రిజర్వుబ్యాంక్-ద్రవ్య విధానం
ఆర్థిక వ్యవస్థలో ధరల స్థిరత్వాన్ని దానితోపాటు ఆర్థికాభివృద్ధిని సాధించడం ప్రభుత్వాల ముఖ్య లక్షణం. మనదేశంలో ఈ లక్ష్యాలను చేరుకోవడానికి ఆర్బీఐ ఆయా రకాల ద్రవ్య విధానాలను రూపొందించి అమలు చేస్తుంది.
రిజర్వుబ్యాంకు ద్రవ్య విధానం
- ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి ఉద్యోగిత ధరల స్థిరత్వంతో కూడిన ఆర్థిక వృద్ధిని సాధించాలనేది ఆధునిక ప్రభుత్వాల ముఖ్య లక్ష్యం.
- ఆర్థిక వ్యవస్థలో సాంఘిక, ఆర్థిక లక్ష్యాల సాధన కోసం ప్రభుత్వాలు అనుసరించే విధానాలు రెండు
1. ద్రవ్య విధానం 2. కోశ విధానం
దవ్య విధానం రకాలు
- ద్రవ్య విధానం పూర్తిగా రిజర్వుబ్యాంక్‌కు సంబంధించినది.
- దేశ ఆర్థిక వ్యవస్థను క్రమబద్దీకరించడానికి 19వ శతాబ్దంలో సంప్రదాయ ఆర్థిక వేత్తలు ద్రవ్య విధానాన్ని సూచించారు.
- ద్రవ్య విధానాన్ని ఏకైక స్థూల ఆర్థిక విధానంగా సూచించవచ్చు.
ద్రవ్య విధానం నిర్వచనాలు
- ఆర్థిక వ్యవస్థలో కొన్ని ఆదర్శలక్ష్యాలు సాధించేందుకు ద్రవ్యం ద్వారా ఆర్బీఐ చేపట్టే విధానాన్ని ద్రవ్య విధానం అంటారు.
- ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లయ్‌ని పెంచేందుకు, తగ్గించేందుకు రిజర్వుబ్యాంకు అనుసరించే విధానాన్నే ద్రవ్య విధానం అంటారు.
- ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యాన్ని ప్రవేశ పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలను గరిష్ఠం చేయడం, నష్టాలను కనిష్ఠం చేయడానికి కేంద్ర బ్యాంకు/రిజర్వుబ్యాంకు అధికారులు అనుసరించే విధానాన్నే ‘ద్రవ్య విధానం’ అంటారు.
- వాణిజ్య బ్యాంకులు పరపతిని విస్తరించుట, కుదించడం ద్వారా సుస్థిరతను తీసుకొచ్చేందుకు రిజర్వుబ్యాంకు అవలంబించే విధానమే ద్రవ్య విధానం లేదా పరపతి విధానం అంటారు.
- ఒక దేశ ద్రవ్య సప్లయ్‌ని నియంత్రించే విధానమే ద్రవ్య విధానం అంటారు.
ద్రవ్య విధాన పరిధి
- ద్రవ్య విధాన పరిధి 2 అంశాలపై ఆధార పడుతుంది.
1 ద్రవ్యం ఉపయోగించే స్థాయి
2. మూలధన మార్కెట్ అభివృద్ధి స్థాయి
ఈ రెండు ఎక్కువగా ఉంటే ద్రవ్య విధాన పరిధి కూడా ఎక్కువగా ఉంటుంది.ద్రవ్య విధాన ఉద్దేశాలు / లక్ష్యాలుతటస్థ ద్రవ్య విధానంమారకపు రేట్ల స్థిరత్వంవిదేశీ మారక చెల్లింపుల్లో సమతుల్యంధరల స్థిరత్వం సాధించుటసంపూర్ణ ఉద్యోగిత సాధించడం ఆర్థికాభివృద్ధిని సాధించడం
దవ్య విధానం రకాలు
- ద్రవ్య విధానం ప్రధానంగా రెండు రకాలు
1) సులభ ద్రవ్య విధానం (Cheap Money Policy)
రుణాల వడ్డీరేట్లు తగ్గించడం వల్ల ద్రవ్య సప్లయ్ పెంచే విధానాన్ని సులభ ద్రవ్య విధానం అంటారు
2) కఠిన ద్రవ్య విధానం (Dear Money Policy)
- రుణాల వడ్డీరేట్లు పెంచడం వల్ల ద్రవ్య సప్లయ్ తగ్గించే విధానం కఠిన ద్రవ్య విధానం అంటారు.
- ద్రవ్యోల్బణ కాలంలో రిజర్వుబ్యాంకు ఈ కఠిన ద్రవ్య విధానాన్నే అవలంబిస్తుంది.
ద్రవ్య విధానం -దశలు
- భారతీయ రిజర్వుబ్యాంకు ద్రవ్య విధానాన్ని ప్రధానంగా మూడు దశలుగా వర్గీకరించి చెప్పవచ్చు.
1. 1952-1972 సంవత్సరాల మధ్య అనుసరించినది నియంత్రిత విస్తరణ దిశ.
2. 1972-1991 సంవత్సరాల మధ్య అనుసరించినది కుదింపు దశ.
3. 1991 సంవత్సరం నుంచి అనుసరిస్తున్నది విస్తరణ దశ.
మొదటి దశ -1952-1972 నియంత్రిత విస్తరణ దశ
- 1992 నుంచి 1972 వరకు భారతీయ రిజర్వుబ్యాంకు పాటించిన ద్రవ్య విధానం నియంత్రణ, విస్తరణ విధానంగా వివరించవచ్చు.
- ఆర్థికాభివృద్ధికి అవసరమైన విత్త సౌకర్యాన్ని కల్పించడంతోపాటు, ధరల స్థిరత్వం మొదలవ్వడం దీని ప్రధాన ఉద్దేశం.
- నరసింహం కమిటీ (1991 ఆగస్టు -1991 డిసెంబర్) -మొదటి దశ
- నరసింహం కమిటీ (1997 డిసెంబర్ -1998 డిసెంబర్) రెండవ దశ
- భారతదేశంలో విత్త సంస్కరణలు బ్యాంకింగ్ సంస్కరణల్లో భాగంగా ఆర్బీఐ 1991 ఆగస్టులో ఆర్బీఐ మాజీ గవర్నర్ మైదవోలు నరసింహం అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయగా 1985 డిసెంబర్‌తో తన నివేదికను సమర్పించింది. రెండో దశ కమిటీని 1997 డిసెంబర్లో ఏర్పాటు చేయగా తన నివేదికను 1998 డిసెంబర్లో సమర్పించింది.
సూచనలు
- ఆర్బీఐ నగదు నిల్వల నిష్పత్తిని (సీఆర్ఆర్) దశల వారీగా 15 శాతం నుంచి 3 శాతానికి తగ్గించాలి.
- ఆర్బీఐ చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తి (ఎస్ఎల్ఆర్) ని 5 సంవవత్సరాల కాల వ్యవధిలో 32.5 నుంచి 25 శాతానికి తగ్గించాలి.
- ప్రాధాన్యత రంగ రుణాలను 10 శాతానికి తగ్గించాలి. వడ్డీరేట్లపైన నియంత్రణ ఎత్తివేయాలి.
- బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించి స్వయం ప్రతిపత్తి కల్గించాలి.
- వడ్డీరేట్లను బ్యాంకురేటుతో అనుసంధానం చేయాలి.
- బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించిన చట్టాలను సంస్కరణలను సమీక్షించాలి.
ఉర్జిత్ పటేల్ కమిటీ (2013-14)
- మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ ఆధ్వర్యంలో ఉర్జిత్ పటేల్ కమిటీని 2013 సెప్టెంబర్‌లో ఏర్పాటు చేయగా 2014 జనవరిలో తన నివేదికను సమర్పించింది.
సూచనలు
- ద్రవ్య విధానంలో నిర్ణయాలు తీసుకోవడానికి ప్రత్యేకంగా ద్రవ్య విధాన కమిటీని ఏర్పాటు చేయాలి.
- ద్రవ్య విధాన కమిటీలో ఓటింగ్ ద్వారా నిర్ణయాలు తీసుకోవాలి.
- ద్రవ్య విధానంలో ఏర్పడే ధరల పెరుగుదలను /ద్రవ్యోల్బణాన్ని అంచనా వేయడానికి WPIకి బదులు సీపీఐ ని పరిగణించాలి.
- ఎఫ్ఆర్బీఎం చట్టంలోని అంశాలు అమలు చేయాలి.
- ప్రతి రెండు నెలలకు ఒకసారి ద్రవ్య విధానాన్ని ప్రవేశ పెట్టాలి.
- ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి భారత ప్రభుత్వం ఆర్బీఐని సంప్రదించి ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని నిర్దేశించాలి.
ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ
- ద్రవ్య విధాన కమిటీని 2016 సెప్టెంబర్‌లో ఏర్పాటు చేయగా 2016 అక్టోబర్ 4 నుంచి పనిచేయడం ప్రారంభించింది.
- ద్రవ్య విధాన కమిటీలో ఒక చైర్మన్ ఐదుగురు సభ్యులు ఉంటారు.
- ద్రవ్య విధాన కమిటీ చైర్మన్‌ను ఆర్బీఐ గవర్నర్ ఎంపిక చేస్తాడు.
- ముగ్గురు సభ్యులను భారత ప్రభుత్వం నియమిస్తుంది.
- ద్రవ్య విధాన కమిటీ సంవత్సరానికి కనీసం నాలుగు సార్లు సమావేశం కావాలి. సమావేశానికి కనీస కోరం నలుగురు సభ్యులు ఉండాలి.
- ద్రవ్య విధాన కమిటీలో తీసుకున్న నిర్ణయాలు మెజారిటీ సభ్యులు ఓటింగ్ ద్వారా అమోదిస్తారు.
- కమిటీ నిర్ణయాల్లో ఆర్బీఐ గవర్నర్ తన నిర్ణాయక ఓటు చేస్తారు.
ప్రాక్టీస్ బిట్స్
1. ఆధునిక ప్రభుత్వాల ప్రధాన లక్ష్యం?
ఎ) ఉత్పత్తి పెరుగుదల
బి) సంపూర్ణ ఉద్యోగిత
సి) ధరల స్థిరత్వం
డి) పైవన్నీ
2. ద్రవ్య విధానం పూర్తిగా ఏ బ్యాంక్‌కు సంబంధించినది?
ఎ) యూనియన్ బ్యాంక్
బి) రిజర్వు బ్యాంక్
సి) స్టేట్ బ్యాంక్
డి) పైవన్నీ
3.ద్రవ్య విధానాన్ని ఎప్పుడు, ఎవరు సూచించారు.
ఎ) 18వ శతాబ్దం సంప్రదాయ ఆర్థిక వేత్తలు
బి) 19వ శతాబ్దం ఆధునిక ఆర్థికవేత్తలు
సి) 19వ శతాబ్దం సంప్రదాయ ఆర్థిక వేత్తలు
డి) 20వ శతాబ్దం ఆధునిక ఆర్థికవేత్తలు
4.ఆర్థికవ్యవస్థలో ద్రవ్య సప్లయ్‌ని పెంచడం, తగ్గించడం కోసం ఆర్బీఐ అనుసరించే విధానాన్ని ఏమంటారు?
ఎ) ద్రవ్య విధానం బి) కోశ విధానం
సి) ఎ, బి డి) ఆర్థిక విధానం
5. ద్రవ్య విధానానికి మరొక పేరు?
ఎ) కోశ విధానం బి) పరపతి విధానం
సి) ఆర్థిక విధానం డి) పైవన్నీ
6. కిందివాటిలో ద్రవ్య విధాన పరిధి ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది?
ఎ) ద్రవ్యం ఉపయోగించే స్థాయి
బి) మూలధన మార్కెట్ అభివృద్ధి స్థాయి
సి) ద్రవ్య సప్లయ్
డి) ఎ, బి
7. కిందివాటిలో ద్రవ్య విధాన లక్ష్యాలు ఏవి?
ఎ) ధరల స్థిరత్వం
బి) తటస్థ ద్రవ్య విధానం
సి) మారకపు రేట్ల స్థిరత్వం
డి) పైవన్నీ
8. రుణాల వడ్డీరేట్లు తగ్గించడం వల్ల ద్రవ్య సప్లయ్‌ని పెంచే విధానాన్ని ఏమంటారు?
ఎ) సులభ ద్రవ్య విధానం
బి) కఠిన ద్రవ్య విధానం
సి) ద్రవ్య విధానం డి) పైవన్నీ
9. ఆర్బీఐ ద్రవ్య విధానంలో రెండో దశను ఏమంటారు?
ఎ) నియంత్రిత విస్తరణ దశ
బి) కుదింపు దశ
సి) విస్తరణ దశ
డి) పైవన్నీ
10. ఆర్బీఐ ద్రవ్య విధానంలో మొదటి దశ కాలం?
ఎ) 1952-1972 బి) 1972-1991
సి) 1991-2022 డి) పైవేవీకావు
11. పరిమాణాత్మక, గుణాత్మక విధానాలను ఉపయోగించి ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసే ద్రవ్య విధానం దశ ఏది?
ఎ) మొదటి దశ బి) రెండో దశ
సి) మూడో దశ డి) నాలుగో దశ
12. ఆర్బీఐ ద్రవ్య విధానంలో మూడో దశను ఏమంటారు?
ఎ) నియంత్రిత విస్తరణ దశ
బి) కుదింపుదశ
సి) విస్తరణ దశ డి) పైవన్నీ
13. చక్రవర్తి కమిటీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
ఎ) 1980 బి) 1981
సి) 1982 డి) 1985
14. ఉర్జిత్పటేల్ కమిటీ ఏ ఆర్బీఐ గవర్నర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు?
ఎ) ఎమ్. నర్సింహం
బి) రఘురాం రాజన్
సి) వేణుగోపాల్‌రెడ్డి
డి) రంగరాజన్
15. ద్రవ్య విధాన కమిటీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
ఎ) 2015 సెప్టెంబర్
బి) 2016 సెప్టెంబర్
సి) 2015 అక్టోబర్
డి) 2016 అక్టోబర్
16. ద్రవ్య విధాన కమిటీ నిర్మాణం?
ఎ) చైర్మన్ ఐదుగురు సభ్యులు
బి) చైర్మన్ ఆరుగురు సభ్యులు
సి) ఆరుగురు సభ్యులు
డి) చైర్మన్ నలుగురు సభ్యులు
17. ఒక దేశ ద్రవ్య సప్లయ్‌ని నియంత్రించే విధానాన్ని ఏమంటారు?
ఎ) ద్రవ్య విధానం బి) కోశ విధానం
సి) ఆర్థిక విధానం డి) పైవన్నీ
18. కింది వాటిలో ద్రవ్య విధాన లక్ష్యాలు ఏవి?
ఎ) సంపూర్ణ ఉద్యోగిత సాధన
బి) ఆర్థికాభివృద్ధిని సాధించడం
సి) ధరల స్థిరత్వం
డి) పైవన్నీ
19. రుణాల వడ్డీరేట్లు పెంచడం వల్ల ద్రవ్య సప్లయ్ తగ్గించే విధానాన్ని ఏమంటారు?
ఎ) ద్రవ్యసప్లయ్
బి) సులభ ద్రవ్య విధానం
సి) కఠిన ద్రవ్య విధానం
డి) పైవన్నీ
20. ఆర్థిక మాంద్యం, ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ ఏ ద్రవ్య విధానాన్ని అనుసరిస్తుంది?
ఎ) సులభ ద్రవ్య విధానం
బి) కఠిన ద్రవ్య విధానం
సి) ఆర్థిక విధానం డి) పైవన్నీ
సమాధానాలు
1-డి 2-బి 3-సి 4-ఎ
5-బి 6-డి 7-డి 8-ఎ
9-బి 10-ఎ 11-బి 12-సి
13-సి 14-బి 15-బి 16-ఎ
17-ఎ 18-డి 19-సి 20-ఎ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు