టెన్త్ ఫెయిలైనా కలెక్టర్‌నయ్యా!.. పయత్నం ఆపొద్దు.. పాజిటివ్ దృక్పథాన్ని వీడొద్దు

- పయత్నం ఆపొద్దు.. పాజిటివ్ దృక్పథాన్ని వీడొద్దు
- తెలుగు మీడియం అని అస్సలు బాధపడొద్దు
- కఠినమైన సబ్జెక్టులు ముందుగా చదవాలి
- చదువు మధ్యలో విశ్రాంతి తీసుకోవాలి
- 1994-95 గ్రూప్ -1 టాప్ 3 ర్యాంకర్, హైదరాబాద్ కలెక్టర్ ఎల్ శర్మన్
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారు ప్రయత్నించడం అస్సలు ఆపకూడదు. పాజిటివ్ దృక్పథాన్ని వీడొద్దు. ఎస్సెస్సీలో ఫెయిలైనా నిరాశపడకుండా ప్రయత్నించి కలెక్టర్ అయ్యారు. ఎస్సెస్సీలో ఇంగ్లిష్, గణితం సబ్జెక్టుల్లో ఫెయిలై, ట్యూషన్‌కు వెళ్లి రెండేండ్లకు పాసయ్యారు. సివిల్స్‌లో మూడుసార్లు ఇంటర్వ్యూ, గ్రూప్-1లో ఒకసారి విఫలమై 1994-95 గ్రూప్-1లో రాష్ట్రస్థాయి 3వ ర్యాంక్ సాధించి.. తన కల ఐఏఎస్ సాధించారు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎల్ శర్మన్. త్వరలో పోటీ పరీక్షల నోటిఫికేషన్లు వెలువడనున్న నేపథ్యంలో నమస్తే తెలంగాణ (నిపుణ)తో తన అనుభవాలు పంచుకున్నారు. ఉద్యోగార్థులకు ప్రిపరేషన్ ప్లాన్‌పై ఇచ్చిన సూచనలు ఆయన మాటల్లో..
ప్రయత్నం ఆపొద్దు
తొలి ప్రయత్నంలో గ్రూప్-1 మిస్సయ్యాను. సివిల్స్‌లో మూడుసార్లు ఇంటర్వ్యూలో విఫలమయ్యాను. కిందపడ్డ ప్రతిసారీ పైకి లేవాలన్న కసితో ప్రయత్నించి అనుకున్నది సాధించాను. ప్రయత్నాన్ని ఎప్పుడూ విరమించుకోవద్దు. ఒకటి పోతే మరో ఉద్యోగం వస్తుంది. సెంట్రల్ ఎక్సైజ్‌లో ఇన్స్పెక్టర్, పోస్టల్, బ్యాంక్ ఉద్యోగాలకు ఎంపికై చివరికి గ్రూప్-1తో ఆపేశాను.
పాజిటివ్ దృక్పథం అవసరం
అభ్యర్థులకు పాజిటివ్ దృక్పథం, ఆత్మవిశ్వాసం ముఖ్యం. సంకల్పం, క్రమశిక్షణ, లక్ష్యం సాధించాలన్న తపన ఉండాలి. మానసిక ైస్థెర్యంతో పరీక్షలకు సిద్ధమవ్వాలి. వదంతులను నమ్మొద్దు. డబ్బులిచ్చి ఉద్యోగాలు పొందారన్న మాటలు విని మోసపోవద్దు.
అన్నిసార్లు విజయం దరిచేరకపోవచ్చు
అన్నిసార్లు పరిస్థితులు ఒకేలా ఉండవు. సివిల్స్‌లో ఒకసారి 250 మార్కులకు 80 మార్కులే వచ్చాయి. ఇంకో 20 మార్కులొస్తే ఐఏఎస్ అయ్యేవాడిని. తృటిలో కోల్పోయాను. ఇంటర్వ్యూలో సరిగ్గా సమాధానాలు చెప్పలేకపోవడం వల్లే ఇలా జరిగిందని అనుకొంటా. అదే గ్రూప్-1 ఇంటర్వ్యూలో 111 మార్కులొచ్చాయి. అంటే అడిగే ప్రశ్నలను బట్టి మార్కులొస్తాయి. సివిల్స్‌లో కఠినంగా అడిగారు, ఆన్సర్ చేయలేకపోయాను. అదే గ్రూప్-1లో సులభంగా సమాధానాలు చెప్పి సక్సెస్ సాధించాను.
తెలుగు మీడియం అని బాధపడొద్దు
గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు తాము తెలుగు మీడియం వాళ్లమని బాధపడొద్దు. నేనే కాదు, నాలాంటి చాలామంది తెలుగు మీడియంలో చదివి సక్సెస్ సాధించారు. సివిల్స్‌లోనూ తెలుగు మీడియం అభ్యర్థులు కూడా విజయం సాధిస్తున్నారు. ఏ మీడియంలో చదివినా.. ప్రశ్నలను అర్థం చేసుకొని, అప్పటికప్పుడు సమాధానాలు రాసేలా సిద్ధమవ్వాలి.
అదేపనిగా చదవొద్దు
అభ్యర్థులు అదేపనిగా చదవొద్దు. మధ్యలో కాస్త విరామం తీసుకొని, తిరిగి కొనసాగించాలి. 18 గంటలు కష్టపడ్డామని.. చాలామంది అంటుంటారు. ఇది సరికాదు. నేను మధ్యమధ్యలో గేమ్స్ ఆడేవాడిని, సినిమాలు చూసేవాడిని, టేబుల్ టెన్నిస్, షటిల్ వంటి వాటి ద్వారా విశ్రాంతి పొందేవాడిని. మిత్రులతో గ్రూప్ డిస్కషన్స్ చేసేవాడిని. ఈ టెక్నిక్స్ నాకు ఉపకరించాయి. సమయానికి తినడం, చదవడం, పడుకోవడం అలవర్చుకోవాలి.
నన్ను సంప్రదించొచ్చు
పోటీ పరీక్షల్లో నెగ్గిన విజేతలతో ముఖాముఖి కలుసుకొని మాట్లాడాలి. వారిని కలిసి ప్రిపరేషన్ ప్లాన్‌ను తెలుసుకోవాలి. ఇలా చేయడం వల్ల స్పష్టత వస్తుంది. ధైర్యాన్నిస్తుంది. ఇందుకోసం అభ్యర్థులు నన్ను సంప్రదించవచ్చు. వారికోసం సమయం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను.
వాతావరణం ముఖ్యం
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు వాతావరణం ముఖ్యం. ప్రశాంతమైన వాతావరణంలో ప్రిపరేషన్ సాగించాలి. మనతో ఉండే సమూహం కూడా ముఖ్యమే. మేం ప్రిపేరయ్యేటప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అందరికీ ఆశ్రయమిచ్చింది. ఏ హాస్టల్కెళ్లినా, ఎక్కడ చూసినా పోటీపరీక్షలకు ప్రిపేరయ్యేవాళ్లే కనిపించేవారు. ఏ రిజల్ట్స్ వచ్చినా 30 శాతం ఉద్యోగాలు ఓయూ వాళ్లే దక్కించుకొనేవాళ్లు. దీంతో కసి, పట్టుదల మరింత పెరిగేది. ప్రిపరేషన్ ప్రారంభంలో కఠినమైన సబ్జెక్టులు, కొత్త సబ్జెక్టులు ముందు చదవాలి. పరీక్షలు సమీపించాక కఠినమైనవి చదివితే ఉపయోగం ఉండదు. సిలబస్ పూర్తిచేయడం కష్టం. ఒక అంశానికి సంబంధించిన పుస్తకాన్ని చదివాక, అదే అంశానికి సంబంధించిన మరో పుస్తకాన్ని కొని, మళ్లీ చదవొద్దు. దీంతో సమయం వృథా అవుతుంది.
RELATED ARTICLES
-
Career Guidence | Career in Python Programming Language
-
NEET Success Stories | నీట్లో మెరిసిన తెలుగు తేజాలు
-
JEE Advanced 2023 – Success Stories | లక్ష్యం పెట్టుకున్నారు.. లక్షణంగా సాధించారు
-
Success Stories | ఆత్మవిశ్వాసం @ ఆరు ఉద్యోగాలు
-
Civil Services Success Stories | వీక్లీ టెస్టులతో లోపాలు సవరించుకున్నా..
-
Civil Services Success Stories | సివిల్స్‌లో మెరిసిన తెలంగాణ తేజాలు
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?