వహాబీ ఉద్యమానికి నాయకత్వం వహించినది?
తెలంగాణ చరిత్ర
1. గోల్కొండ రాజ్యాన్ని మొగలులు జయించిన తర్వాత హైదరాబాద్ రాజధానిగా దక్కన్‌ను పాలించినది?
ఎ) అసఫ్జాహీలు బి) బహదూర్ షా
సి) మొగలులు డి) కుతుబ్‌షాహీలు
2. అసఫ్‌జాహీ వంశ స్థాపకుడు?
ఎ) అసఫ్ జా నిజాం-ఉల్-ముల్క్
బి) ఉస్మాన్ అలీఖాన్
సి) సికిందర్ జా
డి) పై ఎవరూకాదు
3. మీర్ ఖమ్రుద్దీన్‌ఖాన్ లేదా అసఫ్‌జా నిజాం-ఉల్-ముల్క్కు ‘చిన్కిలిచ్ఖాన్’ అనే బిరుదును ప్రదానం చేసినది?
ఎ) ఔరంగజేబు బి) షాజహాన్
సి) సయ్యద్ డి) మహ్మద్ షా
4. అసఫ్ జా బిరుదును ప్రదానం చేసినది?
ఎ) మహ్మద్ షా బి) జౌరంగజేబు
సి) షాజహాన్ డి) ఫరూక్‌షియర్
5. అసఫ్ జా నిజాం-ఉల్-ముల్క్ పాల్ఖేట్ వద్ద ఎవరి చేతిలో ఓడి ముషిగావ్ సంధికి అంగీకరించాడు
ఎ) శివాజీ బి) సాహు
సి) బాలాజీరావు డి) త్రియంబక్
6. నిజాం ఉల్ ముల్క్ మహారాష్ర్టులతో చేసుకున్న సంధి?
ఎ) ముషిగావ్ సంధి బి) వార్నా సంధి
సి) దురారీ సరాయి సంధి
డి) పైవన్నీ
7. నిజాం ఉల్ ముల్క్ ఏ సంధి ప్రకారం మహారాష్ర్టులకు చౌత్ సర్దేశ్ముఖ్ పన్నులు చెల్లించడానికి ఒప్పుకున్నాడు?
ఎ) ముషిగావ్ సంధి బి) వార్నా సంధి
సి) దురారీ సరాయి సంధి
డి) ఏదీకాదు
8. నిజాం ఉద్దౌలా బిరుదు పొందినది?
ఎ) నాసర్‌జంగ్ బి) ముజఫర్ జంగ్
సి) హిమ్మత్ఖాన్ డి) ఘాజీవుద్దీన్
9. ఫ్రెంచి గవర్నర్ డూప్లే సహాయంతో దక్కన్ సుబేదారు అయినది?
ఎ) నాసర్‌జంగ్ బి) ముజఫర్ జంగ్
సి) హిమ్మత్ఖాన్ డి) ఘాజీవుద్దీన్
10. ఆంగ్లేయులతో సంధి చేసుకొని గుంటూరు తప్ప ఉత్తర సర్కారులన్నింటిని ఆంగ్లేయుల పరం చేసినది?
ఎ) నాసర్‌జంగ్ బి) సలాబత్ జంగ్
సి) హిమ్మత్ఖాన్ డి) పై ఎవరూకాదు
11. రెండో అసఫ్‌జా బిరుదుతో నిజాం అయినది ?
ఎ) నిజాం అలీఖాన్ బి) సికిందర్ జా
సి) నాసర్‌జంగ్ డి) హిమ్మత్ఖాన్
12. ఎవరికాలం నుంచి అసఫ్‌జాహీ ప్రభువులు నిజాం ప్రభువులుగా ప్రసిద్ధి చెందారు?
ఎ) నిజాం అలీఖాన్ బి) నాజర్ జంగ్
సి) సలాబత్సంగ్ డి) సికిందర్ జా
13. ఫ్రెంచి సేనాని రెమండ్ సాయంతో తుపాకుల కర్మాగారాలు నెలకొల్పినది ఎవరు?
ఎ) సికిందర్ జా బి) నిజాం అలీఖాన్
సి) ముజఫర్ జంగ్ డి) నాసర్ జంగ్
14. వెల్లస్లీ ప్రవేశ పెట్టిన సైన్య సహకార పద్ధతికి అంగీకరించినది?
ఎ) సికిందర్ జా బి) నిజాం అలీఖాన్
డి) నాసర్ జంగ్ సి) ముజఫర్ జంగ్
15. నిజాం అలీఖాన్ నిర్మించినవి?
ఎ) మోతీ మహల్ బి) గుల్షన్ మహల్
సి) రోషన్ బంగ్లా డి) పైవన్నీ
16. ఎవరి పేరుతో సికింద్రాబాద్ నిర్మాణం జరిగింది?
ఎ) ఉస్మాన్ అలీఖాన్
బి) నిజాం ఉల్ ముల్క్
సి) నిజాం అలీఖాన్
డి) సికిందర్ జా
17. రస్సెల్ దళం (హైదరాబాద్ సైన్యం) ఎవరి కాలంలో ఏర్పాటు చేశారు?
ఎ) ఉస్మాన్ అలీఖాన్
బి) నిజాం ఉల్ ముల్క్
సి) నిజాం అలీఖాన్
డి) సికిందర్ జా
18. నిజాం ప్రభుత్వం ఎవరి వద్ద నుంచి నెలకు రెండు లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నది?
ఎ) పామర్ అండ్ కో కంపెనీ
బి) జాన్ ఆడమ్
సి) చందూలాల్ డి) మార్టిన్ కంపెనీ
19. వహాబీ ఉద్యమం, బేరాన్ దత్తత ఎవరి కాలంలో జరిగినవి?
ఎ) ఉస్మాన్ అలీఖాన్
బి) నిజాం అలీఖాన్
సి) సికిందర్ జా డి) నాసిరుద్దౌలా
20. వహాబీ ఉద్యమం ఎవరికి వ్యతిరేకంగా ప్రారంభమైంది?
ఎ) సిక్కులు యూరోపియన్లు
బి) అరబ్బులు, సిక్కులు, ముస్లింలు
సి) యూరోపియన్లు, గ్రీకులు
డి) హిందువులు, బౌద్ధులు, జైనులు
21. వహాబీ ఉద్యమానికి నాయకత్వం వహించినది?
ఎ) నాసిరుద్దౌలా
బి) సయ్యద్ అహ్మద్‌ఖాన్ బరేలి
సి) నరసింహారావు డి) జగన్నాథరావు
22. దివాన్ అయిన నిజాం అలీఖాన్‌కు గల బిరుదు?
ఎ) మౌల్వీ బి) సాలార్ జంగ్
సి) నిజాం డి) అసఫ్ జా
23. బేరార్ ఒడంబడిక ఎవరెవరికి మధ్య జరిగింది?
ఎ) యూరోపియన్లకు, సిక్కులకు
బి) బ్రిటిష్‌వారికి, నాసిరుద్దౌలాకు
సి) ఫ్రెంచివారికి, నాసిరుద్దౌలాకు
డి) ఫ్రెంచి వారికి , ముస్లింలకు
24. సిపాయిల తిరుగుబాటు ఎవరి కాలంలో జరిగింది?
ఎ) నాసిరుద్దౌలా బి) అఫ్జల్ ఉద్దౌలా
సి) మహబూబ్ అలీఖాన్
డి) సికిందర్ జా
25. సిపాయిల తిరుగుబాటును అణచి వేయడంలో తోడ్పడిన నిజాంకు బ్రిటిష్ వారు ఇచ్చిన బిరుదు?
ఎ) స్టార్ ఆఫ్ ఇండియా
బి) స్టార్ ఆఫ్ ఏసియా
సి) సర్ డి) నైట్‌హుడ్
26. హైదరాబాద్‌లోని సాలార్జంగ్ మ్యూజియంలో వస్తువులు ఎవరు సేకరించినవి?
ఎ) మహబూబ్ అలీఖాన్
బి) అఫ్జల్ ఉద్దౌలా
సి) నవాబ్ అలీఖాన్
డి) సిరాజ్ ఉద్దౌలా
27. హైదరాబాద్ సంస్థానాన్ని సందర్మించిన మొదటి వైస్రాయ్?
ఎ) లార్డ్ రిప్పన్
బి) లార్ట్ మౌంట్ బాటన్
సి) డల్హౌసీ డి) లార్డ్ హేస్టింగ్స్
28. రాజభాషగా పర్షియన్ భాష స్థానంలో ఉర్దూను ప్రవేశ పెట్టింది?
ఎ) మీర్ లాయక్ అలీఖాన్
బి) మొదటి సాలార్జంగ్
సి) నిజాం అలీఖాన్
డి) లార్డ్ రిప్పన్
29. చందా రైల్వే ఆందోళన దేనికి సంబంధించినది?
ఎ) చందా వద్ద రైలు ప్రమాదానికి
బి) మహారాష్ట్రలోని చందా (చంద్రపూర్) నుంచి విజయవాడ రైలు మార్గం
సి) విజయవాడ నుంచి హైదారాబాద్‌కు రైలు
డి) ఏదీకాదు
30. చందా రైల్వే ఆందోళనకు నాయకత్వం వహించింది?
ఎ) అఘోరనాథ్ ఛటోపాద్యాయ
బి) ముల్లా అబ్దుల్ ఖయుమ్
సి) 1, 2 డి) అస్మాన్ జా
31. కిందివాటిలో 1893లో కనుంబా ఇ- ముబారక్ అనే ఫర్మానా ద్వారా ప్రవేశపెట్టిన పాలనా సంస్కరణల గురించి ఏది నిజం?
ఎ) వాటి వల్ల శాసన, క్యానిర్వాహక, న్యాయశాఖలు ఏర్పడ్డాయి
బి) ప్రభుత్వాధికారులు సభ్యులుగా గల
శాసనశాఖ ఏర్పడింది
సి) దివాన్ అధికారాలు తగ్గినవి
డి) పైవన్నీ
32. అసఫ్‌జాహీ పాలకుల్లో చివరి వాడు ఎవరు?
ఎ) ఏడో అసఫ్ జా (మీర్ ఉస్మాన్ అలీఖాన్ -1911-1948)
బి) వికార్ ఉల్-ఉమరా
సి) అస్మాన్ జా డి) సికిందర్ జా
33. ఉస్మాన్ అలీఖాన్ నిర్మించిన తటాకాలు ఏవి?
ఎ) ఉస్మాన్ సాగర్ (గండిపేట చెరువు)
బి) నిజాంసాగర్
సి) హిమాయత్ సాగర్ డి) పైవన్నీ
34. ఉస్మాన్ అలీఖాన్ కాలంలో నెలకొల్పిన కర్మాగారాలు?
ఎ) సిర్పూర్ పేపర్ మిల్
బి) బోధన్ షుగర్ ఫ్యాక్టరీ
సి) అజంజాహీ నూలు మిల్లులు, చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ డి) పైవన్నీ
35. కిందివాటిలో ఏది ఉస్మాన్ అలీఖాన్‌కు సంబంధించినది?
ఎ) నిజాం స్టేట్ రైల్వే
బి) ఉస్మానియా విశ్వవిద్యాలయం
సి) తబ్లిక్ కార్యక్రమం డి) పైవన్నీ
36. తబ్లిక్ అంటే?
ఎ) హిందువులను ముస్లింలుగా మార్చే
కార్యక్రమం
బి) ముస్లింలను యూరోపియన్లుగా మార్చే కార్యక్రమం
సి) ముస్లింలను శుద్ధి చేసే కార్యక్రమం
డి) ఏదీకాదు
37. ఏ సంస్థ కార్యకర్తలను రజాకార్లు అనేవారు?
ఎ) ఇత్తే హాదుల్-ముస్లిమీన్
బి) తబ్లిక్ సి) మజ్లీస్
డి) ఏదీకాదు
38. ఇత్తేహాదుల్ ముస్లిమీన్ సంస్థ నాయకుడు?
ఎ) ఖాసీం రజ్వీ బి) నిజాం అలీఖాన్
సి) సఫ్దర్ జంగ్ డి) పేష్కార్
39. కిందివాటిలో సరిగ్గా జతపరిచినది?
ఎ) ఎలగందల – కరీంనగర్
బి) పాలమూరు మహబూబ్‌నగర్
సి) ఇందూరు నిజామాబాద్
డి) పైవన్నీ
40. ఆపరేషన్ పోలో జరిగిన సంవత్సరం?
ఎ) 1948 సెప్టెంబర్ 13
బి) 1947 ఆగస్టు 15
సి) 1949 ఆగస్టు 15
డి) 1950 జనవరి 26
41. సైనిక చర్య ఆపరేషన్ పోలో తర్వాత నిజాం స్థానం?
ఎ) పీష్వా బి) గవర్నర్
సి) రాజ ప్రముఖ్ డి) దివాన్
42. నిజాం రాజప్రముఖ్ పదవిని రద్దు చేసినది?
ఎ) 1956 రాష్ర్టాల పునర్విభజన సంఘం
బి) 1951 గణతంత్ర దినోత్సం
సి) 1947 పాకిస్థాన్ దాడి డి) ఏదీకాదు
43. బకింగ్‌హామ్ కాలువ నిర్మాణం జరిగిన సంవత్సరం?
ఎ) 1862 బి) 1860
సి) 1877 డి) 1854
44. 1853-1883 వరకు హైదరాబాద్ దివానుగా పని చేసినది?
ఎ) మీర్ మహమ్మద్ సయ్యద్
బి) సాలార్జంగ్
సి) మహబూబ్ అలీఖాన్
డి) తుర్రేబాజ్‌ఖాన్
45. గండిపేట చెరువు అని దేన్ని పిలుస్తారు?
ఎ) ఉస్మాన్‌సాగర్ బి) నిజాంసాగర్
సి) హిమాయత్‌సాగర్
డి) హుస్సేన్‌సాగర్
46. హైదరాబాద్ సంస్థానంలో నెలకొల్పిన తొలి గ్రంథాలయం?
ఎ) ఆంధ్ర సంవర్థనిగ్రంథాలయం
బి) రాజరాజ నరేంద్రాంధ్ర భాషా నిలయం
సి) నిజాం ఆంధ్ర మహాసభ
డి) శ్రీకృష్ణ దేవరాయంధ్ర భాషా నిలయం
47. గోల్కొండ ఏ పరిశ్రమకు ప్రసిద్ధి గాంచినది?
ఎ) కలంకారి బి) నూలు బట్టలు
సి) వజ్రాలు డి) నౌకా పరిశ్రమ
48. నిజాం కాలంలో స్థాపించిన అజాంజాహీ బట్టల మిల్లు ఎక్కడ ఉంది?
ఎ) సిద్దిపేట బి) వరంగల్
సి) కరీంనగర్ డి) బీదర్
49. ఏ నిజాం కాలంలో హైదరాబాద్‌లో పారిశ్రామిక ప్రగతి ప్రారంభమైంది?
ఎ) నాసిరుద్దౌలా బి) అఫ్జలుద్దౌలా
సి) నిజాం అలీఖాన్ డి) ఉస్మాన్ అలీఖాన్
50. రజాకార్ వ్యవస్థను రూపొందించినది ఎవరు?
ఎ) సదర్యార్జంగ్
బి) మౌల్వీ అబ్దుల్ ఖాదర్
సి) బహదూర్ అలీజంగ్
డి) ఖాశీం రజ్వీ
51. 1906లో విజ్ఞాన చంద్రికా అనే సంస్థను ఏర్పాటు చేసినది?
ఎ) రావిచెట్టు రంగారావు
బి) కొమర్రాజు లక్ష్మణరావు
సి) రావి నారాయణ రెడ్డి
డి) వేంకట రామారావు
52. నిజాం కాలంలో ఉన్నత పదవులు అలంకరించిన వారు?
ఎ) చందూలాల్ బి) రాజారాంభక్ష్
సి) మహీపత్ రామ్ డి) పై అందరూ
53. ఉస్మాన్ అలీఖాన్ కాలంలో నిర్మించినది?
ఎ) గండిపేట చెరువు
బి) బోదన్ షుగర్ ఫ్యాక్టరీ
సి) అజాంజాహి మిల్లు
డి) గుల్షన్ మహల్
54. సిర్పూర్ పేపర్ మిల్స్, సిటీ కళాశాల, జూబ్లీహాలు, ఉస్మానియా విశ్వ విద్యాలయం నిర్మించినది?
ఎ) నాసర్‌జంగ్ బి) అఫ్జల్ ఉద్దౌలా
సి) ఉస్మాన్ అలీఖాన్
డి) మహబూబ్ అలీఖాన్
55. ఉస్మానియా విశ్వ విద్యాలయం నిర్మించిన సంవత్సరం?
ఎ) 1920 బి)1918
సి) 1933 డి) 1945
56. హైదరాబాద్ ఇండియన్ యూనియన్‌లో చేరిన సంవత్సరం?
ఎ) 1950, నవంబర్ 1న
బి) 1950, జనవరి 26న
సి) 1949, నవంబర్ 26న
డి) 1948, సెప్టెంబర్ 17న
57. హైదరాబాద్‌లో పోలీస్ చర్య జరిపిన సంవత్సరం?
ఎ) 1947, ఆగస్టు 15
బి) 1948, మర్చి 18
సి) 1948, సెప్టెంబర్ 13
డి) 1947, సెప్టెంబర్ 27
58. సాలార్జంగ్ ఎంతమంది నిజాం నవాబుల కింద ప్రధానిగా పనిచేశాడు?
ఎ) ఇద్దరు బి) ముగ్గురు
సి) నలుగురు డి) ఒకరి
59. సాలార్జంగ్ ప్రధాని కాకముందు ఎవరి దగ్గర పరిపాలనానుభవం గడించాడు?
ఎ) ఆంగ్లేయులు బి) ఫ్రెంచి
సి) పోర్చుగీసు డి) మహారాష్ర్టులు
60. నిజాం రాజ్య ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు సాలార్జంగ్ ప్రవేశ పెట్టిన సంస్కరణలు?
ఎ) ఉన్నతోద్యోగాలను రద్దు చేయడం
బి) రోడ్డు రవాణా మార్గాల పెంపుదల
సి) కాలువలు తవ్వించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం
డి) భూమిశిస్తును బాగా తగ్గించడం
విజేత కాంపిటీషన్స్ సౌజన్యంతో..
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు