సివిల్స్ టాపర్ శృతిశర్మ సక్సెస్ సీక్రెట్ ఇదే!!
సివిల్స్ సాధించాలని చాలామంది కల కంటారు. కానీ, కొంతమందే ఆ కలను సాకారం చేసుకుంటారు. సివిల్స్ అంటే తప్పకుండా ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్లాలి.. పెద్దమొత్తంలో డబ్బులు కావాలని చాలామంది సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యేందుకు వెనుకాడుతారు. అయితే, సివిల్స్‌కి ప్రిపేర్ కావాలంటే కోచింగ్ సెంటర్ల నోట్స్ అవసరమే లేదని అంటోంది సివిల్స్ ఫలితాల్లో టాపర్‌గా నిలిచిన శృతిశర్మ. ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సక్సెస్ సీక్రెట్ వెల్లడిచింది.
శృతిశర్మ ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ సెయింట్ స్టీఫెన్స్ కళాశాల పూర్వవిద్యార్థిని. సివిల్స్ సాధించడం ఆమె కల. నాలుగేళ్లుగా ప్రిపరేషన్ సాగిస్తున్నది. అయితే, ఇందుకోసం ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల చుట్టూ ఆమె తిరగలేదు. ఎన్సీఈఆర్టీ పుస్తకాలపైనే పూర్తిస్థాయిలో ఆధారపడినట్లు ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ పుస్తకాలు చదువుతూ సొంతంగా నోట్స్ తయారుచేసుకున్నానని తెలిపింది. అలాగే, ప్రతిరోజూ వార్తాపత్రికలు చదువుతూ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నట్లు వెల్లడించింది. కోచింగ్ సెంటర్ల మెటీరియల్స్పైన ఆధారపడలేదని శృతిశర్మ తెలిపింది. తన సివిల్స్ ప్రయాణంలో తల్లిదండ్రులు, స్నేహితుల మద్దతు మరువలేనిదని పేర్కొంది. సివిల్స్ సాధిస్తానని అనుకున్నాను కానీ, టాప్ ర్యాంకులో ఉంటానని కలలో కూడా అనుకోలేదని శృతిశర్మ పేర్కొంది.
శృతిశర్మ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. నాలుగేళ్లుగా సివిల్స్‌కు సిద్ధమవుతోంది. జామియా మిలియా ఇస్లామియా రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ విద్యార్థిని. ఇందులో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఉచిత కోచింగ్, రెసిడెన్షియల్ సౌకర్యాలను అందించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ద్వారా ఆర్సీఏ నిధులు సమకూరుస్తుంది. ఇందులో ఉంటూ తన సొంత నోట్స్ చదివి సివిల్స్ సాధించినట్లు శృతిశర్మ పేర్కొంది. యూపీఎస్సీ సోమవారం ప్రకటించిన సివిల్ సర్వీసెస్ పరీక్షా ఫలితాల్లో శృతి శర్మ, అంకితా అగర్వాల్, గామిని సింగ్లా వరుసగా మొదటి, రెండు మరియు మూడో ర్యాంకులను సాధించారు. మొత్తం 685 మంది అభ్యర్థులు ప్రతిష్టాత్మక పరీక్షకు అర్హత సాధించారని యూపీఎస్సీ వెల్లడించింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?