టెట్‌లో స్కోరు పెంచుకోండిలా.. (TET Special)
పోటీ పరీక్షల్లో అత్యంత కీలకమైన సబ్జెక్ట్ గణితం. టెట్ పరీక్షలో కూడా అభ్యర్థి మార్కులను ప్రభావితం చేసేది గణితం. సిలబస్‌లో వచ్చిన మార్పుల నేపథ్యంలో టెట్ కోసం ఏ విధంగా అధ్యయనం చేయాలి అనే దానిపై పూర్తి విశ్లేషణ.
పాఠ్య పుస్తకాలు మారినందున టెట్ సిలబస్‌లో కూడా అనేక అదనపు పాఠ్యాంశాలు చేర్చారు. ఈసారి నిర్వహించే టెట్ పరీక్ష పూర్తిగా నూతన పాఠ్య పుస్తకాలపై ఆధారపడి ఉంటుంది. టెట్ గణితంలో ఎక్కువ మార్కులు వచ్చే చాప్టర్ సంఖ్యామానం.
1. సంఖ్యామానం : ఈ టాపిక్ పరిధిలో సిలబస్‌లో ఇచ్చిన అంశాలను ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం.
-సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు, వాటిపై ప్రాథమిక ప్రక్రియలు. ఈ టాపిక్‌లో ప్రధానంగా అధ్యయనం చేయాల్సిన అంశాలు దశాంశమానం, స్థాన విలువలు. ఇవి 6వ తరగతిలోని మన సంఖ్యలను తెలుసుకుందాం. చాప్టర్ పూర్తిగా నేర్చుకోవాలి. టెట్ 1లో ఈ రెండు అంశాలపై 2 లేదా 3 ప్రశ్నలు ఇస్తున్నారు.
-పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు అకరణీయ సంఖ్యలు టాపిక్‌లను కలిపి చదువుకోవాలి. వీటి ధర్మాలు అంటే సంవృత, సహచర, తత్సమాంశ, విలోమ ధర్మాలు, సమూహ, క్షేత్ర, క్రమధర్మాలు, సాంద్రత ధర్మం, సమీప ఉత్తర పూర్వ సంఖ్యల అంశాలను అధ్యయనం చేయాలి.
-ప్రధాన, సంయుక్త సంఖ్యలు, సాపేక్ష, కవల ప్రధాన సంఖ్యలు
-వందలోపు గల ప్రధాన సంఖ్యలను కోడ్స్ ద్వారా గుర్తుంచుకోవాలి. ఇచ్చినవాటిలో ప్రధాన సంఖ్యలను సాపేక్ష ప్రధాన సంఖ్యలను గుర్తించడం నేర్చుకోవాలి. క.సా.గు, గ.సా.భాలు కట్టడం, వాటిపై గల అనువర్తన సమస్యలు, క.సా.గు, గ.సా.భాల మధ్య సంబంధం నేర్చుకోవాలి.
-సంఖ్యా రేఖపైన అకరణీయ సంఖ్యలను గుర్తించడం రెండు అకరణీయ సంఖ్య మధ్యన గల అకరణీయ సంఖ్యను గుర్తించడం నేర్చుకోవాలి. అంతమయ్యే, ఆవర్తన దశాంశ భిన్నాలను p/q రూపంలోకి మార్చడం. ఆవర్తన దశాంశ భిన్నాలతో సంకలనం, వ్యవకలనం, గుణకార, భాగహారాలు చేయడం నేర్చుకోవాలి. భారతీయ కరెన్సీ గురించి అవగాహన ఉండాలి. వర్గం-వర్గమూలం, ఘనం-ఘనమూలం నేర్చుకోవాలి.
-వర్గం-వర్గమూలం, ఘనం-ఘనమూలం పాఠ్యాంశాల్లో వర్గసంఖ్యల ధర్మాలు, కచ్చితవర్గం కావడానికి ఎంత కలపాలి లేదా తీసివేయాలి వంటి సమస్యలు వర్గంపై అనువర్తన సమస్యలు నేర్చుకోవాలి. 8వ తరగతిలోని ఈ రెండు పాఠ్యాంశాలను పూర్తిగా చదవాలి. పైథాగరస్ త్రికాలను గుర్తించగలగాలి.
2. భిన్నాలు : భిన్నాలతో ప్రధానంగా అధ్యయనం చేయాల్సిన అంశాలను భిన్నాలను సూక్ష్మీకరించడం. భిన్నాలపై చతుర్విద పరిక్రియలు చేయడం నేర్చుకోవాలి. నిత్యజీవితంలో భిన్నాల అనువర్తనాలు అంటే రాతలెక్కలు పూర్తిగా నేర్చుకోవాలి. భిన్నాలను సాధారణ భిన్నాలుగా మార్చడం నేర్చుకోవాలి.
3. అంకగణితం : ఏకవస్తుమార్గ సమస్యలు ముఖ్యంగా భాగహర సమస్యలు. నిష్పత్తి, అనుపాతం, శాతాలు, లాభనష్టాలు, అనులోమ విలోమానుపాతాలు, సరళవడ్డీ, చక్రవడ్డీ సమస్యలు, కాలం-పని, కాలం-దూరం, ట్యాక్స్ ఈ అంశాలన్నీ పాఠ్య పుస్తకాల్లో ఉన్న సమస్యలతో పాటు ఇతర కాంపిటీటివ్ పరీక్షలో వచ్చిన ప్రశ్నలను అధ్యయనం చేయాలి.
4. రేఖా గణితం : జ్యామితీయ పదాలు, ఆకారాలు. టెట్1లో రేఖాగణితంలో కోణం, కోణాల రకాలు, కోణాల జతలు (ఆసన్న, రేఖియ సంపూరక, పూరక, శీర్షాభిముఖ, సంయుగ్మ కోణాల గురించి తెలుసుకోవాలి. కోణాలను నిర్మించే విధానం అంటే స్కేలు, వృత్తలేఖిని సాయంతో ఎటువంటి కోణాలు నిర్మించగలం, ఎటువంటి కోణాలు నిర్మించలేం అనే అంశాలు నేర్చుకోవాలి. సమాంతర రేఖలు ధర్మాలు, తిర్యక్ రేఖ ఖండించినప్పుడు ఏర్పడే కోణాల గురించి తెలుసుకోవాలి. త్రిభుజాలు రకాలు, త్రిభుజ సమానత్వ, అసమానత్వ ధర్మాలు, త్రిభుజ సర్వసమానత నియమాలు చదవాలి. టెట్ 1 సిలబస్‌లో సరూప త్రిభుజాలు, పైథాగరస్ సిద్ధాంతం అంశాలు లేవు. వాటిని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. త్రిభుజాలను నిర్మించడానికి కావాల్సిన కనీస కొలతలు తెలుసుకోవాలి. చతుర్భుజాలు రకాలు, వాటి ధర్మాలు పూర్తిగా నేర్చుకోవాలి. ఘన వస్తువులు, పట్టకానికి ఆయిలర్ సూత్రం చదవాలి.
5. కొలతలు : దూరం, బరువు, సామర్థ్యం, కాలం ప్రమాణాలు వీటిలో ముఖ్యంగా ప్రమాణాలను మార్చడం ముఖ్యంగా నేర్చుకోవాలి. త్రిభుజాలు, చతుర్భుజాల చుట్టూ కొలతలు వైశాల్య సమస్యలు, వృత్త పరిధి, వృత్త వైశాల్యాలు, సెక్టర్, వృత్తాకార కంకణాలపై ముఖ్యంగా దృష్టి సారించాలి. బహుభుజిలపై సమస్యలు కూడా నేర్చుకోవాలి.
6. దత్తాంశ నిర్వహణ : దత్తాంశాన్ని వ్యక్తీకరించడం, పౌనఃపున్య విభాజన పట్టిక, రేఖాచిత్రాలు కేంద్రీయ ప్రవృత్తి మానాలు (అంకమధ్యమం, మధ్యగతం, బహుళకం) 8వ తరగతిలో పౌనఃపున్య విభాజన పట్టికలు, రేఖా చిత్రాలు పాఠ్యాంశం, 6, 7 తరగతుల్లోని దత్తాంశ నిర్వహణ పాఠ్యాంశాలను పూర్తిగా అధ్యయనం చేయాలి.
7. బీజగణితం : మారిన టెట్ సిలబస్‌లో పూర్తిగా కొత్తగా వచ్చిన అంశం బీజ గణితం. ఇందులో బీజ గణిత పరిచయం, సామాన్య సమీకరణాలు, ఏకచర రాశిలో రేఖియ సమీకరణాల సాధన, ఘాతాలు-ఘాతాంకాలు, బీజీయ సమాసాలతో చతుర్విద పరిక్రియలు కారణాంక విభజన, సర్వ సమీకరణాలు
-ఘాతాంక న్యాయాలు, ప్రత్యేక లబ్దాల సూత్రాలపై పట్టు ఉండాలి. ప్రశ్నలను ప్రతిక్షేపణ పద్ధతిలో సాధించడం ప్రత్యేకంగా నేర్చుకోవాలి. ఆప్షన్స్ నుంచి సమస్యను సాధించే అవకాశం ఉన్నప్పుడు సాధారణ పద్ధతిలో చేయకుండా ఉంటే సమయం ఆదా అవుతుంది. తప్పు రాయడానికి అవకాశం ఉండదు.
హిందీ ప్రిపరేషన్ ప్లాన్
ఒకసారి ఒక విలేకరి బాలగంగాధర్ తిలక్‌ను ఓ ప్రశ్న అడిగాడు. అయ్యా! మీరు స్వాతంత్య్రం కోసం ఎంతో కృషి చేస్తున్నారు కదా! స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మంత్రి పదవి చేపడతారా? ప్రధానమంత్రి పదవి చేపడతారా? అని. దీనికి బాలగంగాధర్ తిలక్ చరిత్రలో నిలిచిపోయే సమాధానం చెప్పారు. నేనొక్కడినే మంత్రి పదవి స్వీకరిస్తే ప్రయోజనం ఏమిటి? అనేకమంది మంత్రులను, ప్రధానమంత్రులను తయారు చేయగల ఉపాధ్యాయుడిగానే ఉంటా. దేశాన్ని రక్షించే యువకులకు తర్ఫీదునిచ్చే ఉపాధ్యాయ స్థానమే నాకు గొప్ప పదవి అన్నారు. అది.. ఉపాధ్యాయ వృత్తి గొప్పతనం.
కాలక్రమేణ సమాజం, విద్యారంగం, చట్టాల్లో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. అందులో భాగమే విద్యాహక్కు చట్టం-2009. విద్యాహక్కు చట్టంలోని అధ్యాయం – IV, సెక్షన్ 23 ప్రకారం.. దేశంలో ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలంటే తప్పనిసరిగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ – TET) పాసవ్వాల్సిందే.
సిలబస్ వివరణ
1. చైల్డ్ డెవలప్మెంట్ & పెడగాగి విషయానికి హిందీలో ఇప్పటి వరకు సరైన పుస్తకం లేదు. అందువల్ల తెలుగు D.Ed, B.Ed స్థాయిలో ఉన్న చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి పుస్తకాలను హిందీలోకి తర్జుమా చేయించుకోవాలి. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్‌కు 24 మార్కులు, పెడగాగికి 6 మార్కులు ఉంటాయి.
2. లాంగ్వేజ్-1 (హిందీ) కోసం 6 నుంచి 10వ తరగతి వరకు ద్వితీయ భాష హిందీ పాఠ్య పుస్తకాల్లో పొందుపర్చిన వ్యాకరణాంశాలు చదవాలి. వీటికి 24 మార్కులుంటాయి. అదేవిధంగా హిందీ భాష మెథడాలజీ (6 మార్కులు) కూడా చదవాలి.
3. లాంగ్వేజ్-2 (ఆంగ్లం) కోసం 6 నుంచి 10వ తరగతి ఆంగ్ల పాఠ్యపుస్తకాల్లో పొందుపర్చిన వ్యాకరణాంశాలు చదవాలి. వీటికి 24 మార్కులుంటాయి. అదేవిధంగా ఆంగ్లభాష మెథడాలజీ (6 మార్కులు) కూడా చదవాలి.
4. సోషల్/మ్యాథ్స్/సైన్స్ కోసం 6 నుంచి 10వ తరగతి వరకు సంబంధిత పాఠ్య పుస్తకాల్లో పొందుపర్చిన విషయావగాహన కంటెంట్ చదవాలి. వీటికి 48 మార్కులుంటాయి. అదేవిధంగా ఆయా సబ్జెక్టుల మెథడాలజీ (6 మార్కులు) కూడా చదవాలి.
-సూచన: ప్రశ్నలన్నీ బహుళైచ్ఛిక విధానంలో (మల్టిపుల్ చాయిస్) ఉంటాయి.
పోటీ
టెట్‌లో అర్హత సాధించడం కంటే వెయిటేజీ మార్కులకు తీవ్ర పోటీ ఉంటుంది. కొత్తగా రాసేవారితోపాటు అర్హత సాధించిన వారు కూడా తమ వెయిటేజీ మార్కులను మెరుగుపర్చుకోవడం కోసం పోటీ పడుతుంటారు. టెట్‌లో ఎంత ఎక్కువ వెయిటేజీ మార్కులొస్తే డీఎస్సీలో జాబ్ సాధించే అవకాశాలు అంత పెరిగిపోతాయి.
ఎలా ప్రిపేర్ కావాలి?
-అభ్యర్థి దగ్గర స్కూలు పుస్తకాలు (6-10 వరకు) ఉండాలి.
-స్కూల్ పుస్తకాలను లైన్ టు లైన్ అర్థం చేసుకుంటూ ప్రిపేరవ్వాలి.
-పాఠ్యపుస్తకాలన్నీ సీసీఈ విధానంలో ఉన్నందున కంటెంట్‌ను బట్టీపట్టకూడదు. విషయావగాహనతో చదవాలి.
-బట్టీకొట్టినైట్లెతే పరీక్షలో బోల్తా పడతారు. అర్థం చేసుకోవడంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.
ప్రశ్న: జలాశయ్ మే జన్మ్ లేనేవాలా?
-1. జలజ్ 2. నీరజ్ 3. పంకజ్ 4. సరోజ్
జవాబు: సరోజ్
-అయితే 99 శాతం మంది దీనికి సమాధానం జలజ్ లేదా నీరజ్ ఇస్తారు. అందుకే బట్టీకొట్టడం కంటే అర్థం చేసుకొని చదవడం లక్ష రెట్లు మంచిది.
-పాఠ్య విషయాన్ని రెండు భాగాలుగా విభజించుకోవాలి. అవి: 1. కఠినంగా ఉన్న సబ్జెక్టులు 2. కఠినంగా లేని సబ్జెక్టులు
-ఈ మధ్య కాలంలో మార్కెట్లోకి చాలా పబ్లికేషన్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కొంతమంది పాత మెటీరియల్‌ని అట్ట మార్చివేస్తూ ఉంటారు. మరికొంత మంది మార్కెట్లో ఏ పుస్తకం బాగుంటే ఆ పుస్తకాన్ని కాపీచేసి ప్రింట్చేస్తూ ఉంటారు. అందుకే అభ్యర్థులు అప్రమత్తతతో సరైన పుస్తకాలు, మెటీరియల్ ఎంపిక చేసుకోవాలి.
-కాలం ఎంతో విలువైనది. ఎవరైతే ఈ కాలంతోపాటు పరిగెడుతారో వారికి ఈ సమాజం రెడ్ కార్పెట్ పరుస్తుంది. ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకునేవాడినే విజయం వరిస్తుంది.
-అభ్యర్థులు ప్రతిక్షణం తమను తాము అనాలసిస్ చేసుకోవాలి. సరైన ప్లాన్‌తో ముందుకు వెళ్తూ సమయపాలన పాటిస్తూ నిర్దిష్ట లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నించాలి.
-మన శరీరం ఒక మొబైల్ ఫోన్ వంటిది. మెదడు మెమరీ కార్డు లాంటిది. మెమరీ కార్డులో పనికి రాని ఫైల్స్ (సినిమా కథలు, పనికిరాని ముచ్చట్లు)ను డిలీట్ చేసి పరీక్షకి సంబంధించిన విషయాలను సేవ్ చేసుకోవాలి.
English
ఉపాధ్యాయ వృత్తి ద్వారా సమాజానికి సేవ చేయాలనుకునే అభ్యర్థులు TETలో ఎక్కువ మార్కులు సంపాదించడానికి ఆంగ్ల భాష దోహదపడుతుంది. Englishలో ముఖ్యంగా రెండు భాగాలుంటాయి.
1. Grammar (వ్యాకరణం)
2. Teaching Methodology.
గ్రామర్ నుంచి 24 మార్కులు. Methodology నుంచి 6 మార్కులు వస్తాయి. Grammarలో ప్రతి అంశానికి (Topic)కి దాదాపు Priniciples Strucutres ఉంటాయి. వాటిని బాగా ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు.
S.A అభ్యర్థులు అదనంగా Verbs, Auxiliary Verbs, Types of Adverbs, Types of Conjuctions నేర్చుకోవాలి. సిలబస్‌ని, గత పరీక్ష ప్రశ్నపత్రాలను అధ్యయనం చేస్తే ఒక అవగాహనకు వచ్చి ఎక్కువ మార్కులు తెచ్చుకొనే అవకాశం ఉంది. అన్ని టాపిక్స్ చదవడం ఉత్తమం.
Methodology కోసం Academic Textbook Oriented Methodలో చదవాలి. Language Skills అయినా Reading, Writing, Listening and Speakingని ఉపయోగించాలి.
Englishని ఎంతగా అవగాహన, విశ్లేషణ చేస్తే అంతగా మార్కులు తెచ్చుకోవచ్చు.
కొత్తగా టెట్ రాసేవారు ఎలా ప్రిపేర్ కావాలి?
-డీఎస్సీ రాయాలంటే ప్రాథమికంగా అర్హత పరీక్ష అయిన టెట్ (టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్)లో ఉత్తీర్ణులు కావాలి. అయితే ఈ టెట్‌లో వచ్చిన మార్కుల శాతాన్ని కూడా డీఎస్సీ మార్కులకు జత చేస్తారు. దీన్ని బట్టి టెట్‌లో ఎంతస్కోరు చేస్తే అంత ఉపయోగం ఉందన్నమాట.
-కాబట్టి అన్ని సబ్జెక్టులను సమగ్రంగా అధ్యయనం చేస్తేనే చక్కటి ఫలితం లభిస్తుంది.
-జనరల్ సబ్జెక్టులైన సైకాలజీ, ఇంగ్లిష్, తెలుగుకు 30 మార్కుల చొప్పున 90 మార్కులకు ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి మొదటి వాటిని చదవడం పూర్తి చేయాలి.
-గత ప్రశ్నపత్రాలను కచ్చితంగా పరిశీలించాలి. దీని వలన ప్రతి సబ్జెక్టులో ఏ పాఠ్యాంశం నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయి? ఏ విధంగా మనల్ని పరీక్షిస్తున్నారు అనేది అవగాహన కలుగుతుంది.
-ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేయడం అలవాటు చేసుకోవాలి.
-ఉన్న సమయాన్ని సబ్జెక్టులవారీగా విభజించుకోవాలి.
-మార్కులను స్కోరు చేయడం అకాడమీ పరీక్షలకు అంత తేలిక కాదని గమనించాలి. విషయాన్ని పారదర్శకంగా, లోతుగా, క్షుణ్ణంగా చదవాలి.
-గ్రూప్ డిస్కషన్ కూడా విజయానికి కీలకమైన అంశంగా భావించాలి. అయితే ఈ సందర్భంలో కాలయాపన కాకుండా జాగ్రత్త పడాలి.
చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి
-టెట్‌లో 30 మార్కుల ప్రాధాన్యత గల ఈ సబ్జెక్టులో సాధించే మార్కులు కచ్చితంగా వెయిటేజీలో ప్రధాన భూమిక పోషిస్తాయి.
సబ్జెక్టుకు ఉన్న గుణం
-డిగ్రీ వరకు పరిచయం లేని ఈ సబ్జెక్టు బీఈడీ/డీఈడీల్లోనే కొత్తగా పరిచయమవుతుంది. సంబంధిత ఎడ్యుకేషన్ కోర్సులో దీన్ని అకడమిక్ పరీక్షల దృష్టిలోనే చదువుతున్నాం తప్ప లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం రాలేదు. అంటే టెట్ విషయంలో లోతుగా అధ్యయనం చేస్తేనే స్కోరు పెరుగుతుంది.
-ఒక వైపు నిర్వచనాలు, సంఖ్యా విలువలు ఆయా దశలను అధ్యయనం చేస్తూనే మరొక వైపు సిద్ధాంతాలను లోతుగా విశ్లేషించాలి.
-అప్లికేషన్ (అన్వయ) ప్రశ్నలకు సమాధానం చేయాల్సి ఉండటం ఈ సబ్జెక్టు ప్రత్యేకత.
ఉదా: కుక్క లాలాజల ప్రయోగాలపై పావ్లోవ్ ఇచ్చిన సిద్ధాంత వివరణను నిజ జీవితంలో తరగతి గదిలో ఎలా అన్వయిస్తావు? అని అడగటం.
ఎస్జీటీ, ఎస్ఏకు ఒకే సిలబస్ ఉంటుందా?
-గతంలో నిర్వహించిన ప్రతి టెట్‌లో ఎస్జీటీ, ఎస్ఏ వారికి ఒకే సిలబస్ (చైల్డ్ డెవలప్మెంట్) ఉంది. ఏ ఒక్క అంశంలోనూ తేడాలేదు.
-కానీ ప్రశ్న కాఠిన్యత మాత్రం ఎస్జీటీ కంటే ఎస్ఏ వారికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.
ఏ పుస్తకాలు చదవాలి?
-సాధారణంగా ఎస్జీటీ అభ్యర్థులు డైట్, ఎస్ఏ అభ్యర్థులు బీఈడీ తెలుగు అకాడమీ, విద్యామనోవిజ్ఞానశాస్త్ర పుస్తకాలు చదువుతుంటారు.
-తెలుగు అకాడమీ పుస్తక పరిధి కంటే టెట్ సిలబస్ అధికంగా ఉన్న విషయం గమనించాలి. మరి ఈ అంశాల కోసం అదనపు పుస్తకాలను/ ఇంటర్నెట్ను వాడాలి.
ఉదా: నోమ్‌చామ్‌స్కీ భాషా వికాస సిద్ధాంతం, కార్ల్‌రోజర్స్ సిద్ధాంతం
-పెడగాగి/ అధ్యాపన శాస్త్రంలోని బోధనా ఉపగమాలు, అభ్యసనం కోసం మూల్యాంకనం, అభ్యసించిన దాన్ని మూల్యాంకనం, వివిధ బోధనా పద్ధతులు మొదలైన సమాచారం ఇతర మూలధారాల నుంచి సేకరించాలి.
సబ్జెక్టుపై పట్టు సాధించడం ఎలా?
-ఈ సబ్జెక్టును బట్టీ పట్టడంతో వచ్చే ఫలితం శూన్యమని గమనించాలి. అలా ఎన్నిసార్లు చదివినా లాభం ఉండదు.
-నిజజీవితానికి అన్వయిస్తూ ఈ సబ్జెక్టును ఎంతగా చదివితే అంత పట్టు సాధించవచ్చు.
ఉదా: చక్కటి తరగతి గది నిర్వహణకు ఉపాధ్యాయుడు పాటించాల్సిన విధానం?
1. తగిన ప్రోత్సాహకాలను అందిస్తూ బాగా చదివే విద్యార్థులను అభ్యసనానికి ప్రేరేపించాలి.
2. అభ్యసనలో వెనుకబడిన పిల్లలకు తగు మోతాదులో దండనను అందిస్తూ సవరించాలి.
3. సగటు విధాన అభ్యాసకులకు స్థాయికి తగిన నియోజనాలను ఇచ్చి చదువుపై ధనాత్మక అభిప్రాయం కలిగించాలి.
4. 1, 3
-పైన ఇచ్చిన ప్రశ్న పుస్తకంలో ఎక్కడ కూడా నేరుగా ఇవ్వలేదు. తరగతి గది వాస్తవిక స్థితికి సంబంధించింది.
-సబ్జెక్టును సంసర్గం చేస్తూ చదవడంతో కూడా అవగాహన పరిధి పెరుగుతుంది.
ఉదా: బోధనలో బహుమతులకు ప్రాధాన్యత ఇచ్చి చదివేటప్పుడు దానికి సంబంధిత అంశాలను ఒకే చోట చేర్చాలి.
1. బోధనలో ప్రోత్సాహకాలు తెలిపింది- డబ్ల్యూసీ బాగ్లే
2. బోధనలో బహుమతుల ప్రవేశాన్ని పూర్వపాఠశాలలో అందించింది- ప్రోబెల్
3. బోధనలో బహుమతుల ప్రాధాన్యతను తెలుపుతూ ప్రయోగాలు చేసింది- ఎల్లెన్ఫేజ్
4. బహుమతి, దండన, పొగడ్త, నింద అనే అంశాల ప్రభావాన్ని తెలుపుతూ ప్రయోగాలు చేసింది- హర్లాక్
5. బోధనలో బహుమతులందించడం మంచి ఫలితాలను ఇస్తుంది. ప్రాథమిక దశలో ఇవి చాలా కీలకం- జెరోమ్
సిలబస్
-చైల్డ్ డెవలప్మెంట్, పెడగాగి సబ్జెక్టులో 3 చాప్టర్లు ఉన్నాయి. అవి 1. శిశు వికాసం 2. అభ్యసనం 3. అధ్యాపన శాస్త్రం
1. శిశువికాసం (10 నుంచి 15 మార్కుల వెయిటేజీ)
-ఈ చాప్టర్లో పెరుగుదల, వికాసం, పరిణితి, సన్నద్ధత, భావనలు, వికాస నియమాలు, రకాలు, చామ్స్కీ, పియూజే సిద్ధాంతాలు వైయుక్తిక భేదాలు – ప్రజ్ఞ, మూర్తిమత్వ భావన అనే అంశాలున్నాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు