Where do kinship first appear | బంధుత్వఛాయలు మొదటగా ఎక్కడ కన్పిస్తాయి?
సామాజిక నిర్మితి
1. సమాజం సామాజిక సంబంధాల సాలెగూడు అని పేర్కొన్నది?
1) స్పెన్సర్ 2) గిన్స్బర్గ్
3) మెకైవర్ 4) ఎంఎన్ శ్రీనివాస్
2. సామాజిక అభివృద్ధి (Social Develop-ment) గ్రంథ రచయిత?
1) మోర్గాన్ 2) డర్క్హైమ్
3) ఆగస్ట్కామ్టే 4) హబ్హౌస్
3. ఒక కార్మిక సంఘాన్ని దేనికి ఉదాహరణగా పేర్కొంటారు?
1) ప్రాథమిక సమాజం 2) గౌణ సమూహం 3) 1,2 4) ఏదీకాదు
4. సామాజిక నిర్మితిని మొదటిసారిగా అధ్యయనం చేసిన సమాజశాస్త్రవేత్త?
1) డర్క్హైమ్ 2) ఆగస్ట్కామ్టే
3) హెర్బర్ట్ స్పెన్సర్ 4) మాలినోస్కి
5. కుల అధ్యయనాలను జతపర్చండి.
1) చారిత్రకవాదం ఎ) కోశాంబి
2) మార్క్సిస్ట్వాదం బి) ఏఆర్ దేశాయ్
3) నిమ్నజాతులవాదం సి) అంబేద్కర్
4) నిర్మితి ప్రకల్పవాదం డి) ఎంఎన్ శ్రీనివాస్
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
3) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
4) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
6. బౌద్ధమతం ఏ ప్రాతిపదికన ఆవిర్భవించింది?
1) ఆధ్యాత్మిక భావజాలం
2) భగవంతుని ఆరాధన
3) ప్రకృతి ఆరాధన
4) పూర్వీకుల ఆరాధన
7. సమాజానికి కావాల్సిన ప్రధాన లక్షణం?
1) పరస్పర అవగాహన
2) నిర్దిష్ట భూభాగం
3) సామరస్యం
4) విలీనీకరణం
8. సంస్కృతి అనేది ఒక ?
1) సహజ ప్రవర్తన
2) నేర్చుకొనబడిన ప్రవర్తన
3) అనువంశిక ప్రవర్తన 4) ఏదీకాదు
9. పోటీని శాంతియుత సంఘర్షణగా పేర్కొన్నది?
1) వెబర్ 2) కోజర్
3) డర్క్హైమ్ 4) స్పెన్సర్
10. ది నేషన్ అండ్ ఫ్యామిలి గ్రంథ రచయిత?
1) అల్వా మిర్దాల్ 2) మాలినోస్కి
3) ముర్దాక్ 4) గున్నార్ మిర్దాల్
11. బంధుత్వ ఛాయలు మొదటిసారిగా ఎక్కడ కన్పిస్తాయి?
1) ఐతరేయ బ్రాహ్మణం
2) వాయుపురాణం
3) రుగ్వేదం 4) విష్ణుపురాణం
12. కారల్మార్క్స్ ప్రకారం మతం దేనికి తోడ్పడుతుంది?
1) విప్లవం 2) సముదాయం
3) సామాజిక మార్పు
4) వ్యవస్థలోని సామాజిక సంస్థలు
13. సమాజ పుట్టుకను నిర్వచించే సరైన సిద్ధాంతం?
1) డివైన్ ఆరిజన్
2) ఎవల్యూషనరీ థియరీ
3) జెనెటిక్స్ థియరీ
4) పితృస్వామ్య సిద్ధాంతం
14. సామాజికవేత్త హెర్బర్ట్ స్పెన్సర్ జీవిలో రక్త ప్రసరణను సమాజంలో దేనితో పోల్చారు?
1) భావప్రసారశక్తి 2) రవాణా
3) సంస్కృతి 4) పర్యావరణం
15. గిరిజన తెగలు, సంబంధిత ప్రాంతాలను జతపర్చండి.
1) చెంచులు ఎ) మహబూబ్నగర్
2) భూటియా బి) త్రిపుర
3) కోర్వా సి) మధ్యప్రదేశ్
4) బైగా డి) ఒడిశా
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
3) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
4) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
16. ఉద్యమాలు, సంబంధిత రాష్ర్టాలను జతపర్చండి.
1) తానాభగత్ ఉద్యమం ఎ) జార్ఖండ్
2) వర్లి ఉద్యమం బి) మహారాష్ట్ర
3) జాతిల్ ఉద్యమం సి) ఉత్తరప్రదేశ్
4) ఆదిధర్మ ఉద్యమం డి) పశ్చిమబెంగాల్
1) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
2) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
3) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
17. సంస్కృతిని సంశ్లిష్ట మొత్తంగా నిర్వహించిన సామాజికవేత్త?
1) టైలర్ 2) మెకైవర్
3) మాకియవెల్లి 4) హెర్కోవిట్స్
18. మానవజాతి చరిత్రను ఆటవిక, అనాగరిక, నాగరిక దశలుగా వర్గీకరించినవారు?
1) రాడ్క్లిఫ్బ్రౌన్ 2) ఫ్రాంజ్ బోయాస్ 3) మోర్గాన్ 4) మాలినోవ్స్కి
19. భారతదేశ జనాభాను రిస్లే ఎన్ని వర్గాలుగా విభజించారు?
1) 4 2) 6 3) 9 4) 7
20. ఏకదేవతారాధనను పాటించే మతం?
1) ఇస్లాం 2) క్రైస్తవం
3) 1, 2 4) ఏదీకాదు
21. కింది వ్యక్తులకు సంబంధించిన వాటిని జతపర్చండి.
1) బీఎస్ వెంక్రటావ్
ఎ) ఎన్ఎస్డీపీ ఉద్యమం
2) కాన్షీరాం బి) డీఎస్-4
3) అంబేద్కర్ సి) మూక్నాయక్
4) నారాయణ గురు
డి) స్టేట్ డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్
22. కులాన్ని మార్క్సిస్ట్ దృక్పథంలో అధ్యయనం చేసినవారు?
1) డీపీ ముఖర్జీ 2) ఏఆర్ దేశాయ్
3) 1, 2 4) ఏదీకాదు
23. ఏ కుటుంబంలో భర్త, భార్య పుట్టింట్లో కాపురం ఉంటాడు?
1) మాతృస్వామ్య కుటుంబం
2) మాతృవంశీక కుటుంబం
3) ఉమ్మడి కుటుంబం
4) మాతృత్వాధికార కుటుంబం
24. బహు భార్యత్వం కలిగిలేని తెగ?
1) నాగాలు 2) బైగాలు
3) గోండులు 4) ఖాసాలు
25. కులం హిందూ మతానికి మాత్రమే సంబం ధించిందని పేర్కొన్నవారు?
1) ఎన్కే దత్ 2) ఎంఎన్ శ్రీనివాస్
3) ఎన్సీ దూబె 4) లూయిస్ డ్యుమాంట్
26. సంస్కృతీకరణ అనే భావనకు ఎం.ఎన్ శ్రీనివాస్ మొదటగా పెట్టినపేరు?
1) హిందూయీకరణ 2) డీ ట్రైబలైజేషన్ 3) బ్రాహ్మణీకరణం 4) సాంఘీకరణం
27. 1940లో తెలంగాణలోని గిరిజనులపై అధ్యయనం చేసినవారు?
1) హైమన్డార్ఫ్ 2) ఎంఎన్ శ్రీనివాస్ 3) ఎన్సీ దూబె 4) ఏఆర్ దేశాయ్
28. ఎనిమిది రకాల హిందూ వివాహాల్లో అత్యంత ఆమోదం పొందినది?
1) దైవ 2) అర్ష
3) గాంధర్వ 4) బ్రహ్మ
29. ది పాలిటిక్స్ ఆఫ్ ది ఫ్యామిలి గ్రంథాన్ని ఎవరు రచించారు?
1) డేవిడ్ కూపర్ 2) ఆర్డీ లెయింగ్
3) ఎం బెన్స్టర్ 4) ఎంఎన్ శ్రీనివాస్
30. సామాజిక దూరం స్కేల్ను ఎవరు రూపొందించారు?
1) థర్స్టన్ 2) గట్మాన్
3) బొగార్టస్ 4) లైకార్ట్
జవాబులు
1-3, 2-4, 3-2, 4-3, 5-1, 6-1, 7-1, 8-4, 9-2, 10-1, 11-1, 12-4, 13-2, 14-1, 15-1, 16-4, 17-4, 18-3, 19-4, 20-3, 21-3, 22-3, 23-1, 24-4, 25-4, 26-3, 27-1, 28-4, 29-2, 30-3
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు