బలహీనతను జయిస్తేనే విజయం !
మన స్వప్నాలకు స్పష్టమైన రూపం ఇవ్వటానికి నిర్దిష్ట గమ్యం ఏర్పర్చుకోవడానికి ఈ Swot Analysis ప్రతి విద్యార్థికీ అవసరం. ఇది పూర్తి మీ వ్యక్తిగత పరీక్ష, ఎటువంటి సంకోచాలు, భయాలు లేకుండా సిగ్గుపడకుండా ఒక నోట్‌బుక్‌లో రాయండి. ఉద్యోగం రావాలంటే మీలో ఈ వ్యక్తిత్వ లక్షణాలు ఉండాల్సిందే. అనేక అధ్యయనాల అనంతరం హెచ్ఆర్ మేనేజర్లు ప్రపంచవ్యాప్తంగా వెలిబుచ్చిన అభిప్రాయమిది. మీలో ఈ లక్షణాలు ఉన్నాయా? ఉంటే వాటిని ఇంటర్వూ టైమ్‌లో వ్యక్తీకరించండి. విజయం మీదే.
JOB WINNING STRENGTHS
పాజిటివ్ ఆటిట్యూడ్
Resilience (అపజయం నుంచి త్వరగా కొలుకునే లక్షణం, బంతిలాగా తిరిగి పైకి ఎగిరే గుణం)
Adaptability (పరిస్థితులకనుగుణంగా ఒదిగిపోవటం)
కొత్త సవాళ్లను స్వీకరించగలిగే ైస్థెర్యం
సృజనాత్మకత
అంకితభావంతో పనిచేయగలగటం
చొరవ తీసుకొనగలిగే ైస్థెర్యం
కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి
నాకసలు అలసట అన్నది లేదు / Never Say Die అనే లక్షణం
ఏకాగ్రతచిత్తంతో లక్ష్యం వైపుగా సాగిపోవటం
సమయపాలన (Time Management)
మిమ్మల్ని మీరు Swot చేసుకునేటప్పుడు మీలో పై లక్షణాలు ఉన్నాయా అనే కోణంలో తీవ్రంగా పరిశీలన చేసుకోండి. ఈ లక్షణాలన్నీ మీకు ఉపకరిస్తాయి.
అసలు నేనేంటి?
నేనేం సాధించగలను?
నా ప్రత్యేకతలు ఏమిటి?
నేను ఏ బాధ్యతలను స్వీకరించగలను. ఇలాంటి ప్రశ్నలన్నింటికీ చక్కటి సమాధానం వస్తుంది. మిమ్మల్ని మీరు విశ్వరూపంగా చూసుకోగలరు.
ఈ Swot Analysis రెండు రకాలుగా ఉపయోగపడుతుంది.
1. మన గోల్ మనకు స్పష్టంగా తెలిసినప్పుడు
2. మనమేం చేయాలి అనే స్పష్టత ఇంకా ఏర్పడనప్పుడు
మన గోల్ మనకు స్పష్టంగా తెలుసనుకుందాం. ఇలాంటి సందర్భంలో Swot Analysis ద్వారా మన నైపుణ్యాలని మరింత మెరుగుపర్చుకోవచ్చు.
మన గోల్ పట్ల మనకింకా స్పష్టత రాలేదు అనుకుందాం. ఇలాంటప్పుడు Swotతో మన నైపుణ్యాల పట్ల మనకే అవగాహన ఏర్పడి మన లక్ష్యాన్ని (Goal) స్థిరీకరించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ క్రమంలో ముఖ్యంగా మీ బలాలు రాసుకుంటూ వెళ్లండి.
అది ఎంత చిన్నవి, ప్రాముఖ్యమైనవైనా సరే ఎల్కేజీ పాసయ్యాను అనే దగ్గర్నుంచీ రాసుకోండి. అలాగే మీ వ్యక్తిత్వ లక్షణాలు సైతం రాసుకుంటూ వెళ్లండి. ఓ గుడ్డివాడిని రోడ్డు దాటించాను అనే చిన్న విషయం సైతం వదిలిపెట్టకండి. ఇది కొంచెం అతిశయోక్తి అనిపించినా చేసి చూడండి. మనోవైజ్ఞానికులు, హెచ్ఆర్ మేనేజర్లు కూడా ప్రతిపాదిస్తారు ఈ పద్ధతిని. గోల్ అంటూ లేనివారికి తమ పట్ల తమకే సరైన అవగాహన లేనివారికి ఈ కసరత్తు చాలా ఉపకరిస్తుంది. మీరెంటో మీకే తెలుస్తుంది.
చిన్న గమనిక
W-అంటే Weakness అనేది చలామణిలో ఉండటం వల్ల అలా పేర్కొన్నారు. ఇది నాకు రాదు. నేనింతే అనుకుంటే అది Weakness. నిజానికి ఈ స్కిల్ ఇప్పటిదాకా నాకు రాదు. ఇకపై నేర్చుకుంటాను అని అనుకోవటం మంచి లక్షణం. ఇలా సాధన చేయటం సరైన పద్ధతి. Swot ద్వారా మన Weakness లని Areas for improvmentగా మలచుకోవాలి. అంటే మన అభివృద్ధికి సోపానాలు.
Swot Analysis ఉపయోగాలు
నేల విడిచి సాము చేస్తూ, అభూతమైన కలల్ని కనటం మాని, మన శక్తి సామర్థ్యాలను స్పష్టంగా తెలుసుకోవచ్చు.
మన సామర్థ్యాలను మరింత మెరుగుపర్చుకొనే అవకాశం మనకు లభిస్తుంది.
మనం ఇంకా నేర్చుకోవాల్సిన అంశాలు మన కళ్ల ముందరకొచ్చేస్తాయి. లక్ష్య సాధన క్రమంలో మన Swot Analysis ఎంత తరచుగా చేసుకుంటూ వెళితే మనకు అది అంత ఉపకరిస్తుంది. Swot Analysis విజేత చేతిలో ఉండాల్సిన దిక్సూచి.
హెచ్ఆర్ ఇంటర్వ్యూలో మిమ్మల్ని మీకు సరిగ్గా ప్రజెంట్ చేయగలరు
మీ Interview Tensions దూరమైపోతాయి.
మీ ఆలోచనా స్రవంతి హాయిగా, సజావుగా సాగిపోతుంది.
తనను తెలుసుకున్నవాడు ప్రపంచాన్నే జయించగలడు.
క్షణక్షణం విజయాన్ని శ్వాసించండి ?
విజయం అంటే ఒక గమ్యం కాదు, విజయం ఒక నిరంతర ప్రయాణం
జీవితంలో మీరేం అహ్వానించాల నుకుంటున్నారు? ఇదే ప్రశ్నని ఇంకోలా అడుగుతారు. గోల్ సెట్టింగ్‌కి సంపూర్ణం, స్పష్టమైన దృశ్యం మీ ముందుకు వచ్చేస్తుంది. మిమ్మల్ని అందరూ ఎలా గుర్తుంచుకోవాలనుకుంటున్నారు?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం