NEET Success Stories | నీట్లో మెరిసిన తెలుగు తేజాలు
ఇటీవల జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన వారి మనోగతం వారి మాటల్లో….
ప్రీ ప్లాన్‌తో ర్యాంకు సాధించా
ముందస్తు ప్రణాళిక ఉంటే ఏదైనా సాధించొచ్చు. అందుకు ఇష్టంతో శ్రమించాలి. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోపాటు స్నేహితుల సపోర్టు కూడా ముఖ్యం. నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో చదివి నీట్లో ఆల్ ఇండియా 15వ ర్యాంకు సాధించానని చెప్పారు కాంచని జయంత్ రఘురాం రెడ్డి. తన విజయ ప్రయాణాన్ని ‘నిపుణ’తో పంచుకున్నారు. ఆ వివరాలు అతని మాటల్లో..
కాంచని జయంత్ రఘురాం రెడ్డి నీట్లో ఆల్ ఇండియా 15వ ర్యాంకు
కుటుంబ నేపథ్యం ఏంటి?
- మాది అనంతపురం జిల్లాలోని తాడిపత్రి. నాన్న కాంచని వెంకటచంద్రమౌళి రెడ్డి, అమ్మ హేమలత ప్రైవేటు వైద్యులు. అక్క మధువాణి ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. నాకు అవసరమైన సలహాలు ఇస్తుంది.
ఎప్పటి నుంచి నీట్‌కు ప్రిపేర్ అవుతున్నారు, కోచింగ్ తీసుకున్నారా? - ఎనిమిదో తరగతి నుంచే ప్రిపేరయ్యాను. అప్పటి నుంచి ఇంటర్ వరకు కూకట్‌పల్లిలో చదివాను. కోచింగ్ ఏం తీసుకోలేదు. సొంతంగానే ప్రిపరేషన్ కొనసాగించాను.
ఏయే బుక్స్ చదివారు, ఇంకా ఇతర ర్యాంకులు ఏమైనా వచ్చాయా? - కాలేజీ మెటీరియల్‌తో పాటు ఎన్సీఈఆర్టీ పుస్తకాలు చదివాను. చాలా ఉపయోగపడ్డాయి. మంచి ర్యాంకే వచ్చింది. నీట్‌తో పాటు టీఎస్ ఎంసెట్‌కు కూడా అటెండయ్యాను. అందులో స్టేట్ 16వ ర్యాంకు వచ్చింది.
ఎంసెట్ వైపు వెళ్తారా, నీట్ వైపా? - నీట్ వైపే వెళ్తాను. ఎందుకంటే వైద్యవృత్తి నా కల. తల్లిదండ్రులు వైద్యులు కావడంతో నేను కూడా డాక్టర్‌గా స్థిరపడాలనుకుంటున్నాను. ఢిల్లీలోని ఎయిమ్స్ కాలేజీలో ఎంబీబీఎస్ చదవాలనుంది.
ఇంటర్ బోర్డు పరీక్షలకు, నీట్ పరీక్షకు సమయాన్ని ఎలా బ్యాలెన్స్ చేశారు? - ఇది పోటీ ప్రపంచం. సమయాన్ని బ్యాలెన్స్ చేస్తేనే ముందుకెళ్లగలం. ఇంటర్ పరీక్షల సన్నద్ధతే నీట్‌కు సైతం ఉపయోగపడింది. నెల ముందు నుంచే ఫోకస్ చేశాను. రోజూ 7-8 గంటలు పుస్తకాలతో కుస్తీ పట్టాను.
నీట్లో సులభంగా,కఠినంగా అనిపించిన సబ్జెక్టులు? - ఫిజిక్స్ సబ్జెక్టు సులభంగా అనిపించింది. కెమిస్ట్రీ కొంచెం టఫ్‌గా ఫీలయ్యాను.
భవిష్యత్ లక్ష్యం ఏంటి? - డాక్టర్ అవ్వాలని ఇటువైపొచ్చాను. వైద్యుడిగా స్థిరపడి పేదలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకుంటాను.
నీట్ రాయబోయేవారికి మీరిచ్చే సలహాలు,
సూచనలు? - ఎన్సీఈఆర్టీ పుస్తకాలు బాగా చదవాలి. బయాలజీపై ఎక్కువ శ్రద్ధ అవసరం. ఫైనల్‌గా కెమిస్ట్రీ, ఫిజిక్స్ కూడా అశ్రద్ధ చేయవద్దు. అప్పుడే మంచి ఫలితం వస్తుంది. ఒత్తిడికి లోనైనప్పుడు క్రికెట్, షటిల్ తదితర నచ్చిన ఆటలు ఆడాలి. లేదా నచ్చిన పనులు చేయాలి.
ఎక్కువ సమయం శ్రమించాను
తల్లిదండ్రుల ప్రోత్సాహానికి తోడు స్నేహితుల మధ్య ప్రిపరేషన్ వల్ల ఏదైనా సాధించొచ్చని, తన విషయంలో అదే జరిగిందని అంటోంది తాడిపత్రికి చెందిన నీట్ ర్యాంకర్ బోడెద్దుల జాగృతి. ఆల్ ఇండియాలో 49వ ర్యాంకు సాధించింది. ఆమె తన విజయ ప్రస్థానం గురించి ‘నిపుణ’తో చెప్పుకొచ్చిందిలా..
బోడెద్దుల జాగృతి ఆల్ ఇండియాలో 49వ ర్యాంకు
మీ కుటుంబ నేపథ్యం?
- సొంతూరు అనంతపురం జిల్లా తాడిపత్రి. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో స్థిరపడ్డాం. నాన్న బోడెద్దుల సూర్యనారాయణ రెడ్డి ఇంజినీర్. అమ్మ శివాని గృహిణి. అన్న శరన్నాథ్ రెడ్డి ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. హైదర్‌గూడలో ఇంటర్ పూర్తి చేశాను.
ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు, కోచింగ్ తీసుకున్నారా? - ఇంటర్ ఫస్టియర్ నుంచి ప్రిపరేషన్ మొదలెట్టాను. ఎటువంటి కోచింగ్ తీసుకోలేదు. సొంతంగానే రోజూ 14-16 గంటలు చదివాను.
నీట్లో ర్యాంకు రావడానికి దోహదం చేసిన అంశాలు? - తల్లిదండ్రుల సపోర్టు చాలా ముఖ్యం. బయాలజీపై ఎక్కువ శ్రద్ధ పెట్టాను. మొదట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ కఠినంగా అనిపించినా తర్వాత అలవాటైంది. చివరగా అన్ని సబ్జెక్టులు రివిజన్ చేశాను. దీంతో ర్యాంకు వచ్చింది.
ఎంబీబీఎస్ చదవాలనుకోవడానికి కారణం? - డాక్టర్ కావడం నా కల. అందుకే నీట్‌పై ఫోకస్ పెట్టి ర్యాంకు సాధించాను.
ఏయే బుక్స్ చదివారు? - మెటీరియల్‌తోపాటు ఎన్సీఈఆర్టీ పుస్తకాలు చదివాను. మంచి ఫలితం దక్కింది. సంతోషంగా ఉంది. ఎంసెట్ కూడా రాశాను. కానీ అందులో ర్యాంకు రాలేదు.
ఎంబీబీఎస్ ఎక్కడ చదవాలనుకుంటున్నారు? - ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చదవాలనుంది. సీటు కచ్చితంగా వస్తుందనే నమ్మకం ఉంది. రెండో ఆప్షన్‌గా పుదుచ్చేరిలోని జిప్మర్ను ఎంచుకుంటాను.
ఇంటర్ బోర్డ్ పరీక్షలు రాశారు కదా, నీట్ పరీక్ష ప్రిపరేషన్‌కు టైం బ్యాలెన్స్ అయిందా? - బోర్డ్ పరీక్షల తర్వాత నెల సమయమే ఉంది. ఎటువంటి భయం లేకుండా ప్రశాంతంగా ప్రిపరేషన్ కొనసాగించాను. రోజూ చదవడానికి సమయాన్ని పెంచుతూ వెళ్లాను. ఒత్తిడిని తట్టుకోవడానికి గేమ్స్ ఆడాను.
మీ లక్ష్యం ఏంటి? - డాక్టర్ అయ్యాక మంచి పేరు తెచ్చుకోవాలనుంది. సమాజానికి నా వంతు సేవ చేస్తాను. పదిమంది ప్రాణాలు నిలబెడితే అదే సంతృప్తినిస్తుంది.
నీట్ రాసేవారికి మీరిచ్చే సలహాలు, సూచనలు? - రెండేళ్లు కష్టపడి చదవాలి. ఈ పోటీ ప్రపంచంలో ఏదైనా అంతా సులభం కాదు. సబ్జెక్టులపై పట్టు ఉండాలంటే ఎప్పటికప్పుడు స్నేహితులతో మాట్లాడుతూ ఉండాలి. ఒకరికొకరు సందేహాలు నివృత్తి చేసుకోవాలి. అప్పుడప్పుడు తల్లిదండ్రులతో కూడా చర్చించాలి. ఫలితం మీ కళ్లముందుంటుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?