సముద్రమంత అవకాశాలు – మారిటైం కోర్సులు
భారతదేశం 7500 కి.మీ. సముద్ర తీరప్రాంతం కలిగి ఉంది. దేశంలో 12 ప్రధాన, 200 నాన్ మేజర్ నౌకాశ్రయాలు ఉన్నాయి. దేశ వ్యాపార ప్రగతిలో మారిటైం సెక్టార్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. దేశంలో సముద్ర/సముద్ర వనరుల వినియోగం కోసం 2020లో నీతి ఆయోగ్ ‘బ్లూ ఎకానమీ’ కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. దీంతో మారిటైం విలువను అర్థం చేసుకోవచ్చు. భవిష్యత్తులో మారిటైం రంగంలో పుష్కలంగా ఉద్యోగ అవకాశాలు పెరుగనున్నాయి. ప్రస్తుతం ఇండియన్ మారిటైం యూనివర్సిటీలో యూజీ, పీజీ కోర్సుల ప్రవేశ ప్రకటన విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈకోర్సుల గురించి సంక్షిప్తంగా..
ఇండియన్ మారిటైం యూనివర్సిటీ (IMU-2022)
ఐఎంయూని 2008, నవంబర్ 14న ప్రారంభించారు. ఈ యూనివర్సిటీ భారత షిప్పింగ్ మంత్రిత్వశాఖ పరిధిలో ఉంది. దీని ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. మారిటైం అంటే సమద్ర రంగానికి సంబంధించిన విద్య, శిక్షణ, పరిశోధనలతోపాటు ఓషనోగ్రఫీ, మారిటైం హిస్టరీ, లా, సెక్యూరిటీ, రిస్క్యూ, కార్గో, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ తదితర అంశాల కోసం ప్రత్యేకంగా దీన్ని ప్రారంభించారు. దేశంలోని మారిటైం కాలేజీల్లో ప్రవేశాల కోసం ఐఎంయూ ఏటా కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ను నిర్వహిస్తుంది. ఈ టెస్ట్ ద్వారా పలు యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సులు
అండర్ గ్రాడ్యుయేట్
బీటెక్ (మెరైన్ ఇంజినీరింగ్),
బీటెక్ (నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషన్ ఇంజినీరింగ్)
పై రెండు కోర్సుల కాలవ్యవధి నాలుగేండ్లు.
బీఎస్సీ (నాటికల్ సైన్స్)- మూడేండ్లు
బీబీఏ (లాజిస్టిక్స్, రిటెయిలింగ్ & ఈకామర్స్)- మూడేండ్లు
బీఎస్సీ (షిప్ బిల్డింగ్ & రిపేర్) (ఇది
ఒకే ఒక కాలేజీలో అందిస్తున్నారు. దీనిలో నేరుగా ప్రవేశాలు పొందవచ్చు. వివరాలకు వెబ్సైట్ చూడవచ్చు)
డీఎన్ఎస్- డిప్లొమా ఇన్ నాటికల్ సైన్స్ (ఏడాది)
పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ (రెండేండ్ల కోర్సులు)
ఎంటెక్ (నేవల్ ఆర్కిటెక్చర్&ఓషన్ ఇంజినీరింగ్), ఎంటెక్ (మెరైన్ ఇంజినీరింగ్&మేనేజ్మెంట్), ఎంటెక్ (డ్రెడ్జింగ్&హార్బర్ ఇంజినీరింగ్), ఎంబీఏ (పోర్ట్&షిప్పింగ్ మేనేజ్మెంట్), ఎంబీఏ (ఇంటర్నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్&లాజిస్టిక్స్ మేనేజ్మెంట్), ఎమ్మెస్సీ (కమర్షియల్ షిప్పింగ్&లాజిస్టిక్స్)
వీటితోపాటు పీజీ డిప్లొమా, పీహెచ్డీ, ఎంఎస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వీటిలో ప్రవేశాలు ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా చేస్తారు.
అర్హతలు
యూజీ కోర్సులకు కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్ (ఎంపీసీ) ఉత్తీర్ణత. 18-25 ఏండ్ల మధ్య ఉండాలి. బీబీఏకు ఇంటర్లో ఏ గ్రూప్ వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు. పీజీ, ఎంబీఏ తదితరాలకు వెబ్సైట్ చూడవచ్చు.
ముఖ్య తేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: మే 16
ఐఎంయూసెట్ తేదీ: మే 29
వెబ్సైట్: https://www.imu.edu.in
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు