సివిల్స్‌లో మెరిసిన సింగరేణి స్వీపర్ కుమారుడు

హైదరాబాద్ : నాన్న దినసరి కూలీ.. అమ్మ సింగరేణిలో స్వీపర్(ఔట్ సోర్సింగ్).. అమ్మనాన్న రెక్కాడితేనే.. ఆ కుటుంబం డొక్క నిండుతోంది.. అలాంటి కుటుంబంలో జన్మించాడు ఓ సరస్వతి పుత్రుడు. కష్టాలను ఎదుర్కొని.. కడు పేదరికాన్ని జయించి.. చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి.. యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ ఫలితాల్లో మెరిశాడు. అతనే ఆకునూరి నరేశ్. సివిల్స్ ఫలితాల్లో 117వ ర్యాంకు సాధించిన నరేశ్.. ఐఏఎస్ లేదా ఐపీఎస్ కాబోతున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాశింపల్లి గ్రామానికి చెందిన ఆకునూరి నరేశ్(29) ఐఐటీ గ్రాడ్యుయేట్. నరేశ్ తండ్రి ఐలయ్య దినసరి కూలీ. తల్లి సులోచనమ్మ సింగరేణిలో ఔట్ సోర్సింగ్ కింద స్వీపర్ ఉద్యోగం చేస్తోంది. కుమారుడిని బాగా చదివించాలనే సంకల్పంతో వారిద్దరూ కష్టపడుతూ.. బిడ్డకు మంచి భవిష్యత్‌ను ఇచ్చారు. ఇవాళ సివిల్స్ ఫలితాల్లో మంచి ర్యాంకు సాధించడంతో తల్లిదండ్రులిద్దరూ ఆనంద భాష్పాలు రాల్చుతూ.. ఉద్వేగానికి లోనయ్యారు.
నరేశ్ 5వ తరగతి వరకు కాశింపల్లి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నారు. 6 నుంచి 10వ తరగతి వరకు ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, నర్సంపేటలో అభ్యసించారు. రంగారెడ్డి జిల్లా చిల్కూరులోని ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్(బాయ్స్) కాలేజీలో ఇంటర్ ఎంపీసీ పూర్తి చేశారు. 2015లో ఐఐటీ మద్రాస్ నుంచి ఇంజినీరింగ్ పట్టాను అందుకున్నారు.
ఇంజినీరింగ్ పూర్తయిన తర్వాత చెన్నై సిటీ బ్యాంక్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనాలిస్ట్‌గా చేరారు. అక్కడ మూడేండ్ల పాటు ఉద్యోగం చేశారు. ఉద్యోగం చేస్తూనే.. శంకర్ ఐఏఎస్ అకాడమీలో సివిల్స్ కోచింగ్ తీసుకున్నారు. 2017లో తొలిసారిగా సివిల్స్ రాసినప్పటికీ విజయం సాధించలేకపోయారు. 2019లో 782 ర్యాంకు సాధించి.. ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్‌లో చేరారు. ప్రస్తుతం శిక్షణలో ఉన్నారు. ఐదో ప్రయత్నంలో 117వ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉందని నరేశ్ తెలిపారు. ఐఏఎస్ రాకపోవచ్చు.. ఐపీఎస్ వచ్చే అవకాశం ఉందని నరేశ్ పేర్కొన్నారు. తన విజయానికి తన తల్లిదండ్రులే కారణమని నరేశ్ చెప్పుకొచ్చారు.
RELATED ARTICLES
-
అమ్మ కోసమే ఐఏఎస్..ప్రతి ఆడపిల్లకూ స్ఫూర్తినిచ్చే నిజామాబాద్ అమ్మాయి కథ
-
సివిల్స్ విజేతల సక్సెస్ స్పీక్
-
విధిని ఎదిరించిన విజేతలు
-
Bala latha | ఆ వంద మంది నా ప్రతిబింబాలు.. బాలలత సక్సెస్ స్టోరీ
-
సివిల్స్‌లో మెరిసిన సింగరేణి స్వీపర్ కుమారుడు
-
అత్తారింటిలో వేధింపులు.. కోర్టులో విడాకుల కేసు.. సివిల్స్ సాధించిన ‘శివంగి’
Latest Updates
టీఎస్ఐసెట్ దరఖాస్తు గడువు 4కు పెంపు
జోధ్‌పూర్ ఎయిమ్స్‌లో సీనియర్ రెసిడెంట్ల పోస్టులు
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్లో 32 ఖాళీ పోస్టుల భర్తీ
బీబీనగర్ ఎయిమ్స్‌లో ప్రొఫెసర్ పోస్టుల భర్తీ
Let’s play a game of cricket with numbers…
The Independence struggle
ఆర్టికల్ 39(f)ను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు?
పుట్టుకతోనే గుడ్డి, చెవిటి జీవులు ఏవి? ( బయాలజీ )
తనను తాను దున్నుకునే నేలలు?
జిలాబంది విధానాన్ని ప్రవేశ పెట్టినది ఎవరు