పక్కా ప్రణాళికతో.. ఉద్యోగం పక్కా!
రాష్ట్ర ప్రభుత్వం 80 వేల ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేసింది. ఈ సమయంలో ఎందరో ఉద్యోగార్థులకు ఒక ఇన్స్పిరేషన్ కావాలి. అందుకు నిపుణలో గత టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో ఉద్యోగాలు సాధించిన వారి ఇంటర్వ్యూలు ఇస్తున్నాం. ఈ నేపథ్యంలో 2017 గ్రూప్-1 రాష్ట్ర స్థాయి ఏడో ర్యాంక్ సాధించి, ప్రస్తుతం నల్లగొండ జిల్లా పంచాయతీ అధికారిగా విధులు నిర్వహిస్తున్న నాగర్ కర్నూల్ వాసి విష్ణువర్ధన్ రెడ్డి చెప్పిన విషయాలు ఆయన మాటల్లో తెలుసుకుందాం..
నమ్మకంతో ముందడుగేయాలి
కోచింగ్‌కు వెళ్లినా, వెళ్లకపోయినా టైం టేబుల్ రూపొందించుకొని, ప్రణాళికాబద్ధంగా ప్రిపేరవ్వాలి. గ్రూప్ డిస్కషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఎందుకంటే మనం చదువుకున్నది నలుగురితో చర్చిస్తే బాగా గుర్తుంటుంది. గ్రూప్ డిస్కషన్ పక్కదారి పట్టకుండా చూసుకోవాలి. సమయానుసారంగా చదివితే ఉద్యోగం పక్కాగా సాధించవచ్చు. లక్ష్యం సాధించాలంటే సహనంతో ప్రిపేరవుతూ, సిలబస్‌పై అవగాహన పెంచుకొని మోడల్ పేపర్లను ఫాలో అవుతూ ముందుకెళ్లాలి. పుస్తకంలోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ చదివితే గమ్యం చేరుకోవచ్చు. ముఖ్యంగా ఉద్యోగం సాధిస్తాను అనే నమ్మకం ఉండాలి. ఉద్యోగాల విషయంలో వచ్చే అసత్య ప్రచారాలకు దూరంగా ఉండాలి. ఇటువంటి అనవసర విషయాల గురించి పట్టించుకుంటే ఎంత చదివినా గుర్తుండదు.
ఎలా చదవాలి
ఉద్యోగాల్లో కొన్ని టెక్నికల్, మరికొన్ని నాన్ టెక్నికల్ ఉంటాయి. ఇంజినీరింగ్ లాంటి ఉద్యోగాలు రావాలంటే పుస్తకానికే పరిమితం కావాల్సి ఉంటుంది. కానీ గ్రూప్స్ పరిధిలోఉద్యోగాలు.. దానికి సంబంధించిన సబ్జెక్ట్ మొత్తం సమాజానికి అనుబంధంగా ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్‌లో చదివే ప్రతి అంశాన్నీ పుస్తకానికే పరిమితం చేయకుండా సమాజానికి అనువదిస్తూ ప్రిపేరయితే అది మన మైండ్‌లో ఫిక్స్ అయిపోతుంది. ఏకాగ్రతతో చదవడంతో పాటు అందులోని ప్రధాన పాయింట్లను నోట్ చేసుకొని, వాటిని రివైజ్ చేస్తే మొత్తం విషయం అవగతమవుతుంది.
ఏ మెటీరియల్ ఫాలో కావాలి
మొదట ఎలాంటి చికాకులు, ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంత వాతావరణంలో ప్రిపరేషన్ మొదలుపెట్టాలి. ప్రిపరేషన్ విషయంలో ప్రతిరోజూ ఏ టైంలో ఏం చేయాలనేది సొంతంగా టైం టేబుల్ తయారు చేసుకోవాలి. తెలుగు మీడియం వాళ్లు తెలుగు అకాడమీకి ప్రాధాన్యం ఇవ్వాలి. దాంతోపాటు మరో బుక్ ఫాలో అయితే సరిపోతుంది. కానీ ఎక్కువ బుక్స్ ఫాలో కావద్దు. దీనివల్ల కన్ఫ్యూజన్కు గురయి లక్ష్యం నెరవేరదు. ప్రతి సబ్జెక్ట్‌కు సంబంధించిన ప్రతి ఉద్యోగ పరీక్షను రాయాలి. ఒక ఉద్యోగం వస్తే కాన్ఫిడెంట్ పెరిగి అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఏ సబ్జెక్ట్ అయినా డెప్త్‌గా తెలుసుకోవాలంటే ఆ సబ్జెక్ట్‌పై పూర్తి అవగాహన ఉన్న వాళ్లతో మాట్లాడాలి.
మోడల్ టెస్టులు రాయాలి
ఉద్యోగార్థులు ప్రతిరోజూ పేపర్ చదవాలి. దీనివల్ల కరెంట్ అఫైర్స్‌తో పాటు సబ్జెక్టులపై అప్డేట్ కావచ్చు. గత ప్రశ్నపత్రాలను విశ్లేషణ చేసుకోవడంతో పాటు మోడల్ టెస్ట్ వారానికి ఒకసారి రాసేలా చూసుకుంటే ఎంత టైంలో రాయగలుగుతున్నాం అనేది తెలుస్తుంది. ప్రభుత్వ స్టడీ సర్కిళ్లను సద్వినియోగం చేసుకోవాలి. మాక్‌టెస్ట్‌లు, మాక్ ఇంటర్వ్యూలకు హాజరు కావాలి. ఎదుటివారు ఎక్కువ గంటలు చదువుతున్నారని మీరు అలా చేయవద్దు. మీ సామర్థ్యం, తెలివిని బట్టి ప్రిపేరయితే ఉద్యోగం సాధించవచ్చు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?