నంబర్ వన్ తెలంగాణ (తెలంగాణ)
దేశంలో స్టార్టప్స్‌ను ప్రోత్సహించే టాప్ రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. స్టార్టప్ స్టేట్ ర్యాంకులను జూలై 4న కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ విడుదల చేశారు. ఈ రంగంలో పెద్ద (కోటికి పైగా జనాభా), చిన్న (కోటిలోపు జనాభా) రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చూపిన ప్రతిభ ఆధారంగా వాటిని స్టార్టప్ మెగాస్టార్స్ (బెస్ట్ పర్ఫామర్స్), సూపర్‌స్టార్స్ (టాప్ పర్ఫామర్స్), స్టార్స్ (ది లీడర్స్), రైజింగ్ స్టార్స్ (యాస్పైరింగ్ లీడర్స్), సన్‌రైజర్స్ (ఎమర్జింగ్ స్టార్టప్ ఎకోసిస్టమ్స్) పేర్లతో ఐదు విభాగాలుగా విభజించారు.
సామర్థ్యం, పెంపు, మార్గనిర్దేశం, నిధులు, ఇంక్యుబేషన్, సంస్థాగత విషయాల్లో మద్దతు, మార్కెట్ అందుబాటు, నవకల్పన, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇచ్చే ప్రోత్సాహం ఆధారంగా రాష్ట్రాల స్థాయిని లెక్కించారు. మెగాస్టార్స్: గుజరాత్, కర్ణాటక. సూపర్‌స్టార్స్: తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, జమ్ముకశ్మీర్. స్టార్స్: తమిళనాడు, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, అసోం, అరుణాచల్‌ప్రదేశ్, అండమాన్ నికోబార్, గోవా. రైజింగ్ స్టార్స్: రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్, చండీగఢ్, త్రిపుర, దాద్రానగర్ హవేలి, మణిపూర్, నాగాలాండ్, పుదుచ్చేరి. సన్‌రైజర్స్: బీహార్, ఆంధ్రప్రదేశ్, మిజోరం, లడఖ్.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?