మానవ రక్తంలో ప్లాస్మా ఎంత శాతం ఉంటుంది?
జీవశాస్త్రం
1. కింది వాటిలో సరికాని వాక్యం గుర్తించండి.
1) ఎర్ర రక్తకణ సమూహాన్ని తెల్లరక్త కణ సమూహాన్ని కోలియాక్స్ అంటారు
2) ఎర్ర రక్తకణాల సంఖ్యలో తగ్గుదల- ఎరిత్రో సైటోపీనియా
3) ఎర్ర రక్తకణాల అసాధారణ పెరుగుదల- పాలి సైథీమియా
4) రక్తంలో ఆక్సిజన్ కొరత ఎరిత్రో పాయిటిన్ హార్మోన్ విడుదలను ప్రేరేపిస్తుంది
2. రక్త స్కందనానికి తోడ్పడే పదార్థం ఏది?
1) ప్లాస్మాలోని నీరు
2) ప్లాస్మాలోని ప్రోత్రాంబిన్
3) ఎర్రరక్త కణంలోని హిమోగ్లోబిన్
4) తెల్ల రక్త కణంలోని జీవ పదార్థం
3. కింది వాటిలో సరైంది ఏది?
ఎ. ఆంజియాలజీ- రక్తనాళాల గురించి అధ్యయనం చేసేది
బి. మహాధమని అతిపెద్ద ధమని. ఇది కుడి జఠరిక నుంచి బయలుదేరి ఆక్సిజన్ సహిత రక్తాన్ని శరీర భాగాలకు సరఫరా చేస్తుంది
సి. కరోనరీ ఆర్టరీలో ఏర్పడే అడ్డంకుల వల్ల గుండెపోటు (హార్ట్ ఎటాక్) వస్తుంది
1) ఎ మాత్రమే 2) ఎ, సి మాత్రమే
3) ఎ, బి మాత్రమే 4) బి మాత్రమే
4. కింది వాటిని జతపరచండి.
ఎ. చేప 1. ఒక జఠరిక
బి. కప్ప 2. రెండు జఠరికలు
సి. తొండ 3. రెండు గదుల గుండె
డి. మానవుడు 4. అసంపూర్తిగా
విభజన చెందిన
జఠరిక
1) ఎ-3, బి-1, సి-4, డి-2
2) ఎ-2, బి-4, సి-1, డి-3
3) ఎ-3, బి-1, సి-2, డి-4
4) ఎ-3, బి-2, సి-4, డి-1
5. మొసలి (సరీసృపం) గుండె గదుల సంఖ్య ఎంత?
1) 2 2) 3 3) 4 4) 1
6. కింది వాటిని జతపరచండి.
1. కణాంతర ప్రసరణ వ్యవస్థ
2. జఠర ప్రసరణ కుహరం
3. శరీర కుహర ద్రవం
4. వివృత రక్త ప్రసరణ వ్యవస్థ
5. సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ?
ఎ. బొద్దింక బి. మానవుడు
సి. అమీబా డి. స్పంజికలు
ఇ. వానపాము
1) 1-డి, 2-సి, 3-ఎ, 4-ఇ, 5-బి
2) 1-సి, 2-డి, 3-ఇ, 4-ఎ, 5-బి
3) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి, 5-ఇ
4) 1-సి, 2-ఇ, 3-డి, 4-బి, 5-ఎ
7. మానవుడి ఎర్ర రక్తకణాల నిర్మాణం ఎలా ఉంటుంది?
1) కుంభాకారం, అండాకారం, కేంద్రక రహితం
2) పుటాకారం, అండాకారం, కేంద్రక సహితం
3) పుటాకారం, వర్తులాకారం, కేంద్రక రహితం
4) పుటాకారం, వర్తులాకారం, కేంద్రక సహితం
8. రక్తంలో తెల్ల రక్తకణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడాన్ని ఏమంటారు?
1) ఎరిత్రోపీనియా 2) పాలీసైథీమియా
3) ల్యూకోపీనియా 4) లుకేమియా
9. మానవుడిలో గుండె ద్వారా రక్త ప్రసరణ ఏ విధంగా జరుగుతుంది?
1) ఎడమ కర్ణిక కుడి జఠరిక ఎడమ జఠరిక కుడి కర్ణిక
2) ఎడమ జఠరిక ఎడమ కర్ణిక
ఊపిరితిత్తులు కుడి కర్ణిక కుడి జఠరిక
3) కుడి కర్ణిక కుడి జఠరిక ఊపిరితిత్తులు ఎడమ కర్ణిక ఎడమ జఠరిక
4) ఎడమ కర్ణిక ఎడమ జఠరిక ఊపిరితిత్తులు కుడి కర్ణిక కుడి జఠరిక
10. ఆరోగ్యవంతమైన వ్యక్తి దేహంలో ఉండే రక్తం ఎంత?
1) 2 లీటర్లు 2) 5 లీటర్లు
3) 7 లీటర్లు 4) 8 లీటర్లు
11. ఆరోగ్యవంతమైన మానవుడిలో గుండె నిమిషానికి ఎన్నిసార్లు స్పందిస్తుంది?
1) 79 2) 85 3) 62 4) 72
12. కింది వాటిని జతపర్చండి.
1. బేసోఫిల్స్ ఎ. వ్యాధినిరోధక చర్యల్లో ప్రముఖ పాత్ర
2. ఇసినోఫిల్స్ బి. అతిపెద్ద గమన భక్షక కణాలు
3. న్యూట్రోఫిల్స్ సి. ప్రతిజనక- ప్రతిరక్షక సంక్లిష్టాలను రక్తం నుంచి తొలగిస్తాయి
4. లింఫోసైట్స్ డి. సూక్ష్మరూప భక్షక భటులు
5. మోనోసైట్స్ ఇ. హెపారిన్, హిస్టమిన్ను ఉత్పత్తి చేస్తాయి
సరైన జవాబును గుర్తించండి.
1) 1-ఇ, 2-సి, 3-డి, 4-బి, 5-ఎ
2) 1-ఇ, 2-డి, 3-సి, 4-ఎ, 5-బి
3) 1-ఇ, 2-సి, 3-డి, 4-ఎ, 5-బి
4) 1-ఇ, 2-సి, 3-ఎ, 4-డి, 5-బి
13. రక్త ఫలకికల గురించి సరికాని వాక్యం గుర్తించండి.
1) కేంద్రక రహితం, గుండ్రం, అండాకార, ద్వికుంభాకార చక్రిక లాంటి నిర్మాణాలు
2) అస్థి మజ్జలోని బృహత్కేంద్రక కణాలు శకలీకరణం వల్ల ఏర్పడతాయి
3) జీవిత కాలం 5-9 రోజులు
4) రక్త స్కందనంలో ఎటువంటి పాత్ర వహించవు
14. కింది వాటిలో సరైన అంశాన్ని గుర్తించండి.
1) ఎర్రరక్త కణాలను ల్యూకోసైట్లు అంటారు
2) మానవుడి ఎర్రరక్త కణాలు పుటాకారంగా, కేంద్రక సహితంగా ఉంటాయి
3) తెల్లరక్త కణాలను ఎరిత్రోసైట్లు అంటారు
4) మానవుడి రక్తంలో ప్లాస్మా, ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, రక్త ఫలకికలు ఉంటాయి
15. కింది అంశాలు అధ్యయనం చేయండి.
ఎ. హిమోగ్లోబిన్లోని మూలకం ఇనుము
బి. తెల్ల రక్తకణాలు అధికమవడాన్ని ల్యూకోపీనియా అంటారు
సి. రక్త ఫలకికలు ప్రతిదేహాలను ఉత్పత్తి చేస్తాయి
డి. త్రాంబోప్లాస్టిన్ సమక్షంలో
ప్రోత్రాంబిన్ను త్రాంబిన్గా మారుస్తుంది
పై వాటిలో సరైన వాటిని గుర్తించండి.
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, డి 4) ఎ, సి
16. రక్త స్కందనంలోని ముఖ్య చర్య?
1) ప్రోత్రాంబిన్ నుంచి ఫైబ్రిన్ ఏర్పడటం
2) ఫైబ్రినోజన్ నుంచి ఫైబ్రిన్ ఏర్పడటం
3) త్రాంబోప్లాస్టిన్ నుంచి ప్రోత్రాంబిన్ ఏర్పడటం
4) Ca++ అయాన్ల విడుదల
17. కింది వాటిని జతపరచండి.
ఎ. ఎర్ర రక్తకణాలు 1. నిమ్మ
బి. తెల్ల రక్తకణాలు 2. ఆకుకూరలు
సి. రక్త ఫలకికలు 3. క్యారెట్
డి. ప్లాస్మా 4. సూర్యరశ్మి
5. ఆక్సిజన్ రవాణా
1) ఎ-5, బి-4, సి-2, డి-1
2) ఎ-2, బి-1, సి-4, డి-5
3) ఎ-5, బి-4, సి-1, డి-2
4) ఎ-3, బి-4, సి-1, డి-2
18. చేప గుండెలోని గదుల సంఖ్య?
1) 3 2) 2 3) 4 4) 1
19. కింది వాటిని జతపరచండి.
1. తెల్ల రక్తకణాలు ఎ. ల్యూకోసైటోపీనియా ఏర్పడే విధానం
2. కొద్దిగా పెరిగిన తెల్ల రక్తకణాల సంఖ్య బి. ల్యూకోపాయిసిస్
3. అసాధారణ సంఖ్యలో పెరిగిన తెల్ల రక్తకణాలు సి. ల్యూకోసైటోసిస్
4. తెల్ల రక్తకణాలు క్షీణించడం డి. లుకేమియా
సరైన జతను గుర్తించండి.
1) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి 2) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
3) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి 4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
20. కింది వాటిని జతపరచండి.
1. బేసోఫిల్స్ ఎ. 2.3 శాతం
2. ఇసినోఫిల్స్ బి. 62 శాతం
3. న్యూట్రోఫిల్స్ సి. 0.4 శాతం
4. లింఫోసైట్స్ డి. 5.3 శాతం
5. మోనోసైట్స్ ఇ. 30 శాతం
కింది వాటిలో సరైన జవాబును గుర్తించండి.
1) 1-సి, 2-ఎ, 3-బి, 4-ఇ, 5-డి
2) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి, 5-ఇ
3) 1-సి, 2-డి, 3-బి, 4-ఇ, 5-ఎ
4) 1-ఎ, 2-బి, 3-ఇ, 4-డి, 5-సి
21. మానవ హృదయంలోని జఠరికల సంఖ్య ఎంత?
1) 4 2) 3 3) 2 4) 1
22. సార్వత్రిక రక్త గ్రహీత?
1) A 2) B 3) AB 4) O
23. కింది వాటిని జతపరచండి.
ధమని రక్తం ప్రవహించే మార్గం
ఎ. పుపుస 1. కుడి జఠరిక నుంచి ఊపిరితిత్తులు
బి. దైహిక 2. ఎడమ జఠరిక నుంచి శరీర భాగాలు
సి. హృదయ 3. మహాధమని నుంచి హృదయం
1) ఎ-2, బి-1, సి-3 2) ఎ-1, బి-2, సి-3
3) ఎ-3, బి-2, సి-1 4) ఎ-3, బి-1, సి-2
24. కింది వాటిలో సరికానిది ఏది?
ఎ. రక్తంలోని గ్లూకోజ్ శాతాన్ని పెంచేది ఇన్సులిన్
బి. రక్తంలోని గ్లూకోజ్ శాతాన్ని తగ్గించేది గ్లూకగాన్
1) ఎ మాత్రమే 2) బి మాత్రమే
3) ఎ, బి మాత్రమే 4) ఎ, సి మాత్రమే
25. రక్త స్కందనం జరిగేటప్పుడు వివిధ దశల సరైన వరుస క్రమాన్ని గుర్తించండి.
1) త్రాంబిన్- ప్రోత్రాంబిన్- ఫైబ్రిన్- ఫైబ్రినోజన్- రక్తపు గడ్డ
2) ఫైబ్రిన్- త్రాంబిన్- ప్రోత్రాంబిన్- ఫైబ్రినోజన్- రక్తపు గడ్డ
3) ఫైబ్రినోజన్- ఫైబ్రిన్- త్రాంబిన్- ప్రోత్రాంబిన్- రక్తపు గడ్డ
4) ప్రోత్రాంబిన్- త్రాంబిన్- ఫైబ్రినోజన్- ఫైబ్రిన్- రక్తపు గడ్డ
26. ప్లాస్మా కణాల విధి ఏమిటి?
1) ప్రతిరక్షకాలను ఏర్పరచడం
2) కొవ్వుల నిల్వ
3) ప్రొటీన్ల నిల్వ 4) వాసోడైలేషన్
27. మానవ హృదయంలో లయారంభకం ఏది?
1) సిరాకర్ణికా కణుపు
2) కర్ణికాజఠరికా కణుపు
3) మిట్రల్ కవాటం
4) బండిల్ ఆఫ్ హిస్
28. మానవ రక్తంలో ప్లాస్మా ఎంత శాతం ఉంటుంది?
1) 45 శాతం 2) 55 శాతం
3) 65 శాతం 4) 35 శాతం
29. కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి.
1) రక్తం ఒక ద్రవరూప కణజాలం
2) రక్తం హార్మోన్లను రవాణా చేస్తుంది
3) రక్తానికి వ్యాధినిరోధక శక్తి ఉంది
4) రక్తం గడ్డకట్టడానికి హెపారిన్ తోడ్పడుతుంది
1) 1, 2, 3 2) 1, 2
3) 2, 3, 4 4) 1, 2, 3, 4
30. హిమోగ్లోబిన్లో ఉండే మూలకం?
1) రాగి 2) కోబాల్డ్
3) ఇనుము 4) కాల్షియం
31. ఎర్ర రక్తకణాలకు సంబంధించి సరికానిది ఏది?
1) ఎర్ర రక్తకణాల జీవితకాలం 12-13 రోజులు
2) ఎర్ర రక్తకణాల ఉత్పత్తి ప్రక్రియను ఎరిత్రోపాయిసిస్ అంటారు
3) ఎర్ర రక్తకణాల లోపం వల్ల ఎనీమియా వ్యాధి కలుగుతుంది
4) ఎర్ర రక్తకణాల సంఖ్య 4-6 మిలియన్లు/క్యుబిక్ మిల్లీ లీటర్లు
32. ల్యూకోసైట్స్కు సంబంధించి సరికానిది ఏది?
1) వీటి సంఖ్య 9000/ క్యుబిక్ మిల్లీ లీటర్లు
2) ల్యూకోసైట్స్ జీవితకాలం 12-13 రోజులు
3) వీటి ఆకారం బల్లపరుపు
4) ల్యూకోసైట్స్ సంఖ్య తగ్గితే ‘ల్యూకోపీనియా’ వస్తుంది
33. రక్త ఫలకికలకు సంబంధించి సరైన వ్యాఖ్య ఏది?
ఎ. రక్త ఫలకికలు సాధారణంగా 2.5-4.5 లక్షలు/క్యూబిక్ మిల్లీ లీటర్లు
బి. వీటి జీవిత కాలం 3-10 రోజులు
1) ఎ మాత్రమే 2) బి మాత్రమే
3) ఎ, బి 4) ఏదీ కాదు
34. కింది క్షీరదాల్లో దేని ఎర్ర రక్తకణాలు కేంద్రక సహితాలు?
1) కుందేలు 2) ఒంటె
3) మానవుడు 4) కోతి
35. నాలుగు గదుల గుండె కలిగిన శీతల రక్త జంతువును గుర్తించండి.
1) ధృవపు ఎలుగుబంటి 2) తిమింగలం
3) పెంగ్విన్ 4) మొసలి
36. కింది వాటిని జతపరచండి.
జంతువు గుండెలోని గదుల సంఖ్య
ఎ. సొరచేప 1. పదమూడు
బి. కప్ప 2. నాలుగు
సి. బొద్దింక 3. రెండు
డి. తిమింగలం 4. మూడు
5. ఐదు
సరైన సమాధానాన్ని ఎన్నుకోండి.
1) ఎ-3, బి-4, సి-1, డి-5
2) ఎ-3, బి-4, సి-1, డి-2
3) ఎ-2, బి-1, సి-4, డి-3
4) ఎ-4, బి-3, సి-1, డి-2
37. మనిషి గుండెలో రక్తం ప్రవహించే విధానం ఏది?
1) శరీర భాగాలు కుడికర్ణిక కుడి
జఠరిక ఎడమ కర్ణిక ఎడమ జఠరిక
2) ఎడమ జఠరిక శరీర భాగాలు కుడికర్ణిక కుడి జఠరిక ఊపిరితిత్తులు కర్ణిక
3) ఊపిరితిత్తులు కుడి కర్ణిక కుడి జఠరిక శరీర భాగాలు
4) ఊపిరితిత్తులు కర్ణికెేఎడమ జఠరిక కుడి కర్ణికెేకుడి జఠరిక
38. మానవుడి ఎర్రరక్త కణాల జీవిత కాలం?
1) 100 రోజులు 2) 120 రోజులు
3) 200 రోజులు 4) 180 రోజులు
39. చనిపోయిన ఎర్ర రక్తకణాలు శిథిలమయ్యే భాగం?
1) ప్లీహం 2) కాలేయం
3) క్లోమం 4) పురీషనాళం
- Tags
- Biology
- human blood
- nipuna
- plasma
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు