క్రీడలు 15-06-2022

హాకీ ఫైవ్స్
ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ (ఎఫ్ఐహెచ్) ఫైవ్స్ టోర్నీని భారత జట్టు గెలుచుకుంది. జూన్ 5న స్విట్జర్లాండ్‌లో నిర్వహించిన మ్యాచ్‌లో పోలెండ్ జట్టును భారత్ ఓడించింది. ఒక్కో జట్టులో ఐదుగురు చొప్పున ప్రయోగాత్మకంగా ఈ ఫైవ్స్ను ఎఫ్ఐహెచ్ నిర్వహించింది.

రఫెల్ నాదల్
టెన్నిస్ ఫ్రెంచ్ ఓపెన్ పరుషుల సింగిల్స్ టైటిల్‌ను స్పెయిన్ ఆటగాడు రఫెల్ నాదల్ గెలుచుకున్నాడు. జూన్ 5న పారిస్‌లోని స్టాడ్ రోలాండ్ గారోస్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నాదల్ కాస్పర్ రూడ్ (నార్వే)ను ఓడించాడు. ఈ టోర్నీని గెలవడం నాదల్కు ఇది 14వ సారి. దీంతో ఒక గ్రాండ్‌స్లామ్ టోర్నీని ఇన్నిసార్లు గెలిచి రికార్డు సృష్టించాడు. విజేతకు రూ.18.30 కోట్లు (22 లక్షల యూరోలు), రన్నరప్‌కు రూ.9.15 కోట్లు (11 లక్షల యూరోలు) ప్రైజ్‌మనీగా లభించింది.
మహిళల సింగిల్స్‌లో ఇగా స్వియాటెక్ (పోలెండ్) గెలిచింది. పురుషుల డబుల్స్‌లో మార్సెలో అరెవాలో (ఎల్ సాల్వెడార్)-జీన్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్) జంట గెలుపొందింది. మహిళల డబుల్స్‌లో కరోలిన్ గార్సియా (ఫ్రాన్స్)-క్రిస్టీనా మ్లాడెనోవిక్ (ఫ్రాన్స్) జోడీ గెలిచింది. మిక్స్డ్ డబుల్స్‌లో ఎనా షిబహరా (జపాన్)-వెస్లీ కూల్ హాఫ్ (నెదర్లాండ్స్) జంట గెలుపొందింది.

ఉమెన్స్ వన్డే ర్యాంకింగ్
ఐసీసీ ఉమెన్స్ వన్డే ర్యాంకింగ్‌ను జూన్ 7న విడుదల చేసింది.
బ్యాటింగ్: 1) అలిసా హీలి (ఆస్ట్రేలియా), 2) నటాలి సివర్ (ఇంగ్లండ్), 3) బెత్ మూనీ (ఆస్ట్రేలియా, 4) లారా నొల్వార్ట్ (సౌతాఫ్రికా), 5) మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా), 6) రచెల్ హేన్స్ (ఆస్ట్రేలియా), 7) మిథాలి రాజ్ (భారత్), 8) అమీ సాటర్‌వెయిట్ (న్యూజిలాండ్), 9) స్మృతి మంధాన (భారత్), 10) టామీ బ్యూమాంట్ (ఇంగ్లండ్)
బౌలింగ్: 1) సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లండ్), 2) షబ్నిమ్ ఇస్మాయిల్ (సౌతాఫ్రికా), 3) జెస్ జొనాసెన్ (ఆస్ట్రేలియా), 4) మేగన్ షట్ (ఆస్ట్రేలియా), 5) జులన్ గోస్వామి (భారత్), 6) మరిజన్ కప్ (సౌతాఫ్రికా), 7) అయబొంగా ఖాకా (సౌతాఫ్రికా), 8) అన్య ష్రబ్సోల్ (ఇంగ్లండ్), 9) కేట్ క్రాస్ (ఇంగ్లండ్), 10) హేలీ మాథ్యూస్ (వెస్టిండీస్)
ఆల్‌రౌండర్: 1) నటాలీ సివర్ (ఇంగ్లండ్), 2) ఎలిస్ పెరీ (ఆస్ట్రేలియా), 3) మరియాజన్ కప్ (సౌతాఫ్రికా), 4) హేలీ మాథ్యూస్ (వెస్టిండీస్), 5) అమేలీ కెర్ (న్యూజిలాండ్), 6) అష్లీ గార్డ్నర్ (ఆస్ట్రేలియా), 7) దీప్తి శర్మ (భారత్), 8) జెస్ జొనాసెన్ (ఆస్ట్రేలియా), 9) క్యాథరిన్ బ్రంట్ (ఇంగ్లండ్), 10) జులన్ గోస్వామి (భారత్)

మిథాలి రాజ్
భారత మహిళా క్రికెటర్ మిథాలి రాజ్ అంతర్జా తీయ క్రికెట్‌కు జూన్ 8న రిటైర్ మెంట్ ప్రకటించింది. 1999, జూన్ 26న మిల్టన్ కీన్స్‌లో ఐర్లాండ్‌పై ఆమె అరంగేట్రం చేసింది. మొత్తం 232 వన్డేల్లో 50.68 సగటుతో 7805, 12 టెస్టుల్లో 699, 89 టీ20ల్లో 2364 పరుగులు చేసింది.
RELATED ARTICLES
-
గోబర్ ధన్ ప్లాంటును ఎక్కడ ఏర్పాటు చేశారు? (Groups Special)
-
ఐదేండ్లకే పుస్తకం రాసి గిన్నిస్ లో చోటు దక్కించుకున్నచిన్నారి..? (వార్తల్లో వ్యక్తులు)
-
రన్నింగ్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన వృద్ధురాలి వయసెంతంటే..? ( క్రీడలు)
-
ఈ ఏడాది జాతీయ పఠన దినోత్సవ థీమ్..? (జాతీయం)
-
ప్రపంచ శరణార్థులదినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? (అంతర్జాతీయం)
-
‘దిమ హసావో’ జిల్లాలో వేటిని కనుగొన్నారు? (కరెంట్ అఫైర్స్)
Latest Updates
జాతీయం-అంతర్జాతీయం
తెలంగాణ చిత్రకళాకారులు – ఘనతలు
విద్యా సంస్కరణలతో వికాసం (groups special)
ఖనిజాల కాణాచి అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? (Groups Special)
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం (Groups Special)
పుస్తక సమీక్ష / Book Review
Scholarships for students
డిగ్రీ.. ‘దోస్త్’ రెడీ
బ్యాంకుల్లో 6035 క్లర్క్ పోస్టులు
Ace questions on environment