వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత అథ్లెట్? కరెంట్ అఫైర్స్
(గతవారం తరువాయి..)
రోమ్ కేంద్రంగా పనిచేసే సంస్థలు
ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో): 1945 అక్టోబర్ 16న ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఎఫ్ఏవో రూపొందించే ‘2021 ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్’ జాబితాలో భారత్‌కు చెందిన ముంబయి చోటు దక్కించుకుంది. ఈ నగరానికి ఈ జాబితాలో చోటు దక్కడం ఇదే తొలిసారి. ముంబయిలో మడ అడవులను రక్షించుకోవడానికి నగర వాసులు కృషి చేశారు. ఫలితంగా 5000కు పైగా చెట్లను రక్షించుకోగలిగారు. అలాగే సంజయ్ గాంధీ జాతీయ పార్కు సమీపంలోని అడవిని రక్షించుకొనేందుకు కూడా ముంబయి వాసులు పోరాడారు. 800 ఎకరాల భూమిలో మెట్రో కార్ షెడ్ ప్రాజెక్ట్ కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే ధర్నాలు జరగడంతో దీనిని నిలిపివేశారు. ఎఫ్ఏవోతో కలిసి అమెరికాకు చెందిన అర్బోర్ అనే సంస్థ కూడా ఈ జాబితాను రూపొందిస్తుంది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వరుసగా రెండో ఏడాది కూడా ఈ జాబితాలో చేరింది.
వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్: ఇది కూడా ఇటలీలోని రో మ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఆకలి తీర్చడం, ఆహార భద్రత కోసం కృషిచేస్తుంది. దీనిని 1961లో స్థాపించారు. భారత్‌కు చెందిన అక్షయపాత్ర ఫౌండేషన్‌తో కలిసి ప్రపంచ ఆహార కార్యక్రమం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రధాన మంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ పథకం అమలులో రెండు సంస్థలు పరస్పరం సహకరించుకుంటాయి
ఐక్యరాజ్యమితి ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీవో): 1975 నవంబర్ 1న ఈ సంస్థను ఏర్పాటు చేశారు. స్పెయిన్‌లోని మాడ్రిడ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సంస్థ నుంచి ఇటీవల రష్యా నిష్క్రమించింది. ఉక్రెయిన్‌పై యుద్ధం జరుపుతున్న నేపథ్యంలో రష్యాకు వ్యతిరేకంగా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తుండటంతో రష్యా దీని నుంచి వైదొలిగేందుకు నిర్ణయం తీసుకుంది.
ఎస్ఐపీఆర్ఐ: దీని పూర్తి రూపం స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది ఒక మేధోమదన స్వచ్ఛంద సంస్థ. ప్రపంచ వ్యాప్తంగా సైన్యంపై చేసే వ్యయాన్ని గణిస్తుంది. స్వీడన్‌లోని స్టాక్ హోం కేంద్రంగా పనిచేస్తుంది. దీనిని 1966లో స్థాపించారు. ఈ ఏడాది నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం ప్రపంచంలో రక్షణ వ్యయం చేస్తున్న టాప్ దేశాలు- అమెరికా, రష్యా, భారత్, యూకే అంటే మిలిటరీ వ్యయంలో భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది.
జీ-20: ఇందులో 19 దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ సభ్యత్వాన్ని కలిగి ఉంది. ఖండాలవారీగా సభ్య దేశాలు.. ఉత్తర అమెరికా- అమెరికా, కెనడా, మెక్సికో, దక్షిణ అమెరికా- అర్జెంటీనా, బ్రెజిల్, యూరప్- యూకే, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, టర్కీ, రష్యా. ఆఫ్రికా ఖండంలో దక్షిణాఫ్రికా మాత్రమే సభ్యత్వాన్ని కలిగి ఉంది. ఆసియాలో సౌదీ అరేబియా, భారత్, చైనా, దక్షిణ కొరియా, జపాన్, ఇండోనేషియా ఉన్నాయి. ఓషియానియాలో ఆస్ట్రేలియా ఒక్కటే సభ్యత్వాన్ని కలిగి ఉంది. జీ-20 కూటమికి ఎలాంటి ప్రధాన కేంద్రం కాని, సచివాలయం కాని లేదు. సమావేశం జరుగుతన్న దేశంలో తాత్కాలికంగా వాటిని ఏర్పాటు చేస్తారు. 2023లో భారత్‌లో జీ-20 సమావేశం తొలిసారిగా జరుగనుంది. ఇందుకు ఒక సెక్రటేరియట్‌ను ఏర్పాటు చేశారు. జీ-20 కూటమికి డిసెంబర్ 1, 2022న భారత్ నాయకత్వ బాధ్యత తీసుకోనుంది. నవంబర్ 30, 2023 వరకు దీనిని నిర్విర్తిస్తుంది. సమావేశాలకు సంబంధించి ఒక అపెక్స్ కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి భారత ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వం వహిస్తున్నారు. ఇందులో విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, హోం శాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఉన్నారు. సమావేశాలకు షెర్పాగా పీయూష్ గోయల్ వ్యవహరిస్తున్నారు. 2021లో జీ-20 సమావేశాలు ఇటలీలో జరగగా, 2022లో ఇండోనేషియాలో ఉన్నాయి. ఆ తర్వాత సంవత్సరం సమావేశాలకు భారత్ వేదిక కానుంది.
ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్: హర్యానాలోని గురుగ్రామ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఫ్రాన్స్ సాయంతో దీనిని ఏర్పాటు చేశారు. ఇందులో ఆంటిగ్వా బర్బుడా 102వ సభ్య దేశంగా చేరింది. అలాగే 103వ సభ్య దేశంగా చేరేందుకు సిరియా ఫిబ్రవరిలో ఒప్పందంపై సంతకం చేసింది.
ఏఐఐబీ: దీని పూర్తి రూపం ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంక్. దీనిని 2016లో స్థాపించారు. బీజింగ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఈ బ్యాంక్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా భారత్‌కు చెందిన ఉర్జిత్ పటేల్ నియామకం అయ్యారు. ఇప్పటి వరకు ఆ పదవిలో డీజే పాండియన్ ఉన్నారు. మూడు సంవత్సరాల పాటు ఉర్జిత్ పటేల్ వైస్ ప్రెసిడెంట్ పదవిలో ఉండనున్నారు. ఆయన భారత రిజర్వ్ బ్యాంక్‌కు 24వ గవర్నర్‌గా పనిచేశారు.
ఎన్డీబీ: దీనినే బ్రిక్స్ బ్యాంక్ అని కూడా అంటారు. ప్రధాన కేంద్రం షాంఘైలో ఉంది. ప్రస్తుతం ఇందులో భారత్, బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికాలతో పాటు బంగ్లాదేశ్, ఈజిప్ట్, యూఏఈ, ఉరుగ్వే సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. భారత్‌లోని గుజరాత్లో ఉన్న జీఐఎఫ్‌టీ (గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ)లో కార్యాలయాన్ని ప్రారంభించింది. బళ ఏజెన్సీ, గిఫ్ట్ సిటీలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం ఇదే ప్రథమం.
వివిధ దేశాలు-భారత్‌తో సంబంధాలు
జపాన్: భారత్‌కు, జపాన్‌కు మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై ఈ ఏడాదితో 70 సంవత్సరాలు పూర్తయ్యింది. రెండు దేశాల మధ్య 1952 నుంచి ఈ సంబంధాలు కొనసాగుతున్నాయి. భారత్, జపాన్ ప్రజాస్వామ్య దేశాలే. అలాగే జీ-4, క్వాడ్, జీ-20 కూటముల్లో ఇరు దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి.
బై లేటరల్ స్వాప్ అగ్రిమెంట్: భారత రిజర్వ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ జపాన్ మధ్య ఈ ఒప్పందం 2018లో కుదిరింది. ఇటీవల దీనిని పునరుద్ధరించారు. దీని ప్రకారం 75 బిలియన్ అమెరికన్ డాలర్ల వరకు ఇరు దేశాలు పరస్పరం నగదు మార్పిడి చేసుకుంటాయి. డాలర్‌కు వ్యతిరేకంగా కరెన్సీ పడిపోతున్నప్పుడు ఈ ఒప్పందం ప్రయోజనకరంగా ఉంటుంది.
భారత్-జపాన్ సమావేశం: జపాన్ ప్రధాన మంత్రి ఫ్యుమియో కిషిడా మార్చి 19, 20 తేదీల్లో భారత్‌ను సందర్శించారు. ఇరు దేశాల మధ్య 14వ సమావేశం జరిగింది. రానున్న అయిదేళ్లలో రూ.3.2 లక్షల కోట్ల మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ అంగీకరించింది. అలాగే జలశుద్ధికి సంబంధించి జొహ్కాసౌ అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు ఒక అవగాహన కూడా కుదిరింది.
ఫిలిప్పీన్స్: ఇది కూడా ఆసియాలోని దేశమే. బ్రహ్మోస్ క్షిపణిని ఫిలిప్పీన్స్‌కు అమ్మేందుకు ఇరు దేశాల మధ్య జనవరి 28న ఒప్పందం కుదిరింది. దీని విలువ 375 మిలియన్ అమెరికన్ డాలర్లు. నిజానికి ఈ క్షిపణి వ్యవస్థను భారత్, రష్యా దేశాలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.
చైనా: చైనా కొత్త సరిహద్దు విధానాన్ని ప్రకటించింది. జనవరి 1, 2022న ఇది అమల్లోకి వచ్చింది. నిజానికి ఈ విధానాన్ని ఆ దేశం అక్టోబర్ 23, 2021న ప్రకటించింది. దీన్ని ‘సరిహద్దు ప్రాంతాల రక్షణ, వినియోగం’ అనే పేరుతో పిలుస్తున్నారు. తన దేశ సమగ్రతను కాపాడుకొనేందుకు ఉద్దేశించిందిగా చైనా పేర్కొంది. సరిహద్దులో ఉండే స్థానిక గ్రామీణ ప్రజలు, పౌరులను కూడా రక్షణలో భాగస్వాములను చేసింది. చైనా దేశానికి 14 దేశాలతో 22,100 కిలోమీటర్ల సరిహద్దు ఉంది
శీతాకాల ఒలింపిక్స్: చైనాలోని బీజింగ్ నగరంలో ఈ ఏడాది శీతాకాల ఒలింపిక్స్ ఫిబ్రవరి 4 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించారు. వేసవి, శీతాకాల ఒలింపిక్స్‌ను నిర్వహించిన ఏకైక ప్రపంచ నగరంగా బీజింగ్ ఘనతను దక్కించుకుంది. 2008లో ఆ దేశంలో తొలిసారిగా వేసవి ఒలింపిక్స్ నిర్వహించారు. ఈ ఏడాది నిర్వహించిన శీతాకాల ఒలింపిక్స్‌లో నార్వే అత్యధిక పతకాలను గెలుచుకుంది. ఈ పోటీలకు టార్చ్ బేరర్ క్యూ ఫాబావో వ్యవహరించాడు. ఇతను గల్వాన్ లోయ యుద్ధంలో పాల్గొన్న సైనికుడు. దీనిని నిరసిస్తూ భారత్ అధికారికంగా బహిష్కరించింది. భారత్ తరఫున ఆరిఫ్ ఖాన్ ఈ పోటీల్లో పాల్గొన్నాడు. ఎలాంటి పతకాలను సాధించలేదు.
లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమిటీ :l దీన్ని బ్రిటిష్ ఇండియాలో నియమించారు.
# నివేదికను సమర్పించిన సంవత్సరం 1948, డిసెంబర్
# ఉద్దేశం: భాషా సూత్రం ఆధారంగా రాష్ట్రాల ఏర్పాటు పరిశీలన
# అధ్యక్షుడు: ఎస్.కే. ధర్,
# సభ్యులు: పన్నాలాల్, జగత్ నారాయణ లాల్
ముఖ్యాంశాలు
# 1945-48 మధ్య మద్రాస్ ప్రావిన్స్ లో ఆంధ్రా జిల్లాల జనాభా — 1.88 కోట్లు
# హైదరాబాద్ రాష్ట్ర జనాభా- – 1.63 కోట్లు
# ఆంధ్రా జిల్లాల తలసరి ఆదాయం – – రూ.6.46
# హైదరాబాద్ రాష్ట్ర తలసరి ఆదాయం – రూ. 12.80
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ
ఎడ్యు రిపబ్లిక్
9849212411
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?