సాలార్ జంగ్‌ను ఫిరంగి బచ్చా అని ఎవరన్నారు?
1. కింది వాటిని జతపర్చండి?
పదం భాష
1. జాగీర్ ఎ. పర్షియన్
2. సర్ఫ్-ఎ-ఖాస్ బి. టర్కీ
3. ఇనాం సి. అరబిక్ డి. ఉర్దూ
1) 1-ఎ, 2-బి, 3-సి
2) 1-బి, 2-సి, 3-సి
3) 1-ఎ, 2-సి, 3-సి
4) 1-ఎ, 2-సి, 3-డి
2. కింది వాటిలో సరైనవి గుర్తించండి?
ఎ. జాగీర్ అంటే కలిగి ఉండటం అని అర్థం
బి. పైగా అంటే స్థిరం అని అర్థం
సి. సర్ఫ్-ఎ-ఖాస్ అంటే రాజ్య ఆదాయం అని అర్థం
1) ఎ, బి 2) ఎ, సి
3) బి, సి 4) ఏదీకాదు
3. కింది వాటిలో సరైనదాన్ని గుర్తించండి?
ఎ. హైదరాబాద్ సంస్థానంలో దివానీ
భూములు- 55 శాతం ఉన్నాయి
బి. హైదరాబాద్ సంస్థానంలో జాగీర్దార్ భూములు- 35 శాతం ఉన్నాయి
సి. హైదరాబాద్ సంస్థానంలో సర్ఫ్-ఎ-ఖాస్ భూములు 10 శాతం ఉన్నాయి
1) ఎ, బి 2) బి, సి 3) బి 4) సి
4. కింది వాటిలో సరైనవి గుర్తించండి?
ఎ. సర్బస్తా- భూములను వేలం వేయగా వాటిని దక్కించుకున్నవారి నుంచి భూమిశిస్తు వసూలు చేయడం
బి. పాన్‌మక్తా- కౌలు భూములకు స్థిరశిస్తు చెల్లించేవారు
1) ఎ, బి సరికావు 2) ఎ, బి సరైనవి
3) ఎ సరికాదు, బి సరైనది
4) ఎ సరైనది, బి సరికాదు
5. హైదరాబాద్ సంస్థానంలో అత్యధిక జాగీర్ గల కింది వ్యక్తిని గుర్తించండి?
1) విసునూరు రామచంద్రారెడ్డి
2) కల్లూరి దేశ్‌ముఖ్
3) జన్నారెడ్డి ప్రతాప్‌రెడ్డి 4) ఏదీకాదు
6. కింది వాటిలో సరైనవి గుర్తించండి?
ఎ. జాట్ జాగీర్- నిజాం కోసం జీవితాంతం సేవ చేసిన వారిని జాట్ జాగీర్ అంటారు
బి. మశ్రుతి జాగీర్- మతాధికారులకు, సైనికులకు ఇచ్చే భూములు
సి. అల్తంగా జాగీర్- నిజాం వ్యక్తి గౌరవాన్ని నిలబెట్టిన వారికి ఈ భూములు ఇచ్చేవారు
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
7. జిందా తిలిస్మాత్ అంటే ఏమని అర్థం?
1) మూవింగ్ మ్యాజిక్
2) లివింగ్ మ్యాజిక్
3) లివ్ హెల్దీ 4) ఏదీకాదు
8. కింది వాటిలో సరైనది?
ఎ. 1920లో హకీం మహ్మద్ మోహిజుద్దీన్ ఫరూఖీ జిందా తిలిస్మాత్ అనే సంస్థను స్థాపించాడు
బి. 1916లో వజీర్ సుల్తాన్ వజీర్ సుల్తాన్ టొబాకో (వీఎస్టీ) సంస్థను స్థాపించాడు
1) ఎ, బి 2) ఎ 3) బి 4) ఏదీకాదు
9. సాలార్ జంగ్-1 గురించి కింది వాటిలో సరైనవి?
ఎ. 1829లో సాలార్ జంగ్-1
బీజాపూర్‌లో జన్మించాడు
బి. తన 25 సంవత్సరాల వయస్సులో హైదరాబాద్ దివాన్‌గా నియమితులయ్యాడు
సి. 1883లో కలరా వ్యాధి సోకి చనిపోయాడు
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఏదీకాదు
10. కింది వాటిలో సరికానిది గుర్తించండి?
ఎ. బుజుంగ్ దివానీ అదాలత్- జూనియర్ సివిల్ కోర్ట్
బి. ఖుర్ద్ దివానీ అదాలత్- సీనియర్ సివిల్ కోర్ట్
సి. మజ్లిస్-ఇ-మురఫా- సుప్రీంకోర్ట్
డి. ఫౌజ్దారి అదాలత్- క్రిమినల్ కోర్ట్
1) ఎ, బి 2) బి, సి 3) సి, డి 4) ఎ, డి
11. కింది వాటిని జతపర్చండి?
1. మొదటి రెవెన్యూశాఖ మంత్రి ఎ. నవాబ్ సాహెబ్ జంగ్ బహదూర్
2. మొదటి న్యాయశాఖ మంత్రి బి. నవాబ్ ముఖర్రం ఉద్దౌలా బహదూర్
3. మొదటి పోలీస్ శాఖ మంత్రి సి. నవాబ్ బషీర్ ఉద్దౌలా బహదూర్
డి. నవాజ్ షంషేర్ జంగ్ బహదూర్
1) 1-ఎ, 2-బి, 3-సి 2) 1-బి, 2-సి, 3-డి
3) 1-సి, 2-డి, 3-ఎ 4) 1-డి, 2-ఎ, 3-బి
12. కింది వాటిని జతపర్చండి?
1. 1864 ఎ. రెవెన్యూ బోర్డ్ ఏర్పాటు
2. 1865 బి. జిలాబందీ పద్ధతి
3. 1869 సి. రెవెన్యూ మంత్రిత్వ శాఖ ఏర్పాటు
4. 1867 డి. రెవెన్యూ సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ ఏర్పాటు
ఇ. రెవెన్యూ, పోలీస్ శాఖ వేర్వేరు చేశారు
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి 2) 1-బి, 2-సి, 3-డి, 4-ఇ
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-ఇ 4) 1-బి, 2-సి, 3-ఎ, 4-ఇ
13. కింది వాటిలో సరిగా జతపరచనవి?
ఎ. 1870- సిటీ హైస్కూల్
బి. 1872- సెయింట్ ఆన్స్ హైస్కూల్
సి. 1881- గ్లోరియం గర్ల్స్ హైస్కూల్
డి. 1861- సిటీ హైస్కూల్
14. కింది వాటిని జతపరచండి?
1. ముహతమీమ్ ఎ. పోలీసులు
2. సదర్ ఉల్ మిహం కొత్వాలీ బి. ఎస్పీ
3. అమీన్ సి. పోలీస్ శాఖ మంత్రి
4. సోవార్స్ డి. నగర కమిషనర్
ఇ. ఇన్స్పెక్టర్
15. ఎ. సమర్థవంతమైన, అర్థవంతమైన పరిపాలనను అందించడానికి సాలార్ జంగ్ పరిపాలన వ్యవస్థను మొత్తం 14 శాఖలుగా విభజించారు
బి. జిలాబందీ వ్యవస్థలో భాగంగా మొదట రాజ్యాన్ని 5 సుబాలుగా విభజించారు
పై వాక్యాల్లో సరైనది గుర్తించండి
1) ఎ, బి 2) ఎ 3) బి 4) ఏదీకాదు
16. సాలార్ జంగ్ నిజాం రాజ్య వ్యవస్థను పునరుజ్జీవింప చేశాడని వ్యాఖ్యానించిన వ్యక్తి?
1) డైటన్ 2) విలియం డిగ్బీ 3) విలియమ్సన్ 4) ఏదీకాదు
17. సాలార్ జంగ్ సంస్కరణ దశలకు సంబంధించి సరైనవి గుర్తించండి?
ఎ. 1857-65- ప్రథమ దశ
బి. 1865-80- ద్వితీయ దశ
సి. 1880-83- తృతీయ దశ
18. కింది వాటిలో సరైనవి/ది గుర్తించండి?
ఎ. రాజవంశీయుల పిల్లల కోసం మదర్సా-ఇ-ఐజా విద్యాలయం 1878లో స్థాపించారు
బి. అనాథ పిల్లల కోసం మదర్సా-ఇ-ఆలియా విద్యాలయం 1873లో స్థాపించారు
1) ఎ, బి సరైనవి 2) ఎ, బి సరికావు
3) ఎ సరైనది, బి సరికాదు
4) ఎ సరికాదు, బి సరైనది
19. ఏ సంవత్సరం నుంచి నిజాం నాణేలపైన మొఘల్ చక్రవర్తి పేరును తొలగించి నిజాం నవాబు పేరుతో నాణేలు చలామణిలోకి వచ్చాయి?
1) 1857 2) 1858
3) 1859 4) 1860
20. 19వ శతాబ్దం నాటి ఉత్తమ భారతీయ పాలనవేత్తల్లో, రాజనీతిజ్ఞుల్లో సాలార్ జంగ్ ఒకరు అని ప్రశంసించిన వ్యక్తి?
1) డైటన్ 2) విలియమ్సన్
3) విలియం డిగ్బీ 4) వహీద్ ఖాన్
21. రామప్ప దేవాలయానికి సంబంధించి కిందివాటిలో సరైనవి గుర్తించండి?
ఎ. కాకతీయ సామ్రాజ్య సేనాని రేచర్ల రుద్రుడు క్రీ.శ. 1312లో ఈ ఆలయాన్ని నిర్మించారు
బి. ఈ ఆలయం గోడలపై పెరిగి శివతాండవం దృశ్యాలు ఉన్నాయి
సి. రామప్ప గుడిపై రిటైర్డ్ హెడ్ మాస్టర్ మందల ఎల్లారెడ్డి పుస్తకం రచించారు
1) ఎ, బి 2) ఎ, బి, సి 3) ఎ 4) బి
22. కింది వాటిని జతపరచండి?
1. పాకాల చెరువు ఎ. క్రీ.శ. 1163
2. భద్రకాళి ఆలయం బి. క్రీ.శ. 652
3. వేయిస్తంభాల గుడి సి. క్రీ.శ. 1136
డి. క్రీ.శ. 1213
ఇ. క్రీ.శ. 625
1) 1-డి, 2-బి, 3-ఎ
2) 1-డి, 2-ఇ, 3-సి
3) 1-డి, 2-ఇ, 3-ఎ
4) 1-బి, 2-ఇ, 3-ఎ
23. కింది వాటిలో సరైనది/వి గుర్తించండి?
ఎ. క్రీ.శ. 750-930 మధ్య కాలంలో తూర్పు చాళుక్యులు వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర ఆలయాన్ని నిర్మించారు
బి. ఎలగందుల కోట కాకతీయుల కాలంలో నిర్మితమైంది
సి. 10వ శతాబ్దానికి చెందిన రాష్ట్రకూట రాజవంశీయులు భువనగిరి కోటను నిర్మించారు
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఏదీకాదు
24. చౌమహల్లా ప్యాలెస్ అంటే నాలుగు భవనాల సముదాయం. ఈ నాలుగు భవనాల్లో లేనిది గుర్తించండి?
1) తాహిన్యాత్ మహల్
2) మహతాజ్ మహల్
3) ఆఫ్తాబ్ మహల్ 4) గోకుల్ మహల్
25. కింది వాటిలో దేనికి ‘రహస్య చెరువు’ అని పేరు కలదు?
1) మీర్ ఆలం 2) హుస్సేన్ సాగర్
3) దుర్గం చెరువు 4) గండిపేట చెరువు
26. హిమాయత్ సాగర్‌కు సంబంధించిన పేరు హిమాయత్ అలీఖాన్ పేరుమీదుగా వచ్చింది. కాగా హిమాయత్ అలీఖాన్ కింది వారిలో ఎవరు?
1) 7వ నిజాం అల్లుడు
2) 7వ నిజాం కొడుకు
3) 6వ నిజాం కొడుకు
4) 6వ నిజాం మేనల్లుడు
27. 1950కి పూర్వం సింగరేణి కాలరీస్ కంపెనీ ఆధ్వర్యంలో తెలంగాణలోని 3 ప్రదేశాల్లో బొగ్గు గని తవ్వకం జరిగింది. కింది వాటిలో కానిది ఏది?
1) కొత్తగూడెం 2) తాండూరు
3) ఇల్లెందు 4) గోదావరి ఖని
28. 1872 నాటికి హైదరాబాద్ ఆర్థిక పరిస్థితి మెరుగై, వ్యయం కన్నా ఆదాయం ఎక్కువ ఉందని, 8 లక్షల రూపాయల మిగులు గలదని పేర్కొంది ఎవరు (సాలార్ జంగ్ సంస్కరణల వల్ల)?
1) సర్ రిచర్డ్ విండే 2) సీబీ సాండర్స్
3) విలియం డిగ్బీ 4) ఏదీకాదు
29. కింది వాటిలో ‘నౌబత్ పహాడ్’ అనే కొండపై నిర్మించిన కట్టడాన్ని గుర్తించండి?
1) సంఘీ టెంపుల్ 2) బిర్లా మందిర్
3) ఎర్రమంజిల్ 4) ఏదీకాదు
30. వంద స్తంభాల గుడిగా ప్రసిద్ధి చెందిన కింది ఆలయాన్ని గుర్తించండి?
1) డిచ్పల్లి రామాలయం
2) నవనాథ సిద్దేశ్వర ఆలయం
3) సూర్యనారాయణ దేవాలయం
4) ఏదీకాదు
31. కింది ఏ కోటకు రత్నగర్భ అనే పేరు కలదు?
1) గద్వాల 2) భువనగిరి
3) రామగిరి 4) గణపురం
32. కింది వాటిని జతపర్చండి?
1. వేల్పుల కొండ కోట ఎ. కరీంనగర్
2. నగురూరు కోట బి. జనగామ
3. గాంధారి ఖిల్లా సి. వనపర్తి
4. పానగల్ కోట డి. మంచిర్యాల
ఇ. నల్లగొండ
1) 1-బి, 2-ఎ, 3-డి, 4-ఇ
2) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
3) 1-బి, 2-సి, 3-డి, 4-ఇ
4) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
33. కింది వారిలో ఎవరు సాలార్ జంగ్‌ను ఫిరంగి బచ్చా అని ఎవరన్నారు?
1) అఫ్జలుద్దౌలా
2) మీర్ మహబూబ్ అలీఖాన్
3) నాసిరుద్దౌలా 4) ఎవరూకాదు
34. కింది ఏ నిజాం వద్ద సాలార్ జంగ్-1 దివాన్‌గా పనిచేశాడు?
ఎ. మీర్ ఉస్మాన్ అలీఖాన్
బి. మీర్ మహబూబ్ అలీఖాన్
సి. నాసిరుద్దౌలా డి. అఫ్జలుద్దౌలా
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, డి, సి 4) బి, సి
35. కింది వాటిలో సరైనవి గుర్తించండి?
ఎ. 1858లో హోలిసిక్కా అనే నూతన కరెన్సీని ప్రవేశపెట్టారు
బి. దీని విలువ బ్రిటిష్ రూపాయి కంటే 15 శాతం ఎక్కువ
1) ఎ, బి 2) ఎ
3) బి 4) ఎ, బి సరికావు
36. సాలార్ జంగ్ కింది ఏ ప్రాంతాల్లో ముద్రణాలయాలు ఏర్పాటు చేశాడు?
ఎ. వనపర్తి బి. గద్వాల
సి. నారాయణపేట డి. మహబూబ్‌నగర్
1) ఎ, బి 2) బి, సి
3) సి, డి 4) ఎ, డి
37. 1855లో సాలార్ జంగ్ ‘దారుల్ ఉలూ’ అనే పాశ్చాత్య విద్యాబోధనతో కూడిన పాఠశాలను స్థాపించాడు. ఇందులో కింది ఏ భాషల్లో విద్యాభ్యాసం జరిగింది?
ఎ. పర్షియా బి. ఉర్దూ
సి. హిందీ డి. ఇంగ్లిష్
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, డి
గందె శ్రీనివాస్ విషయ నిపుణులు
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు