Women and Child Welfare | మహిళా శిశు సంక్షేమం సామాజిక శాసనాలు
మన దేశంలో మహిళా, శిశు సంక్షేమం కోసం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వంతోపాటు అన్ని రాష్ర్టాలు తమ పరిధిలో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి. అందుకోసం అవసరాన్నిబట్టి కాలానుగునంగా అనేక చట్టాలను రూపొందించాయి. ఇటీవలి కాలంలో పోటీ పరీక్షల్లో సామాజికాభివృద్ధిలో భాగంగా మహిళాశిశు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అందువల్ల అభ్యర్ధుల కోసం ఈ వ్యాసం..
-విదేశీ వివాహ చట్టం -1969
-భారతీయుల విడాకుల చట్టం-1869
-ఆనంద్ వివాహ చట్టం 1909, 2012
-పారసీ వివాహ చట్టం -1936
-ప్రత్యేక వివాహ చట్టం-1872
-వెట్టిచాకిరి నిషేధ చట్టం- 1976
-బాలకార్మిక నిషేధ చట్టం – 1986
-దేవదాసీ నిషేధ చట్టం -1988
-నిర్భయ చట్టం -2013
-బాలన్యాయ చట్టం-2013, 2000, 1986, 2006
-విద్యాహక్కు చట్టం-2009
-ఫ్యాక్టరీల చట్టం -1948
-కనీస వేతనాల చట్టం- 1948
-గనుల చట్టం-1952
-హిందూ దత్తత చట్టం -1956
-బాలల చట్టం -1938
-Orphanage and Charitable Act-1960
-Immoral Trafficking Prevention ACT-1986
-The Young Persons (Harmful Publication) ACT -1956
-The Infant Milk substitution, Feeding bottles and infant Food ACT- 1992
-The Commission For Protection of Child Rights ACT- 2005
-Apprentices ACT- 1961
-Beedi and cigar Workers ACT- 1966
-జాతీయ మహిళా కమిషన్ చట్టం -1990
-Bangaru Talli Girl Child Promotion and Empowerment ACT-2013
-మహిళాశిశు సంక్షేమం- స్వయం ప్రతిపత్తిగల సంస్థలు
-మహిళాశిశు సంక్షేమ మంత్రిత్వశాఖలో భాగంగా నాలుగు స్వయంప్రతిపత్తి సంస్థలు పనిచేస్తున్నాయి.
1. National Institute of Public co-operation and Child Development (NIPCCD)
2. Central Social Welfare Board (CSWB)
3. Rashtriya Mahila Kosh (RMK)
4. Central Adoption and Resource Authority (CARA)
5. National Institute of Public co-operation and Child Development (NIPCCD)
-మహిళాశిశు సంక్షేమానికి సంబంధించిన జాతీయస్థాయి శిక్షణ సంస్థ.
-మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో పనిచేస్తుంది.
స్వయంప్రతిపత్తిగల సంస్థ
-దీనిని మొదటగా Central Institute of Research and Training in Public Co-operation అనే పేరుతో 1966, ఫిబ్రవరి 20న స్థాపించారు.
-National Institute of Public co-operation and Child Developmentని 1945, ఏప్రిల్ 7న ఏర్పాటు చేశారు.
-మహిళా సంబంధిత అంశాలు, బాలల అభివృద్ధి స్వచ్ఛంద కార్యక్రమాలను వేగం చేయడమే ఈ సంస్థ లక్ష్యం.
-ICDS కార్యక్రమానికి సంబంధించిన సిబ్బందికి శిక్షణ ఇస్తుంది.
-NIPCCOనకు గువాహటి, బెంగళూరు, లక్నో, ఇండోర్లలో స్థానిక కేంద్రాలు ఉన్నాయి. ప్రధాన కేంద్రం ఢిల్లీలో ఉన్నది.
Central Social Welfare Board (CSWB)
-ఈ సంస్థను 1953, ఆగస్టు 13న స్థాపించారు.
-ప్రజా భాగస్వామ్యంతో సంక్షేమ కార్యక్రమాలను అమలుపరిచే లక్ష్యంతో ఏర్పాటు చేసిన మొదటి సంస్థ.
-ఎన్జీవోల సహకారంతో మారుమూల ప్రాంతాలు, దేశవ్యాప్తంగా ఉన్న మహిళలు, బాలలు, అశక్తులకు సంబంధించిన కార్యక్రమాలను అమలు చేస్తున్నది.
-రాష్ట్రస్థాయిలో State Social Welfare Board లను ప్రతి రాష్ట్రంలో 1954న స్థాపించారు. ఇవి CSWB మార్గదర్శకత్వంలో పనిచేస్తాయి.
-CSWB మొదటి చైర్మన్‌గా దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ తన సేవలందించారు.
-ప్రస్తుతం CSWB కింది కార్యక్రమాలను అమలు చేస్తున్నది.
1. దేశంలో 1969 నుంచి అమలు చేస్తున్న Short stay Homes పథకాన్ని 1999 నుంచి CSWB అమలు చేస్తున్నది.
2. 1984 నుంచి Family Counselling centersను నిర్వహిస్తున్నది.
3. Condensed course of Education for Women ను 1958 నుంచి, 1975 నుంచి vocational Training Programme అందిస్తున్నది.
4. 1986 నుంచి గ్రామీణ, నిరుపేద మహిళలకు వివిధ అంశాలపై అవగాహనను పెంపొందించే కార్యక్రమాన్ని చేపడుతున్నది.
5. 1975 నుంచి రాజీవ్‌గాంధీ నేషనల్ క్రెచ్ సెంటర్ పథకాన్ని అమలు చేస్తున్నది.
6. Working Womens Hostelsని నిర్వహిస్తున్నది.
7. Integrated Scheme for Womens Development for North Eastern States పథకం అమలు చేస్తున్నది.
8. భ్రూణ హత్యలపై బాలికా సంరక్షణ అభియాన్ పథకాన్ని అమలు చేస్తున్నది.
9. స్త్రీ సంక్షేమ రంగంలో కృషిచేసిన వారికి e-అవధాన్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది.
రాష్ట్రీయ మహిళా కోశ్
-1993లో స్థాపించారు. దీన్నే నేషనల్ క్రెడిట్ ఫండ్ ఫర్ ఉమెన్ అని కూడా పిలుస్తారు.
-స్వయంప్రతిపత్తి గల సంస్థ. రూ. 31 కోట్ల్ల మూలనిధిని కేటాయించారు.
-అవ్యవస్థీకృత రంగంలో గల నిరుపేద మహిళల రుణ అవసరాలను తీర్చడమే దీని ముఖ్య ఉద్దేశం.
-మహిళా సంక్షేమ శాఖ మంత్రి దీనికి ఎక్స్ అఫీషియో చైర్మన్‌గా వ్యవహరిస్తారు.
సెంట్రల్ అడాప్షన్ అండ్ రెజ్యూమ్ అథారిటీ
-దీన్ని 1990లో ఏర్పాటు చేశారు.
-ఇది స్వయంప్రతిపత్తి గల సంస్థ. మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో పనిచేస్తుంది.
-దీనికి చైర్మన్‌గా జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వ్యవహరిస్తారు.
-1993లో హేగ్‌లో జరిగిన ఇంటర్ కంట్రీ అడాప్షన్ కన్వెన్షన్‌కు అనుబంధంగా ఏర్పాటు చేశారు.
-దేశంలో పిల్లలను దత్తత తీసుకునే వ్యవహారాలు, విదేశీయులను దత్తత తీసుకునే విషయాలకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించి పర్యవేక్షిస్తుంది.
-బాలల దత్తత చట్టబద్ధంగా సాగేలా పరిశీలిస్తుంది.
-పై సంస్థలతోపాటు 1964లో ఏర్పాటు చేసిన ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బోర్డు 1993 నుంచి కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో పనిచేస్తుంది.
జాతీయ మహిళా కమిషన్
-జాతీయ మహిళా కమిషన్ చట్టం- 1990 ప్రకారం 1992, జనవరి 31న జాతీయ మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేశారు. అంటే జాతీయ మహిళా కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ. కానీ కార్యనిర్వహక సంస్థ కాదు.
-ది కమిటీ ఆన్ స్టేట్స్ ఆఫ్ ఉమెన్ 1974, నేషనల్ రెస్పెక్టివ్ ప్లాన్ ఫర్ ఉమెన్ 1988లు జాతీయస్థాయిగా ఒక కమిషన్ ఉండాలని సూచించాయి.
-పౌరుల సూచనల మేరకు జాతీయ మహిళా కమిషన్ చట్టం ద్వారా ఈ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
లక్ష్యాలు
-మహిళలకు సంబంధించిన చట్టాలు, రాజ్యాంగపరమైన రక్షణలను పర్యవేక్షించడం
-అవసరమైన సలహాలను ఇవ్వడం
-మహిళలకు సంబంధించిన పలు అంశాలపై విచారణలు జరుపడం
-విధానపరమైన అంశాల్లో ప్రభుత్వాలకు సూచనలివ్వడం
-ఒక చైర్పర్సన్, ఐదుగురు సభ్యులు, ఒక సెక్రటరీ మెంబర్‌తో కూడి ఉంటుంది.
-మహిళా రంగాలకు చెందిన ప్రముఖులను కేంద్రప్రభుత్వం చైర్‌పర్సన్‌గా, సభ్యులుగా ఎంపికచేస్తుంది.
-చైర్పర్సన్, సభ్యుల పదవీకాలం మూడేండ్లు.
విధులు
-రాజ్యాంగం, ఇతర చట్టాల ద్వారా మహిళల రక్షణల అమలు తీరును పర్యవేక్షిస్తుంది.
-ఏడాదికోసారి, అవసరమనుకున్నప్పుడు ఆయా రక్షణల అమలు తీరుపై కేంద్రప్రభుత్వాలకు నివేదికలను అందజేస్తుంది.
-రక్షణల అమలు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు, సూచనలు అందిస్తుంది.
-మహిళల హక్కుల ఉల్లంఘనకు సంబంధించి ఫిర్యాదులను స్వీకరించి విచారిస్తుంది. అవసరమనుకున్నప్పుడు కేసులను సుమోటోగా స్వీకరిస్తుంది.
-అవసరమైన సందర్భాల్లో ప్రత్యేక విచారణలను చేపడుతుంది.
-మహిళల ఆర్థికాభివృద్ధికి సంబంధించిన ప్రభుత్వ ప్రక్రియలో పాలుపంచుకుంటుంది.
-దేశవ్యాప్తంగా మహిళాభివృద్ధిని మూల్యాంకనం చేస్తుంది.
-మహిళా కమిషన్ రిపోర్టులను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ముందుంచుతుంది. కమిషన్ సూచనలపై తీసుకున్న చర్యలను వివరిస్తుంది. ఒకవేళ చర్యలను తీసుకోనట్లయితే అందుకుగల కారణాలను తెలుపుతుంది.
-మహిళలకు సంబంధించిన కుటుంబ, వివాహ వివాదాలను త్వరగా పరిష్కరించేందుకు పరివారిక్ మహిళా లోక్ అదాలత్ అనే కార్యక్రమాన్ని అమలుచేస్తుంది.
-మహిళా కమిషన్ మొదటి చైర్పర్సన్ జయంతీ పట్నాయక్. ప్రస్తుత చైర్పర్సన్ రేఖ శర్మ. గిరిజావ్యాస్ రెండుసార్లు మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు.
-రాష్ట్ర మహిళా కమిషన్‌ను 1999లో ఏర్పాటు చేశారు. మొదటి చైర్‌పర్సన్‌గా సుశీలాదేవి పనిచేశారు. ప్రస్తుతం సునీతాలక్ష్మారెడ్డి చైర్‌పర్సన్‌గా పనిచేస్తున్నారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు