చేతిరాతతో భవిష్యత్తు
-
గ్రూప్ -1 గైడెన్స్ ట్వంటీఫస్ట్ సెంచరీ అకాడమీ డైరెక్టర్ కృష్ణప్రదీప్
గూప్ -1లో చేతిరాతే కీలకం. ఎందుకంటే ఈ పరీక్షలో వ్యాసాలు రాయాలి. మన చేతిరాతే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మెయిన్స్ వ్యాసాలు గజిబిజిగా రాయొద్దు. కొట్టివేతలు ఉండొద్దు. పేపర్లు దిద్దే వ్యక్తి అర్థం చేసుకునేలా స్పష్టంగా రాయాలి. తప్పుల్లేకుండా అక్షరదోషాలు లేకుండా జాగ్రత్త పడాలని అంటున్నారు ట్వంటీఫస్ట్ సెంచరీ అకాడమీ డైరెక్టర్ కృష్ణప్రదీప్ . గ్రూప్ -1 నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్స్‌పై అభ్యర్థులకు ఆయన పలు సూచనలు చేశారు.
కృష్ణప్రదీప్
‘సీ’ ఫార్ములాను పాటించాలి
# జనరల్ ఎస్సేలో మూడు వ్యాసాలుంటాయి. వీటిలో ఒక్కో ప్రశ్నకు వెయ్యి నుంచి 1200 పదాల్లో సమాధానం రాయాలి. ఒక్కోదానికి 50 మార్కులుంటాయి. మిగతావి షార్ట్ ఆన్సర్లు. 15 ప్రశ్నలు రాయాలి. ఒక్కోదానికి 10 మార్కులుంటాయి. వీటిని 200 పదాల్లో రాస్తే సరిపోతుంది. పదాలు తగ్గకుండా జాగ్రత్త పడాలి. అంతేకాకుండా వ్యాసాలు రాసేటప్పుడు ఒక పద్ధతి ప్రకారం రాయాలి. కాన్సెప్ట్, కాన్ సీక్వేషన్స్, కన్ క్లూజన్ అనే సీ ఫార్ములాను అనుసరించాలి.
కంటెంట్ ఉంటే కష్టమేం కాదు
# వ్యాసాలు రాయాలంటే కంటెంట్ ఉండాలి. కంటెంట్ ఉంటే వ్యాసాలు రాయడం అంత కష్టమేమీ కాదు. సంబంధిత అంశాలపై మనకు స్పష్టమైన అవగాహన ఉండాలి. అంకెలు, గణాంకాలు, పోల్చడం వంటివి చేయవచ్చు. సబ్జెక్టుపై పూర్తిగా అవగాహన ఉంటేనే ఇది సాధ్యపడుతుంది. ఇందుకోసం ప్రిపరేషన్ తో పాటు, సబ్జెక్టుపై లోతైన అవగాహన తెచ్చుకోవాలి. కొన్నింటికి సమాధానాలు పుస్తకాల్లో దొరకవు. మన అవగాహనను పరీక్షించేందుకు కొన్ని ప్రశ్నలడుగుతారు. వాటికి సమాధానాలు సొంతంగా రాయాలి. ఇందుకు వర్తమాన అంశాలపై అవగాహన తెచ్చుకోవడం, దినపత్రికలు చదవడం చేయాలి.
రోజుకు మూడు గంటలు
# రోజుకు 9 గంటల ప్రిపరేషన్ సరిపోతుంది. 6 గంటలు చదవాలి. మరో మూడు గంటలు రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. చాలా మంది రాయడం అలవాటులేక వెనుకబడిపోతున్నారు. అదే సివిల్స్ అభ్యర్థులు మూడు గంటల్లో 20 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉండగా, గ్రూప్ -1లో అదే మూడు గంటల్లో 15 ప్రశ్నలకు రాస్తే సరిపోతుంది. వేగంగా రాయడమే కాకుండా సబ్జెక్టును మాత్రమే రాయాలి. సరిగ్గా రాయడమే కాకుండా, ముల్యాంకనం చేసే వారితో చదివించుకునే బాధ్యత మనమీదే ఉంటుంది. వాక్య నిర్మాణం సరిగ్గా ఉండాలి. పదానికి పదానికి మధ్య అర సెంటీమీటర్ వ్యవధి ఉండేలా చూసుకోవాలి. అక్షరాలు మరీ చిన్నగా, పెద్దగా కాకుండా మధ్యస్థంగా రాయాలి. వ్యాసాల్లో మంచి సామెతలు, జాతీయాలు రాయెచ్చు. శీర్షికలు, ఉపశీర్షికలను వాడొచ్చు.
ముందుగా బుల్లెట్ పాయింట్స్
# కోచింగ్ తోపాటు సొంత నోట్స్ అవసరం. దీని వల్ల మనకో స్పష్టత వస్తుంది. గ్రూప్ -1 అభ్యర్థులకు ఎగ్జామ్ సమయంలో అన్సర్ షీట్ తో పాటు అదనంగా రెండు మూడు పేపర్లు ఇస్తారు. వీటిల్లో ప్రశ్నపత్రం చూడగానే మొదట.. తమకు వచ్చిన సమాధానాలకు సంబంధించిన ముఖ్యమైన వాటిని బుల్లెట్ పాయింట్స్‌గా రాసుకోవాలి. ఆన్సర్లు రాసేటప్పుడు ఆయా బుల్లెట్ పాయింట్స్‌ను అనుసరించే వ్యాసాలు రాయడం ద్వారా సులభతరమవుతుంది. వ్యాసాలు రాసేటప్పుడు సబ్జెక్ట్ నుంచి అస్సలు పక్కకు జరగొద్దు. విషయాంశంతో పాటు తత్సంబంధ అంశాలనే ప్రస్తావించాలి. వర్తమాన అంశాలను జోడించినా మంచిదే.
ఒకే భాషలో రాయాలి
# గ్రూప్ -1 వ్యాసాలు రాసేవాళ్లు ఏ భాషను ఎంచుకుంటే ఆ భాషలోనే వ్యాసాలు రాయాలి. సగం ఒక భాష, మరో సగం ఇంకో భాషలో రాయొద్దు. 6 పేపర్లలో ఒక పేపర్ ను ఒక భాషలో, మరో పేపర్ ను మరో భాషలో రాస్తే పరిగణనలోకి తీసుకోరు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ ఏ భాషలో కావాలంటే ఆ భాషలో రాసుకునే అవకాశఉంది. కాబట్టి అభ్యర్థులు పూర్తిగా సమాధానాలను తెలుగు, ఇంగ్లిష్ , ఉర్దూ భాషల్లో ఏదో ఒక దాంట్లో మాత్రమే రాయాలి.
…మల్లేశం కొంటు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం