమా (యూఏఈ), పార్క్ సిటీ (ఉటా), గ్యాలపోగస్ ఐలాండ్, డాల్ని మొరావా (చెక్ రిపబ్లిక్), సియోల్, గ్రేట్ బారియర్ రీఫ్ (ఆస్ట్రేలియా), దోహా (ఖతార్), డెట్రాయిట్ (యూఎస్), కేరళ (భారత్), ది ఆర్కిటిక్, అహ్మదాబాద్ (భారత్), నైరోబి (కెన్యా), వాలెన్సియా (స్పెయిన్), క్వీన్స్టౌన్ (న్యూజిలాండ్), వాంగే నేషనల్ పార్క్ (జింబాంబ్వే), హిస్టారిక్ సిల్క్ రోడ్ సైట్స్ (ఉజ్బెకిస్థాన్), సావో పౌలో (బ్రెజిల్), ట్రాన్స్ భూటాన్ ట్రైల్ (భూటాన్), డెవాన్ (ఇంగ్లండ్), బాలి (ఇండోనేషియా) వరుసగా మొదటి 20 స్థానాల్లో ఉన్నాయి.
గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్
146 దేశాలతో గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్-2022ను వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) జూలై 13న విడుదల చేసింది. ఈ జాబితాలో ఐస్లాండ్ మొదటి స్థానంలో నిలువగా.. తర్వాతి స్థానాల్లో ఫిన్లాండ్, నార్వే, న్యూజిలాండ్, స్వీడన్, నమీబియా, రువాండా, లిథువేనియా, ఐర్లాండ్, స్విట్జర్లాండ్ నిలిచాయి.
ఈ జాబితాలో భారత్ 135వ స్థానంలో ఉంది. పొరుగు దేశాలైన బంగ్లాదేశ్ 71, నేపాల్ 96, శ్రీలంక 110, మాల్దీవులు 117, భూటాన్ 126, ఇరాన్ 143, పాకిస్థాన్ 145, అఫ్గానిస్థాన్ 146వ స్థానాల్లో ఉన్నాయి.
ఐ2యూ2 భేటీ
ఇండియా, ఇజ్రాయెల్, యూఎస్ఏ, యూఏఈ కూటమి నాయకుల తొలి సమావేశం జూలై 14న వర్చువల్‌గా నిర్వహించారు. భారత ప్రధాని మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని యైర్ లాపిడ్, యూఎస్ఏ అధ్యక్షుడు జో బైడెన్ (జోసెఫ్ రాబినెట్ బైడెన్), యూఏఈ పాలకుడు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్.. నీరు, ఇంధనం, ఆహారం, ఆరోగ్య భద్రత, రవాణా, అంతరిక్ష రంగాల్లో సంయుక్త పెట్టబడులపై చర్చించారు. భారతదేశమంతటా ఫుడ్ పార్కుల ఏర్పాటుకు యూఏఈ 2 బిలియన్ డాలర్ల (సుమారు రూ.16 వేల కోట్లు) పెట్టుబడులు పెట్టనుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?