జాతీయం 15-06-2022
బ్లూ డ్యూక్ సీతాకోక చిలుక
సిక్కిం ముఖ్య మంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ (పీఎస్ గోలే) బ్లూ డ్యూక్ సీతాకోక చిలుకను ఆ రాష్ట్ర సీతాకోక చిలుకగా జూన్ 5న ప్రకటించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ నిర్వహించిన ఆన్లైన్ పోల్‌లో బ్లూ డ్యూక్ 57 శాతం ఓట్లను పొందింది. 43 శాతం ఓట్లతో కృష్ణ నెమలి (ప్యాపిలియో కృష్ణ) అనే సీతాకోక చిలుక రెండో స్థానంలో నిలిచింది. బ్లూ డ్యూక్ శాస్త్రీయ నామం బస్సరోనా దుర్గా దుర్గా. దీన్ని 1858లో కనుగొన్నారు.
జనసమర్థ్ పోర్టల్
13 రకాల ప్రభుత్వ రుణాల స్కీమ్‌లకు సంబంధించిన ‘జన్ సమర్థ్ పోర్టల్’ను ప్రధాని మోదీ జూన్ 6న ఆవిష్కరించారు. వ్యాపారులు, చిన్నతరహా పరి శ్రమల వ్యాపారవేత్తలు, రైతులు, విద్యార్థులు సులభంగా రుణాలు పొందేందుకు ఈ పోర్టల్ తోడ్పడుతుంది. అంతకుముందు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఎకనామిక్, కార్పొరేట్ వ్యవహారాల శాఖలో వారోత్సవాలను ప్రధాని ప్రారంభించారు.
అగ్ని-4
అణ్వాయుధ సామ ర్థ్యం గల అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణిని జూన్ 6న విజయ వంతంగా పరీక్షించారు. ఒడిశాలో ని అబ్దుల్ కలాం ఐలాండ్‌లో ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఇది నాలుగు వేల కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించగలదు. దీని పొడవు 20 మీటర్లు. దీన్ని డీఆర్డీవో రూపొందించింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?