అత్తారింటిలో వేధింపులు.. కోర్టులో విడాకుల కేసు.. సివిల్స్ సాధించిన ‘శివంగి’
‘Shivangi’ achieved civils
ఆమె చిరకాల స్వప్నం సివిల్స్ సాధించడం.. కానీ మొదటి రెండు ప్రయత్నాల్లో విఫలమైంది. అంతలోనే పెళ్లి కావడంతో పుట్టింటి నుంచి మెట్టింటికి వెళ్లింది. అక్కడ చదివే వాతావరణం లేదు. అత్తమామల వేధింపులు, భర్త ఆగడాలతో ఆమె తీవ్ర మానసిక క్షోభకు గురైంది. ఓ వైపు తన కలను నెరవేర్చుకోలేక, మరో వైపు సంసార జీవితంలో సాగలేక తీవ్రంగా మదనపడింది. తన ఆశయాలకు అడ్డుగా మారిన భర్త నుంచి విడాకులను కోరింది. తన కుమార్తెను తీసుకొని పుట్టింటికి తిరిగొచ్చింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ పట్టువిడవకుండా పోరాడింది. పుస్తకాల పురుగులా మారి.. తన డ్రీమ్‌ను నెరవేర్చుకుంది. నిన్న విడుదలైన సివిల్స్ ఫలితాల్లో 177వ ర్యాంకు సాధించింది శివంగి.
ఉత్తరప్రదేశ్ హపూర్ పరిధిలోని పిల్కువాకు చెందిన శివంగి గోయల్ యూపీఎస్సీ ఫలితాల్లో మెరిసింది. ఈ సందర్భంగా శివంగి మీడియాతో మాట్లాడుతూ.. పెళ్లి అయిన మహిళలకు నేను ఇచ్చే సందేశం ఒక్కటే.. మన మెట్టింట్లో అత్తమామల వేధింపులకు భయపడాల్సిన అవసరం లేదు. మనకు మనం ధైర్యంగా ఉంటే ఏదైనా సాధించొచ్చు. కష్టపడి చదివితే సాధించలేనిది ఏది ఉండదు. మీరు కూడా ఏదో ఒక రోజు ఐఏఎస్ అవొచ్చు అని పేర్కొన్నది.
ఐఏఎస్ కావాలనే కోరిక ఎప్పట్నుంచో ఉంది. నాకు పెళ్లి జరిగే నాటికే రెండు సార్లు ఐఏఎస్‌కు ప్రయత్నించాను. కానీ విఫలమయ్యాను. ఆ తర్వాత వివాహమైంది. అత్తగారింట్లో వేధింపులు భరించి.. భరించి, చివరకు విడాకులు కోరాను. ఆ తర్వాత నా ఏడేండ్ల కూతుర్ని తీసుకొని పుట్టింటికి వచ్చాను. నేను మళ్లీ ఎందుకు సివిల్స్ కు ప్రిపేర్ కావొద్దని నిర్ణయించుకున్నాను. దాంతో మళ్లీ సివిల్స్‌కు ప్రిపేరయి.. 177వ ర్యాంకు సాధించాను. చిత్తశుద్ధితో, పట్టుదలతో కష్టపడి చదివి చిన్నప్పటి కలను నెరవేర్చుకోవడం సంతోషంగా ఉందని శివంగి పేర్కొన్నది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?