Poet to poets | కవులకు కవి పాల్కురికి సోమనాథుడు
మన కవులు
కవులకు కవి, మహోన్నత కవి తెలంగాణ మాగాణంలో అన్ని కవితాప్రక్రియల్లో ఆరితేరిన కవికుల గురువు, సోమనాథుడు, స్మరామి స్మరామి, హే సోమనాథా-ప్రణోమి (ప్రణమామి) ప్రణోమి.. వాగ్దేవి వరప్రసా(ది)దః
-మహాకవి పాల్కురికి సోమనాథుడు క్రీ.శ. 1160-1240లో జన్మించాడు. అయితే కొంతమంది చరిత్రకారులు 1240, 1280, 1340 అని అంటున్నారు. నాటి ఏకశిలా నగరం (నేటి వరంగల్లు)లోని పాలకుర్తి గ్రామం. తల్లి శ్రియాదేవి, తండ్రి విష్ణురాయదేవుడు. విద్యా గురువు కరస్థల విశ్వనాథయ్య శివదీక్షా గురువు లింగార్యుడు. తన బాల్యంలోనే ప్రకండ పండితుడిగా, గొప్ప కవిగా ప్రసిద్ధిచెందాడు. అంధులకు నేత్రాలు, అంగహీనులకు అంగాలు తన ప్రభావం వల్ల వచ్చేటట్లు చేశాడని చెబుతారు. చతుర్వేద సర్వశాస్త్ర పారంగతుడై అష్టభాషా పాండిత్యం గావించి దేశీయ చందమైన ద్విపద రచనచేసిన మొదటి తొలి (తెలుగు) తెలంగాణ మహాకవి. ఎన్నో గ్రంథాలను రాసిన మహోన్నత కవి. 1) అనుభవసారం 2) అష్టోత్తర శతనామగద్య 3) అక్షరాంకగద్య 4) గంగోత్పత్తి రగడ 5) చతుర్విద సారం 6) చెన్నమల్లు సీసములు 7) నమస్కారగద్య 8) పంచరత్నాలు (పంచక్రారగద్య) 9) పండితారాధ్య చరిత్ర 10) బసవపురాణం 11) బసవాష్టకం 12) బసవోదాహరణం 13) రుద్రభాష్యం 14) వృషాధిప శతకం 15) ఉమామహేశ్వరవ్రత కల్పం (ఈ తాళపత్ర గ్రంథాన్ని సేకరించాడు వ్యాసకర్త) 16) సోమనాథభాష్యం 17) సోమనాథస్తవం 18) సద్గురు రగడ 19) మల్లమదేవి పురాణం (4 అశ్వాసాల ద్విపద కావ్యం) 20) బసవరగడ 21) చెన్నబసవ రగడ 22) బసవాద్య రగడ 23) బసవోదాహరణ యుగ్మము (సంస్కృతం, తెలుగు భాషల్లో) 24) త్రివిధలింగాష్టకం ఇవేకాక మరికొన్ని గ్రంథాలను రచించాడు. అవి అలభ్యాలు.
-పాల్కురి సోమనాథున్ని మహాకవి అనడానికి ఒక్క వృషాధిపశతకం ఒకటే చాలు. ఎనిమిది భాషల్లో 1) సంస్కృతం 2) ద్రావిడ 3) కన్నడం 4) ఆరె 5) మణప్రవాళ 6) అరుదుమణి ప్రవాళ 7) వాగ్గేయమణి ప్రవాళ 8) గ్రాంథిక జాను తెనుంగు భాషల్లో ఒక్కొక్క పద్యం రాశాడు. భాషకొక పద్యం చొప్పున కాకుండా పదహారు పాదాలకు తగ్గక 88 పాదాలదాకా వివిధ భాషల వరుస నడకలు కూడా రాశాడు. మోడీ, ప్రాకృత (బ్రాహ్మీ), పాళీ భాషల్లోనూ సోమనాథునికి ప్రవేశం ఉంది. తెలుగు, తమిళం, కన్నడం, ఆరె భాషలను బంతులుకట్టి పాడించటమేకాకుండా ఆభాషలను అవపోసనపట్టి సాహిత్య కవిత్వ, హాస్య, కరుణ, రౌద్ర, అద్భుత, వీర, బీభత్స, భయానక, శాంత, మృదురసాలను చూపించాడు. ఎంతోమంది ఈయనపై రాసినను బండారు తమ్మయ్య ఈయనపై కొంత పరిశోధన చేశాడు.
-సోమనాథుని బసవపురాణంలోని కింది పద్యాలను చూడండి
1) ఉదుతర గద్య పద్యోక్తుల కంటే
సరసమైన పరిగిన జానుదెనుంగు
చర్చింపగా సర్వసామాన్య బగుట
గూర్చెద ద్విపదలు గోర్కి దూవణ
పై పద్యాన్ని తెలుగు ద్విపదలోనూ చెప్పాడు సోమనాథుడు
అనుభవసారంలో
2) విమల చిత్ప్రపూర్తి విశ్వేశుమూర్తి
వినయ వర్తి భువన వినుత కీర్తి
విభుకరస్తలంబు విశ్వేశుకారుణ్య
-జనత వినుత కావ్యశక్తియుతుండ అనే ఈ పద్యాన్ని బట్టి సుకృతాత్ముడగు కరస్థలి విశ్వనాథ ప్రకట వరప్రసాద కవిత్వయుతుండగు బసవపురుణా వాఖ్యమును బట్టి కవిత్వ స్ఫూర్తిజేర్చి అనేదాన్ని బట్టి ఈ కవి ద్విపదలో రచన సాగించాడు. అలాగే మన తెలంగాణ వారి కోసం కావ్యగాణంతో కింది మూడో పద్యాన్ని పూర్తిగావించాడు.
3) తొలి కోడి కనువిచ్చి నిలిచిమైవెంచి
జలజల రెక్కలు సడలించి నీల్గి
గ్రక్కున గాలార్చి కంఠంబు విచ్చి
ముక్కున నీకెలు చక్కొల్పికడపు
నిక్కించి మెడసాచి, నిక్కి మున్సూచి
-కొక్కరో కుర్రని కూయక మున్న పద్యాలనేకాక వచన పద్యాలనుకూడా రాశాడని పరిశోధకులు చెబుతున్నారు. నేటి మన తెలుగు సాహిత్యంలో వచన పద్యాలు, వచన కవితలు రాయడం కొత్తేమీకాదు. చాలాకాలం పూర్వమే రెండో ప్రతాపరుద్రుని కాలంనుంచే ప్రారంభమైనది. వచన రచన అనేది ఈ యుగానికి పూర్వమే ఉందని ఆనాటి రాజుల ఆస్థానాల్లో మృదుమధుర రస భావ భాసురనవార్థ వచన రచనా విశారదులు ఉండేవారని ఆదికవులు ఎంతోమంది చెప్పారు. నన్నయ్యభట్టు మహాభారతంలోని అవతారికలో (1-8) రాశారు. ఇలా ఆనాటి నుంచే సాగుతుంది.
వచన పద్యాల పరంపరల కవితల నీరాజనం. సంస్కృతాలంకారికుల మతంలో ఎన్నో మంచి రీతులు ఉన్నాయి. 1) వైదర్భి 2) గౌడి 3) పాంచాలి 4) లాటి 5) మాగధి 6) అవంతిక మొదలైన శబ్ద విభాగాలను బట్టి రీతులకు పేర్లు పెట్టి లెక్కిస్తే అవి బహుసంఖ్యాకమవుతాయి. ఈ ఆరింటిలోనూ ఆరితేరిన మహాకవి సోమనాథుడు. 1) వైదర్భి (కోమలంగా ఉంటుంది) 2) గౌడి (కఠినంగా ఉంటుంది) ఈ రెండు రీతుల్లో ఏది అడిగినా ఆ రెండింటిలో కవిత్వం చెప్పగల కవి సోమనాథుడు. అష్ట భాషాపాండిత్యం గురించి ఆరోజుల్లో ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. పోతన మహాకవికి అనుప్రాససౌందర్యం నేర్పింది మన సోమనాథుడే.
-శైవ సాహిత్యాన్ని తెలుగు సాహిత్యాన్ని ప్రవేశపెట్టినది వీరశైమతమైనప్పటికీ ప్రధానోద్దేశంగానే, మహాకవి సోమనాథుడు రాసిన మహాగ్రంథాలు ఒక మహోన్నత ఎత్తుకు ఎదిగి ప్రపంచంలోనే ఒక నవనీతాన్ని చూపాయి. అందుకే అంతటి మహాకవి సోమనాథుడు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?