హెలికాప్టర్ జాతికి అంకితం (జాతీయం)
ఇండియన్ నేవీ ఎయిర్ సెంటర్ ‘ఐఎన్ఎస్ డేగ’లో అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ (ఏఎల్‌హెచ్-324)కు చెందిన తొలి స్క్వాడ్రన్‌ను తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్‌గుప్తా జూలై 4న ప్రారంభించారు. ఈ తొలి స్కాడ్రన్‌కు ‘కెస్ట్రెల్స్ (చిట్టి డేగ)’ అని పేరుపెట్టారు. ఈ కార్యక్రమం విశాఖపట్నంలో నిర్వహించారు.
ఏక్నాథ్ విజయం
మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే జూలై 4న నిర్వహించిన బల పరీక్షలో విజయం సాధించారు. శివసేన చీలిక వర్గం నేత అయిన షిండేకు 164 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలుపగా.. 99 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. మహారాష్ట్ర శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య 288 కాగా ప్రస్తుతం 287 మంది ఉన్నారు. ఈ బలపరీక్షకు 267 మంది హాజరు కాగా.. ఓటింగ్‌లో 263 మంది పాల్గొన్నారు.
నారీ కో నమన్
హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ ‘నారీ కో నమన్’ పథకాన్ని జూలై 4న ప్రారంభించారు. ఆ రాష్ట్ర సరిహద్దులోని మహిళా ప్రయాణికులకు హిమాచల్ ప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (హెచ్ఆర్టీసీ) బస్సుల్లో చార్జీలపై 50 శాతం రాయితీని అందించడమే ఈ పథక ఉద్దేశం. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్.
డిజిటల్ ఇండియా వీక్
గుజరాత్‌లోని గాంధీనగర్‌లో డిజిటల్ ఇండియా వీక్-2022ని ప్రధాని మోదీ జూలై 4న ప్రారంభించారు. ఈ ఏడాది దీని థీమ్ ‘క్యాటలైజింగ్ న్యూ ఇండియాస్ టెకేడ్’. ‘డిజిటల్ ఇండియి జెనెసిస్-నేషనల్ డీప్‌టెక్ స్టార్టప్ ప్లాట్‌ఫామ్‌ను కూడా ప్రారంభించారు.
రాజేంద్ర ప్రసాద్ అవార్డు
అకడమిక్ ఎక్సలెన్స్ విభాగంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో డా. బాబు రాజేంద్ర ప్రసాద్ మెమోరియల్ అవార్డును ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ జూలై 5న వెల్లడించారు. న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఐఐపీఏ) ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ 320వ సమావేశానికి జితేంద్ర సింగ్ అధ్యక్షత వహించారు. ఐఐపీఏ భవన సముదాయానికి శంకుస్థాపన చేసిన భారత తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ జ్ఞాపకార్థంగా ఈ అవార్డును ఏర్పాటు చేస్తారు. ఐఐపీఏ అధ్యక్షుడు వెంకయ్య నాయుడు. ఐఐపీఏ డైరెక్టర్ జనరల్ సురేంద్ర నాథ్ త్రిపాఠి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?