షుగర్ కేన్ బెల్ట్ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు?
1. తెలంగాణ ప్రాజెక్టులకు భూమి పూజ జరిగిన ప్రదేశాలను జతపర్చండి.
1) పాలమూరు – రంగారెడ్డి ఎ) అంబటిపల్లి
2) డిండి బి) కరివెన/ భూత్పూర్
3) కాళేశ్వరం సి) శివ్వన్నగూడెం
4) మేడిగడ్డ డి) కన్నెపల్లి
1) 1-సి,2-డి,3-బి,4-ఎ
2) 1-బి,2-సి,3-డి,4-ఎ
3) 1-సి,2-బి,3-డి,4-ఎ
4) 1-డి,2-బి,3-సి,4-ఎ
2. చాకలి ఐలమ్మజీవిత చరిత్ర రాసింది ఎవరు?
1) శంకర్ 2) శేఖర్ 3) రాజేందర్ 4) నాగేందర్
3. జలసాధన సమితి స్థాపకుడు ఎవరు?
1) సురేందర్ 2) దుశ్చర్ల సత్యనారాయణ
3) పనబాక సుబ్బన్న 4) గోపాల్‌బాబు
4. సీఎం శౌర్య పతకం -2016 విజేత ఎవరు?
1) శ్రీధర్‌రెడ్డి 2) భాస్కర్ 3) చలపతి 4) గంగారాం
5. కృష్ణానది నది బోర్డు చైర్మన్ ఎవరు?
1) నాయక్ 2) నాథన్ 3) బ్రజేష్ 4) బచావత్
6. షుగర్ కేన్ బెల్ట్అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు ?
1) ఉత్తర మధ్యప్రదేశ్ 2) పశ్చిమ ఉత్తరప్రదేశ్
3) దక్షిణ ఉత్తరప్రదేశ్ 4) మధ్య బీహార్
7. 2016లో అత్యధిక సర్క్యూలేషన్ కలిగిన జాతీయ దినపత్రిక?
1) ద హిందూ 2) టైమ్స్ ఆఫ్ ఇండియా
3) హిందూస్థాన్ టైమ్స్ 4) దైనిక్ భాస్కర్
8. పాకిస్థాన్ న్యూక్లియర్ కాపిటల్ అని ఏ నగరాన్ని పిలుస్తారు?
1) కరాచీ 2) లాహోర్ 3) ఇస్లామాబాద్ 4) రావల్పిండి
9. భారతదేశంలో ప్రతి ఏడాది 165 ఈఫిల్ టవర్ల బరువుకు సమానమైన ఎలక్ట్రానిక్ వ్యర్థాలు విడుదల అవుతున్నాయి. ముఖ్యంగా విదేశీ అక్రమ వ్యర్థాల డంపింగ్‌ను ఎలా అడ్డుకోవాలో తెలియని అవ్యవస్థీకృత ఎలక్ట్రానిక్స్ రంగం 95శాతం ఈ- వ్యర్థాలను వాతావరణంలోకి వెదజల్లుతోంది. పైరో మెటలర్జీ +హైడ్రో మెటలర్జీ విధానాల ద్వారా ఈ – వ్యర్థాలను ప్రాసెస్చేసుకుని తిరిగి వాడుకోవచ్చు. కానీ 30శాతం మాత్రమే అలా జరుగుతుంది. ఇంతకి భారత్ విడుదల చేసే ఈ -వ్యర్థాల బరువెంత (5వ ర్యాంక్) ?
1) 1.5 మిలియన్ టన్నులు
2) 1.7 మిలియన్ టన్నులు
3) 20.3 మిలియన్ టన్నులు
4) 50.9 మిలియన్ టన్నులు
10. ఆగస్టా వెస్ట్‌లాండ్ చాపర్లను తయారు చేసే ఫిన్ మెకానికా ఏ దేశ కంపెనీ ?
1) ఇటలీ 2) ఫ్రాన్స్ 3) బ్రిటన్ 4) జర్మనీ
11. తెలుపు నీటి నది (White River) ఏ దేశంలో ఉంది?
1) థాయ్‌లాండ్ 2) మలేషియా
3) వియత్నాం 4) శ్రీలంక
12. ఐపీఎల్-2016 ఛాంపియన్ హైదరాబాద్ సన్‌రైజర్స్‌కు సంబంధించి కింది వాటిని జతపర్చండి.
1) కోచ్ ఎ) వార్నర్
2) బౌలింగ్ బి) మూడి
3) మెంటర్ సి) మురళి
4) కెప్టెన్ డి) లక్ష్మణ్
1)1-డి,2-బి,3-సి,4-ఎ 2) 1-సి,2-బి,3-డి,4-ఎ
3)1-బి,2-సి,3-డి,4-ఎ 4) 1-ఎ,2-సి,3-బి,4-డి
13. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధాగారం/డిపో పుల్గావ్ లో ప్రమాదం చోటు చేసుకోవడంతో 20 మంది సిబ్బంది మృతిచెందారు. పుల్గావ్ మహారాష్ట్రలోని ఏ జిల్లాలో ఉంది?
1) పర్బణి 2) నాగ్‌పూర్ 3) వార్ధా 4) నాందేడ్
14. గోదావరి నదిలో, శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాల్లో కనిపించే వెదురుతో తయారైన పుట్టి ఈ మధ్య వార్తలకెక్కింది. దేశంలో మొట్టమొదటి పుట్టి రెగెట్టా పోటీలు ఎక్కడ జరిగాయి?
1) వైజాగ్ 2) పంజాబ్ 3) కొచ్చిన్ 4) హుస్సేన్‌సాగర్
15. హిమాచల్‌ప్రదేశ్ లాంటి హిమాలయ పర్వత రాష్ట్రంలో కూడా కరువు కాటకాలతో విలవిలలాడటంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని జల వనరుల సంరక్షణ గురించి ప్రజలకు చైతన్యం కలిగించాల్సిందిగా కొన్ని మార్గదర్శకాలను తయారుచేయాలని ప్రభుత్వాలను ఆదేశించింది. మొదటగా స్పందించిన విదర్భ ప్రాంతంలో జల్హల్ యాత్ర చేపట్టింది. తెలంగాణ కూడా అలాంటి యాత్రను చేపట్టనుంది. ఆ జిల్లాను గుర్తించండి.
1) మెదక్ 2) కరీంనగర్
3) మహబూబ్‌నగర్ 4) నల్లగొండ
16. ఒక కిలో వరిధాన్యం పండించడానికి సగటున ఎన్ని లీటర్ల నీరు అవసరమవుతుంది?
1) 5000 లీటర్లు 2) 4000 లీటర్లు
3) 2200 లీటర్లు 4) 1000 లీటర్లు
17. శాన్-5 అనేది ఒక&?
1) ఇజ్రాయెల్ మిస్సైల్స్ 2) చైనా-1CBM
3) వ్యాక్సిన్ 4) సెల్‌ఫోన్-5RAM
18. సాఫ్ట్వేర్ రంగంలో నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహమిచ్చేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబడిన తెలంగాణ టి-హబ్ ప్రస్తుతం వ్యవసాయరంగంలో కూడా నవకల్పనలకు ఊతమిచ్చే ఉద్దేశంతో హైదరాబాద్‌లోని ఇక్రిశాట్ ఆవరణలో నూతన టి-హబ్ నిర్మాణానికి ఒప్పందం కుదిరింది. అయితే టి-హబ్ సీఈవో ఎవరు?
1) కేటీఆర్ 2) అనితా దాట్ల
3) మల్లు సాయిరాం 4) జయక్రిష్ణన్
19. 102 ఫోన్‌కాల్ తెలంగాణలో నూతన ఆవిష్కరణ దేనికోసం జరిగింది?
1) మహిళల అత్యవసర భద్రత నెం.
2) మహిళా కంట్రోల్ రూం నెం.
3) సీఎం వాయిస్ మెయిల్ నెం.
4) అమ్మఒడి నెం.
20. హిరోషిమా+నాగసాకి నగరాలపై అణు బాంబుల దాడి కారణంగా 2 లక్షల మంది క్షతగాత్రులైనారు. అదృష్టం కొద్ది బయటపడిన వారిని హిబకుషా అని పిలుస్తారు. ఆ 2 లక్షల మందిలో విదేశీయులు ముఖ్యంగా కొరియన్లు ఎంత మంది ఉండొచ్చు. (1945లో కొరియా జపాన్ నియంత్రణలో ఉంది) ?
1) 20 వేలు 2) 50 వేలు 3) 75 వేలు 4) 80 వేలు
21. హిటాచి, తోషిబా, జనరల్ ఎలక్ట్రానిక్స్ వెస్టింగ్ హౌస్ లాంటివి టీవీలు తయారు చేసే సంస్థలు.మనదేశంలో విద్యుత్ కొరతను తీర్చడానికి అణువిద్యుత్ ప్లాంట్లను ఇవి ఏర్పాటు చేయబోతున్నాయి. అన్ని ప్రైవేటు కంపెనీలే ! మరి కుడంకుళం అణు విద్యుత్ కేంద్రం నిర్మించి ప్రారంభించిన రష్యా ప్రభుత్వ కంపెనీ ఏది ?
1) ఎఫ్‌డీఎఫ్ 2) రోసటోం
3) రోస్తావ్ 4) కాస్మోస్-బి-యెలా గులయేవ్
22. ప్రస్తుత కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి ఎవరు ?
1) హర్ధీప్‌సింగ్ కౌర్ 2) కేసరినాథ్ త్రిపాఠి
3) వెంకయ్యనాయుడు 4) ప్రదీప్కుమార్సిన్హా
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు