Perseverance is the result | పట్టుదలతోనే ఫలితం
కొంతకాలం క్రితంవరకు విద్యార్థులకు 10వ తరగతి తర్వాత ఇంటర్ ఆ తర్వాత ఇంజినీరింగ్ లేదా మెడిసిన్ కోర్సులే ప్రపంచంగా ఉండేవి. అవి చేయలేనివారు సాధారణ డిగ్రీవైపు వెళ్లేవారు. కానీ ప్రస్తుతం విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రుల ఆలోచనల్లో కూడా మౌళికమైన మార్పు కనిపిస్తున్నది. సంప్రదాయ చదువులతో లాభం లేదని గ్రహించటంతోపాటు త్వరగా జీవితంలో స్థిరపడాలన్న ఆలోచనే ఇందుకు కారణం. దాంతో ఇటీవల కామర్స్ కోర్సులకు డిమాండ్ పెరుగుతున్నది. కామర్స్ ప్రధాన సబ్జెక్టుతో కొంచెం కష్టపడితే సీఏ, అకౌంటెన్సీ, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ తదితర రంగాల్లో బంగారు భవిష్యత్తు ఉండటంతో ఎక్కువమంది విద్యార్థులు అటువైపు ఆకర్శితులు అవుతున్నారు.
సీఎంఏ కోర్సు – వివరాలు
-సీఏ, సీఎస్ పరీక్షల మాదిరిగానే సీఎంఏ పరీక్షా విధానంలో ఫౌండేషన్, ఇంటర్మీడియట్, ఫైనల్ కోర్సులు ఉన్నాయి. సీఎంఏ ఫౌండేషన్‌లో నాలుగు పేపర్లుంటాయి. ఒక్కో పేపర్‌కు 50 మార్కుల చొప్పున మొత్తం నాలుగు పేపర్లలో 200 మార్కులకు మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. నెగిటివ్ మార్కులు ఉండవు. సీఎంఏ ఇంటర్లో ఒక్కో గ్రూప్‌లో నాలుగు పేపర్ల చొప్పున రెండు గ్రూపుల్లో కలిపి మొత్తం ఎనిమిది పేపర్లుంటాయి. సీఎంఏ ఫైనల్ కోర్సులో కూడా ఎనిమిది పేపర్లుంటాయి.
సబ్జెక్టులవారీగా జాగ్రత్తలు
పేపర్-5: ఫైనాన్షియల్ అకౌంటింగ్
-అకౌంటింగ్.. ఎక్కువ శాతం మార్కులు సాధించగల సబ్జెక్టు.
-ఈ పేపర్లో అకౌంటింగ్ స్టాండర్డ్స్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలి.
-స్టడీ మెటీరియల్, స్కానర్ (గత పరీక్షల ప్రశ్న పత్రాలు)లోని అన్ని లెక్కలు సాధన చేయాలి.
పేపర్-6: లాస్ (Laws), ఎథిక్స్ అండ్ గవర్నెన్స్
-యాక్ట్‌లో ఉండే నిబంధనలు క్షుణ్ణంగా చదవాలి.
-పరీక్ష రాసేటప్పుడు నిబంధనలు, ఉదాహరణలు, లాండ్ మార్క్ కేసెస్ కూడా మిలితం చేసి చదవాలి.
-కార్పొరేట్ లాకు సంబంధించి ఫాస్ట్‌ట్రాక్ పుస్తకాన్ని తయారుచేసుకుని చదివితే పునఃశ్చరణ సులువుగా ఉంటుంది.
-కంపెనీ లా – 2013కు సంబంధించిన నిబంధనలను కూడా జాగ్రత్తగా చదవాలి.
పేపర్-7: డైరెక్ట్ ట్యాక్సేషన్
-డైరెక్ట్ ట్యాక్సేషన్‌కు సంబంధించి ప్రతి అంశంపై లోతైన అవగాహన అవసరం.
-అసెస్మెంట్ ప్రొసీజర్స్, ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్‌పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి.
పేపర్-8: కాస్ట్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్
-కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
-సీఎంఏ ఇంటర్ కోర్సులో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కు సంబంధించి కేవలం ప్రాథమిక అంశాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి సులువుగా 40 మార్కులు సాధించవచ్చు.
పేపర్-9: ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్
-ఆపరేషన్స్ మేనేజ్మెంట్ విషయంలో థియరీ, ప్రాబ్లమ్స్‌కు సమ ప్రాధాన్యం ఇవ్వాలి.
-దీనిలో గణిత ఆధారిత ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి సులువుగా మంచి మార్కులు సాధించవచ్చు.
-ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ సబ్జెక్టులో అశ్రద్ధ చేయకూడదు. నిర్వచనాలు, సైడ్ హెడ్డింగ్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. నిమోనిక్ కోడ్స్ తయారు చేసుకుంటే సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోవడం సులభం అవుతుంది.
పేపర్-10: కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ
-స్టడీ మెటీరియల్‌లో ఉండే ఉదాహరణలను తప్పనిసరిగా అధ్యయనం చేయాలి.
-కాస్ట్ రికార్డ్, కాస్ట్ ఆడిట్ విభాగంపై అశ్రద్ధ చూపవద్దు. దాని నుంచి సులువుగా 20 మార్కులు సాధించవచ్చు.
పేపర్-11: ఇన్‌డైరెక్ట్ ట్యాక్సేషన్
-భావనలు, విధానాలను అర్థం చేసుకోవాలి. స్టడీ మెటీరియల్‌లో ఇచ్చిన ప్రశ్నలను అధ్యయనం చేయాలి.
-సమస్యాపూరిత ప్రశ్నలకు సూచించిన లేదా వర్తించే చట్టం ప్రకారం సమాధానం ఇవ్వాలి.
-మంచి మార్కుల కోసం సర్వీస్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్ విభాగాలు, వాల్యుయేషన్ రూల్స్, ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్, ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి.
పేపర్-12: కంపెనీ అకౌంట్స్ అండ్ ఆడిట్
-ఈ పేపర్లో అకౌంటింగ్ స్టాండర్డ్స్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలి.
-షెడ్యూల్ 3 (ఫార్మాట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్)పై దృష్టి పెట్టాలి.
-ప్రాబ్లమ్స్‌ను ప్రాక్టీస్ చేయాలి.
-ఆడిటింగ్ థియరీ సబ్జెక్టు. ఈ సబ్జెక్టులో నేరుగా వచ్చే ప్రశ్నలను ముందుగానే ఊహించుకోవచ్చు. అకౌంటింగ్ స్టాండర్డ్స్, స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ విధానాలు, ప్రక్రియలపై దృష్టి పెట్టాలి.
సీఎంఏ ఇంటర్ విద్యార్థులకు సూచనలు
-ప్రణాళికాబద్ధంగా చదవాలి.
-అనవసరంగా సమయాన్ని వృథా చేయొద్దు.
-తరగతుల్లో వివరించే ఉదాహరణలు, చార్ట్స్ తప్పకుండా రాసుకోవాలి.
-రన్నింగ్ నోట్స్ రాసుకొని, రివిజన్ సమయంలో చదవాలి.
-కోచింగ్ పూర్తికాగానే పూర్తిస్థాయిలో సన్నద్ధత మొదలు పెట్టాలి.
-రోజుకి రెండు సబ్జెక్టులు చదివేలా ప్రణాళిక సిద్ధంచేసుకోవాలి. ఒకటి థియరీ, మరొకటి ప్రాబ్లమెటిక్ పేపర్ ఎంచుకోవడం మంచిది.
-సన్నద్ధత సమయంలో మరో నోట్‌బుక్‌లో కీలక పదాలు రాసుకోవాలి. మెటీరియల్‌లో కూడా కీలక పదాలను అండర్లైన్ చేసుకోవాలి. దీనివల్ల రివిజన్ చేయడం సులభం అవుతుంది.
-ఎనిమిదింటిలో ఏవైనా నాలుగు సబ్జెక్టుల మీద ఎక్కువ దృష్టి పెడితే వాటిలో ఎక్కువ మార్కులు సాధించే వీలుంటుంది.
-కనీసం రెండు పేపర్లలో 60 కంటే ఎక్కువ మార్కులు సాధించేలా ప్రిపేర్ కావాలి.
-సిలబస్‌లోని అన్ని అంశాలను అవగాహన చేసుకుని ప్రతి చాప్టర్ వెయిటేజీని పరిశీలించాలి.
-పాత పరీక్షలకు సంబంధించిన ప్రశ్న పత్రాలను విశ్లేషించుకుని ఆ ప్రకారం సన్నద్ధం కావాలి.
-స్కానర్ (గత పరీక్షల ప్రశ్న పత్రాలు)ను విశ్లేషించడానికి తగిన సమయం కేటాయించాలి.
-ఆర్టీపీ (రివిజన్ టెస్ట్ పేపర్), ఎంటీపీ (మోడల్ టెస్ట్ పేపర్), పీటీపీ (ప్రాక్టీస్ టెస్ట్ పేపర్)లను తప్పకుండా పునఃశ్చరణ చేసుకోవాలి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?